IDFC
-
స్వయం కృషికి నిదర్శనం.. డీమార్ట్, జొమాటో, స్విగ్గీ
ముంబై: స్వయం కృషితో అవతరించిన దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఈ ఏడాదీ ‘డీమార్ట్’ రాధాకిషన్ దమానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. ‘డీమార్ట్’ పేరుతో ఆయన ఏర్పాటు చేసిన రిటైల్ చైన్ చక్కని ఆదరణ పొందుతుండడం తెలిసిందే. డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్ విలువ రూ.3.4 లక్షల కోట్లుగా ఉంది. ఏడాది కాలంలో 44 శాతం పెరిగింది. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ రెండో స్థానం దక్కించుకున్నారు. ఆయన ఏర్పాటు చేసిన జొమాటో విలువ ఏడాది కాలంలో 190 శాతం వృద్ధి చెంది రూ.2,51,900 కోట్లకు చేరింది. శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డి నెలకొల్పిన స్విగ్గీకి మూడో స్థానం దక్కింది. కంపెనీ విలువ ఏడాది కాలంలో 52 శాతం పెరిగి రూ.1,01,300 కోట్లుగా ఉంది. 2,000 సంవత్సరం తర్వాత స్వయం కృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తలు, వారు ఏర్పాటు చేసిన 200 కంపెనీలతో ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్, హరూన్ ఇండియా ఒక నివేదికను విడుదల చేశాయి. గతేడాది హరూన్ జాబితాలోనూ డీమార్ట్ మొదటి స్థానంలో ఉండగా, ఫ్లిప్‌కార్ట్, జొమాటో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గతేడాది జాబితాలో టాప్–10లో ఉన్న ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, క్రెడ్ ఈ సారి టాప్–10లో చోటు కోల్పోయాయి. ముఖ్యంగా స్వయంకృషితో ఎదిగిన మహిళా అగ్రగామి పారిశ్రామికవేత్తగా ఫాల్గుణి నాయర్‌కు పదో స్థానం దక్కడం గమనార్హం. స్వయం కృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన టాప్–200లో 66 కంపెనీలు బెంగళూరు కేంద్రంగా ఉంటే, 36 కంపెనీలకు ముంబై, 31 కంపెనీలకు గురుగ్రామ్ చిరునామాగా ఉన్నాయి. -
మామూలు బ్యాంక్ బ్యాలెన్స్‌పైనా ఎక్కువ వడ్డీ!
నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అంటే సేవింగ్స్ అకౌంట్ ఉంది. అందరూ తమ డబ్బును ఈ ఖాతాలోనే ఉంచుకుంటారు. లావాదేవీలు నిర్వహిస్తారు. కానీ ఇందులో ఉంచే డబ్బుపై సాధారణంగా పెద్దగా వడ్డీ రాదు. అయితే ఇలాంటి మామూలు సేవింగ్స్ అకౌంట్‌పైనా 7.25 శాతం వరకు వడ్డీని పొందవచ్చని మీకు తెలుసా? సేవింగ్స్ ఖాతాపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్న కొన్ని బ్యాంకుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవింగ్స్ ఖాతాలో రూ.10 కోట్ల లోపు ఉన్న బ్యాలెన్స్‌పై 2.70 శాతం వడ్డీ ఇస్తోంది. రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో డబ్బును ఉంచినట్లయితే, రూ. 50 లక్షల లోపు బ్యాలెన్స్‌పై 3 శాతం వడ్డీ లభిస్తుంది. రూ. 50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే 3.5 శాతం వడ్డీ ఇస్తారు.ఐసీఐసీఐ బ్యాంక్ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచే బ్యాలెన్స్ రూ. 50 లక్షల కంటే తక్కువగా ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది. అదే 50 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉంటే 3.5 శాతం వడ్డీ లభిస్తుంది.ఇదీ చదవండి: కార్మికశాఖ కీలక నిర్ణయం.. పీఎఫ్‌పై మరింత ప్రయోజనంపంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) పొదుపు ఖాతాలో రూ. 10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉంటే దానిపై 2.70 శాతం వడ్డీ ఇస్తారు. బ్యాలెన్స్ రూ.10 లక్షల నుంచి రూ.100 కోట్ల మధ్య ఉంటే 2.75 శాతం, రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ఐడీఎఫ్సీ బ్యాంక్ (IDFC FIRST Bank) సేవింగ్ అకౌంట్ డిపాజిట్లపై అన్ని బ్యాంక్‌ల కంటే అధికంగా వడ్డీ ఇస్తోంది. ఖాతాలో రూ. 5 లక్షల లోపు బ్యాలెన్స్‌పై 3 శాతం వడ్డీని అందిస్తోంది. అదే రూ. 5 లక్షల నుండి రూ. 100 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉంటే, మీరు దానిపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీని ఇస్తోంది. రూ. 100-200 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌పై 4.50 శాతం వడ్డీ ఇస్తోంది.ఈ వడ్డీని ఎలా నిర్ణయిస్తారు?సాధారణంగా పొదుపు ఖాతా వడ్డీ రేటును త్రైమాసికానికి ఒకసారి లెక్కించి జమ చేస్తారు. ఈ వడ్డీ రేటును రోజువారీ బ్యాలెన్స్ అంటే రోజంతా చేసిన డిపాజిట్లలో ఉపసంహరణలు పోగా మిగిలిన మొత్తం ఆధారంగా నిర్ణయిస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చినప్పుడు పొదుపు ఖాతాకు ఎలాంటి మెచ్యూరిటీ వ్యవధి ఉండదు. ఎందుకంటే ఈ రకమైన ఖాతాను సాధారణ పొదుపు, లావాదేవీల కోసం ఉపయోగిస్తారు. పెనాల్టీలు లేదా రుసుము లేకుండా ఈ ఖాతాలో ఎప్పుడైనా నగదు డిపాజిట్ చేయవచ్చు. ఉపసంహరించుకోవచ్చు. -
ఐడీఎఫ్సీ విలీనానికి ఆర్బీఐ అనుమతి
న్యూఢిల్లీ: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో ఐడీఎఫ్సీ లిమిటెడ్, ఐడీఎఫ్సీ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ (ఐడీఎఫ్సీ ఎఫ్‌హెచ్‌సీఎల్) విలీనానికి ఆర్బీఐ తన అనుమతి తెలియజేసింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో ఐడీఎఫ్సీ ఫైనాన్షియల్ హోల్డింగ్ ద్వారా ఐడీఎఫ్సీ వాటాలు కలిగి ఉంది. ఇప్పుడు రివర్స్ మెర్జర్ విధానంలో బ్యాంక్‌లో ఐడీఎఫ్సీ విలీనం కానుంది. ఈ విలీన ప్రక్రియకు ఆర్బీఐ నిరభ్యంతరాన్ని (నో అబ్జెక్షన్) తెలియజేసినట్టు ఐడీఎఫ్సీ లిమిటెడ్ స్టాక్ ఎక్స్చేంజ్లకు వెల్లడించింది. తొలుత ఐడీఎఫ్సీ లిమిటెడ్‌లో ఐడీఎఫ్సీ ఎఫ్‌హెచ్‌సీఎల్ విలీనం అవుతుంది. అనంతరం ఐడీఎఫ్సీ వెళ్లి ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో విలీనం అవుతుంది. ఐడీఎఫ్సీ వాటాదారుల వద్దనున్న ప్రతి 100 షేర్లకు గాను 155 బ్యాంక్ షేర్లు లభించనున్నాయి. విలీనం అనంతరం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ స్టాండలోన్ పుస్తక విలువ 4.9 శాతం పెరగనుంది. -
హెచ్డీఎఫ్సీ తర్వాత.. ఐడీఎఫ్సీ బ్యాంకులో ఐడీఎఫ్సీ విలీనం
ముంబై: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో మాతృ సంస్థ ఐడీఎఫ్సీ లిమిటెడ్ విలీనం కానుంది. పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా లావాదేవీని చేపట్టనున్నారు. ఇందుకు రెండు సంస్థల బోర్డులూ ఆమోదించినట్లు ఐడీఎఫ్సీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు తాజాగా వెల్లడించాయి. విలీన ప్రతిపాదన ప్రకారం ఐడీఎఫ్సీ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 100 షేర్లకుగాను 155 ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు షేర్లు జారీ చేయనున్నారు. ప్రధానంగా మౌలిక రంగానికి రుణాలందించే ఐడీఎఫ్సీ 1997లో ఆవిర్భవించింది. 2015లో ఐసీఐసీఐ, ఐడీబీఐ తరహాలో బ్యాంకింగ్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. 2018 డిసెంబర్లో క్యాపిటల్ ఫస్ట్‌ను టేకోవర్ చేసింది. -
క్రమం తప్పకుండా ఆదాయం
వృద్ధాప్యంలో క్రమం తప్పకుండా ఆదాయాన్నిచ్చే మార్గం కచ్చితంగా ఉండాలి. కొన్ని లక్ష్యాల కోసం స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారూ ఉంటారు. అవసరం ఏదైనా కానీ.. క్రమం తప్పకుండా ఆదాయం పొందేందుకు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (క్రమానుగతంగా ఉపసంహరణ) మంచి సాధనం. ఈ విభాగంలో నిపుణులు సూచిస్తున్న మంచి పథకాలపై సమాచారాన్ని అందించే ‘ప్రాఫిట్ ప్లస్’ స్టోరీ. ఒక పథకంలో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత నిర్ణీత కాలానికి.. అంటే పక్షానికి, నెలకు, త్రైమాసికానికి, ఆరు నెలలకు, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున నిర్ణయించిన మేర ఉపసంహరించుకోవడాన్ని ఎస్‌డబ్ల్యూపీ సాధనంగా పేర్కొంటారు. పెట్టుబడిపై అప్పటి వరకు వచ్చిన రాబడి వరకే ఉపసంహరించుకోవచ్చు. లేదా తమకు ఎంత అవసరమో ఆ మేరకు ఉపసంహరణను నిర్ణయించుకోవచ్చు. దీనివల్ల క్రమం తప్పకుండా ఆదాయం లభించడమే కాకుండా.. ఫండ్‌లో మిగిలి ఉన్న పెట్టుబడి వృద్ధి చెందుతూనే ఉంటుంది. గ్రోత్, డివిడెండ్ ప్లాన్లలోనూ ఎస్‌డబ్ల్యూపీ ఆప్షన్ అందుబాటులో ఉంది. మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ప్రకటించే డివిడెండ్‌పై పంపిణీ పన్నును ఎత్తివేయడంతో ఈ ఫండ్స్‌లో ఎస్‌డబ్ల్యూపీ ఆప్షన్ మరింత ఆకర్షణీయంగా మారిందని చెప్పుకోవాలి. ఈ విభాగంలో మెరుగైన రాబడులను ఇస్తున్న పథకాలను పరిశీలించినట్టయితే.. కెనరా రొబెకో కన్జర్వేటివ్ హైబ్రిడ్ రిస్క్ పెద్దగా కోరుకోని సంప్రదాయ ఇన్వెస్టర్లు, అదే సమయంలో కొంత వరకు ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్నా ఫర్వాలేదనుకునే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. ఈ పథకం 21–25 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించి, మిగిలినదంతా డెట్ సాధనాల్లో పెట్టుబడులుగా పెడుతుంది. ఈ విభాగంలో సాధారణం కంటే మెరుగైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఇది కూడా ఒకటి. గడిచిన మూడేళ్ల కాలంలో వార్షికంగా 6.6 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 6.9 శాతం రాబడులను అందించింది. అధిక నాణ్యత కలిగిన సాధనాల్లోనే ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది. ఈక్విటీలకు కేటాయించిన కొద్ది పెట్టుబడుల్లోనూ మూడింట రెండొంతులు లార్జ్‌క్యాప్ స్టాక్స్‌నే ఎంచుకుంటుంది. దీనివల్ల ఈక్విటీ మార్కెట్లు కరెక్షన్లోకి వెళ్లినా కానీ నష్టాలు పరిమితంగానే ఉంటాయి. అంతేకాదు, మార్కెట్ల ర్యాలీతో కాస్త అధిక రాబడులకూ అవకాశం ఉంటుంది. డెట్ విభాగంలో ఏఏఏ రేటెడ్ సాధనాలనే ఎంచుకుంటుంది. అధిక నాణ్యతకు ఏఏఏ సూచిక. ప్రతి నెలా 5, 15, 20, 25వ తేదీలను ఎస్‌డబ్ల్యూపీ కోసం ఎం చుకునేందుకు ఈ పథకం అవకాశం ఇస్తోంది. ఐడీఎఫ్సీ బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ విభాగంలో ఏఏఏ/ఏ1ప్లస్ రేటెడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో ఇది కూడా ఒకటి. బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల డెట్ పేపర్లలో ప్రధానంగా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. గడిచిన ఏడాదిగా అస్థిరతలు పెరిగిపోవడంతో.. పెట్టుబడుల సగటు మెచ్యూరిటీని అప్పటి వరకు ఉన్న 3.7 సంవత్సరాల నుంచి 2.8 సంవత్సరాలకు ఫండ్ మేనేజర్ తగ్గించుకున్నారు. దీనివల్ల రిస్క్ తగ్గుతుంది. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 13.2 శాతం, మూడేళ్లలో వార్షికంగా 9.4 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 8.6 శాతం చొప్పున రాబడులను ఇవ్వడం గమనార్హం. పెట్టుబడులపై రాబడులను లేదా తాము కోరుకున్నంత నిర్ణీత కాలానికి ఉపసంహరించుకునేందుకు ఈ పథకం అవకాశం ఇస్తోంది. ప్రతి నెలా 10, 20వ తేదీలను ఎంచుకోవచ్చు. ఎల్అండ్టీ షార్ట్ టర్మ్ బాండ్ షార్ట్ టర్మ్ డ్యురేషన్ ఫండ్స్ విభాగంలోని పథకాలు సాధారణంగా ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధి కలిగిన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అదే విధంగా రాబడులు, ఆదాయం, భద్రత, లిక్విడిటీ అంశాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుకూలంగా ఉన్న సాధనాలనే పెట్టుబడులకు ఎంచుకుంటాయి. ఈ విభాగంలో అధిక రేటింగ్ కలిగిన (నాణ్యతతో కూడిన) డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో ఎల్అండ్టీ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్ కూడా ఒకటి. వైవిధ్యం కోసం 160 రకాల డెట్ పేపర్లను ప్రస్తుతానికి తన పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంది. రాబడులను గమనించినట్టయితే.. గడిచిన ఏడాది కాలంలో 11.4 శాతం ప్రతిఫలాన్నిచ్చింది. మూడేళ్ల కాలంలో వార్షికంగా 8.3 శాతం, ఐదేళ్లలో 8.2 శాతం చొప్పున ఇచ్చింది. ప్రతి నెలా 1, 5, 7, 10, 15, 20, 25వ తేదీలను ఎస్‌డబ్ల్యూపీకి ఎంచుకోవచ్చు. కోరుకున్నంత లేదా కేవలం రాబడుల వరకే ఉపసంహరించుకోవడం అన్నది ఇన్వెస్టర్ ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది. ఎంపిక ఎలా? ఎంపిక చేసుకున్న ఫండ్స్‌లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసి ఉన్నా.. లేదా ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసిన అనంతరం ఎస్‌డబ్ల్యూపీని ప్రారంభించుకోవచ్చు. ఇందుకోసం ఏఎంసీకి ఒక దరఖాస్తు ఇస్తే చాలు. లేదా రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్‌కు ఇచ్చినా సరిపోతుంది. చాలా ఏఎంసీలు, ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లు, క్యామ్స్ వంటి రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు, ఎంఎఫ్ యుటిలిటీ సంస్థ ఆన్లైన్ నుంచే ఎస్‌డబ్ల్యూపీని ప్రారంభించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. కొన్ని ఏఎంసీలు స్థిరంగా నిర్ణయించిన మేర ఎస్‌డబ్ల్యూపీకి అనుమతిస్తుంటే.. ఐడీఎఫ్సీ, ఎల్ అండ్‌టీ వంటి ఫండ్ సంస్థలు పెట్టుబడులపై రాబడుల వరకే ఉపసహరించుకునేందుకూ అవకాశం ఇస్తున్నాయి. క్రమం తప్పకుండా ఆదాయం వద్దనుకుంటే.. నమోదు చేసుకున్న ఎస్‌డబ్ల్యూపీని తిరిగి రద్దు కూడా చేసుకోవ చ్చు. ఒకవేళ మీ పెట్టుబడులు ఇక ఏమీ మిగలని సందర్భాల్లో ఎస్‌డబ్ల్యూపీ దానంతట అదే రద్దయిపోతుంది. పన్నుల విషయానికి వస్తే... మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎస్‌డబ్ల్యూపీ ఉపసంహరణలు పన్ను పరిధిలోకి వస్తాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసిన ఏడాది లోపు వెనక్కి తీసుకున్నట్టయితే.. ఆర్జించిన రాబడులపై 15 శాతం స్వల్పకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇన్వెస్ట్ చేసిన 12 నెలల తర్వాత నుంచి ఎస్‌డబ్ల్యూపీని ఆరంభించినట్టయితే.. అప్పుడు రాబడులపై 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాలి. కాకపోతే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అన్నది ఒక ఆర్థిక సంవత్సరంలో రాబడులు రూ.లక్ష మించినప్పుడే చెల్లించాల్సి వస్తుంది. రాబడులు రూ.లక్ష లోపు ఉన్నట్టయితే పన్ను బాధ్యత ఉండదు. అదే స్వల్పకాల మూలధన లాభాల పన్ను ఎంత మొత్తం ఉన్నా కానీ దానిపై 15 శాతం పన్ను పడుతుంది. ఇక డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసిన తర్వాత నుంచి 36 నెలలలోపు ఉపసంహరించుకుంటే వచ్చిన రాబడులు స్వల్పకాల మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తాయి. ఇన్వెస్టర్ ఆదాయపన్ను శ్లాబు ఏ రేటులో ఉంటే ఆ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన 36 నెలల తర్వాత డెట్ ఫండ్స్ నుంచి ఉపసంహరణలు చేస్తే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. వచ్చిన రాబడుల నుంచి ద్రవ్యోల్బణ రేటును మినహాయించి మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఇన్వెస్టర్ తన రిస్క్ స్థాయిని బట్టి ఈక్విటీయా లేక డెట్ పథకమా లేక హైబ్రిడ్ ఫండ్ వీటిల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. అధిక రిస్క్ తీసుకునే వారు ఈక్విటీ పథకాన్ని పరిశీలించొచ్చు. మోస్తరు నుంచి తక్కువ రిస్క్ కోరుకునే వారు డెట్ ఫండ్ లేదా హైబ్రిడ్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. -
బాండ్లలో స్థిరమైన రాబడుల కోసం
ఆర్బీఐ ఇప్పటి వరకు 135 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించి, తాజా పాలసీలో యథాతథ స్థితికి మొగ్గు చూపించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు నియంత్రణ తప్పొచ్చన్న ఆందోళనలు, అంతర్జాతీయంగా అనిశ్చితి ఇవన్నీ దేశీయ బాండ్ మార్కెట్‌పై ప్రభావం చూపించేవే. కనుక ఈ రిస్క్‌లను అధిగమించేందుకు ఇన్వెస్టర్లు (తక్కువ నుంచి మోస్తరు రిస్క్ తీసుకునే వారు) షార్ట్, మీడియం టర్మ్ డెట్ ఫండ్స్ (స్వల్ప కాలం నుంచి మధ్య కాల ఫండ్స్)ను పెట్టుబడుల కోసం పరిశీలించొచ్చు. ఈ విభాగంలో ఐడీఎఫ్సీ బాండ్ ఫండ్ – మీడియం టర్మ్ ప్లాన్ (ఎంటీపీ) మంచి పనితీరుతో అగ్ర స్థానంలో ఉంది. రాబడులు..: ఐడీఎఫ్సీ బాండ్ ఫండ్ ఎంటీపీ గత ఐదేళ్ల పనితీరును గమనించినట్టయితే.. వార్షికంగా 8 శాతం చొప్పున రాబడులను ఇచ్చింది. కానీ, మీడియం టర్మ్ డెట్ విభాగం సగటు రాబడులు ఇదే కాలంలో 7.5 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో ఐడీఎఫ్సీ బాండ్ ఫండ్ ఎంటీపీ వార్షికంగా 7.2 శాతం రాబడులను ఇవ్వగా, ఈ విభాగం సగటు రాబడులు కేవలం 5.9 శాతంగానే ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 11 శాతం రాబడులతో అద్భుత పనితీరు చూపించింది. కానీ, ఈ విభాగం రాబడులు 5.9 శాతం వద్దే ఉన్నాయి. ఏడాది నుంచి ఐదేళ్ల కాలంలో మీడియం టర్మ్ బాండ్ ఫండ్ విభాగం కంటే ఐడీఎఫ్సీ బాండ్ ఫండ్– ఎంటీపీ పనితీరు ఎంతో మెరుగ్గా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెట్టుబడుల విధానం సెబీ మార్గదర్శకాల ప్రకారం మీడియం టర్మ్ బాండ్ ఫండ్స్ మూడు నుంచి నాలుగేళ్ల కాల వ్యవధి కలిగిన డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫండ్స్ వడ్డీ రేట్ల రిస్క్‌ను అధిగమించే విధంగా ఉంటాయి. దీర్ఘకాలిక బాండ్లతో పోలిస్తే మీడియం టర్మ్ బాండ్లు వడ్డీ రేట్ల పరంగా తక్కువ అస్థిరతలతో ఉంటుంటాయి. ఐడీఎఫ్సీ బాండ్ ఫండ్ ఎంటీపీ ప్రధానంగా ఏఏఏ రేటింగ్ కలిగిన సౌర్వభౌమ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. క్రెడిట్ రిస్క్ వాతావరణం అననుకూలంగా ఉన్న సమయాల్లో అధిక రేటింగ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే ఈ తరహా మ్యూచువల్ ఫండ్ పథకాలను పెట్టుబడుల పరంగా భద్రతగా భావించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ విభాగాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ పథకం ఐడీఎఫ్సీ సూపర్ సేవర్ ఇన్కమ్ ఫండ్ – మీడియం టర్మ్ ప్లాన్ పేరుతో కొనసాగింది. రెండు నుంచి నాలుగేళ్ల కాల వ్యవధి కలిగిన సెక్యూరిటీల్లోనే ఈ పథకం ఇన్వెస్ట్ చేయడం వల్ల అస్థిర మార్కెట్లలోనూ మంచి పనితీరు చూపించగలిగింది. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 42.8 శాతం కేంద్ర ప్రభుత్వం బాండ్లు, 50.4 శాతం మేర ఏఏఏ రేటింగ్ కార్పొరేట్ బాండ్లు ఉన్నాయి. -
విలీనం తూచ్.. ఇప్పుడేంటి?
ఐడీఎఫ్సీ గ్రూపు, శ్రీరామ్ గ్రూపు కంపెనీల భారీ స్థాయి విలీనం అటకెక్కిపోవటంపై మార్కెట్ వర్గాల్లో చర్చోపచర్చలు మొదలయ్యాయి. విలీనం జరిగితే ఎవరికి లబ్ధి కలిగి ఉండేది? జరగకపోవటం వల్ల ఎవరికి లాభం? వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. దీనిపై కొన్ని సానుకూల స్వరాలు వినిపిస్తుండగా... కొన్ని ప్రతికూల విశ్లేషణలూ వినపడుతున్నాయి. ఎవరి వాదనెలా ఉన్నా... విలీనం జరిగితే దేశంలో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ తర్వాత ఐడీఎఫ్సీ సైతం ఆర్థిక సేవల దిగ్గజ గ్రూపుగా అవతరించి ఉండేది. ఇపుడా అవకాశం చేజారిన నేపథ్యంలో తాజా పరిణామం ఎవరికి లాభిస్తుందో చూద్దాం... విలీనం జరిగి ఉంటే...: ఐడీఎఫ్సీ– శ్రీరామ్ హోల్డింగ్ కంపెనీ అనేది అన్నింటికీ ప్రమోటింగ్ కంపెనీగా ఉండేది. ఐడీఎఫ్సీ బ్యాంకులో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ విలీనమయ్యేవి. అయితే ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కొన్నాళ్లు అనుబంధ లిస్టెడ్ కంపెనీగా కొనసాగి, తర్వాత కాలంలో విలీనం కావడం లేదా డీలిస్టింగ్ చేయడమో జరిగి ఉండేది. శ్రీరామ్ గ్రూపు బీమా వ్యాపారాలు ఐడీఎఫ్‌సీలో విలీనమయ్యేవి. ఇపుడివన్నీ నిలిచిపోయాయి. ఐడీఎఫ్సీ బ్యాంకుకు నష్టమేనా? పేరెంట్ కంపెనీ ఐడీఎఫ్సీ నుంచి ఐడీఎఫ్సీ బ్యాంకుగా బయటకు వచ్చినప్పటికీ మొత్తం రుణాల్లో ఇన్ఫ్రా రంగానికిచ్చినవే 50 శాతానికిపైగా ఉన్నాయి. దీంతో ఎన్‌పీఏలూ ఎక్కువే. ఈ ముద్ర నుంచి బయటకు రావాలన్నది ఐడీఎఫ్సీ బ్యాంకు ప్రయత్నం. ప్రస్తుతం బ్యాంకు రుణాల్లో రిటైల్ రంగ వాటా 24 శాతంగా ఉంది. కస్టమర్ల సంఖ్యను పెంచుకునే లక్ష్యంతో ఇటీవలి కాలంలో మైక్రో ఫైనాన్స్ సంస్థ గ్రామ విదియాల్‌ను కొనుగోలు చేసింది. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్నూ విలీనం చేసుకుంటే గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఆ సంస్థకు భారీ సంఖ్యలో ఉన్న చిన్న కస్టమర్లు ఐడీఎఫ్సీ బ్యాంకుకు సొంతమై ఉండేవారు. చిన్న, మధ్య స్థాయి సంస్థల రుణాలు, ద్విచక్ర వాహనాల రుణాలు, బంగారం, గృహ రుణాలతో ఐడీఎఫ్సీ రిటైల్ రుణ విభాగంలో బలోపేతమై ఉండేది. దక్షిణాదికే పరిమితమైన శ్రీరామ్ గ్రూపు తో పోలిస్తే ఐడీఎఫ్సీ బ్యాంకు భిన్నమైన సంస్థ. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో విలీనానికి ఏళ్లు పట్టేదని విశ్లేషణలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే విలీనం రద్దు ఐడీఎఫ్సీకి నష్టమేనన్న వ్యాఖ్యలూ వెలువడుతున్నాయి. పిరమల్స్ వాటాలతోనే సమస్య? పిరమల్ గ్రూపునకు శ్రీరామ్ సిటీ గ్రూపు కంపెనీల్లో భారీ వాటాలున్నాయి. విలీనమై ఉంటే ఐడీఎఫ్సీ బ్యాంకులో పిరమల్ గ్రూపునకు 5%కి పైగా వాటా దక్కేది. దీంతో విలీనానికి ఆర్బీఐ అడ్డుచెప్పొచ్చని మొదట్లోనే ప్రశ్నలొచ్చాయి. ఆర్బీఐ అంగీకరిస్తేనే ముందుకెళ్తామని ఇరు సంస్థలూ అప్పట్లో చెప్పాయి. శ్రీరామ్ సిటీ యూనియన్, ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్‌ల మాతృ సంస్థ శ్రీరామ్ క్యాపిటల్‌లో పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు 20% వాటా ఉంది. దీనికి అదనంగా అజయ్ పిరమల్‌కు ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్‌లో 10% వాటా ఉంది. శ్రీరామ్ సిటీ యూని యన్‌లో శ్రీరామ్ క్యాపిటల్‌కు 33.37% వాటా ఉంది. దీంతో శ్రీరామ్ సిటీ యూనియన్‌లో పిరమల్ గ్రూపు వాటా 16.7%. ఈ డీల్ విలువ 2016–17 ఏడాది శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ పుస్తక విలువకు 3.5 రెట్ల స్థాయిలో లేకుంటే ఆ సంస్థ వాటాదారులకు నష్టమేనన్న విశ్లేషణలు అప్పట్లోనే వినవచ్చాయి. చివరికి ఆ విలువపైనే ఇరు వర్గాలు ఒక అంగీకారానికి రాలేక, ఒప్పందాన్ని రద్దు చేసుకోవటం గమనార్హం. హమ్మయ్య! వాటాదారులకు మేలే!! ‘‘డీల్ జరిగితే నాలుగు లిస్టెడ్ కంపెనీల్లో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ వాటాదారులకు మెరుగైన ప్రతిఫలం దక్కి ఉండేది కాదు. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ లిస్టింగ్‌ను కొనసాగిస్తే దాని వాటాదారుల పరిస్థితీ అంతే. ఐడీఎఫ్సీ బ్యాంకు వాటాదారులకు మాత్రం విలీన నిష్పత్తిని బట్టి లబ్ధి కలిగి ఉండేది. దీర్ఘకాలంలో ఇరు సంస్థల ఏకీకరణ సాఫీగా సాగి, డిపాజిట్లు రుణాల పరంగా సమతుల్యత సాధిస్తే అప్పుడు ఇరు సంస్థల వాటాదారులకూ లాభం జరిగి ఉండేది. అన్ని కంపెనీలకు హోల్డింగ్ సంస్థగా ఐడీఎఫ్సీ లిమిటెడ్ వాటాదారులు బాగా లబ్ధి పొందేవారు. డీల్ రద్దు కావటంతో మొత్తంగా శ్రీరామ్ గ్రూపు వాటాదారులకు మేలే జరిగిందని చెప్పవచ్చు’’ అనేది విశ్లేషకుల మాట. డీల్ ముందుకు సాగకపోవటంతో కొన్నాళ్లుగా దీనిపై నీలినీడలు కమ్ముకున్నా... సోమవారం మార్కెట్ ముగిసిన తరవాతే డీల్ రద్దు నిర్ణయం వెలువడింది. దీంతో మంగళవారం ఏ గ్రూపు షేర్లు ఎలా స్పందిస్తాయనేది చూడాల్సి ఉంది. ఐడీఎఫ్సీ, శ్రీరామ్ గ్రూప్ విలీనం లేనట్లే... న్యూఢిల్లీ: ఐడీఎఫ్సీ గ్రూప్, శ్రీరామ్ గ్రూప్ మధ్య విలీన ప్రతిపాదన అటకెక్కింది. కంపెనీల విలువను నిర్ణయించటం, దానికి తగ్గ మార్పిడి నిష్పత్తిని నిర్ణయించటంపై ఇరు వర్గాలు ఒక అంగీకారానికి రాలేకపోవడమే ఇందుకు కారణం. ‘విలీనానికి సంబంధించి ఐడీఎఫ్సీ గ్రూప్, శ్రీరామ్ గ్రూప్‌లు రెండూ ఇరువురికీ ఆమోదయోగ్యమైన షేర్ల మార్పిడి నిష్పత్తిని నిర్ణయించలేకపోయాయి‘ అని ఐడీఎఫ్సీ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. దీంతో ప్రతిపాదిత విలీనంపై చర్చలు నిలిపివేయాలని రెండు సంస్థలు నిర్ణయించినట్లు తెలిపింది. శ్రీరామ్ గ్రూప్‌లో ప్రధానంగా 3 లిస్టెడ్ సంస్థలు శ్రీరామ్ అసెట్ మేనేజ్మెంట్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఉన్నాయి. అలాగే జనరల్ ఇన్సూరెన్స్, జీవిత బీమా వ్యాపారం కూడా ఉంది. జులై 8 నాటి ప్రకటన ప్రకారం బీమా సంస్థలతో పాటు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఐడీఎఫ్సీకి అనుబంధ కంపెనీలుగా మారాల్సి ఉంది. ఇక శ్రీరామ్ సిటీ యూనియన్ని ఐడీఎఫ్‌సీలో పూర్తిగా విలీనం చేసి... అనుబంధ లిస్టెడ్ సంస్థగా ఇరు గ్రూప్‌ల నిర్వహణలో ఉన్నవ్యాపారాలు ఐడీఎఫ్సీ కిందికి వచ్చేవి. -
కలిస్తే లాభమెవరికి?
♦ ఐడీఎఫ్సీ– శ్రీరామ్ విలీనంపై భిన్న స్వరాలు ♦ విలీనం పట్టాలెక్కుతుందా అంటూ సందేహాలు ♦ సాఫీగా జరిగితే ఐడీఎఫ్సీ, ఐడీఎఫ్సీ బ్యాంకుకు మేలే! ఐడీఎఫ్సీ గ్రూపు, శ్రీరామ్ గ్రూపు కంపెనీల భారీ స్థాయి విలీనంపై చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో దీనివల్ల నిజంగా ఎవరికి ప్రయోజనం కలుగుతుందన్న విషయంలో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో నిజంగా ఈ విలీనం లాభాన్ని అందిస్తుందా, నష్టాలకు దారితీస్తుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ విలీనమే జరిగితే దేశంలో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ తర్వాత ఐడీఎఫ్సీ సైతం ఆర్థిక సేవల దిగ్గజ గ్రూపుగా అవతరిస్తుంది. ఐడీఎఫ్సీ, శ్రీరామ్ హోల్డింగ్ కంపెనీ అన్నింటికీ ప్రమోటింగ్ కంపెనీగా ఉంటుంది. ఐడీఎఫ్సీ బ్యాంకులో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ విలీనం కావొచ్చని భావిస్తున్నారు. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ సైతం విలీనం కావచ్చన్న అంచనాలు వెలువడగా, ఇది అనుబంధన కంపెనీగా కొనసాగి, తర్వాత కాలంలో విలీనం కావడం లేదా డీలిస్టింగ్ చేయడం ఏదో ఒకటి జరుగుతుందని, అయితే ఆర్బీఐ అనుమతి మేరకే ఈ చర్య ఉంటుందని భావిస్తున్నారు. ఇక శ్రీరామ్ గ్రూపు బీమా వ్యాపారాలు ఐడీఎఫ్‌సీలో విలీనం అవుతాయి. ఇవీ ప్రస్తుత అంచనాలు. ఐడీఎఫ్సీ బ్యాంకుకు లాభం ఎలా? పేరెంట్ కంపెనీ ఐడీఎఫ్సీ నుంచి ఐడీఎఫ్సీ బ్యాంకుగా అవరించినప్పటికీ మొత్తం రుణాల్లో ఇన్ఫ్రా రంగానికి ఇచ్చినవే 50 శాతానికిపైగా ఉన్నాయి. దీంతో ఈ ముద్ర నుంచి బయటకు రావాలన్నది ఐడీఎఫ్సీ బ్యాంకు ప్రయత్నం. ప్రస్తుతం బ్యాంకు రుణాల్లో రిటైల్ రంగ వాటా 24 శాతంగా ఉంది. కస్టమర్ల సంఖ్యను పెంచుకునే లక్ష్యంతో ఇటీవలి కాలంలో మైక్రో ఫైనాన్స్ సంస్థ గ్రామ విదియాల్‌ను కొనుగోలు చేసింది. ఇక, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్‌ను విలీనం చేసుకుంటే గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఆ సంస్థకు భారీ సంఖ్యలో ఉన్న చిన్న కస్టమర్లు ఐడీఎఫ్సీ బ్యాంకుకు సొంతం అవుతారు. చిన్న, మధ్య స్థాయి సంస్థల రుణాలు, ద్విచక్ర వాహనాల రుణాలు, బంగారం, గృహ రుణాల ద్వారా ఐడీఎఫ్సీ రిటైల్ రుణ విభాగంలో బలోపేతం కాగలదు. రుణ పుస్తకానికి తగ్గ స్థాయిలో డిపాజిట్లు పెంచుకోకపోతే శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్‌కు సంబంధించి ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్ నిబంధనలు అమలు దృష్ట్యా బ్యాంకు మార్జిన్లపై ప్రభావం పడుతుంది. విలీనం నిర్ణయం సులభమే అయినా, క్షేత్ర స్థాయిలో సర్దుకునేందుకు ఏళ్లు పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పిరమల్స్ వాటాలతో సమస్యలు? పిరమల్ గ్రూపునకు శ్రీరామ్ సిటీ గ్రూపు కంపెనీల్లో భారీ వాటాలున్నాయి. విలీనం తర్వాత ఐడీఎఫ్సీ బ్యాంకులో పిరమల్ గ్రూపునకు 5 శాతానికి పైగా వాటా దక్కుతుంది. ఈ నేపథ్యంలో విలీనంపై ఆర్బీఐ నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. ఈ డీల్ విలువ 2016–17 ఆర్థిక సంవత్సరం శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ పుస్తక విలువకు 3.5 రెట్ల విలువ స్థాయిలో జరగకుంటే మాత్రం ఆ సంస్థ వాటాదారులకు నష్టమే. వాటాదారులకు ఫలితం ఉందా? ‘‘నాలుగు లిస్టెడ్ కంపెనీల్లో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ వాటాదారులకు ప్రస్తుత స్థాయిలకు మించి మెరుగైన ప్రతిఫలం దక్కకపోవచ్చు. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్‌ను గనుక డీలిస్ట్ చేస్తే వాటాదారులకు అధిక విలువ దక్కొచ్చు. విలీన నిష్పత్తిని బట్టి ఐడీఎఫ్సీ బ్యాంకు షేరు ధర సమీప కాలంలో పెరగడం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇరు సంస్థల ఏకీకరణ సాఫీగా సాగి, డిపాజిట్లు రుణాల పరంగా అసమతుల్యత అంశాన్ని పరిష్కరించుకోగలిగితే వాటాదారులకు ప్రయోజనం ఉంటుంది. శ్రీరామ్ క్యాపిటల్ మాత్రం ఐడీఎఫ్సీ కిందకు రాకపోవచ్చు. ఇక శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ మార్కెట్ వాటా కేవలం 0.50 శాతమే. జనరల్ ఇన్సూరెన్స్ మార్కెట్ వాటా 1.44 శాతం. వీటివల్ల ఐడీఎఫ్సీకి పెద్దగా లాభించకున్నా ఆర్థిక సేవల పరంగా అతిపెద్ద సంస్థగా అవతరించేందుకు సాయపడగలవు. సరైన దిశలో విలీన ప్రక్రియ సాగితే హోల్డింగ్ కంపెనీగా ఐడీఎఫ్సీ వాటాదారులకు అధిక ప్రతిఫలం దక్కేందుకు అవకాశం ఉంది’’ అన్నది విశ్లేషకుల అంచనా. -
అదరగొట్టిన దిగ్గజాలు..
ఆటో మోటార్స్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ దిగ్గజాలు నేడు ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టాయి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ దిగ్గజం బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రస్తుతం ఆర్థికసంవత్సర సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా తన నికర లాభాలను 66 శాతం పెంచుకుని రూ.234 కోట్లగా నమోదుచేసింది. అగ్రికల్చర్, రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్‌లోని తమ సహకారమే లాభాల బాటకు తోడ్పడిందని పేర్కొంది. అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, కరువు వంటివాటితో బాధపడుతున్న రైతులకు ఊరట కలిగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.159 కోట్ల నుంచి రూ.737 కోట్లకు పెంచుకోగలిగామని కంపెనీ తెలిపింది. జంప్ చేసిన ఐషర్ మోటార్స్ వాణిజ్య వాహనాల ఉత్పత్తి సంస్థ ఐషర్ మోటార్స్ లాభాల్లో జంప్ చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో కన్సాలిడేటెడ్ నికర లాభాలు 45.19శాతం ఎగిసి, రూ.413.16కోట్లగా రికార్డు చేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.284.56కోట్లగా ఉన్నాయి. క్వార్టర్ రివ్యూ సందర్భంగా కంపెనీ కన్సాలిడేటెడ్ ఇన్కమ్ రూ.1,981.01కోట్లకు పెరిగినట్టు బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. గతేడాది కంటే కంపెనీ 34.9 శాతం వృద్ధి నమోదుచేశామని ఐషర్ మోటార్స్ ఎండీ, సీఈవో సిద్ధార్థ లాల్ తెలిపారు. నిర్వహణల నుంచి ఈ త్రైమాసికంలో అత్యధిక ఆదాయాల్లో ఆర్జించామని పేర్కొన్నారు. తమ టూవీలర్ విభాగం రాయల్ ఫీల్డ్ 30.8 శాతం వృద్ధిని సాధించినట్టు చెప్పారు. నెస్లే రెండింతలు జంప్ ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం నెస్లే ఇండియా కన్సాలిడేటెడ్ నికర లాభాలూ రెండింతలు జంప్ అయ్యాయి. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభాలు రూ.269.39 కోట్లగా నమోదైనట్టు పేర్కొంది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.124.20 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జించింది. నికర విక్రయాలు 35.13 శాతం ఎగిసి, రూ.2,346.18కోట్లగా రికార్డైనట్టు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. కంపెనీ లాంచ్ చేసిన 25 పైగా కొత్త ప్రొడక్ట్‌లతో లాభాల వృద్ధికి బాటలు వేశామని నెస్లే ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణ్ తెలిపారు. మ్యాగీ ఉత్పత్తులతో మళ్లీ ఇన్స్టాంట్ న్యూడిల్స్ కేటగిరీలో పూర్తి ఆధిపత్య స్థానానికి వచ్చేశామని పేర్కొన్నారు. నష్టాల్లోంచి లాభాలోకి వచ్చిన ఐడీఎఫ్సీ దేశీయ లీడింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐడీఎఫ్సీ నష్టాల్లోంచి లాభాల్లోకి పయనించింది. శుక్రవారం వెలువరించిన ఫలితాల్లో కంపెనీ రూ.281.79 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాలను ఆర్జించినట్టు పేర్కొంది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.1,468.83కోట్ల నికర నష్టాలను నమోదుచేసింది. గ్రూప్ మొత్తం ఆదాయం ఈ క్వార్టర్లో రూ.2,704.13 కోట్లగా ఉన్నట్టు బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. బజాజ్ ఆటో@7 శాతం ఇటు టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో సైతం రెండో క్వార్టర్లో 6.7 శాతం వృద్ధిని నమోదుచేసి రూ.1,122 కోట్ల లాభాలను ఆర్జించినట్టు తెలిపింది. ఇతరాత్ర ఆదాయాలు లాభాలకు వెన్నుదన్నుగా నిలిచినట్టు కంపెనీ పేర్కొంది. అయితే ఈ క్వార్టర్లో రెవెన్యూలు స్వల్పంగా 0.4 శాతం మాత్రమే పెరిగి రూ.6,432కోట్లగా నమోదయ్యాయి. నెమ్మదించిన సేల్స్ వాల్యుమ్ గ్రోత్తో రెవెన్యూలు స్వల్పంగా నమోదైనట్టు కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో 10.3 లక్షల యూనిట్ల విక్రయాలు జరుపగా.. గతేడాది కంపెనీ 10.56 లక్షల యూనిట్లను అమ్మింది. నైజీరియా, ఈజిప్ట్ వంటి ఎగుమతుల మార్కెట్లలో విక్రయాలు పడిపోయినట్టు బజాజ్ ఆటో తెలిపింది. -
వృద్ధి 7.7 శాతం: ఐడీఎఫ్సీ
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.7% నమోదవుతుందని దేశీయ బ్రోకరేజ్ సంస్థ ఐడీఎఫ్సీ అంచనా వేసింది. ఇందుకు తగిన పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయని ఐడీఎఫ్సీ గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ ఇంద్రనీల్ పన్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్ని సానుకూల ఆర్థిక పరిస్థితులు గత 10 ఏళ్లలో ఎన్నడూ లేవన్నారు. వర్షాభావ పరిస్థితులు, సంస్కరణల నత్తనడక వంటి అంశాలను కారణంగా చూపుతూ రేటింగ్ సంస్థ మూడీస్ తన అంచనాలను 7.5 శాతం నుంచి 7 శాతానికి తగ్గించడంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, తమ సంస్థ మూడీస్ రీతిలో విశ్లేషించడంలేదని అన్నారు. సానుకూలతలు ఇవీ... తగిన ఆహార నిల్వలు, భారీ డిమాండ్ వంటి అంశాలు దేశాభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తాయన్నది తమ అంచనా అని పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం 4.5% నుంచి 5% శ్రేణిలో ఉండే అవకాశం ఉన్నందున, మార్చి నాటికి ఆర్బీఐ అరశాతం రెపో తగ్గించే అవకాశం ఉందని విశ్లేషించారు. క్రూడ్ ధరలు కనిష్ట స్థాయిల్లో ఉండడం భారత్‌కు ఆర్థికంగా కలిసి వస్తున్న మంచి అవకాశమని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు డాలర్ మారకంలో రూపాయి 66 స్థాయిలో ఉండవచ్చన్నది అంచనా. మోడీ ప్రభుత్వం సంస్కరణ లకు కట్టుబడి ఉందన్న విషయం గమనించదగిందని పేర్కొన్నారు. -
ఐడీఎఫ్సీకి బ్యాంకింగ్ లెసైన్సు జారీ
న్యూఢిల్లీ : కొత్తగా బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు రిజర్వ్ బ్యాంక్ లెసైన్సు మంజూరు చేసినట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ సంస్థ ఐడీఎఫ్సీ శుక్రవారం తెలిపింది. ముందుగా 20 శాఖలతో అక్టోబర్ 1 నుంచి బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో మొత్తం 25 సంస్థలు పోటీపడగా ఐడీఎఫ్సీ, బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంకింగ్ లెసైన్సులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. బంధన్‌కు ఆర్బీఐ గత నెల అనుమతులు మంజూరు చేసింది. తాజాగా బ్యాంకింగ్ లెసైన్సు లభించిన దరిమిలా ఐడీఎఫ్సీ షేర్లు శుక్రవారం బీఎస్ఈలో 2.58% పెరిగి రూ. 157.30 వద్ద ముగిశాయి. -
అక్టోబర్ 1 నుంచి ఐడీఎఫ్సీ బ్యాంక్
చెన్నై: కొత్తగా ఏర్పాటు చేస్తున్న బ్యాంక్ కార్యకలాపాలు అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కాగలవని ఇన్ఫ్రా రంగానికి రుణాలిచ్చే సంస్థ ఐడీఎఫ్సీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీవ్ లాల్ వెల్లడించారు. ముందుగా 20 శాఖలతో ప్రారంభిస్తామని, ఆ తర్వాత స్థూల ఆర్థిక పరిస్థితులను బట్టి క్రమక్రమంగా విస్తరిస్తామని ఆయన వివరించారు. మరోవైపు, కొత్త బ్యాంకు ఏర్పాటు ప్రతిపాదనకు కంపెనీ షేర్హోల్డర్లు ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించి సంస్థ కార్యకలాపాలను విభజించే ప్రణాళికకు రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. గతేడాది ఏప్రిల్‌లో ఐడీఎఫ్సీ.. బ్యాంకింగ్ లెసైన్సు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం తమ ఫైనాన్సింగ్ కార్యకలాపాలను విడగొట్టి ఐడీఎఫ్సీ బ్యాంకును ఏర్పాటు చేసేందుకు గత నెల షేర్‌హోల్డర్ల నుంచి అనుమతి కోరింది. ఐడీఎఫ్సీ షేర్హోల్డర్లకు ప్రతిపాదిత ఐడీఎఫ్సీ బ్యాంకులో కూడా షేర్లు లభిస్తాయి. ఇలా ఇప్పటికే ఉన్న షేర్హోల్డర్లకు బ్యాంకు షేర్లను కేటాయిస్తున్నందువల్ల.. కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలోగా లిస్టింగ్ చేయాలన్న నిబంధనను కూడా ఐడీఎఫ్సీ పాటించినట్లవుతుంది. -
మొబైల్ బ్యాంకింగ్‌లోకి యునినార్..
ఆగస్టుకల్లా సేవలు ప్రారంభం - 4జీ సర్వీసుల్లోకి వస్తున్నాం - సాక్షితో యునినార్ సీఈవో వివేక్ సూద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ యునినార్ మొబైల్ బ్యాంకింగ్ సేవల్లోకి అడుగు పెడుతోంది. యునినార్ ప్రమోటర్ అయిన టెలినార్ ఇటీవలే ఫైనాన్స్ కంపెనీ ఐడీఎఫ్‌సీతో కలిసి పేమెంట్స్ బ్యాంకింగ్ లెసైన్స్ కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్బీఐ నుంచి అనుమతులు, కంపెనీ పరంగా సాంకేతిక ఏర్పాట్లు ముగియడానికి నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశం ఉందని యునినార్ సీఈవో వివేక్ సూద్ తెలిపారు. యునినార్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆగస్టుకల్లా మొబైల్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. టెలినార్ ఇతర దేశాల్లో అందిస్తున్న సేవలనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోసహా దేశంలో ఆరు సర్కిళ్లలో పరిచయం చేస్తామని వెల్లడించారు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మొబైల్ ఫోన్ నుంచే బిల్లులు చెల్లించొచ్చు. ఆన్లైన్లో వస్తువులను కొనుక్కోవచ్చు. దేశంలో ఎక్కడి నుంచైనా మొబైల్ ఫోన్‌కుగానీ, బ్యాంకు ఖాతాకుగానీ నగదు బదిలీ చేయవచ్చు. టెలినార్ అనుభవంతో: మొబైల్ బ్యాంకింగ్ రంగంలో టెలినార్‌కు అపార అనుభవం ఉందని వివేక్ సూద్ తెలిపారు. ‘సైబీరియాలో టెలినార్ ఒక బ్యాంకును నిర్వహిస్తోంది. హంగేరీలో మొబైల్ చెల్లింపులు, మలేసియా, థాయిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో మొబైల్ బ్యాంకింగ్ సేవలందిస్తోంది. టెలినార్‌కు ఉన్న అనుభవం నేపథ్యంలో ఆర్బీఐ నుంచి లెసైన్స్ త్వరలోనే వస్తుందని విశ్వసిస్తున్నాం. ఈ సేవల కోసం భారీగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. సబ్సే సస్తా పేరుతో తక్కువ ధరకే 2జీ సేవలను అందించడంతో సామాన్యులకు చేరువయ్యామన్నారు. కస్టమర్లలో అత్యధికులకు బ్యాంకు ఖాతాలు లేవని, ఉపాధికోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిన వారందరూ మొబైల్ బ్యాంకింగ్‌తో ప్రయోజనం పొందుతారని తెలిపారు. స్పెక్ట్రం వేలంలో: యునినార్‌కు ప్రస్తుతం ఉన్న స్పెక్ట్రం 4జీ సేవలు అందించేందుకు సరిపోదని, 4జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొంటామని సీఈవో చెప్పారు. ఆరు సర్కిళ్లలో ఈ సేవలను ప్రవేశపెడతామని పేర్కొన్నారు. విస్తరణకు ఈ ఏడాది రూ.500 కోట్ల దాకా వ్యయం చేస్తున్నట్టు తెలిపారు. యునినార్‌కు తెలుగు రాష్ల్రాల్లో 45 లక్షల మంది కస్టమర్లున్నారు. వీరిలో 29% మంది ఇంటర్నెట్ వాడుతున్నారని సర్కిల్ బిజినెస్ హెడ్ సతీష్ కన్నన్ తెలిపారు. ఆరు సర్కిళ్లలో 2014లో 5 వేల టవర్లు ఏర్పాటైతే, వీటిలో 624 టవర్లు ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌కు కేటాయించారని వివరించారు. కాగా, భారత్‌లో యునినార్‌కు 4.2 కోట్ల మంది యూజర్లున్నారు. 2015లో ఈ సంఖ్య 5 కోట్ల కు చేరుకుంటుందని కంపెనీ విశ్వసిస్తోంది. కంపెనీ ఇప్పటి వరకు రూ.18,000 కోట్లు ఖర్చు చేసింది. -
పూర్తి స్థాయి బ్యాంక్ హోదానే కోరుతున్న ఇండియా పోస్ట్!
ముంబై: ఇండియా పోస్ట్ పూర్తిస్థాయి బ్యాంక్ (యూనివర్సల్ బ్యాంక్) హోదానే కోరుకుంటోందని మహారాష్ట్ర సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ప్రదీప్ కుమార్ బిషోయ్ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఇండియా పోస్ట్ పూర్తిస్థాయి బ్యాంక్ హోదానే కోరుకుంటున్నప్పటికీ, తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ అంశం మాజీ క్యాబినెట్ సెక్రటరీ టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ పరిశీలనలో ఉందని సైతం ఆయన అన్నారు. ఇండియా పోస్ట్‌కు కేవలం పేమెంట్ బ్యాంక్ హోదా ఇచ్చే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో బిషోయ్ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. -
6 రోజుల తర్వాత నష్టాలు
ఆరు రోజుల వరుస లాభాల తరువాత మార్కెట్లు మళ్లీ నష్టపోయాయి. సెన్సెక్స్ 106 పాయింట్లు క్షీణించి 26,314 వద్ద ముగిసింది. గత ఆరు రోజుల్లో 1,091 పాయింట్లు లాభపడ్డ కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టినట్లు నిపుణులు విశ్లేషించారు. ఇక నిఫ్టీ సైతం 22 పాయింట్లు తగ్గి 7,875 వద్ద నిలిచింది. మంగళవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ 26,530 వద్ద, నిఫ్టీ 7,918 వద్ద కొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. దేనా బ్యాంక్, ఓబీసీ డీలా కస్టమర్ల ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్ము రూ. 439 కోట్లను దుర్వినియోగ పరిచాయన్న ఆరోపణలతో దేనా బ్యాంక్(రూ. 256 కోట్లు), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(రూ. 180 కోట్లు)లపై ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించిందన్న వార్తలు ఈ బ్యాంక్ షేర్లను పడగొట్టాయి. దేనా బ్యాంక్ 5%, ఓబీసీ 3.5% చొప్పున పతనమయ్యాయి. ఫార్మా, స్మాల్‌క్యాప్ షేర్ల హవా మార్కెట్ నష్టపోయినప్పటికీ బీఎస్ఈలో హెల్త్‌కేర్ ఇండెక్స్ 3% ఎగసింది. మార్కెట్ల ట్రెండ్‌కు విరుద్ధంగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 1% బలపడింది. -
ఇది స్ప్రింట్ కాదు.. మారథాన్
ముంబై: కొత్త బ్యాంకు కార్యకలాపాల నిర్వహణ అనేది మారథాన్ లాంటిదని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సంస్థ ఐడీఎఫ్సీ చైర్మన్ రాజీవ్ లాల్ వ్యాఖ్యానించారు. తొలి మూడేళ్లూ నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యతనిస్తామని, ఆ తర్వాతే వృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు. మైక్రోఫైనాన్స్ సంస్థ బంధన్‌తో పాటు కొత్తగా బ్యాంకు లెసైన్సు దక్కించుకున్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘ఇది స్ప్రింట్ (వేగంగా పరుగెత్తడం) కాదు.. మారథాన్ (ఎక్కువదూరం పరుగెత్తడం)లాంటిది. ఇవాళ మొదలెడితే కనీసం ఆరేళ్ల నుంచి తొమ్మిదేళ్ల దాకా ఈ ప్రక్రియ కొనసాగుతుంది’ అని బ్యాంకింగ్ కార్యకలపాల గురించి లాల్ చెప్పారు. తొలి మూడేళ్లలో నిలదొక్కుకోవడం, ప్రయోగాలు చేయడం, నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహణ గురించి తెలుసుకోవడంతోనే సరిపోతుందని లాల్ తెలిపారు. ఫలితంగా తొలి మూడేళ్లు వ్యాపార వృద్ధిపై పెద్దగా దృష్టి పెట్టడానికి అవకాశం లభించదన్నారు. అందుకే, తొలి మూడేళ్లు తమ రుణాల మంజూరు పద్దులు తక్కువగా ఉన్నా పెద్దగా కలవరపడాల్సిన అవసరం లేదని లాల్ పేర్కొన్నారు. ఏదేమైనా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), నిర్దేశిత ద్రవ్య నిష్పత్తి (ఎస్ఎల్ఆర్) లాంటి అంశాల వల్ల తమ వ్యాపార పరిమాణం ప్రస్తుత స్థాయికన్నా మరింత ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. వ్యూహమిది.. తొలి మూడేళ్లలో వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యమిస్తామని లాల్ చెప్పారు. మూడేళ్లు ముగిసిన తర్వాత అప్పటికే సాధించిన వృద్ధిని నిలబెట్టుకోవడం, మరింత వృద్ధిని సాధించడంపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. ఆరో సంవత్సరం తర్వాత నుంచి వేగవంతమైన వృద్ధి సాధన మొదలు కాగలదన్నారు. ప్రారంభంలో 24-36 నెలల పాటు బ్యాంకు లాభదాయకతపై ఒత్తిడి ఉంటుందని లాల్ తెలిపారు. అయితే, బ్యాంకు నిలదొక్కుకున్నాక, అవసరమైన శాఖలు, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ..ప్రక్రియలను ఏర్పాటు చేసుకున్న తర్వాత నుంచి లాభదాయకత మెల్లిగా మెరుగుపడుతుంటుందని చెప్పారు. రిక్రూట్మెంట్.. కొత్త బ్యాంకులో మానవ వనరులకు సంబంధించి.. ఇప్పటికే ఇద్దరు-ముగ్గురు సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లను తీసుకోవడం జరిగిందని లాల్ వివరించారు. మిగతా వారిని తీసుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ప్రస్తుత, కొత్త బృందాలు కలిసి బ్యాంకును నిర్వహిస్తాయని ఆయన చెప్పారు. తాను, ఐడీఎఫ్సీ ఎండీ విక్రమ్ లిమాయే .. ఇటు బ్యాంకును, అటు మిగతా గ్రూప్‌ను పర్యవేక్షిస్తామన్నారు. బ్యాంకు సీఈవోని ఐడీఎఫ్సీ నుంచే ఎంపిక చేస్తామని, పేరు త్వరలో వెల్లడిస్తామని లాల్ పేర్కొన్నారు. ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ ఏర్పాటు.. ప్రస్తుతం ఐడీఎఫ్సీకి నాలుగు కార్యాలయాలు ఉన్నాయని, వీటిలో ఒకదాన్ని హెడ్‌క్వార్టర్స్‌గా ఉంచుకుని మిగతా మూడింటిని బ్యాంకు శాఖల కింద మార్చాలని యోచిస్తున్నామని లాల్ వివరించారు. బ్యాంకింగ్ సంస్థగా రూపాంతరం చెందే ప్రక్రియను వివరిస్తూ.. ఇందుకోసం నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ (ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ)ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్త బ్యాంకు సహా ప్రస్తుత ఉన్న మూడు అనుబంధ సంస్థలకి (ఐడీఎఫ్సీ ఆల్టర్నేటివ్, ఐడీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఐడీఎఫ్సీ ఏఎంసీ) ఇది హోల్డింగ్ సంస్థగా ఉంటుందని లాల్ తెలిపారు. ఎన్వోఎఫ్హెచ్సీకి బ్యాంకు నాలుగో అనుబంధ సంస్థగా ఉంటుందని, దీన్ని తొలి రోజునే లిస్టింగ్ చేస్తామని చెప్పారు. ఇన్ఫ్రా రంగానికి రుణాలిచ్చే సంస్థ నుంచి బ్యాంకుగా రూపాంతరం చెందే క్రమంలో ప్రస్తుతమున్న ఐడీఎఫ్సీ షేర్హోల్డర్లకు కొంత మేర లిస్టెడ్ బ్యాంకులో నేరుగా వాటాలు ఇవ్వడం జరుగుతుందని లాల్ పేర్కొన్నారు. ఐడీఎఫ్‌సీలో 52-53 శాతం దాకా విదేశీ ప్రమోటర్ల వాటాలు ఉండగా.. వీటిని నిబంధనలకు అనుగుణంగా క్రమంగా 50 శాతం దిగువకు తెస్తామని లాల్ చెప్పారు. ఇందుకోసం ప్రిఫరెన్షియల్ షేర్ల అలాట్మెంట్ విధానాన్ని పాటిస్తామన్నారు. అటు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్ఎఫ్సీ) లెసైన్సు కోసం కూడా ఐడీఎఫ్సీ దరఖాస్తు చేసిందని, వచ్చే రెండు-మూడు నెలల్లో దీన్ని దక్కించుకోగలదని లాల్ తెలిపారు. లెసైన్సు వచ్చాకా హౌసింగ్ లోన్స్ మంజూరు చేయడం ప్రారంభిస్తామని, ఆ తర్వాత వాటిని క్రమంగా బ్యాంకునకు బదలాయిస్తామన్నారు. -
కొత్తా బ్యాంకులండీ..!
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ద్వారాలు తెరిచింది. దేశంలో దశాబ్దకాలం తర్వాత మళ్లీ తొలిసారిగా బ్యాంకింగ్ లెసైన్స్‌లకు రెండు కంపెనీలను ఎంపికచేసింది. ప్రభుత్వ సంస్థలు ప్రమోట్‌చేసిన ఇన్ఫ్రా ఫైనాన్స్ కంపెనీ.. ఐడీఎఫ్సీ, కోల్‌కతాకు చెందిన మైక్రోఫైనాన్స్ సంస్థ బంధన్‌లకు లెసైన్స్‌లు ఇచ్చేందుకు ఆర్బీఐ బుధవారం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. లెసైన్స్‌ల జారీకి సంబంధించి ఆర్బీఐ ముందుకెళ్లొచ్చంటూ ఎన్నికల సంఘం(ఈసీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మర్నాడే ఈ రెండు కంపెనీల పేర్లను ప్రకటించడం గమనార్హం. ఆర్బీఐ లెసైన్స్ అనుమతి గడువు 18 నెలలు ఉంటుంది. ఈలోగా ఎంపికైన రెండు సంస్థలు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా కొత్తబ్యాంకుల ఏర్పాటుకు తగిన కసరత్తు అంతా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిశీలించాక పూర్తిస్థాయి(రెగ్యులర్) లెసైన్స్‌లను ఆర్బీఐ జారీచేస్తుంది. ఆతర్వాతే బ్యాంకింగ్ సేవలను ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. కాగా, ఇప్పుడు లెసైన్స్‌లు రాని ఇతర దరఖాస్తుదారులు భవిష్యత్తులో విడుదల చేసే కొత్త మార్గదర్శకాల తర్వాత మళ్లీ లెసైన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. మొత్తంమీద ఆర్బీఐ లెసైన్స్‌లు దక్కిన రెండు సంస్థలూ నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లే కావడం విశేషం. ఇండియా పోస్ట్‌కూ అవకాశం... లెసైన్స్‌ల దరఖాస్తులను మదింపు చేసిన బిమల్ జలాన్ నేతృత్వంలోని అత్యున్నతస్థాయి కమిటీ.. ప్రభుత్వరంగంలోని ఇండియా పోస్ట్‌కు కూడా లెసైన్స్‌కు సిఫార్సు చేసింది. అయితే, ప్రభుత్వంతో సంప్రదింపుల ద్వారా ప్రత్యేకంగా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. దీనికి ఆర్బీఐ కూడా ఓకే చెప్పింది. అంటే ఇండియా పోస్ట్‌కు కూడా రానున్నరోజుల్లో లెసైన్స్ లభించే అవకాశాలు ఉన్నట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. గతేడాది జూలైలో ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా.. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన మొత్తం 27 కంపెనీలు ముందుకొచ్చాయి. అయితే, ఆతర్వాత టాటా, వీడియోకాన్ గ్రూప్‌లు రేసు నుంచి వైదొలగడంతో 25 కంపెనీల దరఖాస్తులు మాత్రమే ఆర్బీఐ తుది పరిశీలనలో నిలిచాయి. వీటిలో అనిల్ అంబానీ గ్రూప్, ఆదిత్యబిర్లా గ్రూప్, బజాజ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ క్యాపిటల్, ఎల్అండ్టీ ఫైనాన్స్ తదితర దిగ్గజాలు పోటీపడ్డాయి. దాదాపు 4-5 వరకూ కొత్త లెసైన్స్‌లు ఇవ్వొచ్చని ఎక్కువమంది పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే, కేవలం రెండు లెసైన్స్‌లకే(ఇండియా పోస్ట్‌తో కలిపితే మూడు) ఆర్బీఐ అనుమతించడం విశేషం. ఆర్బీఐ తాజా నిర్ణయం దీర్ఘకాలంతర్వాత వెలువడిందని... దేశంలో మరిన్ని బ్యాంక్ శాఖల ఏర్పాటుకు దోహదం చేస్తుందని ఆర్థిక శాఖకు చెందిన ఫైనాన్షియల్ సేవల విభాగం కార్యదర్శి జీఎస్ సంధు వ్యాఖ్యానించారు. కొత్త బ్యాంకుల ఏర్పాటువల్ల అందరికీ బ్యాంకింగ్ సేవల(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) విస్తరణకు బాటలు వేస్తుందని ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామమని, ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగానికి మేలు చేకూర్చే నిర్ణయంగా దీన్ని ఆయన అభివర్ణించారు. సరిగ్గా పదేళ్లకు.... చిట్టచివరిసారిగా 2003-04లో ఆర్బీఐ యస్‌బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్‌లకు లెసైన్స్‌లు మంజూరు చేసింది. ఆతర్వాత మళ్లీ పదేళ్లకు మరో రెండు లెసైన్స్‌లు జారీ చేయడం గమనార్హం. ప్రస్తుత లెసైన్స్‌ల ప్రక్రియ 2010-11లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సారథ్యంలో మొదలైంది. మూడేళ్లతర్వాత ఇది సాకారమైంది. ప్రస్తుతం దేశంలో 27 ప్రభుత్వ రంగ, 22 ప్రైవేటు రంగ బ్యాంకులు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. వీటితోపాటు 56 రీజినల్ రూరల్ బ్యాంక్(ఆర్ఆర్బీ)లు, 41 విదేశీ బ్యాంకులు దేశంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. మాకు బ్యాంకింగ్ లెసైన్స్ లభించడాన్ని మైక్రోఫైనాన్స్ రంగానికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నాం. ఫైనాన్షియల్ సేవల కల్పనలో మారుమూల ప్రాంతాలకూ వెళ్లేలా మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. ఇక నుంచి పేదవాళ్లకు పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ సేవలను అందించేందుకు మాకు అవకాశం లభిస్తుంది. మాకు ఇప్పటికే రూ.1,100 కోట్ల పెయిడ్ అప్ క్యాపిటల్ ఉంది(ఆర్బీఐ నిబంధన ప్రకారం రూ.500 కోట్లు ఉండాలి). మేం ఎక్కువగా బ్యాంకింగ్ సేవలు లేని గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టిపెట్టాం. ఇప్పుడు మేం నేరుగా బ్యాంకింగ్‌లోకి వస్తుండటం వల్ల మాకు పెద్దగా పోటీ కూడా ఉండదు. - చంద్రశేఖర్ ఘోష్, బంధన్ చైర్మన్ లెసైన్స్ ఎట్టకేలకు లభించడంతో ఇక మేం పూర్తిస్థాయి బ్యాంకింగ్ సేవల కల్పన కోసం మరింత కష్టపడేందుకు సమాయత్తమవుతున్నాం. మేం యూనివర్సల్ లెసైన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. దీనికి అనుగుణంగానే యూనివర్సల్ బ్యాంక్ ఏర్పాటుపై మేం దృష్టిపెడతాం. ఇప్పటికే 21 శాతం టైర్-1 మూలధనం మాకుంది. దీనిప్రకారం చూస్తే దేశంలో అత్యుత్తమ మూలధనంతో ఏర్పాటవుతున్న తొలి బ్యాంక్ మాదే అవుతుంది. నేటి(ఏప్రిల్ 3) నుంచే మా వ్యాపార పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తున్నాం. ఇప్పటికే మేం బ్యాంకింగ్ సేవల కోసం సవివర ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. - రాజీవ్ లాల్, ఐడీఎఫ్సీ చైర్మన్ -
2013 ముగింపు సానుకూలం
పాజిటివ్ ముగింపుతో 2013 సంవత్సరానికి స్టాక్ మార్కెట్ వీడ్కోలు పలికింది. మంగళవారం మందకొడిగా జరిగిన ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 27 పాయింట్ల స్వల్పలాభంతో 21,170 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 6,304 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్ల మద్దతుతో ఈ ఏడాదిలో సెన్సెక్స్ 9 శాతం ర్యాలీ జరపగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 6.5 శాతం ఎగిసింది. సంస్థాగత ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలు మందగించడంతో తాజా ట్రేడింగ్ సెషన్లో హెవీవెయిట్ షేర్లు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. టాటా పవర్, ఐడీఎఫ్సీ, జేపీ అసోసియేట్స్ షేర్లు 3-4 శాతం మధ్య పెరగ్గా, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, విప్రోలు 1-2 శాతం మధ్య ఎగిసాయి. అయితే మిడ్‌క్యాప్ షేర్లు పెద్ద ర్యాలీ జరిపాయి. అమెరికా టైర్ల కంపెనీ కూపర్ డీల్ నుంచి వైదొలిగిన ఫలితంగా అపోలో టైర్స్ భారీ ట్రేడింగ్ పరిమాణంతో 6 శాతం ర్యాలీ జరిపింది. నగదు విభాగంలో ట్రేడయ్యే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో యూబీ హోల్డింగ్స్, టీసీఐ, మీర్జా ఇంటర్నేషనల్, తాజ్ జీవీకే, డెన్ నెట్వర్క్స్, రిలాక్సో ఫుట్‌వేర్ షేర్లు 10-20 శాతం మధ్య పెరిగాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 309 కోట్ల నికరపెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 280 కోట్ల నికర అమ్మకాలు జరిపాయి. ఐటీ ఇండెక్స్ టాప్ : 2013లో ప్రధాన సూచీలను అధిగమించి బీఎస్ఈ ఐటీ సూచి భారీగా 59 శాతం పెరిగింది. ఫార్మా ఇండెక్స్ 22 శాతం పెరుగుదలతో ద్వితీయస్థానాన్ని ఆక్రమించగా, ఆటో, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్‌లు 7-11 శాతం మేర పెరిగాయి. బీఎస్ఈ రియల్టీ సూచీ 32 శాతం పతనమయ్యింది. బ్యాంకింగ్, మెటల్ ఇండెక్స్‌లు 9 శాతం చొప్పున క్షీణించాయి. బ్లూచిప్ షేర్లతో కూడిన ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు పెరిగినా, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు మాత్రం ఈ ఏడాది విలవిలలాడాయి. జపాన్ నికాయ్ రికార్డు : అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి విడుదల చేసిన భారీ నిధుల ఫలితాన్ని అన్ని దేశాల సూచీలు అందిపుచ్చుకున్నా, జపాన్ నికాయ్ ఇండెక్స్ అన్నింటికంటే ఎక్కువగా 57 శాతం ర్యాలీ జరిపింది. 2013లో అమెరికా డోజోన్స్, ఎస్ అండ్ పీ, నాస్‌డాక్‌లు మూడూ 25 శాతంపైగా పెరిగాయి. 1996వ సంవత్సరం తర్వాత డో, ఎస్ అండ్ పీలు ఒకే ఏడాది ఇంత భారీగా పెరగడం ఇదే ప్రధమం. ప్రధాన యూరప్ దేశాల ఇండెక్స్‌లు 12-35 శాతం మధ్య పెరిగాయి. వర్థమాన దేశాల సూచీల్లో అత్యధికంగా అర్జింటీనా సూచీ 89 శాతం ర్యాలీ చేసింది. నిఫ్టీలో లాంగ్ బిల్డప్ : కొద్ది రోజుల నుంచి చిన్న శ్రేణికి పరిమితమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ కొత్త సంవత్సరం తొలిరోజుల్లో ర్యాలీ జరపవచ్చన్న అంచనాలతో మంగళవారం నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో లాంగ్ బిల్డప్ జరిగింది. స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం క్రితంరోజుకంటే 7 పాయింట్లు పెరగడం, 6,300 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరగడం వంటివి లాంగ్ బిల్డప్‌ను సూచిస్తున్నాయి. నిఫ్టీ 6,304 వద్ద ముగియగా, ఫ్యూచర్ 51 పాయింట్ల ప్రీమియంతో 6,355 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. క్రితం రోజున ఈ ప్రీమియం 44 పాయింట్లే. ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 4.94 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 1.97 కోట్ల షేర్లకు పెరిగింది. 6,300 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరగడంతో ఈ పుట్ ఆప్షన్ ఓఐలో 3.59 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇదే స్ట్రయిక్ కాల్ ఆప్షన్ నుంచి 19 వేల షేర్లు కట్ అయ్యాయి. 6,300 స్థాయిపైన స్థిరపడితే నిఫ్టీ క్రమేపీ ర్యాలీ జరపవచ్చని, ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే బలహీనపడవచ్చని ఈ డేటా సూచిస్తున్నది. -
ఐడీఎఫ్సీ ఇన్ఫ్రా ఫండ్‌కు అనుమతి
న్యూఢిల్లీ: ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏర్పాటు చేయడానికి ఐడీఎఫ్సీకి ప్రభుత్వం బుధవారం అనుమతినిచ్చింది. రూ.5,500 కోట్ల కార్పస్‌తో ఐడీఎఫ్సీ ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటి అనుమతిచ్చింది. అల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఏఐఎఫ్) కేటగిరి వన్‌గా ఈ ఫండ్ సెబీ వద్ద నమోదవుతుంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి ఈ ఫండ్ రూ.5,500 కోట్ల వరకూ నిధులు సమీకరించుకోవచ్చు. ఇలా సేకరించిన నిధులను ఇంధన, రవాణా, విమానయానం, టెలికాం మౌలిక సదుపాయాలు, ఇతర పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల కోసం వినియోగిస్తారు.