![Grand Welcome For Neeraj Chopra His Own Village Won Gold Tokyo Olympics - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/17/Neeraj.gif.webp?itok=qa8a0aI-)
పానిపట్: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు హర్యానా పానిపట్‌లోని తన స్వగ్రామం సమల్ఖాలో ఘన స్వాగతం లభించింది. దారిపొడవునా అతన్ని అభినందిస్తూ గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో దేశానికి స్వర్ణం అందించిన వ్యక్తిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం అందుకున్నాడు.
తన స్వగ్రామంలో గ్రామస్తులు చూపిన ప్రేమపై నీరజ్ సంతోషం వ్యక్తం చేశాడు. మీ నుంచి ఇంత ప్రేమను పొందడం చాలా సంతోషంగా ఉంది. జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నాకు రానున్న కాలంలోనూ ఇదే తరహా మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నా. దేశానికి మరిన్ని పతకాలు తీసుకొచ్చేందుకు మరింత కష్టపడతా అంటూ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment