స్కై డైవింగ్‌ చేసిన కేంద్ర మంత్రి.. వీడియో వైరల్‌ | Union Minister Takes The Plunge On Skydiving Day | Sakshi
Sakshi News home page

‘ఎంజాయ్‌ చేశా’.. స్కై డైవింగ్‌ చేసిన కేంద్ర మంత్రి.. వీడియో వైరల్‌

Published Sat, Jul 13 2024 5:56 PM | Last Updated on Sat, Jul 13 2024 6:13 PM

Union Minister Takes The Plunge On Skydiving Day

ఢిల్లీ: 56 ఏళ్ల వయసులో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అరుదైన సాహసం చేశారు. వరల్డ్ స్కై డైవింగ్‌ రోజున.. ఆయన కూడా ఆ ఫీట్‌ చేసి ఆకట్టకున్నారు. భారత దేశంలో ప్రైవేటు రంగంలో మొట్టమొదటి స్కై డైవింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నారాయన.

‘‘భారత్‌తో పాటు ఈ ప్రపంచానికి ఈ రోజు అతిముఖ్యమైనది. హరియాణాలోని నార్నౌల్‌లో ఈ కేంద్రం ఏర్పాటైంది. దేశ పర్యటక శాఖ మంత్రిగా ప్రజలకు ఈ తరహా సదుపాయాలు అందుబాటులో ఉంచడం నా బాధ్యత’’ అని మీడియాతో మాట్లాడారు.

అలాగే తాను స్కై డైవింగ్ చేసిన చిత్రాలను, వీడియోలను ఎక్స్(ట్విటర్) వేదికగా షేర్ చేశారు. ‘‘ఆ థ్రిల్‌ను నేనూ ఎంజాయ్‌ చేశాను. భారత పర్యటక రంగం అంతర్జాతీయ వసతులను పొందుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అంటూ పోస్టు పెట్టారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement