ఐడీఎఫ్‌సీ ఇన్‌ఫ్రా ఫండ్‌కు అనుమతి | CCEA allows IDFC to set up Infrastructure fund with Rs 5,500 corpus | Sakshi
Sakshi News home page

ఐడీఎఫ్‌సీ ఇన్‌ఫ్రా ఫండ్‌కు అనుమతి

Published Fri, Dec 13 2013 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM

CCEA allows IDFC to set up Infrastructure fund with Rs 5,500 corpus

న్యూఢిల్లీ: ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏర్పాటు చేయడానికి ఐడీఎఫ్‌సీకి ప్రభుత్వం బుధవారం అనుమతినిచ్చింది. రూ.5,500 కోట్ల కార్పస్‌తో ఐడీఎఫ్‌సీ ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటి అనుమతిచ్చింది. అల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఏఐఎఫ్) కేటగిరి వన్‌గా ఈ ఫండ్ సెబీ వద్ద నమోదవుతుంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి ఈ ఫండ్ రూ.5,500 కోట్ల వరకూ నిధులు సమీకరించుకోవచ్చు. ఇలా సేకరించిన నిధులను ఇంధన, రవాణా, విమానయానం, టెలికాం మౌలిక సదుపాయాలు, ఇతర పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల కోసం వినియోగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement