వంద కోట్ల క్లబ్లో ఊపిరి..?
వంద కోట్ల క్లబ్లో ఊపిరి..?
Published Thu, Apr 14 2016 9:51 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి జోష్లో ఉన్న సీనియర్ హీరో నాగార్జున.. మరో అరుదైన రికార్డ్కు చేరువలో ఉన్నాడు. ఇప్పటికే మనం, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలతో సత్తా చాటిన నాగ్, ఇప్పుడు ఊపిరి సినిమాతో యంగ్ హీరోలకు కూడా షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమాగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన సినిమా ఊపిరి. భారీ బడ్జెట్తో పీవీపీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది.
ఓవర్ సీస్లో కూడా భారీ వసూళ్లను రాబడుతున్న ఊపిరి, సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే 80 కోట్లకు చేరువలో ఉన్న ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. ఊపిరికి ఈ రికార్డ్ దక్కే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. సర్థార్ గబ్బర్సింగ్ రిలీజ్ తరువాత కూడా ఊపిరి మంచి కలెక్షన్లు సాధిస్తుండటంతో పాటు, ఈ వారం వరుసగా నాలుగు రోజులు పాటు సెలవులు ఉండటం ఊపిరి యూనిట్కు కలిసొచ్చే అంశం.
అయితే గురువారం రిలీజ్ అవుతున్న ఈడోరకం ఆడోరకం, శుక్రవారం రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న పోలీసుడు సినిమాల ఎఫెక్ట్ పడకపోతే ఈ వారాంతానికి ఊపిరి వందకోట్ల మార్క్ను ఈజీగా రీచ్ అవుతుందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మరి నాగార్జున ఈ హ్యాట్రిక్ సినిమాతో కుర్రహీరోలకు కూడా షాక్ ఇచ్చే కలెక్షన్ రికార్డ్ లు నమోదు చేస్తాడేమో చూడాలి.
Advertisement
Advertisement