AIF
-
రుణాల ‘ఎవర్‌గ్రీనింగ్’కు చెక్.. ఆర్బీఐ నిబంధనలు కఠినతరం
ముంబై: రుణాల ఎవర్‌గ్రీనింగ్‌కు చెక్ పెట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు .. గత 12 నెలల్లో తమ దగ్గర నుంచి రుణాలు తీసుకున్న సంస్థల్లో ఏఐఎఫ్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టకుండా నిబంధనలను కఠినతరం చేసింది. రుణగ్రహీతలకు పరోక్షంగా నిధులు అందించేందుకు ఆర్థిక సంస్థలకు ఇది ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఒక సర్క్యులర్‌లో వివరించింది. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉండే బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) తమ పెట్టుబడుల విధానాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఫండ్స్ (ఏఐఎఫ్)లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈ ఏఐఎఫ్‌లలో వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఏంజెల్ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్ మొదలైనవి ఉంటాయి. అయితే, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు గతంలో తాము రుణాలిచ్చిన కంపెనీల్లో పలు ఏఐఎఫ్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేస్తుండటమనేది ఆయా సంస్థలకు మరిన్ని నిధులను సమకూర్చడం కిందికే వస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఇకపై అవి తమ నుంచి రుణం తీసుకున్న ఏ సంస్థలోనూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పెట్టుబడులు పెట్టే ఏఐఎఫ్కి చెందిన ఏ స్కీములోనూ ఇన్వెస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే చేసిన పెట్టుబడులను 30 రోజుల్లోగా ఉపసంహరించాల్సి ఉంటుందని పేర్కొంది. ఒకవేళ అలా చేయలేకపోతే దానికి 100 శాతం మేర ప్రొవిజనింగ్ చేయాలని తెలిపింది. రుణాలను తిరిగి చెల్లించడంలో ఇబ్బందిపడుతున్న రుణగ్రహీతలకు మరిన్ని రుణాలివ్వడం లేదా కొన్ని నిబంధనలను సడలించి లోన్‌ను రెన్యువల్ చేయడం మొదలైనవి ఎవర్‌గ్రీనింగ్ కిందికి వస్తాయి. సాధారణంగా సదరు రుణాన్ని తమ ఖాతాల్లో మొండిబాకీగా చూపాల్సిన పరిస్థితి తలెత్తకుండా బ్యాంకులు ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంటాయి. -
గర్ల్‌ఫ్రెండ్ విషయంపై నీరజ్ చోప్రా క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఒలింపిక్ టైటిల్‌తో మహిళా అభిమానులు కూడా జతయ్యారు. కానీ నాకైతే గర్ల్‌ఫ్రెండే ఇప్పటివరకు లేదు. భవిష్యత్తులో నన్ను ప్రేమించే నెచ్చెలి ఎవరైనా ఉంటారేమో చూద్దాం. ఇప్పుడు నేను పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెట్టాను. ఈవెంట్లు, ప్రదర్శన, పతకాలు ఇవే నా ముందున్నవి. మిగతావన్నీ ఆ తర్వాతే! తదుపరి జరి గే పోటీలు, సన్నాహక శిబిరాలపైనే ఎక్కువగా ఆలోచిస్తాను. నాకు పానీ పూరిలంటే ఇష్టం. కానీ టోక్యోలో ఈవెంట్ కోసం వాటి ని తినలేదు. కడుపు నొప్పి, ఇతరత్రా ఆరోగ్య సమస్యల రిస్క్ ఎందు కని వాటికి దూరంగా ఉన్నాను’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు. టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన 23 ఏళ్ల నీరజ్ చోప్రా మంగళవారం స్వదేశం చేరుకున్నాడు. ఈ సందర్భంగా నీరజ్‌ను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఘనంగా సన్మానించింది. నీరజ్ నెగ్గిన స్వర్ణ పతకంతో తల్లిదండ్రులు సతీశ్, సరోజ్ దేవి, చిన్నాన్న భీమ్ చోప్రా ఈ సన్మాన కార్యక్రమంలో నీరజ్ తల్లిదండ్రులు సరోజ్ దేవి–సతీశ్, చిన్నాన్న భీమ్ చోప్రా పాల్గొన్నారు. ఇక దేశంలో జావెలిన్ త్రోకు ప్రాచుర్యం తెచ్చేందుకు ఏఎఫ్ఐ కీలక నిర్ణయం తీసుకుంది. నీరజ్ బంగారు పతకంతో మెరిసిన ఆగస్టు 7వ తేదీని ‘జాతీయ జావెలిన్ డే’గా నిర్వహిస్తామని ప్రకటించింది. -
‘ఏఐఎఫ్’ రుణాల కోసం ఏపీ నుంచి అధిక దరఖాస్తులు
న్యూఢిల్లీ: వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి(ఏఐఎఫ్) పథకం కింద రూ.8,216 కోట్ల సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు వచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. అత్యధిక దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చినట్టు తెలిపింది. దిగుబడి తర్వాత వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేదుకు కేంద్ర సర్కారు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన ఈ పథకం పదేళ్ల పాటు కొనసాగనుంది. దీని కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు 3 శాతం వడ్డీ రాయితీపై మొత్తం రూ.లక్ష కోట్ల రుణాలను అందించనున్నాయి. గరిష్టంగా రూ.3 కోట్ల వరకు రుణాలపై ఈ మేరకు వడ్డీ రాయితీ అమలవుతుంది. ‘‘ఈ పథకం కింద ఇప్పటి వరకు 8,665 దరఖాస్తులు రూ.8,216 కోట్ల రుణాల కోసం వచ్చాయి. ఇందులో రూ.4,000 కోట్ల రుణాలు మంజూరయ్యాయి’’ అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అత్యధికంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) నుంచి రాగా, ఆ తర్వాత వ్యవసాయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, రైతుల నుంచి వచ్చినట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అత్యధికంగా 2,125 దరఖాస్తులు రాగా.. మధ్యప్రదేశ్ నుంచి 1,830, ఉత్తరప్రదేశ్ నుంచి 1,255, కర్ణాటక నుంచి 1,071, రాజస్థాన్ నుంచి 613 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపింది. చదవండి: 65 కిలోమీటర్లకు కేవలం ఐదు రూపాయలే ఖర్చు! -
రియల్టీ రంగానికి భారీ ఊరట
సాక్షి,న్యూఢిల్లీ: రియల్టీ రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రియల్ ఎస్టేట్ రంగంలో జోష్ నింపేందుకు పలు కీలక నిర్ణయాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వెల్లడించారు. దీని ప్రకారం ఎన్పీఏ ఎన్సీఎల్టీ ప్రకటించని సంస్థలకు మాత్రమే అనే నిబంధనను తాజాగా తొలగించారు. తద్వారా మధ్య, చిన్న ఆదాయ రియల్టీ ప్రాజెక్టులకు, సగంలో నిలిచిపోయి పూర్తి కాని ప్రాజెక్టులకు కేంద్రం నిధులను సమకూరుస్తుంది. తద్వారా సంబంధిత ప్రాజెక్ట్ పూర్తి కావడానికి సాయపడుతుంది. ఇందుకోసం రూ .25 వేల కోట్ల విలువైన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని (ఎఐఎఫ్) ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇందులో కేంద్ర 10వేల కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నిధులను సమకూర్చనుంది. గృహ ప్రాజెక్టుల కోసం రూ.25,000 కోట్ల నిధి నిర్మాణంలో ఉండి నిలిచిపోయిన హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తయేందుకు వీలుగా రూ.25,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు. దీనికి ప్రభుత్వం రూ.10,000 కోట్లు సమకూర్చుతుంది. దీని ద్వారా అందుబాటు ధరలు, మధ్య ఆదాయ హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తయేందుకు వీలు కలగనుంది. అంతేకాకుండా నగదు కొరత కారణంగా నిలిచిపోయిన, రెరాలో నమోదైన ప్రాజెక్టులను రియల్ ఎస్టేట్ డెవలపర్లు పూర్తి చేసే అవకాశం లభించనుంది. ఈ నిధిని ప్రొఫెషనల్స్ నిర్వహిస్తారనీ, ఈ నిధి మూలంగా దాదాపు 3.5 లక్షల మంది మధ్య తరగతి గృహ కొనుగోలుదారులకు ప్రయోజనం కలుగుతుందని ఆర్థికమంత్రి వివరించారు. ఈ నేపథ్యంలోనే హౌసింగ్ ప్రాజెక్టులకు నిధులను అందించే నిమిత్తం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎన్పీఏ, ఎన్సీఎల్టీకి వెళ్లిన హౌసింగ్ ప్రాజెక్టులకు దీని ద్వారా ప్రయోజనం కలగనుందన్నారు. ఈ వివరాలను కేబినెట్ సమావేశం తరువాత ఆమె మీడియాకు వివరించారు.1,600 రియాల్టీ ప్రాజెక్టులు నిలిచిపోవడంతోభారతదేశంలో సుమారు 4.58 లక్షల హౌసింగ్ యూనిట్లు చిక్కుకున్నాయని అంతర్గత సర్వేలో తేలిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. -
ఫండ్ స్కీమ్స్‌ను అటూ–ఇటూ మార్చకూడదు
న్యూఢిల్లీ: ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్(ఏఐఎఫ్) నిర్వహిస్తున్న ఓపెన్–ఎండెడ్ స్కీమ్స్‌ను క్లోజ్డ్–ఎండెడ్ స్కీమ్స్‌గా మార్చడానికి లేదని మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ తెలిపింది. అలాగే క్లోజ్డ్–ఎండెడ్ స్కీమ్స్‌ను ఓపెన్–ఎండెడ్ స్కీమ్స్‌గా కూడా మార్చకూడదని పేర్కొంది. ఏఐఎఫ్ నిబంధనలకు సంబంధించి సింగులర్ ఇండియా ఆపర్చునిటీస్ ట్రస్ట్(ఎస్ఐఓటీ) లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయడంలో భాగంగా సెబీ ఈ స్పష్టతని ఇచ్చింది. ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్‌ల్లో ఇన్వెస్టర్లు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎప్పుడైనా తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. వీటికి నిర్దేశిత మెచ్యూరిటీ కాలపరిమితి ఉండదు. క్లోజ్డ్–ఎండెడ్ స్కీమ్స్‌కు నిర్దేశిత కాలపరిమితి ఉంటుంది. ఏఐఎఫ్‌లు రకరకాలైన స్కీమ్‌లను ఆఫర్ చేయవచ్చు. అయితే ఏదైనా స్కీమ్‌ను ఆరంభించే ముందు ఆ స్కీమ్‌కు సంబంధించిన వివరాలను కనీసం 30 రోజుల ముందు సెబీకి నివేదించాల్సి ఉంటుంది. భారత్‌లో నమోదైన ఏఐఎఫ్‌లు దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను సమీకరించి ముందుగా నిర్ణయించిన విధానాల ప్రకారం ఇన్వెస్ట్ చేస్తాయి. ఏఐఎఫ్‌లో వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, కమోడిటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కలగలసి ఉంటాయి. -
ఇన్వెస్ట్ మెంట్ ఫండ్స్‌కు మరిన్ని పన్ను ప్రోత్సాహకాలు
నారాయణ మూర్తి కమిటీ సిఫార్సు న్యూఢిల్లీ: స్టార్టప్‌ల్లో పెట్టుబడి చేసే ఆల్ట్రనేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స (ఏఐఎఫ్‌లు)కు మరిన్ని పన్ను ప్రోత్సాహకాలు అందించాలని ఎన్ఆర్ నారాయణమూర్తి కమిటీ సిఫార్సుచేసింది. వెంచర్‌క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స నిబంధనల్లో గణనీయమైన మార్పులు చేయాలని కూడా సెబి నియమించిన ఈ కమిటీ సూచించింది. కమిటీ తన రెండో నివేదికను తాజాగా సెబికి సమర్పించింది. నివేదికలోని ముఖ్యాంశాలు.... ⇔ బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్సను క్యాటగిరీ- 2 ఏఐఎఫ్ల్లో పెట్టుబడికి అనుమతించాలి. ⇔ ఒక్కో ఇన్వెస్టరు నుంచి రూ. 10 కోట్ల లోపు మొత్తాన్ని సమీకరించే ఏఐఎఫ్‌లు జరిపే ప్రైవేట్ ప్లేస్‌మెంట్స్ ఒప్పందాల్ని వెల్లడించాలి. ⇔ అన్ని రకాల ఏఐఎఫ్‌లకు 12% జీఎస్టీ విధించాలి. -
ఏఐఎఫ్‌లలో విదేశీ పెట్టుబడులకు ఓకే
న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాల ఫండ్స్‌ను (ఏఐఎఫ్) మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే క్రమంలో వీటికి పన్నులపరమైన ప్రయోజనాలు కల్పిస్తూ ‘పాస్ థ్రూ’ హోదా ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ సాధనాల్లో విదేశీ పెట్టుబడులను కూడా అనుమతించాలని నిర్ణయించింది. పాస్ థ్రూ హోదా ఉన్న సంస్థలకు వచ్చే ఆదాయంపై పన్నులు.. కార్పొరేట్ స్థాయిలో కాకుండా వ్యక్తిగత స్థాయిలో సదరు సంస్థ యజమానులు చెల్లిస్తారు. దీని వల్ల ద్వంద్వ పన్నుల సమస్య ఉండదు. రియల్ ఎస్టేట్ మొదలైన రంగాల్లో ఇన్వెస్ట్ చేసే కొత్త తరహా ఫండ్స్‌ను ఏఐఎఫ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇన్వెస్ట్ చేసే రంగాలను బట్టి ఇవి రెండు రకాలుగా ఉన్నాయి. వీటికి ట్యాక్స్ పాస్ థ్రూ హోదానివ్వడంపై పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇన్వెస్టర్లకు ఇది గొప్ప ఊరటనిస్తుందని ఖేతాన్ అండ్ కో పార్ట్నర్ బీజల్ అజింక్య తెలిపారు. -
ఐడీఎఫ్సీ ఇన్ఫ్రా ఫండ్‌కు అనుమతి
న్యూఢిల్లీ: ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏర్పాటు చేయడానికి ఐడీఎఫ్సీకి ప్రభుత్వం బుధవారం అనుమతినిచ్చింది. రూ.5,500 కోట్ల కార్పస్‌తో ఐడీఎఫ్సీ ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటి అనుమతిచ్చింది. అల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఏఐఎఫ్) కేటగిరి వన్‌గా ఈ ఫండ్ సెబీ వద్ద నమోదవుతుంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి ఈ ఫండ్ రూ.5,500 కోట్ల వరకూ నిధులు సమీకరించుకోవచ్చు. ఇలా సేకరించిన నిధులను ఇంధన, రవాణా, విమానయానం, టెలికాం మౌలిక సదుపాయాలు, ఇతర పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల కోసం వినియోగిస్తారు.