సాక్షి, న్యూఢిల్లీ: ‘ఒలింపిక్ టైటిల్‌తో మహిళా అభిమానులు కూడా జతయ్యారు. కానీ నాకైతే గర్ల్‌ఫ్రెండే ఇప్పటివరకు లేదు. భవిష్యత్తులో నన్ను ప్రేమించే నెచ్చెలి ఎవరైనా ఉంటారేమో చూద్దాం. ఇప్పుడు నేను పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెట్టాను. ఈవెంట్లు, ప్రదర్శన, పతకాలు ఇవే నా ముందున్నవి. మిగతావన్నీ ఆ తర్వాతే! తదుపరి జరి గే పోటీలు, సన్నాహక శిబిరాలపైనే ఎక్కువగా ఆలోచిస్తాను. నాకు పానీ పూరిలంటే ఇష్టం. కానీ టోక్యోలో ఈవెంట్ కోసం వాటి ని తినలేదు. కడుపు నొప్పి, ఇతరత్రా ఆరోగ్య సమస్యల రిస్క్ ఎందు కని వాటికి దూరంగా ఉన్నాను’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు.
టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన 23 ఏళ్ల నీరజ్ చోప్రా మంగళవారం స్వదేశం చేరుకున్నాడు. ఈ సందర్భంగా నీరజ్‌ను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ఘనంగా సన్మానించింది.
నీరజ్ నెగ్గిన స్వర్ణ పతకంతో తల్లిదండ్రులు సతీశ్, సరోజ్ దేవి, చిన్నాన్న భీమ్ చోప్రా
ఈ సన్మాన కార్యక్రమంలో నీరజ్ తల్లిదండ్రులు సరోజ్ దేవి–సతీశ్, చిన్నాన్న భీమ్ చోప్రా పాల్గొన్నారు. ఇక దేశంలో జావెలిన్ త్రోకు ప్రాచుర్యం తెచ్చేందుకు ఏఎఫ్‌ఐ కీలక నిర్ణయం తీసుకుంది. నీరజ్ బంగారు పతకంతో మెరిసిన ఆగస్టు 7వ తేదీని ‘జాతీయ జావెలిన్ డే’గా నిర్వహిస్తామని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment