సాక్షి,న్యూఢిల్లీ: రియల్టీ రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రియల్ ఎస్టేట్ రంగంలో జోష్ నింపేందుకు పలు కీలక నిర్ణయాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వెల్లడించారు. దీని ప్రకారం ఎన్‌పీఏ ఎన్‌సీఎల్‌టీ ప్రకటించని సంస్థలకు మాత్రమే అనే నిబంధనను తాజాగా తొలగించారు. తద్వారా మధ్య, చిన్న ఆదాయ రియల్టీ ప్రాజెక్టులకు, సగంలో నిలిచిపోయి పూర్తి కాని ప్రాజెక్టులకు కేంద్రం నిధులను సమకూరుస్తుంది. తద్వారా సంబంధిత ప్రాజెక్ట్ పూర్తి కావడానికి సాయపడుతుంది. ఇందుకోసం రూ .25 వేల కోట్ల విలువైన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని (ఎఐఎఫ్) ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇందులో కేంద్ర 10వేల కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నిధులను సమకూర్చనుంది.
గృహ ప్రాజెక్టుల కోసం రూ.25,000 కోట్ల నిధి
నిర్మాణంలో ఉండి నిలిచిపోయిన హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తయేందుకు వీలుగా రూ.25,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు. దీనికి ప్రభుత్వం రూ.10,000 కోట్లు సమకూర్చుతుంది. దీని ద్వారా అందుబాటు ధరలు, మధ్య ఆదాయ హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తయేందుకు వీలు కలగనుంది. అంతేకాకుండా నగదు కొరత కారణంగా నిలిచిపోయిన, రెరాలో నమోదైన ప్రాజెక్టులను రియల్ ఎస్టేట్ డెవలపర్లు పూర్తి చేసే అవకాశం లభించనుంది. ఈ నిధిని ప్రొఫెషనల్స్ నిర్వహిస్తారనీ, ఈ నిధి మూలంగా దాదాపు 3.5 లక్షల మంది మధ్య తరగతి గృహ కొనుగోలుదారులకు ప్రయోజనం కలుగుతుందని ఆర్థికమంత్రి వివరించారు. ఈ నేపథ్యంలోనే హౌసింగ్ ప్రాజెక్టులకు నిధులను అందించే నిమిత్తం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎన్‌పీఏ, ఎన్‌సీఎల్‌టీకి వెళ్లిన హౌసింగ్ ప్రాజెక్టులకు దీని ద్వారా ప్రయోజనం కలగనుందన్నారు. ఈ వివరాలను కేబినెట్ సమావేశం తరువాత ఆమె మీడియాకు వివరించారు.1,600 రియాల్టీ ప్రాజెక్టులు నిలిచిపోవడంతోభారతదేశంలో సుమారు 4.58 లక్షల హౌసింగ్ యూనిట్లు చిక్కుకున్నాయని అంతర్గత సర్వేలో తేలిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment