ముంబై: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో మాతృ సంస్థ ఐడీఎఫ్‌సీ లిమిటెడ్ విలీనం కానుంది. పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా లావాదేవీని చేపట్టనున్నారు. ఇందుకు రెండు సంస్థల బోర్డులూ ఆమోదించినట్లు ఐడీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు తాజాగా వెల్లడించాయి.
విలీన ప్రతిపాదన ప్రకారం ఐడీఎఫ్‌సీ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 100 షేర్లకుగాను 155 ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు షేర్లు జారీ చేయనున్నారు. ప్రధానంగా మౌలిక రంగానికి రుణాలందించే ఐడీఎఫ్‌సీ 1997లో ఆవిర్భవించింది.
2015లో ఐసీఐసీఐ, ఐడీబీఐ తరహాలో బ్యాంకింగ్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. 2018 డిసెంబర్‌లో క్యాపిటల్ ఫస్ట్‌ను టేకోవర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment