Javelin Throw
-
Paris Paralympics 2024: గతంకంటే ఘనంగా...
పారిస్: కనీసం 25 పతకాలతో తిరిగి రావాలనే లక్ష్యంతో ‘పారిస్’ బయలుదేరిన భారత దివ్యాంగ క్రీడాకారులు లక్ష్య సాధనలో విజయవంతమయ్యారు. పారాలింపిక్స్ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అబ్బురపరిచారు. ఆదివారం ముగిసిన పారిస్ పారాలింపిక్స్ క్రీడల్లో భారత్ 29 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది. గత టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 19 పతకాలతో 24వ స్థానంలో నిలిచింది. శనివారం భారత్‌కు ఒక స్వర్ణ పతకం, ఒక కాంస్య పతకం లభించింది. భారత్ సాధించిన 29 పతకాల్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. చైనా 220 పతకాలతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. చైనా క్రీడాకారులు 94 స్వర్ణాలు, 76 రజతాలు, 50 కాంస్య పతకాలు గెల్చుకున్నారు. మెరిసిన నవ్‌దీప్... శనివారం భారత్‌కు రజతం ఖరారైన చోట అనూహ్య పరిస్థితుల్లో స్వర్ణ పతకం లభించింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 కేటగిరీలో భారత అథ్లెట్ నవ్‌దీప్ సింగ్ ఈటెను 47.32 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఇరాన్ అథ్లెట్ సాదెగ్ బీట్ సాయె జావెలిన్‌ను 47.64 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. అయితే స్వర్ణం ఖరారయ్యాక సాదెగ్ నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన పతాకాన్ని ప్రదర్శించాడు. అంతకుముందు త్రో విసిరాక తలను చేతితో ఖండిస్తున్నట్లుగా సాదెగ్ సంకేతం ఇచ్చాడు. దాంతో అతనికి హెచ్చరికగా ఎల్లో కార్డును ప్రదర్శించారు. మతపరమైన పతాకాన్ని ప్రదర్శించడంతో సాదెగ్‌కు రెండో ఎల్లో కార్డు చూపెట్టారు. దాంతో అతను డిస్క్వాలిఫై అయ్యాడు.సాదెగ్ ఫలితాన్ని రద్దు చేయడంతోపాటు అతను సాధించిన స్వర్ణ పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. రెండో స్థానంలో నిలిచిన నవ్‌దీప్‌కు స్వర్ణ పతకాన్ని ప్రదానం చేశారు. మరోవైపు మహిళల 200 మీటర్ల టి12 (దృష్టిలోపం) కేటగిరీలో సిమ్రన్ కాంస్యం సాధించింది. ఫైనల్లో సిమ్రన్ తన గైడ్ అభయ్ సింగ్‌తో కలిసి 24.75 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. -
రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా
లూసాన్ డైమండ్ లీగ్‌లో స్టార్ జావలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. నిన్న జరిగిన పోటీలో నీరజ్ తన చివరి అవకాశంలో బల్లాన్ని 89.49 మీటర్ల దూరం విసిరాడు. ఇది ఈ సీజన్లో అతనికి అత్యుత్తమ ప్రదర్శన. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ తన బల్లాన్ని 89.45 మీటర్ల దూరం విసిరాడు. నిన్న జరిగిన పోటీలో నీరజ్ నాలుగో రౌండ్ వరకు నాలుగో స్థానంలో నిలిచాడు. ఐదో ప్రయత్నంలో 85.58 మీటర్లు విసరగలిగాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో సీజన్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. Feeling so bad for Neeraj Chopra 💔90m will come for sure .Neeraj was nowhere close to his best in 1st 5 throws gave his all in at 6th throw with SB of 89.49m !!Common Neeraj 90m will come for sure !!#NeerajChopra #DiamondLeague #Javelin pic.twitter.com/Omuoapm3gK— Ram kapoor🇮🇳 (@Ram1947_) August 22, 2024ఈ పోటీలో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఆండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) తన బల్లాన్ని 90.61 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. బల్లాన్ని 87.08 మీటర్ల దూరం విసిరిన జర్మనీ త్రోయర్ జూలియన్ వెబర్ మూడో స్థానంలో నిలిచాడు. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం కోసం జరిగిన పోటీ నీరజ్ చోప్రా పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. -
అర్షద్ నదీమ్‌పై కానుకల వర్షం.. ఘన సత్కారం
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో స్వర్ణ పతకం గెలిచిన పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌ను ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఘనంగా సత్కరించారు. అతడి కోసం ఇస్లామాబాద్‌లో మంగళవారం విందు ఏర్పాటు చేసిన ఆయన.. నదీమ్ కుటుంబానికి సాదర స్వాగతం పలికారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. కఠిన సవాళ్లతో సావాసం చేయాల్సి వచ్చినా దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నదీమ్ నిరూపించాడని కొనియాడారు.రెండో అత్యున్నత పురస్కారంఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 15 కోట్ల(భారత్ కరెన్సీలో రూ. 4.5 కోట్లు) చెక్కును ప్రధాని షరీఫ్ నదీమ్‌కు అందించారు. అదే విధంగా.. పాకిస్తాన్‌లోని రెండో అత్యున్నత పురస్కారం.. హిలాల్ ఇంతియాజ్ అవార్డును నదీమ్‌కు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ పసిడి పతక వీరుడి పేరిట ఇస్లామాబాద్‌లోని జిన్నా స్టేడియంలో అర్షద్ నదీమ్ హై పర్ఫామెన్స్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.దీనితో పాటు క్రీడలను ప్రోత్సహించే క్రమంలో పాక్ కరెన్సీలో ఒక బిలియన్ రూపాయల నిధిని కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్ పేర్కొన్నారు. కాగా నదీమ్ కుటుంబంతో పాటు అతడి కోచ్ సల్మాన్ ఇక్బాల్ భట్‌ను కూడా ప్రధాని ప్రశంసించారు. అతడి కూడా పాక్ కరెన్సీలో కోటి రూపాయలు నజరానా ఇస్తున్నట్లు తెలిపారు.నదీమ్‌కు కారు 92.97 పంజాబ్ (పాక్) ముఖ్యమంత్రి మరియం నవాజ్ (మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె) నదీమ్ స్వగ్రామానికి వెళ్లి మరీ ప్రోత్సాహకాన్ని చెక్ రూపంలో అందజేశారు. వారి కుటుంబసభ్యులతో ముచ్చటించిన ఆమె ఒలింపిక్ చాంపియన్‌ను తయారు చేసిన కోచ్ సల్మాన్ ఇక్బాల్ భట్‌కూ రూ. 50 లక్షల (రూ.15 లక్షలు) చెక్ ఇచ్చారు.ఈ నెల 8న పారిస్‌లో జరిగిన ఫైనల్ ఈవెంట్లో నదీమ్.. భారత హాట్ ఫేవరెట్ నీరజ్ చోప్రా (89.45 మీటర్లు; రజతం)ను వెనక్కినెట్టి 92.97 మీటర్లతో కొత్త ఒలింపిక్ రికార్డును నెలకొల్పాడు. ఈ ఒలింపిక్ రికార్డు స్కోరుతో కూడిన నేమ్ ప్లేట్ ఉన్న కారును కూడా నదీమ్‌కు ఈ సందర్భంగా బహూకరించారు. -
అర్షద్ కూడా మా బిడ్డ లాంటివాడే: నీరజ్ చోప్రా తల్లిదండ్రులు
ప్యారిస్ ఒలింపిక్స్-2024లోస్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ ఈవెంట్లో.. నీరజ్ ఈ సీజన్లోనే అత్యుత్తమగా ఈటెను 89.45 మీటర్లు విసిరాడు. అయితే.. ఆది నుంచి నీరజ్‌కు గట్టిపోటీగా భావించిన పాకిస్తాన్ ప్లేయర్ అర్షద్ నదీమ్ అనూహ్య రీతిలో బల్లాన్ని ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి సంచలనం సృష్టించాడు.ఒలింపిక్ రికార్డు తన అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్ రికార్డు నెలకొల్పి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫలితంగా రెండో స్థానానికే పరిమితమైన నీరజ్‌కు సిల్వర్ మెడల్ దక్కింది. అయితే, చాలా మంది వీరిద్దరి మధ్య పోటీని ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌గా అభివర్ణించారు. కానీ.. ఇలాంటి పోలికలు సరికావని అంటున్నారు నీరజ్ చోప్రా తల్లిదండ్రులు. మా బిడ్డ లాంటివాడేఅర్షద్ను కూడా తమ బిడ్డలాగే భావిస్తామని.. వారిద్దరు పోటీపడుతుంటే చూడముచ్చటగా ఉంటుందని ప్రేమను చాటుకున్నారు. ‘‘ఫైనల్ చూస్తున్నపుడు మేమేమీ కంగారుపడలేదు. మా పిల్లలు అక్కడ పోటీపడినట్లుగా అనిపించింది. మనకు స్వర్ణం వచ్చిందా.. రజత పతకం వచ్చిందా అన్నది ముఖ్యం కాదు. అక్కడున్నవాళ్లంతా ఎంతో కష్టపడి వచ్చినవారే. అయితే, వారిలో వీళ్లిద్దరు అద్భుతంగా ఆడారు’’ అని నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి నీరజ్, అర్షద్ నదీమ్‌పై ప్రశంసలు కురిపించారు. తమ కుమారుడు గాయాల పాలయ్యాడని.. అతడు సాధించిన ఈ వెండి పతకం కూడా పసిడితో సమానమని పేర్కొన్నారు.ఎలాంటి శత్రుత్వం లేదుఇక నీరజ్ వాళ్ల ఆంటీ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ దాయాదుల పోరు అనే చర్చకు తావులేదు. ఇది కేవలం ఆటగాళ్ల మధ్య పోటీ మాత్రమే. నదీమ్‌తో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని నీరజ్ ఇప్పటికే స్పష్టం చేశాడు. నిజానికి అర్షద్ నదీమ్.. కాంపిటీషన్లకు వెళ్తున్నపుడు మేము అతడి కోసం కూడా ప్రార్థిస్తాం. మీడియా వేదికగా నదీమ్ తల్లిదండ్రులకు మేము ఈ విషయం చెప్పేందుకు సంతోషిస్తున్నాం. అతడు ఎల్లప్పుడూ బాగుండాలని మేము కోరుకుంటాం’’ అని పేర్కొన్నారు.ఆ రెండు కలిసి వచ్చాయిఅదే విధంగా.. నీరజ్ చోప్రా తండ్రి సతీశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘అర్షద్ నదీమ్ కూడా అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఆటగాడు. అతడు పడ్డ కష్టానికి ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఫలితం దక్కింది. దీనిని మనం ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌గా చూడకూడదు. ప్రపంచవ్యాప్తంగా అందరు ఆటగాళ్లు అక్కడ పోటీపడ్డారు. ఈరోజు నదీమ్‌ది. హార్డ్‌వర్క్‌తో పాటు అదృష్టం కూడా అతడికి కలిసి వచ్చింది.ఫలితాలు కూడా ఈ రెండింటి కలయికగానే ఉంటాయి’’ అని అన్నారు. ఎన్డీటీవీతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఓ ఆటగాడి తల్లిదండ్రులుగా తాము ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని.. ఒక్కోసారి కొడుకు కళ్లారా చూసుకునే సమయం కూడా ఉండదని ఉద్వేగానికి లోనయ్యారు.చదవండి: #Arshad Nadeem: కూలీ కొడుకు.. ఒక్కపూట తిండిలేక పస్తులు.. ఒలింపిక్ వీరుడిగా -
Paris Olympics 2024: రజత నీరాజనం
పారిస్: పసిడి ఆశలతో ‘పారిస్’లో అడుగు పెట్టిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. రెండో ప్రయత్నంలో 26 ఏళ్ల నీరజ్ జావెలిన్‌ను 89.45 మీటర్ల దూరం విసిరి ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. చివరకు ఈ స్కోరుతోనే నీరజ్‌కు రజత పతకం ఖరారైంది.క్వాలిఫయింగ్‌లో 89.34 మీటర్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచిన నీరజ్ ఫైనల్లో కాస్త ఒత్తిడికి లోనయ్యాడు. అతడి తొలి ప్రయత్నం ఫౌల్ అయింది. రెండో ప్రయత్నంలో నీరజ్ ఆందోళన చెందకుండా సంయమనంతో జావెలిన్‌ను 89.45 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత నీరజ్ మూడు, నాలుగు, ఐదు, ఆరో ప్రయత్నాలు కూడా ఫౌల్గానే నమోదయ్యాయి. దాంతో ఈ త్రోలలో నమోదైన స్కోరును పరిగణనలోకి తీసుకోలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఎవరూ ఊహించని విధంగా జావెలిన్ త్రోలో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకొని అందర్నీ నివ్వెరపరిచాడు. 27 ఏళ్ల నదీమ్ తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే రెండో ప్రయత్నంలో నదీమ్ జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరి కొత్త ఒలింపిక్ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఆండ్రెస్ థోర్కిల్డ్సన్ (నార్వే; 90.57 మీటర్లు) నెలకొల్పిన రికార్డును నదీమ్ బద్దలు కొట్టాడు. ప్రపంచ మాజీ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) 88.54 మీటర్లతో కాంస్య పతకాన్ని సాధించాడు. 1 వ్యక్తిగత క్రీడాంశంలో ఒలింపిక్స్ చరిత్రలో పాకిస్తాన్‌కు తొలి స్వర్ణ పతకం నదీమ్ ద్వారా లభించింది. గతంలో పాకిస్తాన్ హాకీ జట్టు 3 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు గెలిచింది. 1960 రోమ్ ఒలింపిక్స్ రెజ్లర్ మొహమ్మద్ బషీర్ కాంస్యం... 1988 సియోల్ ఒలింపిక్స్‌లో బాక్సర్ హుస్సేన్ షా కాంస్యం సాధించారు. 4 ఒలింపిక్స్ క్రీడల్లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన నాలుగో భారత ప్లేయర్‌గా నీరజ్ గుర్తింపు పొందాడు. గతంలో రెజ్లర్ సుశీల్ (2008 బీజింగ్; కాంస్యం... 2012 లండన్; రజతం), షట్లర్ పీవీ సింధు (2016 రియో; రజతం... 2020 టోక్యో; కాంస్యం), షూటర్ మనూ భాకర్ (2024 పారిస్; 2 కాంస్యాలు) ఈ ఘనత సాధించారు. -
వచ్చాడు... విసిరాడు... ఫైనల్ చేరాడు
అనూహ్యమేమీ కాదు...అలవాటు లేనిదేమీ కాదు... అడుగు పెడితే చాలు జావెలిన్‌తో అద్భుతంగా ఆడుకునే భారత స్టార్ నీరజ్ చోప్రా ఒలింపిక్ వేదికపై మళ్లీ తన బంగారు వేటను మొదలు పెట్టాడు. అసలు పోరుకు ముందు అర్హత సమరంలో తనదైన శైలిలో అదరగొట్టాడు. క్వాలిఫయింగ్ పోరులో ఒకే ఒక్క త్రో విసిరి అలా అలవోకగా ముందంజ వేశాడు... మరో మాటకు తావు లేకుండా అగ్ర స్థానంతో దర్జాగా ఫైనల్లోకి అడుగు పెట్టి ఒక లాంఛనం ముగించాడు... ఎక్కడా తడబాటు లేదు, కాస్త ఉత్కంఠ పెంచినట్లుగా కూడా కనిపించలేదు. రోజూ చేసే పని ఇదేగా అన్నట్లుగా క్షణాల వ్యవధిలో త్రో పూర్తి చేసి వెనక్కి తిరిగి చూడకుండా నడుచుకుంటూ వెళ్లిపోయాడు... ఇదే తరహా ప్రదర్శనను రేపు జరిగే ఫైనల్లోనూ చూపిస్తే మన బంగారు బాలుడి ఒడిలో వరుసగా రెండో ఒలింపిక్స్‌లో మరో పసిడి పతకం పరుగెత్తుకుంటూ వచ్చి వాలడం ఖాయం! పారిస్: కోట్లాది భారత అభిమానుల పసిడి ఆశలను మోస్తూ బరిలోకి దిగిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో సత్తా చాటిన నీరజ్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించే లక్ష్యంతో మైదానంలోకి అడుగు పెట్టాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్ గ్రూప్ ‘బి’లో నీరజ్ తన జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరి క్వాలిఫై అయ్యాడు. ఫైనల్ చేరేందుకు అర్హత మార్కు 84 మీటర్లు కాగా... తన తొలి ప్రయత్నంలోనే అంతకంటే ఎక్కువ దూరం బల్లెం విసరడంతో నీరజ్‌కు మళ్లీ త్రో చేయాల్సిన అవసరమే రాలేదు. గ్రూప్ ‘ఎ’, గ్రూప్ ‘బి’ రెండూ కలిపి నీరజ్‌దే అత్యుత్తమ ప్రదర్శన. వ్యక్తిగతంగా కూడా ఈ దూరం నీరజ్ కెరీర్లో రెండో స్థానంలో నిలుస్తుంది.2022లో అతను జావెలిన్‌ను 89.94 మీటర్లు విసిరాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కూడా అయిన నీరజ్‌తో హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమైన అండర్సన్ పీటర్స్ (గ్రెనడా), జూలియన్ వెబర్ (జర్మనీ) జావెలిన్‌ను 88.63 మీటర్లు , 87.76 మీటర్లు వరుసగా రెండు, మూడు స్థానాలతో ముందంజ వేశారు. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ (86.59 మీటర్లు) కూడా ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యాడు. 84 మీటర్లు విసిరిన లేదా రెండు గ్రూప్‌లలో కలిపి 12 మంది అత్యుత్తమ స్కోరర్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. క్వాలిఫయింగ్‌లో 9 మంది 84 మీటర్ల మార్క్‌ను అందుకొని ముందంజ వేయగా, మరో ముగ్గురికి మాత్రం టాప్–12లో రావడంతో అవకాశం లభించింది. పోటీలో నిలిచిన మరో భారత జావెలిన్ త్రోయర్ కిషోర్ జెనా తీవ్రంగా నిరాశపరిచాడు. జావెలిన్‌ను 80.73 మీటర్లు మాత్రమే విసిరిన అతను గ్రూప్ ‘ఎ’లో తొమ్మిదో స్థానానికే పరిమితం కావడంతో ఫైనల్ అవకాశం చేజారింది. గత ఏడాది ఆసియా క్రీడల్లో జావెలిన్‌ను 87.54 మీటర్ల దూరం విసిరి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన కిషోర్... అసలు సమయంలో కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయాడు. మరోవైపు మహిళల 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ కిరణ్ పహాల్ నిరాశపర్చింది. ఈ ఈవెంట్లో ఆమె సెమీఫైనల్ చేరడంలో విఫలమైంది. ఆరుగురు పాల్గొన్న రెపిచాజ్ హీట్–1లో మొదటి స్థానంలో నిలిస్తేనే సెమీస్ చేరే అవకాశం ఉండగా... 52.59 సెకన్లలో పరుగు పూర్తి చేసిన కిరణ్ ఆరో స్థానంతో ముగించింది.ఎప్పుడైనా తొలి ప్రయత్నమే మెరుగ్గా ఉండాలని భావిస్తా. ప్రతీసారి అది సాధ్యం కాకపోవచ్చు. అలా జరిగింది కూడా. నేను ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నా. ఎలాంటి ఇబ్బంది లేదు. ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. అయితే క్వాలిఫయింగ్కంటే ఫైనల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కాబట్టి సన్నద్ధత కూడా చాలా బాగుండాలి. నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నా. ఫైనల్ సాయంత్రం జరుగుతుంది కాబట్టి వాతావరణం కాస్త చల్లగా ఉండవచ్చు. అయితే దానికి అనుగుణంగానే సిద్ధమవుతా. ఫైనల్ చేరిన వారంతా బలమైన ప్రత్యర్థులే కాబట్టి ఎవరితోనూ ప్రత్యేకంగా పోటీ ఉండదు. –నీరజ్ చోప్రా -
బ్యాట్ వదిలి బల్లెం పట్టిన డీకే
టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ కొద్ది రోజుల కిందటే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికి వార్తల్లో నిలిచాడు. సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం డీకే క్రికెట్ ప్రపంచం మొత్తం నుంచి ఘనంగా సెడాంఫ్ను అందుకున్నాడు.క్రికెట్‌కు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో సేద తీరుతున్న డీకే.. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో కలిసి జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. Neeraj Chopra trained Dinesh Karthik to be his partner at 2024 Olympics.#Neerajchopra #Dineshkarthik pic.twitter.com/zOLswEDjW8— scOut Op (@ScOutoppp69) May 29, 2024డీకే జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో బాగా వైరలవుతంది. ఈ వీడియోలో డీకే రెండు ప్రయత్నాల అనంతరం బల్లెంను విజయవంతంగా నిర్దేశిత ప్రాంతం ఆవలికి విసరగలిగాడు. లాస్ట్ ఛాన్స్ అని నీరజ్‌ను అడిగి మరీ జావెలిన్‌ను అందుకున్న డీకే.. ప్రొఫెషన్ అథ్లెట్‌లా రన్ అప్ తీసుకుని జావెలిన్‌ను సంధించాడు. మండే ఎండలో డీకే చేస్తున్న ప్రయత్నానికి ముగ్దుడైన నీరజ్.. నువ్వు చేయగలవు దినేష్ భాయ్ అంటూ ప్రోత్సహించాడు. నీరజ్ ప్రోత్సాహంతో జావెలిన్‌ను విసిరిన డీకే అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి సక్సెస్ సాధించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు డీకేను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నీ ప్రయత్నం అమోఘమని కొనియాడుతున్నారు. తెలీని క్రీడలోనూ సక్సెస్ సాధించావని కితాబునిస్తున్నారు. క్రికెట్లో మ్యాచ్ ఫినిషన్ ఇప్పుడు సక్సెస్ఫుల్ జావెలిన్ త్రోయర్ అంటూ కొనియాడుతున్నారు. మరికొందరేమో నీరజ్‌తో పాటు ఒలింపిక్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోమని సూచిస్తున్నారు. 38 ఏళ్ల డీకే 2004 నుంచి 2022 వరకు మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. డీకే ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్ నుంచి తాజాగా ముగిసిన 2024 సీజన్ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు.నీరజ్ చోప్రా విషయానికొస్తే.. 26 ఏళ్ల ఈ జావెలిన్ త్రోయర్ 2020 టోక్యో ఓలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించాడు. ఈ ఏడాది జులైలో జరిగే సమ్మర్ ఓలింపిక్స్లో నీరజ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. -
Federation Cup 2024: నీరజ్ చోప్రాకు స్వర్ణం
భువనేశ్వర్: స్వదేశంలో మూడేళ్ల తర్వాత తొలిసారి బరిలోకి దిగిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా స్వర్ణ పతకంతో మెరిశాడు. గతవారం దోహాలో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్...బుధవారం జరిగిన ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మీట్లో పసిడి పతకం సాధించాడు. హరియాణాకు చెందిన 26 ఏళ్ల నీరజ్ నాలుగో ప్రయత్నంలో జావెలిన్‌ను 82.27 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. కర్ణాటకకు చెందిన డీపీ మనూ 82.06 మీటర్లతో రజత పతకాన్ని దక్కించుకోగా... మహారాష్ట్రకు చెందిన ఉత్తమ్ పాటిల్ 78.39 మీటర్లతో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. గత ఏడాది ఆసియా క్రీడల్లో రజత పతకం నెగ్గిన కిశోర్ కుమార్ జెనా నిరాశపరిచాడు. ఒడిశాకు చెందిన కిశోర్ జావెలిన్‌ను 75.25 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. చివరిసారి భారత్‌లో 2021 మార్చి 17న భువనేశ్వర్‌లోనే జరిగిన ఫెడరేషన్ కప్‌లో నీరజ్ పోటీపడి స్వర్ణ పతకం సాధించాడు. మూడేళ్ల తర్వాత ఇదే వేదికపై పోటీపడ్డ నీరజ్ పసిడి ఫలితాన్ని పునరావృతం చేశాడు. -
దీపాంశుకు స్వర్ణం
దుబాయ్: ఆసియా అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలతో కలిపి మొత్తం నాలుగు పతకాలు లభించాయి. పురుషుల జావెలిన్ త్రోలో దీపాంశు శర్మ పసిడి పతకం సాధించాడు. దీపాంశు జావెలిన్‌ను 70.29 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.భారత్‌కే చెందిన రోహన్ యాదవ్ 70.03 మీటర్లతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. పురుషుల 1500 మీటర్ల విభాగంలో ప్రియాంశు రజత పతకం నెగ్గాడు. ప్రియాంశు 3 నిమిషాల 50.85 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల డిస్కస్ త్రోలో రితిక్ (53.01 మీటర్లు) రజత పతకం గెలిచాడు. -
పతకాల పంట
హాంగ్జౌ: ఆసియా పారా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. పోటీల మూడో రోజు బుధవారం భారత్ ఖాతాలో 30 పతకాలు చేరాయి. ఇందులో ఆరు స్వర్ణ పతకాలు ఉన్నాయి. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 కేటగిరీలో సుమిత్ అంటిల్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం గెలిచాడు. సుమిత్ జావెలిన్‌ను 73.29 మీటర్ల దూరం విసిరి 70.83 మీటర్లతో తన పేరిటే ఉన్న పాత ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. జావెలిన్ త్రో ఎఫ్46 కేటగిరీలో భారత్‌కే చెందిన సుందర్ సింగ్ గుర్జర్ కూడా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణ పతకం గెలిచాడు. సుందర్ జావెలిన్‌ను 68.60 మీటర్ల దూరం విసిరి 67.79 మీటర్లతో శ్రీలంక అథ్లెట్ దినేశ్ ముదియన్‌సెలగె పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తిరగ రాశాడు. పురుషుల టి11 1500 మీటర్ల విభాగంలో అంకుర్ ధామా, మహిళల టి11 1500 మీటర్ల విభాగంలో రక్షిత రాజు... పురుషుల ఎఫ్37/38 జావెలిన్ త్రో ఈవెంట్లో హనే... మహిళల టి47 లాంగ్‌జంప్ ఈవెంట్లో నిమిషా బంగారు పతకాలు గెలిచారు. కాంస్య పతకాలు నెగ్గిన గురు నాయుడు, ప్రియదర్శిని పనాజీ: జాతీయ క్రీడల్లో భాగంగా బుధవారం వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఒక్కో కాంస్య పతకం లభించింది. పురుషుల 55 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్. గురు నాయుడు ఓవరాల్‌గా 230 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. మహిళల 45 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి ప్రియదర్శిని మొత్తం 161 కేజీల బరువెత్తి మూడో స్థానంతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. -
Asian Games 2023: నీరజ్ చోప్రాకు స్వర్ణం.. 80కి చేరిన భారత్ పతకాల సంఖ్య
ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. ఇదే ఈవెంట్లో కిషోర్ జెనా రజత పతకం నెగ్గాడు. గత ఏషియన్ గేమ్స్‌లో ఇదే ఈవెంట్లో స్వర్ణం సాధించిన నీరజ్.. ఈసారి జావెలిన్‌ను 88.88 మీటర్లు విసిరి స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ ఈవెంట్లో రజతం సాధించిన కిషోర్ 87.54 మీటర్లు జావెలిన్‌ను విసిరి, నీరజ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. ఈ ప్రదర్శనతో నీరజ్, కిషోర్ ఇద్దరు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. కాగా, జావెలిన్ త్రోలో రెండు పతకాలతో (గోల్డ్, సిల్వర్) భారత్ పతకాల సంఖ్య 80కి (17 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) చేరింది. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 312 పతకాలతో (168 గోల్డ్, 93 సిల్వర్, 51 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. జపాన్ 144 మెడల్స్‌తో (36, 51, 57) రెండో స్థానంలో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా 145 పతకాలతో (33, 44, 68) మూడో స్థానంలో ఉన్నాయి. -
పసిడి పారుల్ అన్ను బంగారం
చైనా గడ్డపై భారత మహిళా అథ్లెట్లు పారుల్ చౌధరీ, అన్ను రాణి అద్భుతం చేశారు. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారి భారత్‌కు 5000 మీటర్ల విభాగంలో పారుల్... జావెలిన్ త్రోలో అన్ను రాణి పసిడి పతకాలు అందించారు. ఈ ఇద్దరితోపాటు మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్యా రామ్రాజ్ కాంస్యం... పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావెల్ కాంస్యం... పురుషుల 800 మీటర్ల విభాగంలో మొహమ్మద్ అఫ్జల్ రజతం... పది క్రీడాంశాల సమాహారమైన డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ రజతం గెల్చుకున్నారు. అథ్లెటిక్స్ కాకుండా బాక్సింగ్‌లో రెండు కాంస్యాలు... కనోయింగ్‌లో ఒక కాంస్యం లభించాయి. ఓవరాల్‌గా ఆసియా క్రీడల పదో రోజు భారత్ ఖాతాలో తొమ్మిది పతకాలు చేరాయి. మరో ఐదు రోజులపాటు కొనసాగే ఈ క్రీడల్లో ప్రస్తుతం భారత్ 69 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆర్చరీలో మూడు పతకాలు... బాక్సింగ్‌లో మరో పతకం... క్రికెట్లో ఒక పతకం కూడా ఖరారయ్యాయి. ఫలితంగా ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడం లాంఛనం కానుంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 70 పతకాలు సాధించింది. హాంగ్జౌ: బరిలోకి దిగితే పతకం సాధించాలనే లక్ష్యంతో తమ ఈవెంట్లలో పోటీపడుతున్న భారత అథ్లెట్లు ఈ ఆసియా క్రీడల్లో మెరిపిస్తున్నారు. నిలకడగా రాణిస్తూ... తమపై పెట్టుకున్న అంచనాలకు మించి ప్రతిభ కనబరుస్తూ... 1951 తర్వాత ఈ క్రీడల చరిత్రలో పతకాలపరంగా తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశారు. పోటీల పదోరోజు భారత్‌కు తొమ్మిది పతకాలు రాగా... అందులో ఆరు అథ్లెటిక్స్ ఈవెంట్ల నుంచి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు ఇప్పటికే 22 పతకాలు (4 స్వర్ణాలు, 10 రజతాలు, 8 కాంస్యాలు) గెలిచారు. తద్వారా 2018లో 20 పతకాల ప్రదర్శనను సవరించారు. 1951లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన తొలి ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అత్యధికంగా 34 పతకాలు గెలిచారు. మంగళవారం భారత మహిళా అథ్లెట్లు పారుల్ చౌధరీ, అన్ను రాణి పసిడి కాంతులు విరజిమ్మారు. 5000 మీటర్ల రేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పారుల్ విజేతగా అవతరించింది. ఆమె అందరికంటే వేగంగా 15 నిమిషాల 14.75 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని గెలిచింది. తద్వారా ఈ క్రీడల చరిత్రలో 5000 మీటర్లలో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా పారుల్ గుర్తింపు పొందింది. తాజా క్రీడల్లో పారుల్‌కిది రెండో పతకం. ఆమె 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో రజతం గెలిచింది. గతంలో మహిళల 5000 మీటర్ల విభాగంలో భారత్ తరఫున సునీతా రాణి (1998–రజతం; 2002–కాంస్యం), ఓపీ జైషా (2006–కాంస్యం), ప్రీజా శ్రీధరన్ (2010–రజతం), కవితా రౌత్ (2010–కాంస్యం) పతకాలు నెగ్గారు. తాజా స్వర్ణ పతకంతో ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగంలో తనను డీఎస్పీగా నియమిస్తారని పారుల్ ఆశిస్తోంది. యూపీ ప్రభుత్వ క్రీడా పాలసీ ప్రకారం ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన వారికి డీఎస్పీ ఉద్యోగం ఇస్తారు. మూడో ప్రయత్నంలో... వరుసగా మూడోసారి ఆసియా క్రీడల్లో పోటీపడ్డ జావెలిన్ త్రోయర్ అన్ను రాణి తొలిసారి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 2014 ఇంచియోన్ ఏషియాడ్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్ను రాణి కాంస్యం సాధించింది. 2018 జకార్తా క్రీడల్లో ఆరో స్థానంతో నిరాశపరిచింది. మూడో ప్రయత్నంలో 31 ఏళ్ల అన్ను రాణి ఏకంగా బంగారు పతకాన్ని మెడలో వేసుకుంది. 11 మంది పోటీపడ్డ ఫైనల్లో అన్ను రాణి జావెలిన్‌ను తన నాలుగో ప్రయత్నంలో గరిష్టంగా 62.92 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ఖరారు చేసుకుంది. నదీషా దిల్హాన్ (శ్రీలంక; 61.57 మీటర్లు) రజతం, హుయ్‌హుయ్ లియు (చైనా; 61.29 మీటర్లు) కాంస్యం గెలిచారు. ‘ఏడాది మొత్తం ఎంతో ప్రయత్నించినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయా. ప్రభుత్వం నాపై ఎంతో డబ్బు వెచి్చంచి విదేశాల్లో శిక్షణకు పంపించింది. ఫలితాలు రాకపోవడంతో కాస్త నిరాశకు గురయ్యా. అయితే ఆసియా క్రీడల్లో ఈ సీజన్లోనే ఉత్తమ ప్రదర్శనతో స్వర్ణం సాధించడంతో చాలా ఆనందంగా ఉంది’ అని అన్ను రాణి వ్యాఖ్యానించింది. ఆసియా క్రీడల మహిళల జావెలిన్ త్రోలో గతంలో బార్బరా వెబ్‌స్టర్ (1951; కాంస్యం), ఎలిజబెత్ డావెన్‌పోర్ట్ (1958; రజతం... 1962; కాంస్యం), గుర్మిత్ కౌర్ (1998; కాంస్యం) పతకాలు గెలిచారు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకాన్ని సాధించింది. హీట్స్‌లో 55.42 సెకన్ల సమయం నమోదు చేసి పీటీ ఉష జాతీయ రికార్డును సమం చేసిన విత్యా ఫైనల్లో దానిని పునరావృతం చేయలేకపోయింది. తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల విత్యా 55.68 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల 800 మీటర్ల విభాగంలో మొహమ్మద్ అఫ్జల్ రజత పతకం గెలిచాడు. తొలిసారి ఆసియా క్రీడల్లో పోటీపడ్డ ఈ కేరళ అథ్లెట్ ఒక నిమిషం 48.43 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావెల్ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల ప్రవీణ్ 16.68 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. 49 ఏళ్ల తర్వాత... పది క్రీడాంశాల (100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, 400 మీటర్లు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్‌వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్లు) సమాహారమైన డెకాథ్లాన్‌లో 49 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం లభించింది. ఢిల్లీకి చెందిన తేజస్విన్ శంకర్ 7666 పాయింట్లతో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకాన్ని సాధించాడు. 2011 నుంచి భారతీందర్ సింగ్ (7658 పాయింట్లు) పేరిట ఉన్న డెకాథ్లాన్ జాతీయ రికార్డును తేజస్విన్ సవరించాడు. 1974 టెహ్రాన్ ఆసియా క్రీడల్లో విజయ్ సింగ్ చౌహాన్ స్వర్ణం, సురేశ్ బాబు కాంస్యం గెలిచాక ఈ క్రీడల్లో మళ్లీ భారత్‌కు పతకం అందించిన డెకాథ్లెట్‌గా తేజస్విన్ గుర్తింపు పొందాడు. -
Asian Games 2023: చరిత్ర సృష్టించిన అన్నూ రాణి
ఏషియన్ గేమ్స్‌లో ఇవాళ (అక్టోబర్ 3) కూడా భారత్ జోరు కొనసాగుతుంది. మహిళల జావెలిన్ త్రోలో అన్నూ రాణి స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో అన్నూ 62.92 మీటర్ల దూరం వరకు జావెలిన్ (బల్లెం) విసిరి, ఈ సీజన్ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. ఆసియా క్రీడల మహిళల జావెలిన్ త్రో విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం. Gold in women’s javelin throw at the Asian Games in Hangzhou. Annu Rani best throw was 62.92m.@Adille1 @Media_SAI pic.twitter.com/sYnRJUTmpm — Athletics Federation of India (@afiindia) October 3, 2023 -
బంగారు బాలుడు.. మన నీరజ్ చోప్రా
అపరిమితమైన ప్రేమ.. అపరిమితమైన కేలరీలు.. ఆ బాలుడికి అన్నీ ఎక్కువే. నానమ్మ చేత్తో ప్రేమగా తినిపించే రోటీ, లడ్డూలు, మీగడ, జున్ను.. నెయ్యి, చక్కెర కలిపి చేసే చూర్మా. హరియాణ్వీ వంటకాలు తినీ తినీ.. టీనేజ్‌లోకి వచ్చేసరికి సహజంగానే బొద్దుగా తయారయ్యాడు. దాంతో అప్పటి వరకు చూపించిన ప్రేమ కాస్తా కుటుంబసభ్యుల్లో ఒకింత ఆందోళనగా మారింది. ఇలా అయితే ఎలా అంటూ అతని తండ్రి, ఆయన ముగ్గురు సోదరులు కలసి ఆ కుర్రాడిని వెంటనే జిమ్‌లో చేర్పించి బరువు తగ్గించే ప్రయత్నంలో పడ్డారు. అయితే తమ సమీపంలోని ఊర్లో ఉన్న ఆ జిమ్ నాలుగు రోజులకే మూతపడటంతో కుర్రాడు ఖుష్ అయ్యాడు. కానీ కుటుంబసభ్యులు మాత్రం వదిలిపెట్టలేదు. సొంత ఊరు ఖాండ్రా నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిమ్‌కు వెళ్లైనా ఆకారం మార్చాల్సిందే అని షరతు పెట్టారు. దాంతో ఆ అబ్బాయికి వెళ్లక తప్పలేదు. కానీ తాను కొత్తగా వెళుతున్న ఊరు తన జీవితాన్ని, రాతను మారుస్తుందని.. చిరస్థాయిగా నిలిచే ఘనతను సృష్టించేందుకు దారి చూపిస్తుందని అతను ఊహించలేదు. అయిష్టంగానే చారిత్రక పట్టణం పానిపట్‌కు వెళ్లిన ఆ కుర్రాడు నీరజ్ చోప్రా.. భారత క్రీడల్లో ఒక కొత్త చరిత్రను రాసిన ఆటగాడు. ‘విజయం సాధించాలనే కాంక్ష మీకు నిద్ర పట్టనివ్వకపోతే.. కష్టపడటం తప్ప మరే విషయం మీకు నచ్చకపోతే.. ఎంత శ్రమించినా అలసట అనిపించకపోతే.. విజయంతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నట్లు అని అర్థం చేసుకోండి’.. ట్విటర్లో ఈ స్ఫూర్తిదాయక వ్యాఖ్యను పెట్టింది జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్‌కి రెండేళ్ల ముందు! అప్పటికి సాధించిన ఘనతలు అతనికేమాత్రం సంతృప్తినివ్వలేదని, అసలు లక్ష్యం వేరే ఉందని అతని మాటలను బట్టి అనిపించింది. నిజంగానే అతను తన ఉత్సాహాన్ని మాటలతో సరిపెట్టలేదు. అందుకు అనుగుణంగా కఠోర సాధన చేశాడు. అలసట లేకుండా శ్రమించాడు. చివరకు ఆ ప్రయాణం ఒలింపిక్స్ పతకం వరకు సాగింది. కానీ అంతటితో ఆగిపోకుండా రెండేళ్లు తిరిగేలోగా ప్రపంచ చాంపియన్ షిప్‌లోనూ స్వర్ణం సాధించి జావెలిన్ లో తనకు ఎదురే లేదని నిరూపించాడు. 13 ఏళ్ల వయసులో ఇంట్లోవాళ్ల ఒత్తిడితో జిమ్‌లోకి అడుగుపెట్టిన అతను తర్వాతి 13 ఏళ్లలో అసమాన ఘనతలన్నీ సాధించిన జగజ్జేతగా నిలవడం నీరజ్ స్థాయిని చూపిస్తోంది. బల్లెం విసిరితే.. నీరజ్ చేతిలో బల్లెంతో రన్‌వేపై అడుగులు వేయడం మొదలు పెట్టగానే ఒకటి మాత్రం ఖాయమవుతుంది. అదే అతను కచ్చితంగా పతకం గెలవడం! భారత క్రీడల్లో ఇంత నిలకడగా విజయాలు దక్కడం దాదాపుగా కనిపించదు. సీనియర్ స్థాయిలోకి వచ్చిన తర్వాత ఇటీవలి ప్రపంచ చాంపియన్ షిప్ వరకు తాను పోటీపడ్డ ప్రతిచోటా పతకంతోనే తిరిగొచ్చాడు. అతనికి మెడల్ అందించిన 88.17 మీటర్ల దూరం నీరజ్ టాప్–5లో కూడా లేదు. కానీ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి దానికి అనుగుణంగా తన ఆటను మార్చుకోగల ప్రత్యేక లక్షణం అతడిని విజేతగా నిలబెట్టింది. గణాంకాలు మాత్రమే ప్రతిసారి ఆటగాడి గొప్పతనాన్ని చెప్పలేవు. కానీ నీరజ్ విషయంలో అంకెలు ఒక పెద్ద కథే చెబుతాయి. టోర్నీ టోర్నీకి ప్రదర్శనను మెరుగుపరచుకుంటూ పోవడం, ఒక పెద్ద విజయంతో సంతృప్తి చెందకుండా మళ్లీ స్టార్టింగ్ పాయింట్ వద్దకు వచ్చి కొత్తగా అంతే ఉత్సాహంతో పోటీకి సిద్ధమవడం అతడిని గొప్పగా నిలబెట్టాయి. తన టాప్–10లో తొమ్మిది దూరాలను అతను ఒలింపిక్స్‌లో స్వర్ణం తర్వాతే నమోదు చేశాడు. కెరీర్లో 10 సార్లు అతను బల్లేన్ని 88 మీటర్లకు పైగా దూరం విసరడం విశేషం. ఎండా.. వాన.. సంబంధం లేదు.. అనారోగ్యం అనే మాటే లేదు. ఎప్పుడైనా సాధన చేయాల్సిందే. ఏ బరిలో అయినా బల్లేన్ని విసిరేందుకు సిద్ధమవాల్సిందే! పానిపట్ నుంచే మొదలు పెట్టి... నీరజ్ చోప్రా కుటుంబం ‘రోర్’ తెగకు చెందింది. మూడో పానిపట్ యుద్ధంలో ఓటమి తర్వాత అక్కడే స్థిరపడిన మరాఠాల వారసులుగా వీరి గురించి చెబుతారు. నలుగురు అన్నదమ్ముల్లో అతని తండ్రి ఒకడు. 16 మంది సభ్యుల ఈ ఉమ్మడి కుటుంబానికి కలిపి ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండు బర్రెలు, మూడు ఆవులు అదనపు ఆస్తి! ఇలాంటి స్థితిలో తమ అబ్బాయిని అంతర్జాతీయ ఆటగాడి స్థాయికి చేర్చడం అంత సులువైన విషయం కాదు. ప్రాక్టీస్ జావెలిన్, మ్యాచ్ జావెలిన్ లు మొదలు డైట్, ఫిట్నెస్ వరకు అన్నీ ఖర్చుతో కూడుకున్నవే. అయితే సాహసికులు, సత్తా ఉన్నవారికే అదృష్టం కూడా వెంట ఉంటుందన్నట్లుగా నీరజ్‌కు తన కెరీర్లో పెద్దగా ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టలేదు. తమ స్థాయికి తగినట్లుగానే ఆరంభంలో కుటుంబ సభ్యులందరూ అండగా నిలిచారు. పానిపట్ నుంచి మొదలుపెట్టి ప్రపంచ చాంపియన్ గా మారడం వరకు అతని ఆట ముందు అన్ని అవరోధాలూ చిన్నబోయాయి. 2010లో పానిపట్ శివాజీ స్టేడియంలో కసరత్తులు చేస్తున్న సమయంలో ఒకసారి సరదాగా జావెలిన్ విసురుతూ మరో త్రోయర్ జైవీర్ కంట్లో పడ్డాడు. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా తొలి ప్రయత్నంలోనే 40 మీటర్ల వరకు జావెలిన్ వెళ్లడం జైవీర్‌ను ఆకట్టుకుంది. అతనే ఆది గురువుగా నీరజ్‌కు ఆటలో ఓనమాలు నేర్పించాడు. ఏడాది తర్వాత మరింత మెరుగైన శిక్షణ కోసం పంచకులలో దేవీలాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అడుగుపెట్టిన నీరజ్‌ను కోచ్ నసీమ్ అహ్మద్ మరింతగా తీర్చిదిద్దాడు. సింథటిక్ రన్ వే సౌకర్యం ఉండటంతో అతని త్రోయింగ్‌లో పదును పెరిగింది. ఇక పోటీల్లో సత్తా చాటే సమయం ఆసన్నమవగా.. జిల్లాస్థాయి పోటీల్లో తొలిసారి విజేతగా నిలవడంతో ప్రారంభమైన గెలుపు ప్రస్థానం ఆపై శిఖరాలకు చేరింది. ఒకటిని మించి మరొకటి.. 15 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ జూనియర్ చాంపియన్ షిప్‌ను గెలుచుకోవడంతో నీరజ్ గురించి అందరికీ తెలిసింది. ఆ తర్వాత రెండేళ్లకు వరల్డ్ యూత్ చాంపియన్ షిప్లో రజతంతో ఈ కుర్రాడిలో సత్తా ఉందని అథ్లెటిక్స్ ప్రపంచం గుర్తించింది. తర్వాతి ఏడాదే జూనియర్ ప్రపంచ రికార్డు కూడా అతను బద్దలు కొట్టాడు. అయితే 2015లో కేరళలో జరిగిన జాతీయ క్రీడల్లో నీరజ్‌కు పతకం దక్కలేదు. అతను ఐదో స్థానంతోనే సరి పెట్టుకున్నాడు. కానీ అథ్లెటిక్స్ సమాఖ్య ఫలితాన్ని పట్టించుకోకుండా ప్రత్యేక ప్రతిభావంతుడిగా పటియాలాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో సాధన చేసే అవకాశం అతనికి కల్పించింది. ఇది తన కెరీర్లో సరైన మలుపుగా నీరజ్ చెప్పుకున్నాడు. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, ప్రముఖ కోచ్‌లతో శిక్షణ, ప్రత్యేక డైట్ కారణంగా అతను ఎన్ ఐఎస్‌లో టాప్ అథ్లెట్‌గా రూపుదిద్దుకున్నాడు. ఆ తర్వాత అద్భుతాలు సృష్టించడమే మిగిలింది. ‘శాఫ్’ క్రీడల్లో తొలి అంతర్జాతీయ స్వర్ణంతో మెరిసిన అతను ఆ తర్వాత ఎదురు లేకుండా దూసుకుపోయాడు. పోలండ్‌లో ప్రపంచ అండర్–20 చాంపియన్ షిప్లో ప్రపంచ రికార్డులతో పసిడి గెలవగా.. పేరుకే జూనియర్ అయినా ఆ ప్రదర్శన అతనికి సీనియర్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చోటు కల్పించింది. ఇక ఆ తర్వాత నీరజ్ వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. 2019లో గాయం, శస్త్రచికిత్స కారణంగా కాస్త వెనకడుగు వేసినా మళ్లీ దూసుకొచ్చి సత్తా చాటగలనని నీరజ్ తన విజయాలతో నిరూపించాడు. ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచ చాంపియన్ షిప్ స్వర్ణం, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు, ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ విజేత.. అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యుత్తమ విజయాలన్నీ నీరజ్ ఖాతాలో ఉన్నాయి. అయినా సరే ప్రతి టోర్నీకి అదే మొదటి మ్యాచ్‌లాగా అదే తపనతో అతను సిద్ధమవుతున్నాడు. ఇన్ని ఘనతల తర్వాత వేరేవారైనా కాస్త ఉదాసీనతకు చోటిస్తారేమో.. కానీ ఆర్మీలో సుబేదార్ అయిన 26 ఏళ్ల నీరజ్‌లో అదే కసి, అదే పట్టుదల! అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలు ఇప్పటికే అతని ఖాతాలో చేరాయి. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్కు ‘నీరజ్ చోప్రా స్టేడియం’గా పేరు పెట్టి రక్షణశాఖ నీరజ్ పట్ల తన గౌరవాన్ని చాటుకుంది. ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచ చాంపియన్ షిప్ స్వర్ణం, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు, ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ విజేత.. అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యుత్తమ విజయాలన్నీ నీరజ్ ఖాతాలో ఉన్నాయి. అయినా సరే ప్రతి టోర్నీకి అదే మొదటి మ్యాచ్‌లాగా అదే తపనతో అతను సిద్ధమవుతున్నాడు. ఇన్ని ఘనతల తర్వాత వేరేవారైనా కాస్త ఉదాసీనతకు చోటిస్తారేమో.. కానీ ఆర్మీలో సుబేదార్ అయిన 26 ఏళ్ల నీరజ్‌లో అదే కసి, అదే పట్టుదల! అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలు ఇప్పటికే అతని ఖాతాలో చేరాయి. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్కు ‘నీరజ్ చోప్రా స్టేడియం’గా పేరు పెట్టి రక్షణశాఖ నీరజ్ పట్ల తన గౌరవాన్ని చాటుకుంది. ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచ చాంపియన్ షిప్ స్వర్ణం, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు, ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ విజేత.. అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యుత్తమ విజయాలన్నీ నీరజ్ ఖాతాలో ఉన్నాయి. అయినా సరే ప్రతి టోర్నీకి అదే మొదటి మ్యాచ్‌లాగా అదే తపనతో అతను సిద్ధమవుతున్నాడు. ఇన్ని ఘనతల తర్వాత వేరేవారైనా కాస్త ఉదాసీనతకు చోటిస్తారేమో.. కానీ ఆర్మీలో సుబేదార్ అయిన 26 ఏళ్ల నీరజ్‌లో అదే కసి, అదే పట్టుదల! అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలు ఇప్పటికే అతని ఖాతాలో చేరాయి. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్కు ‘నీరజ్ చోప్రా స్టేడియం’గా పేరు పెట్టి రక్షణశాఖ నీరజ్ పట్ల తన గౌరవాన్ని చాటుకుంది. •మెహమ్మద్ అబ్ధుల్ హాది -
ప్రపంచంలో భారత్, పాక్.. నం.1, 2.. ఇక ఒలింపిక్స్‌లో! నాకు తెలుసు..
World Athletics Championships 2023- Neeraj Chopra- Arshad Nadeem: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2023లో స్వర్ణం సాధించిన భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘నీ ఆటకు నీరాజనం’ అంటూ భారతీయులంతా ఈ హర్యానా కుర్రాడి విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్నారు. నీరజ్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ అతడి గెలుపును కొనియాడుతున్నారు. ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌తో కాగా టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి గెలిచి యావత్ భారతావనిని పులకింపజేసిన ఈ గోల్డెన్ బాయ్.. వరల్డ్ అథ్లెటిక్స్‌లోనూ గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. నాలుగు దశాబ్దాలుగా భారత అథ్లెట్లకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేసి రికార్డులకెక్కాడు. నీరజ్ భాయ్.. సంతోషంగా ఉందన్న అర్షద్ ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జావెలిన్ త్రో స్టార్ అర్షద్ నదీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుడాపెస్ట్ వరల్డ్ అథ్లెటిక్స్‌లో నీరజ్ కంటే ఒక అడుగు వెనుకబడి రజతంతో సరిపెట్టుకున్న అతడు.. ‘‘నీరజ్ భాయ్.. నీ విజయం పట్ల నాకెంతో సంతోషంగా ఉంది! ప్రపంచంలో ఇండియా- పాకిస్తాన్ 1, 2 స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలో భారత్, పాక్.. నం.1,2 ఆ దేవుడి దయ వల్ల ఒలింపిక్స్‌లోనూ మనం 1- 2 స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. ప్యారిస్ ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటాలని నీరజ్ చోప్రాకు ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక విజయానంతరం నీరజ్ మాట్లాడుతూ.. ‘‘ఈవెంట్ ముగిసిన తర్వాత నేను అర్షద్‌ను కలిశాను. ప్రపంచ వేదికపై భారత్- పాక్ సత్తా చాటినందుకు ఇద్దరం సంతోషం పంచుకున్నాం. మాకు గట్టిపోటీనిచ్చిన యూరోపియన్ ఆటగాళ్లను దాటుకుని ముందుకు వెళ్లిన తీరును గుర్తు చేసుకున్నాం. క్రీడల్లో ఇరు దేశాల మధ్య ఉన్న పోటీతత్వం గురించి మాకు తెలుసు. అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలుసు ఈసారి నేను గెలిచాను. దీంతో ఆసియా క్రీడల నేపథ్యంలో అభిమానుల అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలుసు. మేము మళ్లీ చైనాలోని హాంగ్జూలో మళ్లీ కలుస్తాం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ జాకూచ్ వాద్లెచ్(86.7 మీటర్లు)ను వెనక్కి నెట్టి వరల్డ్ అథ్లెటిక్స్‌లో అర్షద్ రన్నరప్‌గా నిలిచాడు. 87.82 మీటర్ల దూరం ఈటెను విసిరి రజత పతకం గెలిచాడు. చదవండి: నవీన్‌కు గట్టి షాక్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్! అయ్యో పాపం.. ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. విధ్వంసకర ఆటగాడు దూరం! -
నీరజ్ మెరిసె... తొలిసారి ఒకే ఈవెంట్ ఫైనల్లో ముగ్గురు భారత అథ్లెట్లు
బుడాపెస్ట్ (హంగేరి): కొన్నేళ్లుగా అంతర్జాతీయ అథ్లెటిక్స్ వేదికపై భారత ముఖచిత్రంగా మారిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా తొలి అడ్డంకిని విజయవంతంగా అధిగమించాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో నీరజ్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. తన మొదటి ప్రయత్నంలోనే ఈటెను ఏకంగా 88.77 మీటర్ల దూరం విసిరిన నీరజ్ ఆదివారం జరిగే ఫైనల్‌కు అర్హత సాధించాడు. అంతేకాకుండా పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణాన్ని (85.50 మీటర్లు) కూడా దాటేసి వచ్చే ఏడాది జరిగే విశ్వ క్రీడలకు బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో 12 మంది బరిలో ఉన్న గ్రూప్ ‘ఎ’లో నీరజ్ పోటీపడ్డాడు. మైదానంలోని అభిమానులు ఉత్సాహపరుస్తుండగా నీరజ్ జావెలిన్‌ను 88.77 మీటర్ల దూరం విసిరి ఒక్క త్రోతో రెండు లక్ష్యాలను సాధించాడు. జావెలిన్‌ను 83 మీటర్ల దూరం విసిరిన వారు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తారు లేదా టాప్–12లో నిలిచిన వారికి ఫైనల్ చేరే అవకాశం లభిస్తుంది. నీరజ్ తప్ప గ్రూప్ ‘ఎ’ నుంచి మరెవరూ నేరుగా ఫైనల్ చేరలేకపోయారు. గ్రూప్ ‘ఎ’లోనే పోటీపడ్డ మరో భారత అథ్లెట్ డీపీ మనూ (81.31 మీటర్లు)... గ్రూప్ ‘బి’లో బరిలో నిలిచిన కిశోర్ కుమార్ జేనా (80.55 మీటర్లు) కూడా ఫైనల్‌కు చేరారు. ఓవరాల్‌గా మనూ ఆరో స్థానంలో, కిశోర్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఫలితంగా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో తొలిసారి ఒకే ఈవెంట్లో ముగ్గురు భారత అథ్లెట్లు ఫైనల్లో పోటీపడనున్నారు. నీరజ్‌తోపాటు అర్షద్ నదీమ్ (పాకిస్తాన్; 86.79 మీటర్లు), జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 83.50 మీటర్లు) మాత్రమే క్వాలిఫయింగ్ మార్క్‌ను అధిగమించి నేరుగా ఫైనల్ చేరారు. డిఫెండింగ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 78.49 మీటర్లు) ఓవరాల్‌గా 16వ స్థానంలో నిలిచి ఫైనల్ చేరలేకపోయాడు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్, టోక్యో ఒలింపిక్స్, డైమండ్ లీగ్ మీట్‌లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన 25 ఏళ్ల నీరజ్ ఖాతాలో ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణ పతకం మాత్రమే చేరాల్సి ఉంది. గత ఏడాది అమెరికాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ హరియాణా జావెలిన్ త్రోయర్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెల్చుకున్నాడు. అంతా అనుకున్నట్లు జరిగితే ఆదివారం జరిగే ఫైనల్లో నీరజ్‌ను ఈసారి విశ్వవిజేతగా చూడవచ్చు. -
నీరజ్ చోప్రా మెరిసె.. వరుసగా రెండో డైమండ్ లీగ్‌లో అగ్రస్థానం
లుసాన్ (స్విట్జర్లాండ్): ఒలింపిక్ చాంపియన్, భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి మెరిశాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ సిరీస్‌లో భాగంగా తాను బరిలోకి దిగిన రెండో టోర్నీలోనూ అగ్రస్థానాన్ని సంపాదించాడు. లుసాన్‌లో జరిగిన సీజన్‌లోని ఆరో డైమండ్ లీగ్ మీట్లో 25 ఏళ్ల నీరజ్ టైటిల్ గెల్చుకున్నాడు. గాయం కారణంగా నెలరోజులపాటు విశ్రాంతి తీసుకున్న నీరజ్‌కు ఈ మీట్లో ఐదో ప్రయత్నం ప్రదర్శన మొదటి స్థానాన్ని ఖరారు చేసింది. ఐదో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను 87.66 మీటర్ల దూరం విసిరాడు. ‘ఫౌల్ త్రో’తో మొదలుపెట్టిన భారత స్టార్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 83.52 మీటర్లు... మూడో ప్రయత్నంలో 85.04 మీటర్లు విసిరాడు. అనంతరం నాలుగో ప్రయత్నం ‘ఫౌల్’కాగా, ఆరో ప్రయత్నంలో జావెలిన్ 84.15 మీటర్ల దూరం వెళ్లింది. జూలియన్ వెబెర్ (జర్మనీ; 87.03 మీటర్లు) రెండో స్థానంలో, జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 86.13 మీటర్లు) మూడో స్థానంలో నిలిచారు. డైమండ్ లీగ్ సిరీస్‌లో భాగంగా మొత్తం ఏడు మీట్లలో జావెలిన్ త్రో ఈవెంట్ ఉంది. ఏడు మీట్ల తర్వాత టాప్–8లో నిలిచిన వారు సెపె్టంబర్ 16, 17 తేదీల్లో అమెరికాలోని యుజీన్‌లో జరిగే గ్రాండ్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. లుసాన్ మీట్లో టైటిల్ నెగ్గిన నీరజ్ ప్రస్తుతం 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈనెల 21న మొనాకోలో జరిగే డైమండ్ లీగ్ మీట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న నీరజ్ ఆగస్టులో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగుతాడు. లుసాన్ డైమండ్ లీగ్ మీట్లో లాంగ్‌జంప్ ఈవెంట్ లో పాల్గొన్న భారత అథ్లెట్ శ్రీశంకర్ 7.88 మీటర్ల దూరం దూకి ఐదో స్థానంలో నిలిచాడు. -
రష్మీ, భవానిలకు కాంస్యాలు
భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు రష్మీ, భవాని యాదవ్ జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలతో మెరిశారు. ఒడిశాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఇద్దరు కాంస్య పతకాలు సాధించారు. జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల జావెలిన్ త్రో ఈవెంట్లో రష్మీ ఈటెను 50.95 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. నాలుగో ప్రయత్నంలో ఈ మెరుగైన ప్రదర్శన ద్వారా ఆమె కాంస్య పతకం నెగ్గింది. ఇందులో అన్ను రాణి (ఉత్తరప్రదేశ్; 58.22 మీ.) స్వర్ణం, ప్రియాంక (హరియాణా; 51.94 మీ.) రజతం గెలుపొందారు. అంతకుముందు జరిగిన లాంగ్‌జంప్ పోటీలో భవాని 6.44 మీటర్ల దూరం దూకి కాంస్యంతో తృప్తిపడింది. అన్సీ సోజన్ (కేరళ; 6.51 మీ.), శైలీసింగ్ (ఉత్తరప్రదేశ్; 6.49 మీ.) వరుసగా పసిడి, రజత పతకాలు సాధించారు. భారత స్టార్ అథ్లెట్, షాట్‌పుటర్ తజీందర్ పాల్ తూర్ తన రికార్డును తానే సవరించి కొత్త ‘ఆసియా’ రికార్డు నెలకొల్పాడు. అతను గుండును 21.77 మీటర్ల దూరం విసిరాడు. దీంతో 28 ఏళ్ల పంజాబ్ అథ్లెట్ తజీందర్ 2021లో 21.49 మీటర్లతో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. అతను విసిరిన దూరం ఈ సీజన్లో ప్రపంచంలోనే తొమ్మిదో మెరుగైన ప్రదర్శనగా నిలిచింది. 21.40 మీటర్ల క్వాలిఫయింగ్ మార్క్‌ను దాటడంతో ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలకూ తజీందర్ పాల్ అర్హత సంపాదించాడు. సోమవారం ముగిసిన ఈ పోటీల్లో ఏపీ అమ్మాయి యెర్రా జ్యోతి ఉత్తమ మహిళా అథ్లెట్‌గా ఎంపికైంది. తమిళనాడు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. -
డైమండ్ లీగ్ టోర్నీతో నీరజ్ సీజన్ షురూ
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా ఈ ఏడాది అంతర్జాతీయ సీజన్‌ను డైమండ్ లీగ్ టోర్నీతో మొదలుపెట్టనున్నాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ పసిడి పతకం గెలిచి చాంపియన్‌గా నిలిచాడు. ఈ ఏడాది డైమండ్ లీగ్ సీజన్లో మొత్తం 14 వన్డే టోర్నీలు ఉన్నాయి. మే 5న దోహాలో తొలి టోర్నీ జరుగుతుంది. జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీకి ధనుశ్ శ్రీకాంత్ న్యూఢిల్లీ: జూన్ తొలి వారంలో జర్మనీలో జరిగే ప్రపంచకప్ జూనియర్ షూటింగ్ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన ధనుశ్ శ్రీకాంత్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. 20 ఏళ్ల ధనుశ్ 2019లో దోహాలో జరిగిన ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లో... 2021లో పెరూ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు సాధించాడు. విజేత షణ్ముఖ ముంబై: అఖిల భారత ‘ఫిడే’ రేటింగ్ చెస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ పి.షణ్ముఖ విజేతగా నిలిచాడు. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో షణ్ముఖతోపాటు విక్రమాదిత్య కులకర్ణి, సౌరవ్ ఖేరెడ్కర్ 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. షణ్ముఖకు టైటిల్ ఖరారు కాగా... విక్రమాదిత్య రన్నరప్‌గా, సౌరవ్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఈ టోర్నీలో షణ్ముఖ ఏడు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. విజేతగా నిలిచిన షణ్ముఖకు ట్రోఫీతోపాటు రూ. 75 వేలు ప్రైజ్‌మనీగా లభించింది. -
జావెలిన్ నుంచి క్రికెట్‌కు...
ఇంగ్లండ్‌తో సెమీస్‌లో అర్ధ సెంచరీతో పాటు నాలుగు క్యాచ్‌లు పట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన దక్షిణాఫ్రికా ఓపెనర్ తజ్మీన్ బ్రిట్స్ క్రికెట్ ప్రస్థానం అసాధారణం. అడ్డంకులను అధిగమించి ఇక్కడి వరకు రావడం స్ఫూర్తిదాయకం. 2007 వరల్డ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రోలో బ్రిట్స్ స్వర్ణం సాధించింది. ఆపై ఇదే ఆటలో మరింత ముందుకు వెళ్లేందుకు పట్టుదలగా సాధన చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్ లక్ష్యంగా ఆమె సన్నాహాలు సాగాయి. ఈ మెగా ఈవెంట్ కోసం ఆమె అప్పటికే అర్హత సాధించింది కూడా. అయితే దురదృష్టం బ్రిట్స్‌ను పలకరించింది. 2011లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. మూడు నెలల పాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. శరీరంలో వేర్వేరు భాగాలన్నీ దెబ్బ తినగా, మళ్లీ మళ్లీ శస్త్ర చికిత్సలు చేయాల్సి వచ్చింది. ఎలాంటి మార్గనిర్దేశనం లేని ఆ సమయంలో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. అయితే చివరకు కోలుకున్న తర్వాత క్రికెట్ వైపు మళ్లింది. నడవలేని స్థితి నుంచి మళ్లీ మైదానంలోకి దిగింది. పట్టుదలతో సాధన చేసి దేశవాళీలో మంచి ప్రదర్శనతో సీనియర్ స్థాయి వరకు ఎదిగింది. 2018 టి20 వరల్డ్‌కప్‌లోనే చాన్స్ లభిస్తుందని అనుకున్నా, త్రుటిలో చేజారింది. ఇప్పుడు ఈసారి తానే ముందుండి జట్టును ఫైనల్ వరకు నడిపించింది. సెమీస్‌లో ఒక క్యాచ్ కోసం డైవ్ చేసినప్పుడు ఒక్కసారిగా ఆమెను పాత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. అయితే ఎలాంటి గాయాలు కాలేదని తెలుసుకొని ఊరట పొందింది. సొంత గడ్డపై వరల్డ్‌కప్ ఫైనల్ ఆడబోవడం కలగా ఉందని, మరొక్క మంచి ప్రదర్శనతో ట్రోఫీ అందుకునే క్షణం కోసం ఎదురు చూస్తున్నట్లుగా తజ్మీన్ బ్రిట్స్ భావోద్వేగంతో చెప్పింది. -
నీరజ్ చోప్రా స్కై డైవింగ్.. వీడియో వైరల్
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా గతవారం డైమండ్ లీగ్ ట్రోఫీని తొలిసారి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈటెను 88.44 మీటర్ల దూరం విసిరి ట్రోఫీ కొల్లగొట్టాడు. గత గురువారం జరిగిన ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసి డిస్క్వాలిఫై అయ్యాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో ఈటెను 88.44 మీటర్లు దూరం విసిరాడు. మూడో ప్రయత్నంలో 88 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 86.11 మీటర్లు, చివరి ప్రయత్నంలో 87 మీటర్లు విసిరాడు. ఇక డైమండ్ లీగ్ మీట్ ముగించుకొని ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉన్న నీరజ్ చోప్రా వెకేషన్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా స్విట్జర్లాండ్‌లో స్కై డైవింగ్ చేసి..ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు.దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన నీరజ్ చోప్రా..'' స్కై ఈజ్ నాట్ ది లిమిట్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో బాలీవుడ్ సినిమా ''జిందగీ నా మిలేగీ దుబారా'' మ్యూజిక్‌ను ప్లే చేస్తూ.. ఆ సినిమా తరహాలోనే స్కైడైవింగ్ చేయడం విశేషం. ఆకాశం మధ్యలో విమానం నుంచి దూకే సమయంలో నీరజ్ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. చిరునవ్వులు చిందిస్తూ స్కైడైవ్‌ను ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. రెండు రోజుల్లోనే నాలుగు లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం. నీరజ్ చోప్రా స్కై డైవింగ్ ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక 2017, 2018 డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్‌కు నీరజ్ అర్హత సాధించినప్పటికి ట్రోఫీ కొట్టేలేకపోయాడు. ఈసారి మాత్రం ట్రోఫీ అందుకున్న నీరజ్ చోప్రా వచ్చే ఏడాది హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ బెర్తును ఇప్పటికే ఖరారు చేసుకున్నాడు. View this post on Instagram A post shared by MySwitzerlandIn (@myswitzerlandin) చదవండి: లియాండర్ పేస్ గురువు కన్నుమూత -
'90 మీటర్ల దూరం విసిరినా పతకం రాకపోతే'
అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గురువారం విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. రెండో ప్రయత్నంలో ఈటెను 88.44 మీటర్ల దూరం విసిరి ఎవరికి అందనంతో ఎత్తులో నిలిచిన నీరజ్.. అగ్రస్థానంలో నిలిచి తొలిసారి ట్రోఫీని అందుకున్నాడు. అయితే టోక్యో ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా ఇప్పటికే చాలా ఈవెంట్స్‌లో పాల్గొన్నప్పటికి అతని అత్యధిక దూరం 89.94 మీటర్లుగా ఉంది. ఈ ఏడాది జూన్ 30న జరిగిన స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ దీనిని అందుకున్నాడు. అయితే నీరజ్ 90 మీటర్లు మార్క్ ఎప్పుడు అందుకుంటాడా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన అనంతరం నీరజ్ చోప్రా మీడియాతో సుధీర్ఘంగా మాట్లాడాడు. ‘జావెలిన్‌ను 90 మీటర్లు విసిరేందుకు ప్రయత్నించా. దానిని అందుకోలేకపోయినా బాధపడటం లేదు. ఎందుకంటే డైమండ్ ట్రోఫీ గెలవడం అన్నింటికంటే ముఖ్యం. అది నేను సాధించాను. 90 మీటర్ల మార్క్ అనేది పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంది. దానిని అందుకొని కూడా పతకం గెలవకపోతే వృథా కదా! ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత ఆటగాళ్లకు గుర్తింపు రావడం కూడా ఎంతో అవసరం. అన్నింటికి మించి నా కుటుంబం కూడా ఇక్కడే ఉంది. తొలిసారి వారంతా నేను పాల్గొన్న ఒక అంతర్జాతీయ ఈవెంట్‌కు హాజరయ్యారు. మరో వైపు నాపై ఇప్పటికే అంచనాల ఒత్తిడి తీవ్రంగా ఉంది. కొత్తగా ఒత్తిడి పెంచుకోలేను. అందరూ ఇప్పుడు స్వర్ణమే ఆశిస్తున్నారు. నేను వంద శాతం ప్రయత్నిస్తాను కానీ అది ఎప్పుడూ సాధ్యం కాదని అందరూ అర్థం చేసుకోవాలి’ అంటూ తెలిపాడు. చదవండి: Neeraj Chopra: ఎదురులేని నీరజ్ చోప్రా.. పట్టిందల్లా బంగారమే Golds,Silvers done, he gifts a 24-carat Diamond 💎 this time to the nation 🇮🇳🤩 Ladies & Gentlemen, salute the great #NeerajChopra for winning #DiamondLeague finals at #ZurichDL with 88.44m throw. FIRST INDIAN🇮🇳 AGAIN🫵🏻#indianathletics 🔝 X-*88.44*💎-86.11-87.00-6T😀 pic.twitter.com/k96w2H3An3 — Athletics Federation of India (@afiindia) September 8, 2022 -
ఎదురులేని నీరజ్ చోప్రా.. పట్టిందల్లా బంగారమే
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రాకు ఎదురులేకుండా పోతుంది. అతను ఏం పట్టినా బంగారమే అవుతుంది. తాజాగా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో విజయం సాధించిన నీరజ్ చోప్రా ట్రోఫీని ఎగురేసుకుపోయాడు. భారత కాలమాన ప్రకారం జ్యూరిచ్ వేదికగా గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన గేమ్‌లో నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలో ఈటెను 88.34 మీటర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచాడు. అతనికి పోటీగా ఉన్న ఐదుగురు కనీసం దరిదాపులోకి కూడా రాలేకపోయారు. దీంతో ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ట్రోఫీ నీరజ్ సొంతమైంది. ఇక గేమ్ విషయానికి వస్తే.. తొలి ప్రయత్నంలో నీరజ్ చోప్రా ఫౌల్ చేసి డిస్క్వాలిఫై అయ్యాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో ఈటెను 88.44 మీటర్లు దూరం విసిరాడు. మూడో ప్రయత్నంలో 88 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 86.11 మీటర్లు, చివరి ప్రయత్నంలో 87 మీటర్లు విసిరాడు. అయితే నీరజ్‌తో పాటు ఉన్న మిగతా ఐదుగురు వేగాన్ని అందుకోవడంలో విఫలమయ్యారు. ఇక 2017, 2018 డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్‌కు నీరజ్ అర్హత సాధించినా పతకం సాధించలేకపోయాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో సంచలనం సృష్టించిన నీరజ్ ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతంతో మెరిశాడు. Golds,Silvers done, he gifts a 24-carat Diamond 💎 this time to the nation 🇮🇳🤩 Ladies & Gentlemen, salute the great #NeerajChopra for winning #DiamondLeague finals at #ZurichDL with 88.44m throw. FIRST INDIAN🇮🇳 AGAIN🫵🏻#indianathletics 🔝 X-*88.44*💎-86.11-87.00-6T😀 pic.twitter.com/k96w2H3An3 — Athletics Federation of India (@afiindia) September 8, 2022 -
చిన్న గ్యాప్ మాత్రమే.. ప్రపంచ రికార్డుతో ఘనంగా రీఎంట్రీ
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. గజ్జల్లో గాయంతో కామన్వెల్త్ గేమ్స్‌కు దూరంగా ఉన్న నీరజ్ చోప్రా స్విట్జర్లాండ్‌లోని లుసాన్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో మరోసారి అదరగొట్టాడు. శుక్రవారం(ఆగస్టు 26న) జరిగిన అర్హత రౌండ్లో తొలి ప్రయత్నంలోనే నీరజ్ ఈటెను 89.08 మీట్లర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచాడు. ఇది అతని కెరీర్లో మూడో బెస్ట్ త్రో కావడం ఇశేషం. ఇంతకముందు ఇదే సీజన్లో 89.30 మీటర్లు, 89.98 మీటర్ల దూరం ఈటెను విసిరి కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. ఇక నీరజ్ చోప్రా వచ్చే నెలలో 7, 8 తేదీల్లో స్విట్జర్లాండ్‌లోనే డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో పాల్గొంటాడు. నీరజ్ తన తొలి ప్రయత్నంలో ఈటెను 89.08 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 85.18 మీటర్లు, మూడో ప్రయత్నంలో ఈటెను విసరలేదు. నాలుగో ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ చివరి ప్రయత్నంలో 80.04 మీటర్లు మాత్రమే విసరగలిగాడు. అయితే తనకంటే బెస్ట్ ఎవరు వేయకపోవడంతో నీరజ్ తొలి స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. గత నెలలో అమెరికాలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్ సందర్భంగా గాయపడటంతో నీరజ్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగాడు. #NeerajChopra 🇮🇳 Top finish with 89.08m at Lausanne Diamond League 🔥 He is back and back with a bang!#IndianAthletics@Diamond_League pic.twitter.com/0zTwDpjhyU — Athletics Federation of India (@afiindia) August 26, 2022 చదవండి: భారత్‌పై ‘ఫిఫా’ నిషేధం ఎత్తివేత Yora Tade: ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతూ మృత్యు ఒడిలోకి భారత కిక్ బాక్సర్ -
డైమండ్ లీగ్ మీట్లో నీరజ్ చోప్రా
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గజ్జల్లో గాయం నుంచి కోలుకున్నాడు. ఈనెల 26న స్విట్జర్లాండ్‌లోని లుసాన్‌లో జరిగే డైమండ్ లీగ్ మీట్లో నీరజ్ బరిలోకి దిగనున్నాడు. ఈ మీట్లో అతను రాణిస్తే వచ్చే నెలలో 7, 8 తేదీల్లో స్విట్జర్లాండ్‌లోనే జరిగే డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాడు. గత నెలలో అమెరికాలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ రజతం సాధించాడు. ఫైనల్ సందర్భంగా గాయపడటంతో నీరజ్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగాడు. -
నీరజ్ చోప్రా గైర్హాజరీలో చెలరేగిన నదీమ్.. 56 ఏళ్ల పాకిస్తాన్ నిరీక్షణకు తెర
కామన్వెల్త్ గేమ్స్ జావెలిన్ త్రో ఈవెంట్లో పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ అద్భుతం చేశాడు. ఫైనల్లో నదీమ్ జావెలిన్‌ను 90.18 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించాడు. ఈ క్రమంలో జావెలిన్‌ను 90 మీటర్లకు పైగా విసిరిన రెండో ఆసియా అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. 2017లో చైనీస్ తైపీ అథ్లెట్ 91.36 మీటర్ల దూరం విసిరాడు. నదీమ్ ప్రదర్శనతో పాక్ 56 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పతకం గెలిచింది. ఇదిలా ఉంటే భారత స్టార్, వరల్డ్ నంబర్ వన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గాయం కారణంగా చివరి నిమిషంలో కామన్వెల్త్ క్రీడల బరిలో నుంచి తప్పుకోవడం నదీమ్‌కు కలిసొచ్చింది. నీరజ్ గైర్హాజరీలో నదీమ్ చెలరేగాడు. కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పాక్ కల సాకారం చేశాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నదీం నాలుగో స్థానంలో నిలువగా.. నీరజ్ చోప్రా ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని (రెండో స్థానం) గెల్చుకున్నాడు. నీరజ్ అదే ఊపులో కామన్వెల్త్ బరిలోకి దిగి ఉంటే అలవోకగా 90 మీటర్ల దూరం విసిరేవాడు. ఏదిఏమైనప్పటికీ నీరజ్ కామన్వెల్త్ క్రీడల బరిలో లేకపోవడంతో పాక్ 56 ఏళ్ల కల నెరవేరింది. కాగా, నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చరిత్రలో భారత్‌కు రజత పతకం అందించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ బాబీజార్జి కాంస్య పతకాన్ని సాధించింది. చదవండి: భారత్-పాక్ మ్యాచ్ సందడి మొదలైంది.. హీటెక్కిస్తున్న హిట్‌మ్యాన్ ప్రోమో -
జావెలిన్ త్రోలో తొలి పతకం.. చరిత్ర సృష్టించిన అన్నూ మాలిక్
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల జాతరను కొనసాగిస్తుంది. ఇప్పటికే భారత్ ఖాతాలో 46 పతకాలు ఉండగా.. తాజాగా మరో మెడల్ వచ్చి చేరింది. ప్రస్తుత క్రీడల్లో జావెలిన్ త్రోలో భారత్ తొలి పతకం సాధించింది. మహిళల కేటగిరీలో అన్నూ రాణి జావెలిన్‌ను 60.03 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకం గెలిచింది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో మహిళల విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కాగా, ఓవరాల్‌గా (మహిళలు, పురుషులు) మూడవది. అన్నూ మెడల్‌తో భారత్ పతకాల సంఖ్య 47కు (16 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలు) చేరింది. ఇదిలా ఉంటే, కామన్వెల్త్ క్రీడల పదో రోజు భారత్ పతకాల సంఖ్య ఏడుకు (3 స్వర్ణాలు, రజతం, 3 కాంస్యాలు) చేరింది. మహిళల 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్, పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్, ట్రిపుల్ జంప్‌లో ఎల్దోస్ పాల్ పసిడి పతకాలు సాధించగా.. పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో అబ్దుల్లా అబూబకర్ రజతం, మహిళల హాకీ, పురుషుల 10000 మీటర్ల రేస్ వాక్‌లో సందీప్ కుమార్, మహిళల జావెలిన్ త్రోలో అన్నూ రాణి కాంస్య పతకాలు గెలిచారు. చదవండి: అంచనాలకు మించి రాణిస్తున్న భారత అథ్లెట్లు.. రేస్ వాక్‌లో మరో పతకం -
నీరజ్ చోప్రా 'రజతం'.. డ్యాన్స్‌తో ఇరగదీసిన కుటుంబసభ్యులు
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా స్వస్థలమైన హర్యానాలోని పానిపట్ కేంద్రంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. నీరజ్ పతకం సాధించాడని తెలియగానే అతని కుటుంబసభ్యులు, బంధు మిత్రులు మిఠాయిలు పంచుకొని బాణసంచాలు కాల్చారు. అనంతరం డ్యాన్స్‌లతో ఇరగదీశారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఏఎన్ఐ ట్విటర్లో షేర్ చేయగా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇక ఆదివారం జరిగిన ఫైనల్లో తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ చోప్రా.. నాలుగో ప్రయత్నంలో ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రజతం కొల్లగొట్టాడు. తద్వారా 19 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. 2003 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో లాంగ్ జంప్ విభాగంలో భారత మహిళా అథ్లెట్ అంజూ బాబీ జార్జీ కాంస్యం గెలుచుకుంది. అప్పటి నుంచి భారత్‌కు అథ్లెటిక్స్ విభాగంలో పతకం రాలేదు. తాజాగా నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్‌లో పతకం సాధించిన రెండో భారత అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు. గ్రెనేడియన్ జావెలిన్ త్రోయర్ అండర్సన్ పీటర్స్ 90.54 దూరం విసిరి స్వర్ణం సాధించగా.. 88.09 మీటర్లతో జాకుబ్ వడ్లేజ్ కాంస్యం గెలుచుకున్నాడు. కాగా భారత్‌కు చెందిన మరో అథ్లెట్ రోహిత్ యాదవ్ ఫైనల్లో నిరాశపరిచాడు. తన మూడో ప్రయత్నంలో ఈటెను 78.72 మీటర్ల దూరం విసిరిన రోహిత్ ఓవరాల్‌గా 10వ స్థానానికి పరిమితమయ్యాడు. #WATCH Family and friends celebrate Neeraj Chopra's silver medal win in the World Athletics Championships at his hometown in Panipat, #Haryana Neeraj Chopra secured 2nd position with his 4th throw of 88.13 meters in the men's Javelin finals. pic.twitter.com/khrUhmDgHG — ANI (@ANI) July 24, 2022 చదవండి: రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా.. రెండో భారత అథ్లెట్‌గా రికార్డు -
Neeraj Chopra Latest Photos: శభాష్ నీరజ్ చోప్రా (ఫొటోలు)
-
నిరాశపర్చిన అన్నూ రాణి.. ఆశలన్నీ గోల్డెన్ బాయ్‌పైనే..!
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ బోణీ కొట్టేందుకు ఇంకా నిరీక్షించాల్సి ఉంది. ఏదో ఒక పతకం సాధిస్తుందని ఆశించిన మహిళా జావెలిన్ త్రోయర్ అన్నూ రాణి తాజాగా జరిగిన ఫైనల్స్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేక ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఐదు ప్రయత్నాల్లో భాగంగా అన్నూ ఒకేసారి 60 మీటర్లకు పైగా (61.12) బళ్లాన్ని (జావెలిన్) విసరగలిగింది. తొలి ప్రయత్నంలో 56.18 మీటర్ల దూరాన్ని విసిరిన అన్నూ.. ఆతర్వాత నాలుగు ప్రయత్నాల్లో 61.12, 58.14, 59.98, 58.70 మీటర్ల దూరం మాత్రమే బళ్లాన్ని విసిరి నిరాశపర్చింది. ఫలితంగా ఏడో స్థానంతో సరిపెట్టుకుని మెగా ఈవెంట్ నుంచి రిక్త హస్తాలతో నిష్క్రమించింది. ఫైనల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కెల్సీ లీ బార్బర్ (ఆస్ట్రేలియా) మరోసారి సత్తా చాటి (66.91 మీ) స్వర్ణం కైవసం చేసుకోగా.. అమెరికాకు చెందిన కారా వింగర్ (64.05) రజతం, జపాన్ త్రోయర్ హరుకా కిటగుచి (63.27) కాంస్య పతకాలు సాధించారు. ఇదిలా ఉంటే, ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో అన్నూ రాణి పోరాటం ముగియడంతో భారత్ ఆశలన్నీ టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. క్వాలిఫికేషన్స్‌లో నీరజ్ తొలి ప్రయత్నంలోనే ఏకంగా 88.39 మీటర్ల దూరం విసిరి తుది పోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. నీరజ్‌తో పాటు మరో భారత క్రీడాకారుడు రోహిత్ యాదవ్ కూడా 11వ స్థానంతో ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఫైనల్స్ జరుగుతాయి. చదవండి: World Athletics Championship: పతకంపై ఆశలు! -
వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్.. ఫైనల్స్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా
ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరో సారి తన సత్తా చాటాడు. అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2022 ఫైనల్‌కు నీరజ్ చోప్రా చేరుకున్నాడు. శుక్రవారం ఉదయం జరిగిన గ్రూప్-ఏ జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్ తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి నీరజ్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఇక అతడితో పాటు మరో భారత త్రోయర్ రోహిత్ యాదవ్ కూడా ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అంతకుముందు అన్నూ రాణి మహిళల జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ఫైనల్స్ భారత కాలమానం ప్రకారం ఆదివారం జరగనున్నాయి. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా పతకం సాధిస్తే.. రెండో భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టిస్తాడు. 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత లాంగ్ జంపర్ అంజూ బాబి జార్జ్ కాంస్య పతకం నెగ్గింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు భారత్ కేవలం ఒకే ఒక పతకం మాత్రమే సాధించింది. చదవండి: IND vs WI: విరాట్ కోహ్లికి రెస్ట్ అవసరమా..? అసలే ఫామ్ కోల్పోయి..! As the commentator predicted, "he wants one & done" #NeerajChopra does it pretty quickly & with ease before admin's laptop could wake up 🤣 With 88.39m, Olympic Champion from 🇮🇳 #India enters his first #WorldAthleticsChamps final in some style 🫡 at #Oregon2022 pic.twitter.com/y4Ez0Mllw6 — Athletics Federation of India (@afiindia) July 22, 2022 -
World Athletics Championships 2022: నేడు బరిలో నీరజ్ చోప్రా
భారత క్రీడాభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోరుకు రంగం సిద్ధమైంది. భారత స్టార్ అథ్లెట్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా నేడు బరిలోకి దిగబోతున్నాడు. జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ ఈవెంట్లో అతనితో పాటు మరో భారత త్రోయర్ రోహిత్ యాదవ్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. ఆటోమెటిక్ క్వాలిఫయింగ్ మార్క్ 83.50 మీటర్లు (లేదా) కనీసం టాప్–12లో నిలిస్తే ఫైనల్‌కు అర్హత లభిస్తుంది. ఉ.గం. 5.35 నుంచి సోనీ చానల్స్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
WAC 2022: జావెలిన్ త్రో ఫైనల్లో భారత అథ్లెట్
అమెరికాలోని ఒరేగాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా అథ్లెట్ అన్నూ రాణి శుభారంభం చేసింది. గురువారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ పోటీల్లో అన్నూ రాణి రెండో ప్రయత్నంలో ఈటెను 59.06 మీటర్ల దూరం విసిరి గ్రూఫ్ బిలో 5వ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచిన అన్నూ రాణి ఫైనల్లో అడుగుపెట్టింది. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండోసారి జావెలిన్ త్రో ఫైనల్లో అడుగుపెట్టిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా నిలిచింది. 2019లో దోహా వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లో అన్నూ రాణి ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. మరి ఈసారైనా పతకం సాధిస్తుందేమో చూడాలి. అంతకముందు ఈటెను తొలి ప్రయత్నంలో 55.32 మీటర్లు విసిరినప్పటికి.. రెండో ప్రయత్నంలో మాత్రం 59.60 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక 29 ఏళ్ల అన్నూ రాణి కెరీర్ బెస్ట్ 63.82 మీటర్లుగా ఉంది. జంషెడ్పూర్ వేదికగా ఈ ఏడాది మేలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో అన్నూ రాణి ఈ ప్రదర్శనను నమోదు చేసింది. ఇక జపాన్‌కు చెందిన హరుకాకిటాగుచి ఈటెను 64.32 మీటర్ల దూరం విసిరి సీజన్ బెస్ట్‌తో తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనాకు చెందిన షియింగ్ లిహూ(63.86 మీటర్లు), లిథువేనియాకు చెందిన లివేట జాసియునైట్(63.80 మీటర్లు) మూడో స్థానంలో నిలిచింది. మొత్తంగా గ్రూఫ్ ఏ, గ్రూఫ్ బి నుంచి కలిపి 12 మంది ఫైనల్లో పోటీ పడనున్నారు. మహిళల జావెలిన్ త్రో ఫైనల్ జూలై 22న ఉదయం 5 గంటలకు జరగనుంది. చదవండి: World Athletics Championship: 'నా కొడుకు ప్రపంచ చాంపియన్.. గర్వంగా ఉంది' -
90 మీటర్లే టార్గెట్‌గా.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా
ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఒరేగాన్‌లో అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరగనున్న హ్యూజిన్లోని హెవార్డ్ స్టేడియంలో నిలబడి ఫోటోకు ఫోజు ఇచ్చాడు. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్న నీరజ్.. ''హేవార్డ్ ఫీల్డ్ స్టేడియం.. పతకమే లక్ష్యంగా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇటీవల డైమండ్ లీగ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన నీరజ్.. రెండుసార్లు తన వ్యక్తిగత రికార్డును మెరుగుపర్చుకున్నాడు. 90 మీటర్లకు దరిదాపుల్లో ఉన్న నీరజ్ ఇదే జోష్‌లో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో దేశానికి తొలి పసిడి అందించాలని తహతహలాడుతున్నాడు. ఇక నీరజ్ చోప్రా సారథ్యంలో భారత అథ్లెట్ల బృందం ఇప్పటికే ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు ఈ పోటీల్లో భారత్ నుంచి అంజూబాబి జార్జ్ (కాంస్యం, లాంగ్‌జంప్) మాత్రమే పతకం నెగ్గింది. ఆ తర్వాత మరే అథ్లెట్ ఈ వేదికపై మెడల్ సాధించలేకపోగా.. ఆ లోటు భర్తీ చేసేందుకు నీరజ్ చోప్రా సిద్ధమవుతున్నాడు. మరోవైపు లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్, పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాష్ సాబ్లే ఫైనల్ చేరి పతకం ఆశలు రేకెత్తిస్తున్నారు. ఇక షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్ సింగ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. View this post on Instagram A post shared by Neeraj Chopra (@neeraj___chopra) చదవండి: Allyson Felix: మాట నిలబెట్టుకున్న దిగ్గజ అథ్లెట్.. కెరీర్‌కు గుడ్‌బై -
భారత్ స్టార్ నీరజ్ చోప్రాకు తప్పిన పెను ప్రమాదం
భారత స్టార్ జావెలిన్ త్రోయర్.. ఒలింపియన్ నీరజ్ చోప్రాకు పెను ప్రమాదం తప్పింది. ఫిన్లాండ్లో శనివారం జరిగిన కూర్తానె గేమ్స్‌లో నీరజ్ జావెలిన్‌ను 86.69 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే నీరజ్ చోప్రా ఈ గేమ్‌లో జావెలిన్ త్రోయింగ్ ప్రయత్నాల్లో రెండుసార్లు ఫౌల్ చేశాడు. ఈ క్రమంలోనే జావెలిన్ త్రో విసరగానే పట్టు తప్పిన నీరజ్ జారి కిందపడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ నీరజ్‌కు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. కిందపడిన నీరజ్ పైకిలేచి తాను బాగానే ఉన్నానంటూ చిరునవ్వుతో సంకేతాలు ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అంతకముందే భారీ వర్షం పడడంతో గ్రౌండ్ మొత్తం బురదమయమయింది. వర్షం ముగిసిన వెంటనే ఆటను ప్రారంభించారు. ఆటలో మొదటగా నీరజ్ చోప్రానే జావెలిన్ త్రో విసిరాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఇది ఆయనకు రెండో పోటీ. ఇక్కడ నీరజ్ అథ్లెటిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. నీరజ్ తర్వాత వాల్కాట్ 86.64 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచాడు. పీటర్స్ 84.75 ఉత్తమ ప్రయత్నంతో మూడో స్థానంలో నిలిచాడు. అదే విధంగా చోప్రాతో పాటు కుర్టానే ఒలింపిక్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న ప్రపంచ పారి జావెలిన్ ఛాంపియన్ సందీప్ చౌదరి కూడా పోటీలో పాల్గొని 60.35 మీటర్ల బెస్ట్ త్రోతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్ పది నెలల తర్వాత ఇటీవల పావో నుర్మీ గేమ్స్‌లో పాల్గొని రజతం సాధించాడు. ఈ గేమ్స్‌లో నీరజ్ ఈటెను 89.30 మీటర్ల దూరం విసిరి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. Nasty slip for Neeraj Chopra on a very slippery runway at the Kuortane Games. He seems ok though. pic.twitter.com/6Zm0nlojkZ — jonathan selvaraj (@jon_selvaraj) June 18, 2022 చదవండి: Neeraj Chopra: స్వర్ణం నెగ్గిన నీరజ్ చోప్రా Katherine Brunt: 'ఒక శకం ముగిసింది'.. టెస్టులకు ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గుడ్‌బై -
స్వర్ణం నెగ్గిన నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ ఏడాది తొలి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫిన్లాండ్లో శనివారం జరిగిన కూర్తానె గేమ్స్‌లో నీరజ్ జావెలిన్‌ను 86.69 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. కెషర్న్ వాల్కట్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో; 86.64 మీటర్లు) రజతం, అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 84.75 మీటర్లు) కాంస్యం సాధించారు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్ పది నెలల తర్వాత ఇటీవల పావో నుర్మీ గేమ్స్‌లో పాల్గొని రజతం సాధించాడు. -
వారెవ్వా నీరజ్ చోప్రా.. తన రికార్డు తానే బద్దలు కొట్టాడు
టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత తిరిగి బరిలోకి దిగిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో తన పేరిట ఉన్న రికార్డును తాజాగా బద్దలు కొట్టాడు. ఫిన్లాండ్లో జరుగుతున్న పావో నుర్మీ గేమ్స్‌లో రజతం గెలిచిన నీరజ్ చోప్రా.. ఈటెను 89.30 మీటర్ల దూరం విసిరి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో 2021, ఆగస్టు 7న జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. తద్వారా అథ్లెటిక్స్ విభాగంలో తొలి స్వర్ణం సాధించిన ఆటగాడిగా.. ఓవరాల్‌గా వ్యక్తిగతంగా ఒలింపిక్స్‌లో దేశానికి స్వర్ణం అందించిన రెండో ఆటగాడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. గతేడాది మార్చిలో పాటియాలాలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఈటెను 88.07 మీటర్ల దూరం విసిరాడు. చదవండి: బంగారు కొండ.. టైలర్ కలను నెరవేర్చిన కొడుకు Olympic Champion Neeraj Chopra settles for a Silver Medal with a New National Record Throw of 89.30m at the Paavo Nurmi Games in Finland.@afi We can see several performance hikes in various events this season. Hope for more further. @Adille1 @Media_SAI @SPORTINGINDIAtw pic.twitter.com/cBLg4Ke8nh — Athletics Federation of India (@afiindia) June 14, 2022 -
నీరజ్ చోప్రాకు విశిష్ట పురస్కారం
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నీరజ్ చోప్రాను పరమ విశిష్ట సేవా పతకంతో సత్కరించనుంది. జనవరి 26న రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నీరజ్‌చోప్రాకు పతకం అందించనున్నాడు. ఇక ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నీరజ్ చోప్రా నిలిచాడు. చదవండి: Australian Open Grandslam 2022: సెమీస్‌కు దూసుకెళ్లిన నాదల్, యాష్లే బార్టీ గతంలో 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటింగ్ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత నీరజ్ సాధించిన స్వర్ణమే రెండోది. నీరజ్ గత సంవత్సరం దేశ అత్యున్నత క్రీడా పురస్కారం, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు. ఇక ఇండియన్ ఆర్మీలో నీరజ్ చోప్రా జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 384 మంది రక్షణ సిబ్బందిని గ్యాలంటరీ మరియు ఇతర అవార్డులతో సత్కరించనున్నారు. అవార్డులలో 12 శౌర్య చక్రాలు, 29 పరమ విశిష్ట సేవా పతకాలు, నాలుగు ఉత్తమ యుద్ధ సేవా పతకాలు, 53 అతి విశిష్ట సేవా పతకాలు, 13 యుద్ధ సేవా పతకాలు, మూడు బార్ టు విశిష్ట సేవా పతకాలు ఉన్నాయి. వీటితో పాటు మరో 122 విశిష్ట సేవా పతకాలు, 81 సేన పతకాలు, రెండు వాయు సేన పతకాలు, 40 సేన పతకాలు, ఎనిమిది నేవీసేన పతకాలు, 14 నావో సేన పతకాలతో విజేతలను రాష్ట్రపతి సత్కరిస్తారు. చదవండి: Australian Open 2022: 'నీ మాటలతో నన్ను ఏడిపించేశావు.. థాంక్యూ' -
Neeraj Chopra: ఒలింపిక్ రికార్డును సవరించాల్సి ఉంది
ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడంతోనే తన లక్ష్యం పూర్తి కాలేదని, మున్ముందు మరింతగా శ్రమించి 90.57 మీటర్ల ఒలింపిక్ రికార్డును సవరించాలని భావిస్తున్నట్లు స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా వ్యాఖ్యానించాడు. వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్, ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్ కోసం త్వరలోనే సన్నాహకాలు మొదలు పెడతానని నీరజ్ చెప్పాడు. హ్యాండ్‌బాల్ అభివృద్ధికి రూ. 240 కోట్లు న్యూఢిల్లీ: దేశంలో హ్యాండ్‌బాల్ క్రీడకు మరింత గుర్తింపు తెచ్చేందుకు కార్పొరేట్ సంస్థ బ్లూ స్పోర్ట్ ఎంటర్టైన్మెంట్ ముందుకు వచ్చింది. వచ్చే ఐదేళ్లలో హ్యాండ్‌బాల్ అభివృద్ధికి రూ. 240 కోట్లు అందజేస్తామని బ్లూ స్పోర్ట్స్ ప్రకటించింది. పురుషుల, మహిళల టీమ్‌ల కోసం రూ. 120 కోట్ల చొప్పున, మరో రూ. 35 కోట్లు ప్రాధమిక స్థాయిలో ఆట కోసం ఇస్తామని వెల్లడించింది. హ్యాండ్‌బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో జరగనున్న ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ నిర్వహణా హక్కులు ఈ సంస్థ వద్దే ఉన్నాయి. చదవండి: తాలిబన్ ముప్పు.. పాక్ చేరిన అఫ్ఘాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు -
అదరహో... దేవేంద్ర, సుందర్
పారాలింపిక్స్ జావెలిన్ త్రోలోనే భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. పురుషుల ఎఫ్–46 కేటగిరీలో పోటీపడిన రాజస్తాన్ జావెలిన్ త్రోయర్లు దేవేంద్ర ఝఝారియా రజతం సాధించగా... సుందర్ సింగ్ గుర్జర్ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. 40 ఏళ్ల దేవేంద్ర బల్లెంను 64.35 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో... 25 ఏళ్ల సుందర్ సింగ్ బల్లెంను 64.01 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచారు. పారాలింపిక్స్‌లో దేవేంద్రకిది మూడో పతకం కావడం విశేషం. 2004 ఏథెన్స్ పారాలింపిక్స్ లో, 2016 రియో పారాలింపిక్స్‌లో దేవేంద్ర స్వర్ణ పతకాలు గెలిచాడు. వినోద్‌కు నిరాశ మరోవైపు ఆదివారం పురుషుల డిస్కస్ త్రో ఎఫ్–52 విభాగంలో కాంస్యం గెలిచిన వినోద్ కుమార్‌పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. వినోద్ వైకల్యం వర్గీకరణ జాబితాలో లేదని అతని ప్రత్యర్థులు ఫిర్యాదు చేయడంతో సోమవారం నిర్వాహకులు దీనిపై సమీక్షించారు. చివరకు వినోద్ వైకల్యం వర్గీకరణ జాబితాలో లేకపోవడంతో అతని ఫలితాన్ని రద్దు చేసి కాంస్య పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. యోగేశ్ అద్భుతం... పురుషుల డిస్కస్ త్రో ఎఫ్–56 విభాగంలో భారత అథ్లెట్ యోగేశ్ కథునియా రజత పతకం సాధించాడు. తొలిసారి పారాలింపిక్స్‌లో బరిలోకి దిగిన 24 ఏళ్ల యోగేశ్ డిస్క్‌ను చివరిదైన ఆరో ప్రయత్నంలో 44.38 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. క్లాడినె బటిస్టా (బ్రెజిల్–45.59 మీటర్లు) స్వర్ణం, లియోనార్డో దియాజ్ (క్యూబా–43.36 మీటర్లు) కాంస్యం సాధించారు. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్–1 కేటగిరీలో భారత షూటర్ స్వరూప్ ఉన్హాల్కర్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన స్వరూప్ 203.9 పాయింట్లు స్కోరు చేశా>డు. -
కృత్రిమ కాలుతో కనకం వైపు...
‘ఫాంటమ్ లింబ్ పెయిన్’... కృత్రిమ కాలు అమర్చుకున్న వారిలో దాదాపు అందరికీ వచ్చే సమస్య. తీవ్రమైన నొప్పితో అల్లాడిపోయే పరిస్థితి... కొన్నిసార్లు వేడి వల్ల లోపలి భాగం (లైనర్) నుంచి రక్తం కూడా కారుతుంటే ఆ బాధ తట్టుకోవడం కష్టం! సాధన సమయంలో సుమిత్ అంటిల్ కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు ఎదుర్కొన్నాడు. కానీ తాను పారాలింపిక్స్‌లో పాల్గొనాలనే, పతకం సాధించాలనే లక్ష్యం నుంచి మాత్రం అతను తప్పుకోలేదు. ‘ప్రొస్థెటిక్ లెగ్’తోనే జావెలిన్‌లో ప్రపంచాన్ని గెలిచేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం అతను తన కలను నిజం చేసుకున్నాడు. టోక్యోలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. 2015 జనవరి 5 వరకు సుమిత్ జీవితం చాలా మందిలాగే సరదాగా సాగింది. హరియాణాలో గల్లీ గల్లీలో కనిపించే చాలా మందిలాగే రెజ్లింగ్ వైపు వెళ్లాడు. నాలుగైదేళ్లు పెద్దగా ఫలితాలు లేకపోయినా కుటుంబ సభ్యులు, సన్నిహితులు అతను ‘పహిల్వాన్’ కావాలనే కోరుకోవడంతో ఆటను కొనసాగిస్తూ వచ్చాడు. అయితే 17 ఏళ్ల వయసులో ట్యూషన్ నుంచి తిరిగొస్తూ జరిగిన ఒక ప్రమాదం సుమిత్ జీవితాన్ని మార్చేసింది. మోటార్ బైక్‌పై వెళుతుండగా జరిగిన యాక్సిడెంట్‌తో అతను తన ఎడమ కాలును కోల్పోయాడు. మోకాలి కింది భాగం మొత్తం తొలగించాల్సి రాగా... 53 రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాడు. కృత్రిమ కాలు బిగించడంతో ఇక లోకమంతా విషాదంగా, ఏదో కోల్పోయినట్లుగా కనిపించింది. దాంతో ఇంటికే పరిమితమైన అతను పాత జ్ఞాపకాలతో రెండేళ్ల తర్వాత మళ్లీ స్టేడియం వైపు మరలాడు. అదే సుమిత్ జీవితాన్ని మార్చింది. సోనెపట్ సమీపం లోని తన సొంత ఊరు ఖేవ్డాకు చెందిన ఒక పారాథ్లెట్ అతనికి పరిచయమయ్యాడు. అంతే... పారా క్రీడల గురించి మొత్తం తెలుసుకున్న అతను మళ్లీ ఆటల్లో కొత్త జీవితం వెతుక్కునేందుకు సిద్ధమయ్యాడు. అథ్లెటిక్స్‌లో, అందులోనూ జావెలిన్ త్రోలో సత్తా చాటగలనని నమ్మకంతో సాధన మొదలుపెట్టిన సుమిత్ ఒక్కసారిగా దూసుకుపోయాడు. 2019లో వరల్డ్ పారా అథ్లెటిక్స్, వరల్డ్ గ్రాండ్‌ప్రి, పారిస్ ఓపెన్లలో అతను మూడు రజతాలు సాధించి సత్తా చాటాడు. వరల్డ్ నంబర్‌వన్‌గా, వరల్డ్ రికార్డు సృష్టించిన ఘనతతో టోక్యో బరిలోకి దిగిన సుమిత్ రాణించి విశ్వ క్రీడల్లో భారత జాతీయ గీతాన్ని సగర్వంగా వినిపించగలిగాడు. -
స్వర్ణంతో సుమిత్ చరిత్ర సృష్టించాడు ఫొటోలు
-
Sumit Antil: సుమిత్ అంటిల్‌కు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన సుమిత్ అంటిల్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. '' పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించినందుకు సుమిత్‌కు శుభాకాంక్షలు. నీ స్వర్ణంతో దేశానికి ఒకేరోజు రెండు బంగారు పతకాలు రావడం ఆనందం కలిగించింది. జావెలిన్ త్రోలో మూడు ప్రయత్నాల్లోనూ అద్బుత ప్రదర్శన చేసి కొత్త రికార్డు సృష్టించావు. నీ కెరీర్ ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నా'' అంటూ జగన్ ట్వీట్ చేశారు. Congratulations Sumit Antil for adding another #Gold medal to India's count at #TokyoParalympics and setting a new world record for each of the three attempts in the same event. @ParalympicIndia — YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2021 ఇక టోక్యో పారాలింపిక్స్‌లో మెన్స్ జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో పోటీపడిన భారత పారా అథ్లెట్ సుమిత్ అంటిల్ వరల్డ్ రికార్డు త్రోలతో గోల్డ్ మెడల్ సాధించాడు. తన మొదటి ప్రయత్నంలోనే 66.95 విసిరి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్, రెండో ప్రయత్నంలో ఏకంగా 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. మూడో ప్రయత్నంలో 65.27 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 66.71 మీటర్లు విసిరిన సుమిత్... తన ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్లు విసిరి, సరికొత్త చరిత్ర సృష్టించాడు. చదవండి: Tokyo Paralympics: భారత్ ఖాతాలో మరో స్వర్ణం పారాలింపిక్స్ పతక విజేతలకు గవర్నర్ బిశ్వభూషణ్ అభినందనలు టోక్యో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత పారాఅథ్లెట్లను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించిన అవని లేఖారా, ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా జావెలిన్ త్రోలో రెండవ స్వర్ణ పతకం సాధించినందుకు సుమిత్ ఆంటిల్, హైజంప్‌లో వెండి పతకం సాధించిన నిషద్ కుమార్, పురుషుల డిస్కస్ త్రోలో వెండి పతకం సాధించిన యోగేష్ కథునియా, జావెలిన్ త్రో లో రజత పతకం సాధించిన దేవేంద్ర జారియా, కాంస్య పతకం పొందిన సుందర్ సింగ్ గుర్జార్లకు శుభాకాంక్షలు తెలిపారు. -
Tokyo Paralympics: భారత్ ఖాతాలో మరో స్వర్ణం
-
Tokyo Paralympics: భారత్ ఖాతాలో మరో స్వర్ణం
టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే షూటింగ్ విభాగంలో స్వర్ణం గెలిచిన భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్ త్రోలో సుమిత్ అంటిల్ స్వర్ణం సాధించాడు. మెన్స్ జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో పోటీపడిన భారత పారా అథ్లెట్ సుమిత్ అంటిల్ వరల్డ్ రికార్డు త్రోలతో గోల్డ్ మెడల్ సాధించాడు. తన మొదటి ప్రయత్నంలోనే 66.95 విసిరి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్, రెండో ప్రయత్నంలో ఏకంగా 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. మూడో ప్రయత్నంలో 65.27 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 66.71 మీటర్లు విసిరిన సుమిత్... తన ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్లు విసిరి, సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇదే ఈవెంట్లో పోటీపడిన మరో భారత పారా అథ్లెట్ సందీప్ చౌదరీ అత్యుత్తమంగా 62.03 మీటర్లు విసిరి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. చదవండి: Avani Lekhara: ‘గోల్డెన్ గర్ల్’ విజయంపై సర్వత్రా హర్షం సుమిత్ సాధించిన పతకంతో కలిసి పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య మళ్లీ ఏడుకి చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో అవనీ లేఖరా స్వర్ణం సాధించగా టీటీలో భవీనా పటేల్, మెన్స్ హైజంప్ ఈవెంట్లో నిషద్ కుమార్, డిస్కస్ త్రో ఈవెంట్లో యోగేశ్ కతునియా, జావెలిన్ త్రో ఎఫ్46లో దేవేంద్ర జాజారియా రజత పతకాలు సాధించారు. చదవండి: Yogesh Kathuniya: కోచ్ లేకుండానే పతకం సాధించిన అభినవ ఏకలవ్యుడు What a start to the evening @ParaAthletics session 🤩 Sumit Antil throws a World Record on the first throw of the day, can anyone top that?#ParaAthletics #Tokyo2020 #Paralympics pic.twitter.com/cLB5qHYQ61 — Paralympic Games (@Paralympics) August 30, 2021 -
పాక్ అథ్లెట్ నా జావెలిన్‌ను ట్యాంపర్ చేయలేదు: నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: పాక్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్.. తన జావెలిన్‌ను ట్యాంపర్ చేయాలని ప్రయత్నించాడని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నీరజ్ చోప్రా స్పందించాడు. ఈ వివాదంపై క్లారిటీ ఇస్తూ.. అతను ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో అతను మాట్లాడుతూ.. దయచేసి నన్ను, నా కామెంట్లను వ్యక్తిగత ఎజెండాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశాడు. క్రీడాకారుల మధ్య ఎటువంటి వైరుధ్యాలు ఉండవని, దేశాలు, ప్రాంతాలకు అతీతంగా క్రీడలు అందరినీ ఏకం చేస్తాయని పేర్కొన్నాడు. मेरी आप सभी से विनती है की मेरे comments को अपने गंदे एजेंडा को आगे बढ़ाने का माध्यम न बनाए। Sports हम सबको एकजूट होकर साथ रहना सिखाता हैं और कमेंट करने से पहले खेल के रूल्स जानना जरूरी होता है 🙏🏽 pic.twitter.com/RLv96FZTd2 — Neeraj Chopra (@Neeraj_chopra1) August 26, 2021 ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై కొంత మంది నెటిజన్లు ఉద్దేశపూర్వకంగా దుమారం రేపుతున్నారని, వారి కామెంట్లు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయని, అలాంటి వాటిని నిజమైన భారతీయులు పట్టించుకోవద్దని కోరాడు. నదీమ్ నా జావెలిన్‌ను పట్టుకోవడం పొరపాటుగా జరిగి ఉంటుందని, ఇందులో అతను ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పేమీ ఉండదని భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. కాగా, కీలకమైన ఫైనల్‌కు ముందు జరిగిన ఓ ఆసక్తికర ఘటనకు సంబంధంచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నీరజ్ స్పందించాల్సి వచ్చింది. ఆ వీడియోలో పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ నీరజ్ చోప్రా జావెలిన్‌ను పట్టుకొని తిరగడం స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో నదీమ్.. నీరజ్ జావెలిన్‌ను ట్యాంపర్ చేయాలని ప్రయత్నించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే, టోక్యో ఒలింపిక్స్ 2020లో ఫైనల్లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 87.58 మీటర్లు విసిరి అథ్లెటిక్స్‌లో భారత్ 100 ఏళ్ల స్వర్ణ పతక నిరీక్షణకు తెరదించాడు. చదవండి: పతకం చేజార్చుకున్న 24 మంది ఒలింపియన్లకు టాటా కార్లు -
నీరజ్ చోప్రాకు స్వగ్రామంలో ఘన స్వాగతం
పానిపట్: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు హర్యానా పానిపట్‌లోని తన స్వగ్రామం సమల్ఖాలో ఘన స్వాగతం లభించింది. దారిపొడవునా అతన్ని అభినందిస్తూ గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో దేశానికి స్వర్ణం అందించిన వ్యక్తిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం అందుకున్నాడు. తన స్వగ్రామంలో గ్రామస్తులు చూపిన ప్రేమపై నీరజ్ సంతోషం వ్యక్తం చేశాడు. మీ నుంచి ఇంత ప్రేమను పొందడం చాలా సంతోషంగా ఉంది. జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నాకు రానున్న కాలంలోనూ ఇదే తరహా మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నా. దేశానికి మరిన్ని పతకాలు తీసుకొచ్చేందుకు మరింత కష్టపడతా అంటూ తెలిపాడు. -
Independence Day 2021: జాతీయ గీతాన్ని మార్మోగించాడు
భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి అంతర్జాతీయ వేదికపై భారత్ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఫైనల్లో నీరజ్ రెండో రౌండ్లో 87.58 మీటర్లు విసిరి సీజన్ బెస్ట్ నమోదు చేసి స్వర్ణం గెలిచి భారత్‌కు గోల్డెన్ ముగింపు ఇచ్చాడు. ఆగస్టు 15తో 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారతావని జాతీయ గీతాన్ని జపాన్ గడ్డపై మారుమోగించాడు. -
గర్ల్‌ఫ్రెండ్ విషయంపై నీరజ్ చోప్రా క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఒలింపిక్ టైటిల్‌తో మహిళా అభిమానులు కూడా జతయ్యారు. కానీ నాకైతే గర్ల్‌ఫ్రెండే ఇప్పటివరకు లేదు. భవిష్యత్తులో నన్ను ప్రేమించే నెచ్చెలి ఎవరైనా ఉంటారేమో చూద్దాం. ఇప్పుడు నేను పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెట్టాను. ఈవెంట్లు, ప్రదర్శన, పతకాలు ఇవే నా ముందున్నవి. మిగతావన్నీ ఆ తర్వాతే! తదుపరి జరి గే పోటీలు, సన్నాహక శిబిరాలపైనే ఎక్కువగా ఆలోచిస్తాను. నాకు పానీ పూరిలంటే ఇష్టం. కానీ టోక్యోలో ఈవెంట్ కోసం వాటి ని తినలేదు. కడుపు నొప్పి, ఇతరత్రా ఆరోగ్య సమస్యల రిస్క్ ఎందు కని వాటికి దూరంగా ఉన్నాను’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు. టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన 23 ఏళ్ల నీరజ్ చోప్రా మంగళవారం స్వదేశం చేరుకున్నాడు. ఈ సందర్భంగా నీరజ్‌ను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఘనంగా సన్మానించింది. నీరజ్ నెగ్గిన స్వర్ణ పతకంతో తల్లిదండ్రులు సతీశ్, సరోజ్ దేవి, చిన్నాన్న భీమ్ చోప్రా ఈ సన్మాన కార్యక్రమంలో నీరజ్ తల్లిదండ్రులు సరోజ్ దేవి–సతీశ్, చిన్నాన్న భీమ్ చోప్రా పాల్గొన్నారు. ఇక దేశంలో జావెలిన్ త్రోకు ప్రాచుర్యం తెచ్చేందుకు ఏఎఫ్ఐ కీలక నిర్ణయం తీసుకుంది. నీరజ్ బంగారు పతకంతో మెరిసిన ఆగస్టు 7వ తేదీని ‘జాతీయ జావెలిన్ డే’గా నిర్వహిస్తామని ప్రకటించింది. -
నీరజ్ చోప్రా ‘టోక్యో’ ఘనతకు గుర్తింపు
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బంగారంతో చరిత్ర సృష్టించిన రోజు ఇక ప్రతి యేటా పండగ కానుంది. వేడుకగా జరగనుంది. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఆగస్టు 7వ తేదీని ‘జాతీయ జావెలిన్ డే’గా నిర్వహిస్తామని ప్రకటించింది. 23 ఏళ్ల నీరజ్ ఈ నెల 7న టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో మెరిసి అథ్లెటిక్స్ పసిడి కలను నిజం చేశాడు. విశ్వక్రీడల అథ్లెటిక్స్‌లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. స్వదేశం చేరిన నీరజ్‌ను ఏఎఫ్ఐ మంగళవారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఏఎఫ్ఐ ప్రణాళిక సంఘం చైర్మన్ లలిత్ భానోత్ ‘దేశంలో జావెలిన్ త్రోకు ప్రాచుర్యం తెచ్చేందుకు, ఈ క్రీడల్లో యువతను ప్రోత్సహించేందుకు ఇకపై ఆగస్టు 7వ తేదీని జాతీయ జావెలిన్ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇందులో భాగంగా యేటా ఆ రోజు రాష్ట్ర సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా జావెలిన్ త్రో పోటీలు నిర్వహిస్తాం. వేడుకగా బహుమతుల ప్రదానోత్సవం జరుపుతాం’ అని తెలిపారు. నీరజ్ చోప్రా మాట్లాడుతూ ‘నాకు చాలా గర్వంగా ఉంది. నా స్వర్ణ విజయాన్ని చిరస్మరణీయంగా మారుస్తున్నందుకు సంతోషంగా ఉంది. అథ్లెటిక్స్ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ఎంతో మందికి ఇది ప్రేరణ అవుతుంది’ అని అన్నారు. నా లక్ష్యం ప్రపంచ చాంపియన్‌షిప్... ఒలింపిక్ స్వర్ణ పతకంతో తన ప్రయాణం ఆగిపోదని భవిష్యత్‌లో జరిగే అన్ని మెగా ఈవెంట్స్‌లో పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతానని నీరజ్ వ్యాఖ్యానించాడు. ‘నేను ఇదివరకే 2018 ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకాలు గెలిచాను. ఇప్పుడు ఒలింపిక్ స్వర్ణం సాధించాను. ఇక నా లక్ష్యం వచ్చే ఏడాది అమెరికాలో జరిగే ప్రపంచ చాంపియషిప్ టైటిల్. ఇది కూడా పెద్ద ఈవెంట్. చెప్పాలంటే ఒలింపిక్స్‌కు ఏమాత్రం తీసిపోని మెగా ఈవెంట్. ఒక్క ఒలింపిక్ స్వర్ణంతోనే ఆగిపోను. ఇంకా మెరుగయ్యే ందుకు కష్టపడతాను. తదుపరి ఆసియా, కామన్వెల్త్ గేమ్స్, ఒలిం పిక్స్ పతకాలు నెగ్గేందుకు కృషి చేస్తాను’ అని నీరజ్ అన్నాడు. నీరజ్ నెగ్గిన స్వర్ణ పతకంతో తల్లిదండ్రులు సతీశ్, సరోజ్ దేవి, చిన్నాన్న భీమ్ చోప్రా మాజీ లాంగ్‌జంపర్, ప్రస్తుత ఏఎఫ్ఐ ఉపాధ్యక్షురాలైన అంజూ బాబీ జార్జ్ మాట్లాడుతూ ‘నీరజ్ స్వర్ణం తెచ్చిన రోజు భారత అథ్లెటిక్స్ చరిత్రలో కలకాలం నిలిచిపోయే రోజు. అథ్లెటిక్స్‌లో ఇంతకు మించిన ఘనత ఇంకోటి లేనే లేదు. యువతకు అతనే స్ఫూర్తి’ అని కొనియాడింది. మరోవైపు పంజాబ్ ప్రభుత్వం శనివారం నిర్వహించే కార్యక్రమంలో నీరజ్ చోప్రాకు రూ. 2 కోట్ల 51 లక్షలు... కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టులో సభ్యులుగా ఉన్న 8 మంది తమ రాష్ట్ర ఆటగాళ్లకు రూ. 2 కోట్ల 51 లక్షల చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వనుంది. -
నీరజ్ చోప్రా విన్యాసాలు అదుర్స్; వీడియో వైరల్
నీరజ్ చోప్రా.. ఈ పేరు ఇప్పుడు ఒక సంచలనం. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో తన అద్భుత ప్రదర్శనతో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. తద్వారా ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణం అందించిన తొలి వ్యక్తిగా.. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన రెండో ఆటగాడిగా నీరజ్ చోప్రా నిలిచాడు. అయితే నీరజ్ చోప్రా ఈరోజు బంగారు పతకం సాధించడం వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ దాగుంది. ఇందులో భాగంగానే టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తన ట్విటర్లో నీరజ్ చోప్రా విన్యాసాలను షేర్ చేశాడు. ఆ వీడియోలో నీరజ్ తన చేతిలో బరువైన వస్తువును పెట్టుకొని శరీరాన్ని పూర్తిగా విల్లులాగా వంచడం.. ఆ తర్వాత అలాగే పైకి లేవడం కనిపిస్తుంది. నీరజ్ చోప్రా శరీరం ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందనేది చెప్పడానికి ఇది ఉదాహరణ. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతని స్టంట్స్‌కు ఫిదా అవుతున్నారు. ''ఇదెలా సాధ్యం.. నీరజ్ చేస్తున్న విన్యాసాలు ఒక్కరోజులో వచ్చినవి కాదు.. దీని వెనుక ఎంతో కఠోర శ్రమ దాగి ఉందంటూ'' నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక గతవారం టోక్యోలో పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా 87.58 మీటర్లు విసిరి సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి భారత గడ్డ మీద అడుగుపెట్టిన నీరజ్ చోప్రాతోపాటు అథ్లెట్లు, ఇతర పతక విజేతలకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హర్యానాలోని పానిపట్ ఖండ్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా భారతదేశానికి అథ్లెటిక్స్‌లో మొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించి దేశ ప్రతిష్టను మరింత పెంచాడు. Meet our new hero! #NeerajChopra pic.twitter.com/8iihthXYuO — Mohammad Kaif (@MohammadKaif) August 8, 2021 -
స్వప్న లోకంలో విహరిస్తున్నా అనుకున్నా: నీరజ్ చోప్రా
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని గెల్చుకుని భారత్ అథ్లెట్స్‌లో వందేళ్ల కల సాకారం చేయడమే కాదు, అథ్లెటిక్స్‌లో ఒలింపిక్ స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచిన జావెలిన్ త్రో సంచలనం నీరజ్ చోప్రా(23) ఆనందంలో మునిగి తేలుతున్నాడు. బంగారు పతకం సాధించడం ఇంకా కలగానే ఉంది. ఏదో స్పప్నలోకంలో విహరిస్తున్న అనుభవం కలిగిందంటూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. ఒలింపిక్ క్రీడల్లో అథ్లెటిక్స్‌లో బంగారు పతకంతో హీరోగా నిలిచిన నీరజ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మీడియా ఇంటరాక్షన్‌లో మంగళవారం మాట్లాడాడు. పతకాన్ని సాధించడం ప్రతీ అథ్లెట్ కల..అందులోనూ ఒలింపిక్ స్వర్ణం గెలవడం అంటే మామూలు విషయం కాదని నీరజ్ పేర్కొన్నాడు. అందుకే తాను బంగారు పతకాన్ని సాధించాను అన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను, కలగా ఉంది. దేశం కోసం గొప్ప పని చేశానని ఇండియాలో అడుగుపెట్టినపుడు, ఎయిర్‌పోర్ట్‌లో కోలాహలం చూసినపుడు మాత్రమే అర్థమైందన్నారు. భారత అథ్లెట్లలో ఆలోచన ఈసారి చాలా భిన్నంగా ఉందనీ, కేవలం పాల్గొనడంతోనే సరిపెట్టకుండా, అందరూ పతకం కోసం పోటీ పడ్డారని వ్యాఖ్యానించాడు. (Naresh Tumda: రోజుకూలీగా మారిన క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్) గత వారం టోక్యోలో 87.58 మీటరలు విసిరి పురుషుల ఫైనల్లో సంచలనాత్మక విజయాన్ని సాధించాడు నీరజ్ చోప్రా. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి భారత గడ్డ మీద అడుగుపెట్టిన నీరజ్ చోప్రాతోపాటు అథ్లెట్లు, ఇతర పతక విజేతలకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పానిపట్ ఖండ్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో 87.58 మీటర్లు విసిరి తన ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టి భారతదేశానికి అథ్లెటిక్స్‌లో చారిత్రాత్మక మొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. చదవండి : షాకింగ్: పార్కింగ్ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్ -
నీరజ్ చోప్రాను అభినందించిన పాక్ అథ్లెట్.. ఆ దేశ అభిమానుల ఆగ్రహం
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాడు. ఫైనల్ పోటీలో నీరజ్ 87.58 మీటర్లు విసిరి స్వర్ణం కైవసం చేసుకోగా.. వడ్లెచ్ 86.67 మీటర్లు, వాస్లీ 85.44 మీటర్లు విసిరి వరుసగా రజతం, కాంస్యం గెలుచుకున్నారు. వీరి తరువాత జర్మన్‌కు చెందిన వెబర్ నాలుగో స్థానంలో, పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ అర్షద్ (84.62 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో నీరజ్‌తో పోటీపడి ఐదో స్థానంలో నిలిచిన పాక్ అథ్లెట్ నదీమ్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో నదీమ్.. భారత బల్లెం యోధుడు, స్వర్ణ పతకం విజేత, నా ఐడల్ నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు.. సారీ పాకిస్తాన్ నేను మీ కొరకు పతకం గెలవలేక పోయాను అంటూ పేర్కొన్నాడు. ఫైనల్ ముగిసిన కాసేపటికే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ముఖ్యంగా భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రాను తమ దేశ అథ్లెట్ అర్షద్ నదీమ్ ‘ఐడల్’ గా పేర్కొనడంపై పాక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కంటే ఒక ఏడాది చిన్నవాడైన నీరజ్‌ను ఐడల్‌గా పేర్కొనడం ఏంటనీ విమర్శించారు. అయితే, అసలు విషయం ఏంటంటే.. ఆ ట్విట్టర్ అకౌంట్ నకిలీదని, సయీద్ అన్వర్ అనే వ్యక్తి నదీమ్ పేరిట ట్వీట్లు చేశాడని ట్విటర్ అధికారులు గుర్తించారు. అనంతరం ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. కాగా, అంతకుముందు 2018 ఏషియన్ గేమ్స్‌లో వీరిద్దరి షేక్ హ్యాండ్ విషయం వైరల్ అయ్యింది. నీరజ్ అప్పుడు కూడా స్వర్ణం గెలవగా.. అర్షద్ నదీమ్ కాంస్య పతకంతో సరిపుచ్చుకున్నాడు. పతకాలు బహుకరించిన తర్వాత నదీమ్, నీరజ్ తమ దేశ జెండాలను భుజంపై వేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అప్పట్లో వైరల్ అయ్యింది. -
ఒలింపిక్స్‌లో సాధించలేకపోయా.. కానీ ఆ రికార్డు బద్దలుకొడతా
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారతీయుల బంగారు స్వప్నం సాకారమైంది. రెండు వారాలుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పసిడి దృశ్యం శనివారం ఆవిష్కృతమైంది. అథ్లెటిక్స్ ఈవెంట్లో భాగంగా పురుషుల జావెలిన్ త్రోలో భారత ప్లేయర్ నీరజ్ చోప్రా అద్వితీయ ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని తన మెడలో వేసుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన అథ్లెట్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. అయితే నీరజ్ జావెలిన్ త్రోలో 90.57 మీటర్ల ఒలింపిక్స్ రికార్డును బద్దలు కొట్టాలని భావించాడు. కానీ దానిని అందుకోలేకపోయాడు. స్వర్ణ పతకం సాధించిన అనంతరం సెలబ్రేషన్స్‌లో భాగంగా నీరజ్ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడాడు. ''ఈ సంవత్సరం తనకు చాలా ముఖ్యమైంది. రెండు మూడు అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడం తనకు చాలా సహాయపడింది. అందువల్లే ఒలింపిక్స్‌కు ఎలాంటి ఒత్తిడి లేకుండా సన్నద్ధమయ్యాను. అంతేగాక నా ప్రదర్శనపై దృష్టి పెట్టగలిగాను. టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణం గెలిచాను. అయితే ఒలింపిక్స్‌లో బరిలోకి దిగినప్పుడు 90.57 మీటర్ల ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టాలని అనుకున్నా. ఇప్పడు అది సాధ్యపడలేదు.. కానీ రానున్న రోజుల్లో కచ్చితంగా ఆ రికార్డును బద్దలుకొడుతా. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవాలనే ఆకాంక్షను నెరవేర్చుకున్నా.ఇక నా నెక్స్ట్ టార్గెట్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే. దాని సన్నద్దత కోసం లాసాన్నే, పారిస్, జూరిచ్ జావెలిన్ ఫైనల్లో పాల్గొనబోతున్నా. '' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఈ ఏడాదే జరగాల్సి ఉన్నప్పటికి టోక్యో ఒలింపిక్స్ జరగడంతో వచ్చే ఏడాదిలో జరగనుంది. #WATCH | My participation in the two-three international competitions helped me a lot. So there was no pressure on me while playing in #TokyoOlympics and I was able to focus on my performance: Javelin throw Gold medalist Neeraj Chopra pic.twitter.com/nefpG9Tla7 — ANI (@ANI) August 7, 2021 -
'37 ఏళ్ల నా కలను నిజం చేశావు బేటా'
ఢిల్లీ: నీరజ్ చోప్రా.. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశానికి అథ్లెటిక్స్ విభాగంలో తొలి స్వర్ణం అందించి చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణంతో జపాన్ గడ్డపై మువన్నెల జెండాను రెపరెపలాడించాడు. ఈ నేపథ్యంలో 'పరుగుల రాణి' పీటీ ఉష నీరజ్ చోప్రాను అభినందిస్తూ అతనితో దిగిన పాత ఫోటోను తన ట్విటర్లో షేర్ చేసింది. '' 37 ఏళ్ల తర్వాత నా కలను నిజం చేశావు.. థ్యాంక్యూ బేటా.. ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయానన్న బాధను ఈరోజుతో మర్చిపోయేలా చేశావు. నేను సాధించకుంటే ఏంటి.. ఒక భారతీయుడిగా నువ్వు దానిని చేసి చూపించావు'' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం పీటీ ఉష ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా '' పయ్యోలి ఎక్స్‌ప్రెస్'' .. '' పరుగుల రాణిగా'' పేరు పెందిన పీటీ ఉష.. 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో తృటిలో పతకం సాధించే అవకాశం కోల్పోయింది. ఆ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హార్డిల్స్ విభాగంలో పోటీ పడిన ఆమె సెకనులో వందోవంతులో కాంస్య పతకం కోల్పోవాల్సి వచ్చింది. పీటీ ఉష 400 మీ హార్డిల్స్‌ను 55. 42 సెకన్లలో పూర్తి చేయగా.. రోమానియాకు చెందిన క్రిస్టియానా కోజోకారు 55.41 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్యం గెలుచుకోవడంతో ఉష నాలుగో స్థానంలో నిలిచింది. అలా ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు పతకం అందించాలనేది కలగానే మిగిలిపోయింది. ఈ విషయాన్ని పీటీ ఉష స్వయంగా చాలా ఇంటర్య్వూల్లో పేర్కొంది. అయితే ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా మాత్రం పీటీ ఉష రికార్డు పదిలంగా ఉంది. అంతకముందు 1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలతో పాటు రజతం సాధించింది. అలాగే 1982 ఢిల్లీ ఆసియా క్రీడలలో 2 రజతాలు, 1990 ఆసియాడ్ లో 3 రజతాలు, 1994 ఆసియాడ్‌లో ఒక రజత పతకాన్ని సాధించింది. Realised my unfinished dream today after 37 years. Thank you my son @Neeraj_chopra1 🇮🇳🥇#Tokyo2020 pic.twitter.com/CeDBYK9kO9 — P.T. USHA (@PTUshaOfficial) August 7, 2021 THE THROW THAT WON #IND A #GOLD MEDAL 😍#Tokyo2020 | #StrongerTogether | #UnitedByEmotion @Neeraj_chopra1 pic.twitter.com/F6xr6yFe8J — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 7, 2021 -
నీరజ్ చోప్రాకు సీఎస్కే అరుదైన గిఫ్ట్.. అదేంటంటే
టోక్యో: ఒలింపిక్స్‌లో భారత్‌కు అథ్లెటిక్స్ విభాగంలో తొలిసారి స్వర్ణం అందించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణం కొల్లగొట్టిన భారత్‌కు గోల్డెన్ ముగింపునిచ్చిన నీరజ్‌కు దేశ వ్యాప్తంగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు సహా పలు కార్పొరేట్ సంస్థలు భారీ నజరానాను ప్రకటిస్తూ వచ్చాయి. ఇందులో భాగంగానే ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ నీరజ్ చోప్రాకు అరుదైన కానుకను ఇచ్చింది. ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో అతని ప్రదర్శనకు గాను రూ. కోటి రివార్డుతో పాటు ప్రత్యేక జెర్సీని గిఫ్ట్‌గా అందించనుంది. జావెలిన్ త్రోలో అతను స్వర్ణం కొట్టేందుకు కారణమైన 87.58 మీటర్ల దూరాన్ని సీఎస్కే ప్రత్యేకంగా తీసుకుంది. 8758 పేరుతో ఒక స్పెషల్ సీఎస్కే జెర్సీని తయారు చేయించి నీరజ్‌కు అందజేయనుంది. సీఎస్కే జట్టు ఉన్నంతకాలం నీరజ్ చోప్రా స్పెషల్ జెర్సీ మా గుర్తుగా ఉంటుందని.. అది అతనికి ఇచ్చే గౌరవమని సీఎస్కే ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు. Anbuden saluting the golden arm of India, for the Throw of the Century! 8️⃣7⃣.5⃣8⃣ 🥇🔥 CSK honours the stellar achievement by @Neeraj_chopra1 with Rs. 1 Crore. @msdhoni Read: https://t.co/zcIyYwSQ5E#WhistleforIndia #Tokyo2020 #Olympics #WhistlePodu 🦁💛 📸: Getty Images pic.twitter.com/lVBRCz1G5m — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) August 7, 2021 -
అతను మనోడు కాడు.. అథ్లెటిక్స్‌లో నీరజ్‌దే తొలి స్వర్ణం
టోక్యో: 1900 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రిటీష్–ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ అథ్లెటిక్స్‌లో 2 రజత పతకాలు (200 మీ.పరుగు, 200 మీ.హర్డిల్స్) సాధించాడు. అయితే పేరుకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడని చెబుతున్నా, నాటి బ్రిటిష్ సామ్రాజ్య పాలనలో, స్వాతంత్య్రానికి 47 ఏళ్ల ముందు సాధించిన ఈ విజయానికి భారతీయత ఆపాదించడంలో అర్థం లేదు. అందుకే నీరజ్ సాధించిన స్వర్ణమే అథ్లెటిక్స్‌లో మన దేశానికి దక్కిన మొదటి పతకంగా భావించాలి. నిజానికి అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) 2005లో ప్రచురించిన అధికారిక ట్రాక్ అండ్ ఫీల్డ్ గణాంకాల్లో గ్రేట్ బ్రిటన్ తరఫునే ప్రిచర్డ్ పాల్గొన్నట్లుగా పేర్కొంది. అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మాత్రం తమ ఒలింపిక్ పతకాల జాబితాలో ప్రిచర్డ్ ప్రదర్శనను భారత్ ఖాతాలోనే ఉంచింది! -
నీ ఆటకు నీరాజనం...
సాక్షి క్రీడా విభాగం: ‘విజయం సాధించాలనే కాంక్ష మీకు నిద్ర పట్టనివ్వకపోతే... కష్టపడటం తప్ప మరే విషయం మీకు నచ్చకపోతే... ఎంత శ్రమించినా గానీ అలసట అనిపించకపోతే... విజయంతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నట్లు అర్థం చేసుకోండి’... దాదాపు రెండేళ్ల క్రితం ఈ స్ఫూర్తిదాయక వ్యాఖ్యను ట్వీట్ చేసిన నీరజ్ చోప్రా ఇప్పటికీ దానినే తన పిన్డ్ ట్వీట్‌గా పెట్టుకున్నాడు. బహుశా రాబోయే రోజుల్లో తాను భారత క్రీడా చరిత్రలో కొత్త చరిత్రను లిఖిస్తాననే ఆత్మవిశ్వాసం కావచ్చు, కానీ నిజంగానే నీరజ్ శనివారం అతి పెద్ద ఘనతను నమోదు చేసి ఒలింపిక్స్ ‘బంగారు బాబు’గా నిలిచాడు. వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌తో మొదలు పెట్టి ఆసియా చాంపియన్‌షిప్, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల్లో స్వర్ణాలతో ఇప్పటికే ఈతరంలో భారత అత్యుత్తమ అథ్లెట్‌గా గుర్తింపు తెచ్చుకున్న నీరజ్ కళ్ల ముందు ఒలింపిక్ పతకమే లక్ష్యంగా నిలిచింది. ఇప్పుడు పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే ఏకంగా స్వర్ణం కొల్లగొట్టి అతను తన స్థాయిని ఒక్కసారిగా పెంచుకున్నాడు. ఇంతింతై... నీరజ్ విజయం ఒక్కసారిగా, అనూహ్యంగా వచ్చిం ది కాదు. అతని కెరీర్‌ను చూస్తే ఒక్కో దశలో తన ఆటను మెరుగుపర్చుకుంటూ, ఒక్కో పతకాన్ని తన ఖాతాలో చేర్చుకుంటూ మెల్లగా ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. జూనియర్ స్థాయిలో ఆకట్టుకునే ప్రదర్శనల తర్వాత 2016 ‘శాఫ్’ క్రీడల్లో 82.23 మీటర్ల త్రో విసిరి అతను తొలిసారి అందరి దృష్టిలో పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత పోలాండ్‌లో జరిగిన అండర్–20 వరల్డ్ చాంపియన్íషిప్లో నీరజ్ సత్తాను గుర్తించేలా చేసింది. 86.48 మీటర్లతో అతను ప్రపంచ రికార్డు నెలకొల్పడం విశేషం. నిజానికి ఈ దూరంతో అతను రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేవాడే. కానీ ఒలింపిక్స్ కటాఫ్ తేదీ ముగిసిన తర్వాత ఈ ఈవెంట్ జరగడంతో అతనికి అవకాశం పోయింది. గాయంతో ఆట ఆగినా... వరుస టోర్నీలు, విజయాలతో పాటు సహజంగానే అథ్లెట్ల వెన్నంటి గాయాలు కూడా ఉంటాయి. రెండేళ్ల క్రితం నీరజ్ కూడా దాని బారిన పడ్డాడు. జావెలిన్ త్రో కారణంగా ఒత్తిడి ఎక్కువగా ఉండే కుడి మోచేతి గాయం కారణంగా నీరజ్‌కు శస్త్ర చికిత్స కూడా చేయాల్సి వచ్చింది. 2019 వరల్డ్ చాంపియన్‌షిప్ సహా అతను పలు టోర్నీలకు దూరమయ్యాడు. దాంతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం కష్టంగా మారింది. చివరకు 2020 జనవరిలో అతను తన తొలి టోర్నీలో సత్తా చాటి క్వాలిఫై అయ్యాడు. అయితే కరోనా కారణంగా క్రీడలు ఏడాది వాయిదా పడ్డాయి. ఈ సమయాన్ని అతను సమర్థంగా వాడుకున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో పాటు తన శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకునే పనిలో పడ్డాడు. ‘ఫౌల్’ సమస్య రాకుండా తన టెక్నిక్‌ను మార్చుకోవడంతో పాటు ఎదురు గాలి వీచే వాతావరణ పరిస్థితుల్లోనూ సమస్య రాని విధంగా ఉండే జావెలిన్లను కూడా ఎంచుకొని సాధన చేశాడు. ఒలింపిక్స్‌లో పతకం సాధించే అంచనాలు ఉన్న డిఫెండింగ్ చాంపియన్ థామస్ రోలర్, వరల్డ్ సిల్వర్ మెడలిస్ట్ మాగ్నస్ కర్ట్, ఆండ్రీస్ హాఫ్మన్ గాయాలతో ఒలింపిక్స్ నుంచి ముందే తప్పుకోగా... 2012 చాంపియన్ వాల్కాట్, 2019 వరల్డ్ చాంపియన్ పీటర్స్, మార్సిన్ క్రుకోస్కీ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగారు. తన ప్రతిభకు తోడు అన్ని కలిసి రావడంతో నీరజ్ ఇప్పుడు స్వర్ణ ఘనతను సాధించాడు. చూపుల్లో బాలీవుడ్ హీరోలా కనిపించే నీరజ్ సినిమాలు కాకుండా మరో దారిని ఎంచుకొని ఎవరెస్ట్ స్థాయిని అందుకున్నాడు. ఇప్పుడు భారత క్రీడా రంగానికి అతను ఒక పెద్ద ‘పోస్టర్ బాయ్’గా మారాడు. ప్రపంచ అండర్–20 స్వర్ణ పతకంతో... -
మనోడు బంగారం
టోక్యో ఒలింపిక్స్‌లో భారతీయుల బంగారు స్వప్నం సాకారమైంది. రెండు వారాలుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ‘పసిడి దృశ్యం’ శనివారం ఆవిష్కృతమైంది. అథ్లెటిక్స్ ఈవెంట్లో భాగంగా పురుషుల జావెలిన్ త్రోలో భారత ప్లేయర్ నీరజ్ చోప్రా అద్వితీయ ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని తన మెడలో వేసుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన అథ్లెట్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. గతంలో మిల్కా సింగ్ (1960 రోమ్), పీటీ ఉష (1984 లాస్ ఏంజెలిస్) నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాలను కోల్పోయారు. అభినవ్ బింద్రా (షూటింగ్– 2008 బీజింగ్) తర్వాత ఒలింపిక్స్ క్రీడల్లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారుడిగా నీరజ్ గుర్తింపు పొందాడు. శనివారం భారత్ ఖాతాలో రెండో పతకం కూడా చేరింది. పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియా కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. కాంస్య పతకపోరులో బజరంగ్ 8–0తో నియాజ్బెకోవ్(కజ కిస్తాన్)పై గెలిచాడు. మహిళల బాక్సింగ్(69 కేజీల విభాగం)లో కాంస్యం సాధించిన లవ్లీనా శనివారం పతకాన్ని అందుకుంది. మొత్తంగా ‘టోక్యో’ క్రీడల్లో 7 పతకాలతో భారత్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అత్యధికంగా 6 పతకాలు లభించాయి. నేటితో విశ్వ క్రీడలు ముగియనున్నాయి. బల్లెం దిగింది..బంగారమొచ్చింది చేతిలో బల్లెం... కళ్లల్లో చురుకుదనం... గుండెల్లో ఆత్మవిశ్వాసం... ప్రపంచాన్ని గెలవాలనే పట్టుదల... పోటీకి సిద్ధమైన వేళ ఆందోళన, ఒత్తిడి ఎక్కడా లేవు... అలా పది అడుగుల ప్రయాణం మొదలైంది... వేగం పెంచుతూ ముందుకు దూసుకొచ్చిన తర్వాత అంతే వేగంగా జావెలిన్ చేయి దాటింది... అలా అలా గాల్లో దూసుకుపోయిన బల్లెం 87.58 మీటర్ల తర్వాత మైదానంలో కసుక్కున దిగింది. అంతే... నీరజ్ చోప్రాకు తాను కొత్త చరిత్ర సృష్టించానని అర్థమైపోయింది. ఇక తానూ టోక్యో నుంచి పతకంతో ఖాయంగా వెళతానని తెలిసిపోయింది. అందుకే సంబరాలు చేసుకునేందుకు ఆలస్యం చేయలేదు. అయితే తాను అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకం మాత్రమే అందించలేదని, అది మరి కొద్దిసేపటిలో పసిడిగా కూడా మారబోతోందని ఆ క్షణాన నీరజ్ ఊహించలేదు. ఆ తర్వాత మిగతా ప్రత్యర్థులంతా కలిసి యాభై నాలుగు ప్రయత్నాల్లోనూ నీరజ్ స్కోరును అధిగమించలేకపోవడంతో అతని ప్రదర్శన శిఖరాన నిలిచింది. ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారతీయుల ప్రదర్శన అంటే హాజరు పట్టికలో పేర్లు నమోదు చేసుకోవడమే... 1920 నుంచి పోటీల్లో పాల్గొంటున్న మన ఆటగాళ్లు గెలుపు కాదు కదా, ఫైనల్స్ చేరడం కూడా గొప్ప ఘనతగా భావించే పరిస్థితి. క్వాలిఫయింగ్కే పరిమితమై వెనుదిరగడం ప్రతీ ఒలింపిక్స్‌లో కనిపించే దృశ్యమే. అథ్లెటిక్స్‌లో మన దేశం పతకాలు సాధించగలదని ఏనాడూ ఏదశలోనూ ఎవరూ కనీసం అంచనా వేయలేదు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో మిల్కా సింగ్, 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పీటీ ఉష నాలుగో స్థానాల్లో నిలిచిన ఘనతలే ఇప్పటి వరకు అత్యుత్తమంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇలాంటి స్థితిలో నీరజ్ సాధించిన బంగారు పతకం గురించి ఎంత చెప్పినా తక్కువే. గత కొన్నేళ్లుగా ఒక్కో మెట్టే ఎక్కుతూ జావెలిన్‌లో అతను వరుస విజయాలు సాధించినా... ఒలింపిక్స్‌కు వచ్చేసరికి అందరిలాగే అతనూ చివరి క్షణంలో తడబడతాడేమోనని ఒకింత ఆందోళన... అయితే నీరజ్ జావెలిన్ అన్ని భయాలను బద్దలు కొట్టింది. ‘నన్ను ఓడించడం నీరజ్ వల్ల కాదు...నేను టోక్యోలో కనీసం 90 మీటర్లకు పైగా జావెలిన్ విసరగలను’... వరల్డ్ నంబర్‌వన్ వెటెర్ ఇటీవల నీరజ్‌కు విసిరిన సవాల్ ఇది. ఈ ఏడాదిలోనే వెటెర్ ఏకంగా ఏడుసార్లు 90 మీటర్ల స్కోరును దాటగా, అత్యుత్తమం 97.76 మీటర్లు. ఒలింపిక్స్‌కు ముందు నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన 88.07 మీటర్లు మాత్రమే. మరో జర్మన్, 9వ ర్యాంక్ వెబర్ అత్యుత్తమ స్కోరు 88.29 కూడా నీరజ్కంటే ఎక్కువే. అయితే భారత త్రోయర్ ప్రత్యర్థి పాత ఘనతలకు బెదరలేదు. ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ పోయాడు. క్వాలిఫయింగ్‌లో తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచి ఫైనల్‌కు చేరిన నీరజ్ తన ప్రదర్శన ‘గాలివాటం’ కాదని నిరూపిస్తూ భారతీయులు గర్వపడే ప్రదర్శన చేశాడు. ఒలింపిక్స్ వేదికపై సగర్వంగా భారత జాతీయ పతాకం ఎగరడం మాత్రమే కాదు... 13 ఏళ్ల తర్వాత, అదీ రవీంద్రుడి వర్ధంతి రోజునే జనగణమన...వినిపించడం ప్రతీ భారతీయుడి గుండె భావోద్వేగంతో ఉప్పొంగేలా చేసింది. ఇదీ నీరజ్ దేశానికి అందించిన బంగారపు కానుక. టోక్యో: భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కొత్త చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో దేశం తరఫున రెండో వ్యక్తిగత స్వర్ణం సాధించిన ఆటగాడిగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఒలింపిక్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కాగా... అదీ స్వర్ణం కావడం నీరజ్ ఘనతను రెట్టింపు చేసింది. శనివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ 87.58 మీటర్ల దూరం బల్లెం విసిరి నంబర్‌వన్‌గా నిలిచాడు. జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 86.67 మీటర్లు), వితెస్లావ్ వెసిలీ(చెక్ రిపబ్లిక్; 85.44 మీటర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచి రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటర్ అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్) స్వర్ణం సాధించిన తర్వాత భారత్‌కు ఒలింపిక్స్ మళ్లీ మరో పసిడి పతకం లభించింది. నీరజ్ స్వర్ణ పతకంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 7కు చేరింది. దీంతో 2012 లండన్ ఒలింపిక్స్‌లో 6 పతకాలతో సాధించిన భారత అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించింది. శనివారంతో టోక్యో క్రీడల్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. ఆదివారంతో టోక్యో ఒలింపిక్స్ క్రీడలు కూడా ముగియనున్నాయి. రెండో ప్రయత్నంలోనే... క్వాలిఫయింగ్ ఈవెంట్లో 86.65 మీటర్లు జావెలిన్ విసిరి అగ్రస్థానంతో ఫైనల్స్‌కు అర్హత సాధించిన నీరజ్ శనివారం కూడా అంతే ఆత్మవిశ్వాసంతో ఆటను మొదలు పెట్టాడు. తన తొలి ప్రయత్నంలో అతను విసిరిన బల్లెం 87.03 మీటర్లు దూసుకుపోయింది. ఫైనల్లో పాల్గొన్న 12 మంది తొలి ప్రయత్నాల్లో నీరజ్ అందరికంటే ఎక్కువ దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఇక రెండో ప్రయత్నంలో దానిని మరింత మెరుగుపర్చుకుంటూ 87.58 మీటర్లతో అతని జావెలిన్ మరింత ముందుకు వెళ్లింది. ఈ దూరమే నీరజ్ చివరి వరకూ నిలబెట్టుకోగలిగాడు. తర్వాతి నాలుగు ప్రయత్నాల్లో (మొత్తం ఆరు) అతను వరుసగా 76.79 మీటర్లు, ఫౌల్, ఫౌల్, 84.24 మీటర్లు జావెలిన్ విసిరినా నష్టం లేకపోయింది. ఫేవరెట్లలో ఒకడైన జొనాస్ వెటెర్ (జర్మనీ) తన తొలి ప్రయత్నంలో 82.52 మీటర్లు జావెలిన్ విసిరి వెనుకబడ్డాడు. తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ ‘ఫౌల్’ చేసిన అతను 9వ స్థానం లో నిలిచాడు. దాంతో టాప్–8 లో పోటీ పడే అవకాశం కూడా లేకుండా వెటెర్ నిష్క్రమించాడు. మిగతా త్రోయర్లు చివరి వరకు ప్రయత్నించినా నీరజ్ స్కోరును అందుకోలేకపోయారు. ‘సూరజ్’ వరకు ‘నీరజ్’ జావెలిన్ నీరజ్ చోప్రాకు అభినందనలు. అథ్లెటిక్స్‌లో స్వర్ణం గెలవాలనే వందేళ్ల భారతీయుల కలను నువ్వు నిజం చేశావు. ఈ విజయం దేశంలోని ఇతర క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. –కె.చంద్రశేఖర రావు, తెలంగాణ ముఖ్యమంత్రి భారత సైన్యంలో పని చేస్తున్న సిపాయి ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో స్వర్ణం సాధించి దేశం గర్వపడేలా చేశాడు. తొలి ఒలింపిక్స్‌లోనే జావెలిన్‌తో నీరజ్ చరిత్ర సృష్టించాడు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భారత జాతి కల నెరవేర్చిన నీకు కృతజ్ఞతలు. మా బంగారు క్లబ్‌లోకి ఆహ్వానం. చాలా గర్వంగా ఉంది. నిన్ను చూస్తే సంతోషం వేస్తోంది. –అభినవ్ బింద్రా ఇలాంటి రోజు కోసం నాన్న ఎన్నో ఏళ్లు ఎదురు చూశారు. ఇప్పుడు అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణంతో ఆయన కల తీరింది. నాకు కన్నీళ్లు ఆగడం లేదు. ఇది సాధించిన నీరజ్‌కు కృతజ్ఞతలు. నువ్వు గెలవడమే కాదు నాన్నకు పతకాన్ని అంకితమివ్వడం చాలా గొప్పగా అనిపిస్తోంది. –జీవ్, మిల్కా సింగ్ కుమారుడు 37 ఏళ్ల క్రితం అసంపూర్తిగా మిగిలిపోయిన నా కల ఇప్పుడు పూర్తయింది. థ్యాంక్యూ మై సన్. –పీటీ ఉష నీ వల్ల భారత్ ప్రకాశిస్తోంది నీరజ్... నీ జావెలిన్ త్రివర్ణాన్ని ఎగురవేసి అందరూ గర్వపడేలా చేసింది. –సచిన్ టెండూల్కర్ నమ్మలేకపోతున్నా. తొలిసారి అథ్లెటిక్స్‌లో భారత్‌కు స్వర్ణం అందించడం చాలా గొప్పగా అనిపిస్తోంది. నేనూ, నా దేశం గర్వించే క్షణమిది. నేను విసిరిన దూరం బంగారం అందిస్తుందని ఊహించలేదు. ఇంకా ఆ భావోద్వేగంలోనే ఉన్నాను. నేను మామూలుగా మారేందుకు కొంత సమయం పడుతుందేమో. నా జీవితంలో ఇదే అత్యుత్తమ క్షణం. త్రో సమయంలో నేను ఒక్కసారి కూడా ఒత్తిడికి లోను కాలేదు. బలంగా జావెలిన్ విసరాలని మాత్రమే అనుకున్నా. ఇటీవలే కన్నుమూసిన దిగ్గజం మిల్కా సింగ్‌కు నా పతకం అంకితం. స్టేడియంలో భారత జాతీయగీతం వినపడాలని ఆయన కోరుకున్నారు. ఆయన లేకపోయినా ఆ కల నేను పూర్తి చేశాను. – నీరజ్ చోప్రా -
నీరజ్ చోప్రాకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా?
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో అద్బుత ప్రదర్శన చేసి స్వర్ణం కొల్లగొట్టిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. స్వర్ణం సాధించి భారతీయుల కలను సాకారం చేసిన నీరజ్ చోప్రాకు ఇష్టమైన ఫుడ్ ఏంటనేది నెటిజన్లు తెగ వెతికేశారు. అయితే నీరజ్ చోప్రాకు స్వీట్లు అంటే మహా ప్రాణం. స్వతహగా హర్యానా వాసి అయిన నీరజ్ చిన్నప్పటి నుంచి స్వీట్లు ఎక్కువగా తినడం వల్లే 12 ఏళ్ల వయసులో 90 కేజీలకు పైగా పెరిగాడు. ఆ బరువును తగ్గించుకునేందుకే జావెలిన్ త్రోను ఎంచుకున్నాడు. ఈరోజు ఆ క్రీడే దేశానికి ఒలింపిక్స్‌లో స్వర్ణం తెచ్చేలా చేసింది. అయితే నీరజ్ చోప్రా బ్రెడ్ ఆమ్లెట్ తినడం ఎంతో ఇష్టమని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇక తనకిష్టమైన సాల్టెడ్ రైస్‌ను తానే స్వయంగా వండుకొని తినడం అలవాటు చేసుకున్నాడు. ఇక టోర్నమెంట్లు ఉన్న సమయాల్లో సలాడ్లు, పండ్లు తినడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాడు. ఇక ప్రాక్టీస్ చేసేప్పుడు మాత్రం పండ్లరసాలు ఎక్కువగా తీసుకుంటాడు. ఏ దేశంలో పోటీలకు హాజరైతే.. అక్కడ దొరికే ఆహారాలను తీసుకోవడం నీరజ్‌కు అలవాటు. తాజాగా తన డైట్‌లోకి సాల్మన్ చేపలను కూడా యాడ్ చేసుకున్నాడు. ఇక శనివారం సాయంత్రం జరిగిన ఈవెంట్లో 87.58 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి పసిడి పతకాన్ని కొల్లగొట్టాడు. -
ఆర్మీ సుబేదార్ నుంచి స్వర్ణ పతక విజేతగా
సాక్షి, వెబ్‌డెస్క్: ఆటలాడటం.. యుద్ధం చేయడం దాదాపు రెండు ఒకలాంటివే. రెండింటిలోనూ విజయం సాధించడం అంత సులవేం కాదు. అందుకే అటు సైనికుడు.. ఇటు ఆటగాడు.. ఇరువురు ప్రతినిత్యం శ్రమిస్తూనే ఉంటారు. తమలోని పోరాట యోధునికి.. క్రీడాకారుడికి పదునుపెట్టుకుంటునే ఉంటారు. యుద్ధంలోనూ, ఇటు క్రీడల్లోను సాధించే విజయాన్ని దేశం మొత్తం ఆనందిస్తుంది. ప్రతి భారతీయుడు.. తానే గెలిచినట్లు సంబరాలు చేసుకుంటాడు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఇదే దృశ్యం కనిపిస్తుంది. ఒలింపిక్స్‌లాంటి అంతర్జాతీయ వేదిక మీద ఓ సైనికుడు చూపిన అసమాన ప్రతిభకు స్వర్ణం లభించింది. 13 ఏళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో.. టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెట్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి.. గోల్డోన్ ముగింపు పలికాడు. ఆర్మీ సుబేదార్ నుంచి స్వర్ణం విజేతగా నీరజ్ చోప్రా ప్రస్థానం ఇది.. హరియాణాలోని పానీపత్ జిల్లా ఖంద్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా(23) వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. అతడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు వ్యవయం చేస్తూ.. జీవనం సాగించేవారు. బాల్యంలో నీరజ్ చాలా బద్ధకంగా ఉండేవాడట. దాంతో విపరీతంగా బరువు పెరిగాడు. ఎంతలా అంటే.. 12 ఏళ్లకే 90కిలోల బరువు ఉన్నాడు. అంత చిన్న వయసులో.. ఇంత భారీగా బరువు పెరగడం పట్ల నీరజ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బరువు తగ్గించడం కోసం ఇంట్లో వాళ్లు ఎక్సర్సైజ్ చేయమని ఎంత చెప్పినా నీరజ్ వినేవాడు కాదట. నీరజ్ జీవతంలోకి జావెలిన్ త్రో ప్రవేశం.. ఈ క్రమంలో ఓ సారి నీరజ్ అంకుల్ భీమ్ చోప్రా అతడిని పానీపత్ స్టేడియంలో జాగింగ్ చేయడానికి తీసుకెళ్లాడు. అక్కడే అతడికి జావెలిన్ త్రో ఆటగాడు జై చౌధరీ తారసపడ్డాడు. జావెలిన్ త్రోను చేతికిచ్చి విసరమని జై చెప్పగానే.. అంత భారీశరీరం ఉన్నప్పటికి కూడా నీరవ్ ఎంతో చక్కటి ప్రదర్శన కనబర్చాడట. జావెలిన్ త్రో గురించి ఏ మాత్రం తెలియకపోయినప్పటికి.. నీరజ్ మొదటి ప్రయత్నంలోనే 35-40 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడట. ఇది గమనించిన జై చౌధరీ.. నీరజ్‌లో పుట్టుకతోనే ప్రతిభ ఉందని అనుకున్నాడు. దీని గురించి జై చౌధరీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆటపై నీరజ్‌కు ఆసక్తి పెరిగింది. జావెలిన్‌లో శిక్షణ పొందాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వ్యాయామమంటే ఏమాత్రం ఇష్టం లేని నీరజ్ బరువు తగ్గడానికి సిద్ధపడ్డాడు. ఊహించని ఈ మార్పుతో అతడి కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. అయితే నీరజ్ జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్నాడని అతడి కుటుంబ సభ్యులకు తెలియదు. ఓ సారి పేపర్లో నీరజ్ ఫోటో రావడంతో అప్పుడు దీని గురించి వారికి తెలిసింది. అప్పటి వరకు జావెలిన్ త్రో అనే ఆట ఉందనే విషయమే అతడి కుటుంబ సభ్యులకు తెలియదు. ఆర్థికంగా కష్టమైన.. ఆసక్తిని కాదనలేక.. అప్పటికే నీరజ్ జావెలిన్ త్రో పట్ల మమకారాన్ని పెంచుకున్నాడు. అయితే నీరజ్‌ను ఆ రంగంలో ప్రోత్సాహించడం అతడి కుటుంబానికి ఆర్థికంగా చాలా కష్టం. అయినప్పటికి నీరజ్ ఇష్టాన్ని కాదనలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. నీరజ్ శిక్షణకు కావాల్సినవన్నీ సమకూర్చారు. 2011 నుంచి చదువును కొనసాగిస్తూనే నీరజ్ జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. 2013లో ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్, 2015లో ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. పతకాలు రాకున్నా.. మంచి ప్రదర్శనే చేశాడు. దాంతో నేషనల్ క్యాంప్ నుంచి నీరజ్‌కు పిలుపు వచ్చింది. మొదలైన పతకాల వేట... నేషనల్ క్యాంప్‌లో చేరిన తర్వాత నీరజ్ ఆటతీరులో ఎంతో మార్పు వచ్చింది. ఇక 2016 నుంచి నీరజ్ కెరీర్.. పతకాలు, రికార్డులతో విజయ పథంలో పరుగులు తీస్తోంది. 2016 జరిగిన సౌత్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం, ఏషియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాడు. వరల్డ్ అండర్ 20 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే కాదు.. జావెలిన్‌ను 86.48 మీటర్లు దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2016 గౌహతిలో జరిగిన దక్షిణ ఆసియా క్రీడలు, 2017 భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండింటిలోనూ స్వర్ణం సాధించాడు. చైనాలోని జియాక్సింగ్లో జరుగుతున్న ఆసియా గ్రాండ్ ప్రి అథ్లెటిక్స్ మీట్ రెండో దశలో నీరజ్ రజత పతకాన్ని సాధించాడు. 2018 లో, అతను జకార్తాలో జరిగిన గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్, ఆసియన్ గేమ్స్‌లో స్వర్ణం సాధించాడు. చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిన 2019.. నీరజ్ కెరీర్లో 2019 సంవత్సరం ఒక చేదు జ్ఞాపకం. ఎందుకంటే.. భుజానికి గాయం, శస్త్రచికిత్స కారణంగా అతడు ఆ ఏడాదిలో జరిగిన పోటీల్లో పాల్గొనలేకపోయాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత నీరజ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వివిధ పోటీల్లో పాల్గొంటూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. తనలో ఎలాంటి మార్పూ రాలేదని నిరూపిస్తూ.. ముందులాగే రికార్డుల పర్వం కొనసాగించాడు. 2020లో ఒలింపిక్ కోటాలో పలు పోటీల్లో పాల్గొన్నాడు. ఈ ఏడాది మార్చి 2021లో జరిగిన జావెలిన్ త్రో పోటీలో పాల్గొని మరో రికార్డు సృష్టించాడు. 2018లో తన పేరుపై ఉన్న 87.43 మీటర్ల రికార్డును 88.07 మీటర్లతో బద్దలుకొట్టాడు. ఒలింపిక్స్ కోసం కఠోర శిక్షణ.. ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా నీరజ్ చోప్రా కఠోర శిక్షణ తీసుకున్నాడు. తన ఉత్తమ ప్రదర్శనలతో జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ ప్రోగ్రామ్‌లో చోటు దక్కించుకున్న నీరజ్.. ఆస్ట్రేలియా కోచ్ గారీ కాల్వర్ట్ వద్ద శిక్షణ పొందాడు. ప్రస్తుతం జర్మన్ బయో మెకానిక్స్ నిపుణుడు క్లాస్ బార్టోనియెట్జ్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే స్వర్ణం గెలిచి.. తన కలను నెరవేర్చుకున్నాడు. తన కుటుంబ సభ్యుల సహకారం లేకుంటే తాను ఈ రోజు ఈ స్థితిలో ఉండేవాడినే కాదని.. తన విజయానికి కారణం వారే అంటాడు నీరజ్. ప్రస్తుతం అతడు ఇండియన్ ఆర్మీలో 4 రాజ్‌పుతానా రైఫిల్స్‌లో సుబేదార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నీరజ్ చోప్రా చండీగఢ్‌లోని డీఏవీ కళాశాలలో గ్రాడ్యుయేన్ పూర్తి చేశాడు. -
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుతం
-
నీరజ్ చోప్రా అద్భుతం.. వారెవ్వా భారత్‌కు 'గోల్డెన్' ముగింపు
-
నీరజ్ చోప్రా అద్భుతం.. వారెవ్వా భారత్‌కు 'గోల్డెన్' ముగింపు
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి భారత్ త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. తద్వారా 100 ఏళ్ల తర్వాత భారత్ తరఫున అథ్లెటిక్స్ ఫీల్డ్ అండ్ ట్రాక్ విభాగంలో పతకాన్ని అందించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. మ్యాచ్ విషయానికొస్తే మొదటి రౌండ్లోనే 87.03 మీటర్లు విసిరి టాప్ పొజీషన్లో ఉన్న నీరజ్ రెండో రౌండ్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈసారి ఏకంగా 87.58 మీటర్లు విసిరి సీజన్ బెస్ట్ నమోదు చేశాడు. ఆ తర్వాత మూడో రౌండ్లో 76. 79 మీటర్లు విసిరినప్పటికి తొలి రెండు రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యం కనబరచడంతో తొలి స్థానంలో కొనసాగాడు. ఇక నాలుగో;ఐదో రౌండ్లో త్రో వేయడంలో విఫలమయ్యాడు.ఇక చివరగా ఆరో రౌండ్లో 84.24తో ముగించాడు. ఓవరాల్‌గా 87.58తో సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణం దక్కించుకున్నాడు. ఇక భారత్‌కు వ్యక్తిగత విభాగంలో స్వర్ణం తెచ్చిన రెండో ఆటగాడిగా నీరజ్ చోప్రా చరిత్రలోకెక్కాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో అభివన్ బింద్రా భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు. హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా పానిపట్ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్ 24న జన్మించాడు. చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో చదువుకున్న నీరజ్ చిన్న వయసులోనే ఇండియన్ ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్ సుబేదార్‌గా పనిచేస్తోన్నాడు. 2018 ఏషియన్ గేమ్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇప్పటికీ 88.06 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆ తర్వాత 2018లోనే జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా 86.47 మీటర్లు విసిరి మరోసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. -
Tokyo Olympics: అందరి దృష్టి నీరజ్‌పైనే
అథ్లెటిక్స్‌లో ఊరిస్తోన్న ఒలింపిక్ పతకాన్ని భారత్‌కు ఈసారైనా లభిస్తుందా లేదా అనేది నేడు తేలిపోతుంది. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో భారత ప్లేయర్ నీరజ్ చోప్రా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. హరియాణాకు చెందిన 23 ఏళ్ల నీరజ్ చోప్రా క్వాలిఫయింగ్‌లో జావెలిన్‌ను 86.59 మీటర్ల దూరం విసిరి ‘టాపర్’గా నిలువడంతో అందరి దృష్టి అతనిపైనే కేంద్రీకృతమైంది. నీరజ్ ఫైనల్లోనూ తన ప్రావీణ్యాన్ని పునరావృతం చేసి పతకం సాధిస్తాడా లేదా అనేది నేటి సాయంత్రానికల్లా తెలిసిపోతుంది. నీరజ్‌తోపాటు జోనస్ వెటెర్ (జర్మనీ), జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్), వితెస్లా వెసిలీ (చెక్ రిపబ్లిక్), వెబెర్ (జర్మనీ) కూడా పతకాల రేసులో ఉన్నారు. 12 మంది పోటీపడుతున్న ఈ ఫైనల్లో తొలుత అందరికీ మూడు అవకాశాలు లభిస్తాయి. టాప్–8లో నిలిచిన వారికి మరో మూడు అవకాశాలు ఇస్తారు. అనంతరం టాప్–3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇస్తారు. -
ఒలింపిక్స్‌లో రేపే మనకు ఆఖరిరోజు.. కలిసి వస్తుందా!
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పోటీ పడుతున్న క్రీడాంశాలు రేపటితో ముగియనున్నాయి. ఇప్పటివరకు భారత్ ఐదు పతకాలు సాధించింది. అందులో రెండు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ విభాగం నుంచి రెండు రజతాలు.. బాడ్మింటన్, హాకీ, బాక్సింగ్ విభాగాల్లో కాంస్యాలు లభించాయి. కాగా ఒలింపిక్స్ రేపు మనకు ఆఖరిరోజు అయినా పతకాల ఆశలు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా జావెలిన్ త్రోపై ఎక్కువ ఆశలు ఉన్నాయి. నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్ రౌండ్లో అగ్రస్థానంలో నిలవడంతో ఫైనల్లో కచ్చితంగా మెడల్ గెలుస్తాడని అంతా భావిస్తున్నారు. ఇక రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా కాంస్యం కోసం తలపడనున్నాడు. అలాగే గోల్ఫ్‌లో భారత క్రీడాకారిణి అదితి అశోక్ పతకంపై ఆశలు రేపుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో రేపటి భారత షెడ్యూల్ ►జావెలిన్ త్రో ఫైనల్- నీరజ్ చోప్రా ►రెజ్లింగ్‌లో కాంస్య పతక పోరు- భజరంగ్ పునియా ►గోల్ఫ్ పతకం రేసులో భారత క్రీడాకారిణి అదితి అశోక్.. వాతావరణం అనుకూలించక గోల్ఫ్ ఆట రద్దయితే.. రెండోస్థానంలో ఉన్న అదితికి రజతం దక్కే అవకాశం -
జావెలిన్ త్రో ఫైనల్ కు భారత్ క్వాలిఫై
-
జావెలిన్ త్రోలో సందీప్‌కు స్వర్ణం
దుబాయ్: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల బోణీ చేసింది. దుబాయ్‌లో శుక్రవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో (ఎఫ్ 42–64 కేటగిరీ) అంశంలో భారత క్రీడాకారులు సందీప్ చౌదరీ, సుమీత్ అంటిల్ (62.88 మీటర్లు) వరుసగా స్వర్ణ, రజత పతకాలు సాధించి వచ్చే ఏడాది జరిగే టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత పొందారు. సందీప్ జావెలిన్‌ను 66.18 మీటర్ల దూరం విసిరి ఈ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. గత జూన్‌లో 65.80 మీటర్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సందీప్ బద్దలు కొట్టాడు. పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్ 52 విభాగం)లో వినోద్ కుమార్ ఇనుప గుండును 19.29 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. టాప్–4లో నిలువడం ద్వారా వినోద్ టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు. -
అన్ను రాణి, అవినాశ్‌లకు రజతం
దోహా (ఖతర్): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజే భారత్ పతకాల ఖాతా తెరిచింది. మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి... పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాశ్ ముకుంద్ రజత పతకాలు నెగ్గగా... 5000 మీటర్ల విభాగంలో పారుల్ చౌదరీ... 400 మీటర్ల విభాగంలో పూవమ్మ రాజు కాంస్య పతకాలు సాధించారు. అన్ను రాణి జావెలిన్‌ను 60.22 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది. 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్లో అవినాశ్ 8 నిమిషాల 30.19 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానాన్ని పొందాడు. మరోవైపు మహిళల 5000 మీటర్ల ఫైనల్ రేసును పారుల్ 15 నిమిషాల 36.03 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. 400 మీటర్ల ఫైనల్లో పూవమ్మ రాజు 53.21 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. మహిళల 100 మీటర్ల హీట్స్‌లో ద్యుతీ చంద్ 11.28 సెకన్లలో గమ్యానికి చేరి 11.29 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టి సెమీఫైనల్‌కు చేరింది. -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ ఫైనల్ (సింధు,తైజుయింగ్; ఉ. గం.11.30 నుంచి) ఆర్చరీ: మహిళల, పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్స్ (భారత్‌గీకొరియా;ఉ.10.30 నుంచి) అథ్లెటిక్స్: మహిళల జావెలిన్ త్రో ఫైనల్ (అన్ను రాణి; సా.5.55 నుంచి); పురుషుల 800 మీ. ఫైనల్: జిన్సన్ జాన్సన్, మన్జిత్ సింగ్ (సా.6.10 నుంచి); మహిళల 5 వేల మీ. ఫైనల్ (సూరియా, సంజీవని; సా. గం.6.20 నుంచి). బాక్సింగ్: మహిళల 57 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (సోనియా గీ జొ సన్ హా); మ. గం.1 నుంచి; మహిళల 60 కేజీల క్వార్టర్ ఫైనల్: పవిత్ర గీ హుస్వాతున్); మం.గం.1.45 నుంచి హాకీ: పురుషుల పూల్ లీగ్ మ్యాచ్, భారత్ గీ శ్రీలంక; మ. గం.2.30 నుంచి. సోనీ టెన్–2, టెన్–3, సోనీ ఈఎస్పీఎన్ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
డైమండ్ లీగ్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక ‘డైమండ్ లీగ్ ఫైనల్’ టోర్నీకి అర్హత సాధించాడు. ఇటీవల జరిగిన రాబట్ (మొరాకో) అంచె డైమండ్ లీగ్ సిరీస్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను అత్యుత్తమంగా 83.32మీ. దూరం విసిరి ఐదో స్థానంలో నిలిచాడు. తద్వారా 4 పాయింట్లు సాధించి జ్యూరిచ్‌లో ఆగస్టు 30న జరిగే ‘డైమండ్ లీగ్ ఫైనల్’కు అర్హత సాధించాడు. అంతకుముందు కూడా దోహా డైమండ్ లీగ్‌లో నాలుగో స్థానంలో నిలిచి 5 పాయింట్లు, యుజిన్ డైమండ్ లీగ్‌లో ఆరోస్థానంలో నిలిచి 3 పాయింట్లను సాధించాడు. -
ఫ్రెంచ్ మీట్లో భారత్‌కు స్వర్ణం
పారిస్ : ఫ్రాన్స్‌లో జరుగుతున్న సొట్టేవిల్లే అథ్లెటిక్స్ మీట్లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణపతకం సాధించాడు. ఫ్రాన్స్‌లో జరిగిన అథ్లెటిక్స్ మీట్ ఫైనల్లో జావెలిన్‌ను రికార్డు స్థాయిలో 85.17 మీటర్లు విసిరి పసిడిని సొంతం చేసుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్ విజేత ఛాంపియన్ వాల్కాట్ ఐదో స్థానంలో నిలవడం విశేషం. చోప్రా తర్వాత స్థానంలో మోల్దోవన్ జావెలిన్ త్రోయర్ ఆండ్రియన్ 81.48 మీటర్లతో రజత పతకాన్ని గెలుపొందగా.. లిథునియా అథ్లెట్ ఈడిస్ 79.31 మీటర్లతో కాంస్య పతకం గెలుపొందాడు. 2016లో జరిగిన వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్‌ను 86.48 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పిన నీరజ్ చోప్రా మళ్లీ ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో 86.47 మీటర్లతో ఆ రికార్డు దరిదాపుల్లోకి వచ్చినా.. తాజాగా 85.17 మీటర్లే జావెలిన్‌ను చోప్రా విసరడం కొసమెరుపు. 2016లో కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినప్పటికీ రియో ఒలింపిక్స్‌కి అర్హత సాధించలేకపోయిన ఈ స్టార్ జావెలిన్ త్రోయర్.. త్వరలోనే ఇండోనేషియా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్‌లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నాడు. -
58 ఏళ్ల తర్వాత జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్
-
దవీందర్ ధమాకా
♦ జావెలిన్ త్రోలో ఫైనల్లోకి ♦ నీరజ్ చోప్రాకు నిరాశ ♦ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లండన్: ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జావెలిన్ త్రోయర్ దవీందర్ సింగ్ కాంగ్ అద్భుతం చేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫయింగ్‌లో దవీందర్ సింగ్ ఈటెను 84.22 మీటర్ల దూరం విసిరి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 83 మీటర్ల దూరం విసిరిన వారందరికీ ఫైనల్‌కు చేరుకునే అర్హత ఉండగా... మొత్తం 32 మందిలో 13 మంది ఈ మార్క్‌ను అధిగమించారు. ఫైనల్ నేడు (శనివారం) జరుగుతుంది. భారత్‌కే చెందిన అండర్–20 వరల్డ్ చాంపియన్ నీరజ్ చోప్రా మాత్రం నిరాశపరిచాడు. ఈటెను 82.26 మీ. దూరం విసిరి 15వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. గత జూన్‌లో దవీందర్‌కు నిర్వహించిన డోపింగ్ పరీక్షలో అతను గంజాయి సేవించినట్లు తేలింది. అయితే ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో గంజాయి లేకపోవడంతో దవీందర్‌పై సస్పెన్షన్ వేటు పడలేదు. దాంతో అతను ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. -
పదేళ్ల తర్వాత... మళ్లీ పసిడి
►జావెలిన్ త్రోలో స్వర్ణం నెగ్గిన బార్బరా స్పొటకోవా ►ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ గెలవాలనే బలీయమైన కాంక్ష ఉంటే వయసు ఒక అంకె మాత్రమేనని చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బరా స్పొటకోవా నిరూపించింది. ఒకవైపు యువ క్రీడాకారిణులు తెరపైకి దూసుకొస్తున్నా... అవేమీ పట్టించుకోకుండా 36 ఏళ్ల స్పొటకోవా తన ప్రదర్శనతో తన ప్రత్యేకతను చాటుకుంది. పదేళ్ల విరామం తర్వాత మరోసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకొని ఔరా అనిపించింది. లండన్: అనుభవం ఉంటే అంతర్జాతీయ వేదికపై ఎప్పుడైనా అద్భుత ఫలితాలు సాధించవచ్చని చెక్ రిపబ్లిక్ జావెలిన్ త్రోయర్ బార్బరా స్పొటకోవా రుజువు చేసింది. సరిగ్గా పదేళ్ల విరామం తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మహిళల జావెలిన్ త్రో ఫైనల్స్‌లో 36 ఏళ్ల స్పొటకోవా ఈటెను 66.76 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని సంపాదించింది. 2007 ఒసాకా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచిన స్పొటకోవా పదేళ్ల తర్వాత మళ్లీ విశ్వవిజేతగా నిలువడం విశేషం. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలిచిన ఆమె, 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. ‘లండన్ ఒలింపిక్ స్టేడియం నాకెంతో కలిసొస్తుంది. ఐదేళ్ల క్రితం ఇదే వేదికపై స్వర్ణం నెగ్గాను. మళ్లీ ఇదే వేదికపై అలాంటి ఫలితాన్ని పునరావృతం చేశాను’ అని స్పొటకోవా వ్యాఖ్యానించింది. లింగ్వి లీ (చైనా–66.25 మీటర్లు) రజతం, హుయ్‌హుయ్ లియు (చైనా–65.26 మీటర్లు) కాంస్యం గెలిచారు. నికెర్క్ నిలబెట్టుకున్నాడు... మరోవైపు పురుషుల 400 మీటర్ల విభాగంలో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ వేడ్ వాన్ నికెర్క్ తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 43.98 సెకన్లలో అతను గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. స్టీవెన్ గార్డ్నర్ (బహమాస్–44.41 సెకన్లు) రజతం గెల్చుకోగా... అబ్దుల్లా హరూన్ (ఖతర్–44.48 సెకన్లు) కాంస్యం సొంతం చేసుకున్నాడు. పురుషుల పోల్‌వాల్ట్ ఈవెంట్లో సామ్ కెండ్రిక్స్ (అమెరికా) విజేతగా నిలిచాడు. అతను 5.95 మీటర్ల ఎత్తుకు ఎగిరి పసిడి పతకాన్ని నెగ్గాడు. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్లో కిప్రుటో (కెన్యా–8ని:14.12 సెకన్లు), పురుషుల 800 మీటర్ల ఈవెంట్లో పియరీ అంబ్రోసి బాసి (ఫ్రాన్స్–1ని:44.67 సెకన్లు) స్వర్ణ పతకాలను సాధించారు. మరోవైపు పురుషుల జావెలిన్ త్రోలో గురువారం క్వాలిఫయింగ్ పోటీలు జరగనున్నాయి. భారత ఆశాకిరణం నీరజ్ చోప్రా బరిలోకి దిగనున్నాడు. 32 మంది పోటీపడుతున్న క్వాలిఫయింగ్ ఈవెంట్లో టాప్–12లో నిలిచిన వారు ఫైనల్‌కు చేరతారు. -
రికార్డు దూరం విసిరి.. పసిడి పట్టాడు!
-
రికార్డు దూరం విసిరి.. పసిడి పట్టాడు!
రియో డి జెనీరో: పారాలింపిక్స్-2016లో మరో భారత అథ్లెట్ మంగళవారం పసిడి సాధించాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్లో పాల్గొన్న దేవేంద్ర ఝఝారియా.. అంతకుముందు తన పేరిట ఉన్నప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. 63.97 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరి.. 62.15 మీటర్ల గత రికార్డును తిరగరాశాడు. 2004 అథెన్స్ పారాలింపిక్స్ లో దేవేంద్ర ఈ ఘనతను సాధించాడు. రియో పారాలింపిక్స్ లో దేవేంద్ర పసిడి గెలవడంతో ఆయన కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఈవెంట్స్ ముందురోజు దేవేంద్రతో మాట్లాడినప్పుడు కచ్చితంగా స్వర్ణం గెలుస్తావని చెప్పానని, అలాగే జరిగిందని ఆయన భార్య మంజు మీడియాకు తెలిపారు. పారాలింపిక్స్ లో రెండుసార్లు పసిడి గెలిచిన తొలి భారతీయుడిగా దేవేంద్రకు గుర్తింపు లభించడం ఆనందాన్ని మరింత రెట్టింపు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. పారాలింపిక్స్-2016లో ఇప్పటివరకూ పురుషుల హై జంప్ లో తంగవేలు మరియప్పన్, మహిళల షాట్ పుట్ లో దీపా మాలిక్ లు పసిడి, వెండి పతకాలను సాధించిన విషయం తెలిసిందే. Devendra Jhajharia is now the only player in our @Paralympics/@Olympics history to have two individual #GOLD medals. pic.twitter.com/IyvoiMFzf7 — PCCAI (@pccai_in) September 13, 2016 -
'టోక్యో ఒలింపిక్స్ పతకంపైనే గురి'
న్యూఢిల్లీ:2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా స్సష్టం చేశాడు. ఇటీవల జరిగిన అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డు నెలకొల్సిన నీరజ్.. టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించడంపైనే దృష్టి సారించినట్లు పేర్కొన్నాడు. 'నేను రియో ఒలింపిక్స్ కు ఎంపిక కాకపోవడం చాలా నిరాశకు గురి చేసింది. రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించలేకపోవడానికి నా వెన్నునొప్పి కూడా కారణం. ఇటీవల జరిగిన ట్రయల్స్‌లో ఒలింపిక్స్ అర్హత ప్రమాణామైన 80 మీటర్ల లక్ష్యాన్ని అందుకోలేకపోయాను. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రియోకు పంపడానికి ఫెడరేషన్ ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ అది లభిస్తే సంతోషం. లేకపోతే 2020 ఒలింపిక్సే లక్ష్యంగా ఇప్పట్నుంచీ సాధన చేస్తా'అని నీరజ్ తెలిపాడు. ఇటీవల పొలాండ్ లో జరిగిన అండర్-20 పోటీలో నీరజ్ 86.48 మీటర్ల దూరం జావెలిన్ విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 84.69 మీటర్లతో జిగిస్‌ముండ్స్ సిర్మాయిస్ (లాత్వియా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును నీరజ్ బద్దలు కొట్టాడు. సీనియర్ లేదా జూనియర్ విభాగంలో ఓ భారత అథ్లెట్ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
నీరజ్ సంచలనం
జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డు * వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ పోటీల్లో స్వర్ణం సొంతం * ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు న్యూఢిల్లీ: కలయా... నిజమా అన్నట్లు ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా పెను సంచలనం సృష్టించాడు. ఎవరూ ఊహించని విధంగా జావెలిన్ త్రోలో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. పోలాండ్‌లో శనివారం రాత్రి జరిగిన ఈ ఈవెంట్లో హరియాణాకు చెందిన 18 ఏళ్ల నీరజ్ ఈటెను 86.48 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో 84.69 మీటర్లతో జిగిస్‌ముండ్స్ సిర్మాయిస్ (లాత్వియా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును నీరజ్ బద్దలు కొట్టాడు. సీనియర్ లేదా జూనియర్ విభాగంలో ఓ భారత అథ్లెట్ ప్రపంచ రికార్డు సాధించడం ఇదే ప్రథమం. ఏ స్థాయి ప్రపంచ చాంపియన్షిప్లోనైనా స్వర్ణ పతకాన్ని నెగ్గిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందిన నీరజ్ రియో ఒలింపిక్స్‌కు మాత్రం అర్హత పొందలేకపోయాడు. ఇటీవల జరిగిన ట్రయల్స్‌లో నీరజ్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణామైన 80 మీటర్ల లక్ష్యాన్ని అందుకోలేకపోయాడు. ‘ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని అనుకున్నాను. కానీ అది జరగలేదు. ప్రపంచ అండర్-20 చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గాలనే లక్ష్యం పెట్టుకున్నా. అనుకున్నది సాధించాను’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు. ప్రపంచ రికార్డు నెలకొల్పిన నీరజ్ చోప్రాను అభినందించిన కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ అతనికి రూ. 10 లక్షలు నజరానా ప్రకటించారు. గతంలో 2000లో ప్రపంచ అండర్-20 చాంపియన్‌షిప్‌లో సీమా పూనియా డిస్కస్ త్రోలో స్వర్ణం సాధించింది. అయితే ఆమె డోపింగ్‌లో పట్టుబడటంతో ఆమెపై నిషేధం విధించి, స్వర్ణాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే 2002లో ఇదే చాంపియన్‌షిప్‌లో సీమా కాంస్య పతకాన్ని గెలిచింది. 2004లో ప్రపంచ అండర్-20 చాంపియన్‌షిప్‌లో నవ్‌జీత్ కౌర్ థిల్లాన్ డిస్కస్ త్రోలో కాంస్యం సాధించింది. 2003లో పారిస్‌లో జరిగిన సీనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అంజూ బాబీ జార్జి లాంగ్‌జంప్‌లో కాంస్య పతకం దక్కించుకుంది.