న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ ఏడాది తొలి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫిన్‌లాండ్‌లో శనివారం జరిగిన కూర్తానె గేమ్స్‌లో నీరజ్ జావెలిన్‌ను 86.69 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. కెషర్న్ వాల్కట్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో; 86.64 మీటర్లు) రజతం, అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 84.75 మీటర్లు) కాంస్యం సాధించారు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్ పది నెలల తర్వాత ఇటీవల పావో నుర్మీ గేమ్స్‌లో పాల్గొని రజతం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment