భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా గతవారం డైమండ్ లీగ్ ట్రోఫీని తొలిసారి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈటెను 88.44 మీటర్ల దూరం విసిరి ట్రోఫీ కొల్లగొట్టాడు. గత గురువారం జరిగిన ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసి డిస్‌క్వాలిఫై అయ్యాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో ఈటెను 88.44 మీటర్లు దూరం విసిరాడు. మూడో ప్రయత్నంలో 88 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 86.11 మీటర్లు, చివరి ప్రయత్నంలో 87 మీటర్లు విసిరాడు.
ఇక డైమండ్ లీగ్ మీట్ ముగించుకొని ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉన్న నీరజ్ చోప్రా వెకేషన్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా స్విట్జర్లాండ్లో స్కై డైవింగ్ చేసి..ఫ్యాన్స్ను ఖుషీ చేశాడు.దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన నీరజ్ చోప్రా..'' స్కై ఈజ్ నాట్ ది లిమిట్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో బాలీవుడ్ సినిమా ''జిందగీ నా మిలేగీ దుబారా'' మ్యూజిక్‌ను ప్లే చేస్తూ.. ఆ సినిమా తరహాలోనే స్కైడైవింగ్ చేయడం విశేషం.
ఆకాశం మధ్యలో విమానం నుంచి దూకే సమయంలో నీరజ్ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. చిరునవ్వులు చిందిస్తూ స్కైడైవ్‌ను ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. రెండు రోజుల్లోనే నాలుగు లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం. నీరజ్ చోప్రా స్కై డైవింగ్ ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక 2017, 2018 డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్‌కు నీరజ్ అర్హత సాధించినప్పటికి ట్రోఫీ కొట్టేలేకపోయాడు. ఈసారి మాత్రం ట్రోఫీ అందుకున్న నీరజ్ చోప్రా వచ్చే ఏడాది హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్ బెర్తును ఇప్పటికే ఖరారు చేసుకున్నాడు.
చదవండి: లియాండర్ పేస్ గురువు కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment