grand welcome
-
పల్లెటూరి చిన్నోడు.. నటనలో మెప్పించాడు
అల్లూరి సీతారామరాజు: కృషి, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం వెరసి ఓ పల్లెటూరి చిన్నోడు... ‘కోర్ట్’లో మెప్పించి అనేక మంది ప్రశంసలు అందుకుంటున్నాడు. చిన్న చిన్న డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేసే ఆ చిన్నోడు డ్యాన్స్ పట్ల మక్కువతో తనను తాను తీర్చిదిద్దుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. 19 ఏళ్లకే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ‘కోర్ట్’ సినిమా ద్వారా హీరోగా మారి బంపర్ హిట్ కొట్టాడు. ఆయన ఇటీవల తన స్వగ్రామమైన కూనవరం వచ్చారు. ఆయనకు స్థానికులు అపూర్వ స్వాగతం తెలిపి ఘనంగా సన్మానించారు. చింతూరు ఏజెన్సీ డివిజన్ కూనవరం గ్రామానికి చెందిన రోషన్ అంచెలంచెలుగా ఎదిగిన తీరును తెలుసుకుందాం... ఇటీవల విడుదలైన కోర్ట్ సినిమా హిట్ కావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. హీరో నాని నిర్మాతగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ బంపర్ హిట్ సాధించింది. ఇందులో యువ హీరోగా రోషన్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి.. సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన రోషన్ తాత మస్తాన్ కూనవరం ఎంపీడీవో కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేశారు. తండ్రి రషీద్ వైద్యశాలలో పనిచేసేవారు. రోషన్ చదువు ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు భద్రాచలంలో..అనంతరం ఖమ్మంలో పదో తరగతి వరకు సాగింది. రోషన్‌కు చిన్నతనం నుంచే డ్యాన్స్‌పై మక్కువ ఉండేది. తన సోదరుడు తౌఫిక్ ప్రోత్సాహంతో పాల్వంచలోని అరవింద్ మాస్టర్, భద్రాచలంలోని పవన్, నాగురాజు మాస్టార్ల వద్ద డ్యాన్స్‌లో మెలకువలు నేర్చుకున్నారు. సినిమారంగంపై ఉన్న మక్కువతో హైదరాబాద్‌కు కుటుంబసమేతంగా తరలివెళ్లారు. వివిధ టీవీ ఛానళ్లలో డ్యాన్స్ పోటీల్లో పాల్గొని, ఉత్తమ ప్రదర్శనతో రోషన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో దర్శకుడు తరుణ్‌భాస్కర్ అతడిలోని ప్రతిభను గుర్తించి, ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించే అవకాశం కల్పించారు. ఆ తరువాత అరవింద సమేత, గద్దలకొండ గణేష్, వెంకీ మామ చిత్రాల్లో బాలనటుడిగా.. సలార్, విరూపాక్ష, బచ్చలమల్లి, మిషన్ ఇంపాజిబుల్, స్వాగ్ వంటి చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు పోషించడంతో తనకంటూ ఓ గుర్తింపు వచ్చింది. ‘సరిపోదా శనివారం’తో ప్రత్యేక గుర్తింపు సరిపోదా శనివారం చిత్రంలో హీరో నానితో కలిసి పనిచేసే అవకాశం రావడంతో రోషన్‌కు ప్రత్యేక అవకాశం లభించింది. అతనిలో నటనను హీరో నాని గుర్తించారు.. ఈ నేపథ్యంలో నాని నిర్మాతగా, రామ్ జగదీష్ దర్శకత్వంలో తీసిన ‘కోర్ట్’ సినిమాలో యువ కథనాయుకుడిగా రోషన్‌కు అవకాశం దొరికింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ సాధించింది. రోషన్ నటనకు పెద్ద పెద్ద కథనాయకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. స్వగ్రామస్తుల ఆదరణ మరువలేను ఈ సందర్భంగా హీరో రోషన్ మాట్లాడుతూ తాను నటించిన మిషన్ ఇంపాజిబుల్ చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవిని కలిశానని, చిత్రంలో తాను చేసిన డ్యాన్స్‌ను ఆయన మెచ్చుకొని ప్రశంసించారని గుర్తు చేశారు. కోర్ట్ చిత్రం చూసిన తరువాత కథనాయకుడు చిరంజీవి స్వయంగా ఆహ్వానించి జ్ఞాపికను బహుకరించడం మరచిపోలేని అనుభూతి అని చెప్పారు.ఇటీవల తన స్వగ్రామం కూనవరం వచ్చానని, స్థానికులు చూపిన ఆదరణ మరువలేనిదన్నారు. ప్రస్తుతం కొందరు దర్శకులు కథలు వినిపించారు. వాటిలో కొన్నింటికి అంగీకారం తెలిపే అవకాశముందని చెప్పారు. -
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం
-
వైఎస్ జగన్‌కు నీరా'జనం' (ఫోటోలు)
-
బుజ్జిపాపాయికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత (ఫోటోలు)
-
వినేశ్‌కు అపూర్వ స్వాగతం
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శనివారం స్వదేశానికి చేరుకుంది. స్వర్ణపతక పోరుకు ముందు అనర్హతకు గురై అప్పీల్‌కు వెళ్లిన ఆమె ఇన్నాళ్లూ పారిస్‌లోనే ఉండిపోయింది. ఫైనల్ రోజు కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె అనర్హతకు గురైంది. ఫైనల్లో ఓడినా కనీసం రజతం ఖాయం అనుకోగా, అదీ చేజారిపోయింది. సంయుక్త రజతం కోసం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో వినేశ్ అప్పీలు చేసింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మద్దతుతో నిష్ణాతులైన లాయర్ల బృందం ఆమె కేసును వాదించింది. విచారణ తదుపరి వాయిదాల అనంతరం చివరకు భారత రెజ్లర్‌కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. దీంతో భారత్‌కు పయనమైన వినేశ్ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే క్రీడాభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. డోలు బాజాలు, భాంగ్రా నృత్యాల మధ్య ఆమె బయటకు వచ్చింది. వినేశ్ భర్త సోమ్‌వీర్ రాఠీ కూడా ఆమె వెంట ఉన్నాడు. ఒలింపిక్ పతక విజేతలైన స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాలతో పాటు, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, పోటెత్తిన అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వెల్లువెత్తిన అభిమానం చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన ఫొగాట్ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది గమనించిన సాక్షి, బజరంగ్ ఆమెను దగ్గరికి తీసుకొని ఓదార్చారు. అనంతరం తేరుకొని వినమ్రంగా చేతులు జోడించి ‘యావత్ దేశానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని చెప్పింది. పెద్ద సంఖ్యలో అభిమానులంతా తమ వాహనాల్లో వినేశ్‌ను ఆమె స్వగ్రామం బలాలి (హరియాణా) చేరే వరకు అనుసరించారు. దీంతో ఈ 135 కిలో మీటర్ల మార్గమంతా వీఐపీ కాన్వాయ్‌ని తలపించింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత బృందానికి చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించిన మాజీ షూటర్ గగన్ నారంగ్ కూడా శనివారం ఆమెతో పాటు స్వదేశం చేరుకున్నారు. ఆమెతో పారిస్‌లో దిగిన ఫొటోని ‘ఎక్స్’లో షేర్ చేస్తూ వినేశ్ నిజమైన చాంపియన్‌గా అభివర్ణించారు.‘క్రీడా గ్రామంలో తొలి రోజే ఆమె చాంపియన్‌గా అడుగుపెట్టింది. అనర్హతకు గురైనా ఇప్పటికీ ఆమెనే చాంపియన్. పతకాలు, విజయాలే కాదు... కొన్నిసార్లు పోరాటం కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. వినేశ్ కనబరిచింది కూడా అదే! యువతరానికి ప్రేరణగా నిలిచిన ఆమెకు నా సెల్యూట్’ అని నారంగ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. వినేశ్ కోసం ఢిల్లీలో, తమ స్వగ్రామంలో ఎదురు చూసిన అభిమానులు ఆమెకు బ్రహ్మరథం పట్టారని సోదరుడు హర్విందర్ ఫొగాట్ చెప్పాడు. ‘ఒలింపిక్స్ నిర్వాహకులు నాకు పతకం ఇవ్వకపోతేనేమి. ఇక్కడి ప్రజలంత ఎంతో ప్రేమ, గౌరవం అందించారు. నాకు ఇది 1000 ఒలింపిక్ పతకాలతో సమానం’ అని వినేశ్ వ్యాఖ్యానించింది. -
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఫొగట్ కు ఘనస్వాగతం
-
సీఎం రేవంత్ కు గ్రాండ్ వెల్కమ్
-
నంద్యాల పర్యటన.. దారిపొడవునా జననేతకు ఘన స్వాగతం (ఫొటోలు)
-
జననేత కోసం జనం
-
2024 ప్యారిస్ ఒలింపిక్స్: స్పెషల్ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ
రిలయన్స్ ఫౌండేషన్, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, ఛైర్మన్ నీతా అంబానీ 2024 పారిస్ ఒలింపిక్స్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పారిస్‌లో జరుగుతున్న 142వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్‌కు నీతా అంబానీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నుంచి ఘనస్వాగతం లభించింది. ముఖ్యంగా నీతా అంబానీ సాదరంగా ఆహ్వానించిన మాక్రాన్ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ కూడా నీతాకు శుభాకాంక్షలు తెలిపారు.ఫ్రాన్స్ రాజధాని నగరంలో జరిగిన లూయిస్ విట్టన్ ఫౌండేషన్‌లో జరిగిన 142వ ఐఓసీ షన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నీతా అంబానీ ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దిన ఎరుపు రంగు సూట్‌ను ధరించారు. గోల్డెన్ థ్రెడ్‌వర్క్ డ్రెస్‌లో చాలా నిరాడంబరమైన ఆభరణాలతో నీతా అందంగా, హుందాగా కనిపించారు..కాగా 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు శుక్రవారం, జూలై 26న జరగనున్నాయి. అధికారిక ప్రారంభోత్సవానికి ముందు జూలై 24న కొన్ని క్రీడలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఒలింపిక్స్‌లో 206 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 10,500 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 ఆగస్టు 11న ముగుస్తుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, నీతా అంబానీ వ్యాపారవేత్తగా, పరోపకారిగా చాలా పాపులర్. ఇటీవల తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. -
పోలీసు ఆంక్షలున్నా.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
-
గన్నవరం చేరుకున్న జగన్.. భారీగా పోటెత్తిన జనం (ఫొటోలు)
-
అధైర్య పడొద్దు.. మంచి రోజులొస్తాయి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తమ బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డినీ గుండెలకు హత్తుకుంది పుట్టిన గడ్డ పులివెందుల. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చి తాను చేయగలిగేది మాత్రమే చెప్పిన జగన్ ఎప్పటికి తమ నాయకుడే అని చేతల్లో చూపించారు పులివెందుల వాసులు. రాజన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ, సవాళ్లను ఎదుర్కొంటూ... ముందుకు సాగుతున్న జగన్‌కు అండగా ఉంటామని నిరూపించింది. కష్టాలు తాత్కాలికమేనని.. మళ్లీ జగన్ పట్టం కడతారని అంటున్నారు పులివెందుల వాసులు. అందుకే సొంతూరికి వచ్చిన తమ బిడ్డకు అపూర్వ స్వాగతం పలికారు.కడప జిల్లాలో జరుగుతున్న తన రెండో రోజు పర్యటనలో భాగంగా పులివెందులలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పలువురిని కలుసుకున్నారు. రాయలసీమ లోని నాలుగు ఉమ్మడి జిల్లాలైన అనంతపురం చిత్తూరు కర్నూలు కడప ప్రాంతాల నుంచి దాదాపు 5,000 మంది అభిమానులు.. వైఎస్ జగన్ కలిసారు.ఎన్నికల అనంతరం తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ ప్రోత్సహిస్తున్న రౌడీ ముఖలు చేస్తున్న దాడుల గురించి వైఎస్ జగన్‌కు వివరించారు. పార్టీ నేతలకు అభిమానులకు తాను అండగా ఉంటానని ఎవరు ఎలాంటి ఆందోళన గురి కావద్దని వైఎస్ జగన్ తెలిపారు. రేపు మధ్యాహ్నం వరకు పులివెందులో వైఎస్ జగన్ వివిధ వర్గాలను కలుసుకుంటున్నారు. -
పులివెందులలో వైఎస్ జగన్ కు అపూర్వస్వాగతం
-
సీఎం జగన్ కి వైఎస్సార్సీపీ నేతల ఘన స్వాగతం
-
లండన్ వీధుల్లోను అదే అభిమానం
-
భూటాన్‌లో ప్రధానికి ఘనస్వాగతం
న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శుక్రవారం(మార్చ్ 22) ఉదయం భూటాన్ వెళ్లారు. ప్రధానికి భూటాన్‌లోని పారో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆ దేశ ప్రధాని షెరిగ్ టోబ్గే ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్‌తో ద్వైపాక్షిక సంబంధాల విషయమై ప్రధాని చర్చలు జరుపుతారు. భూటాన్ రాజుతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. గత వారమే భూటాన్ ప్రధాని భారత్‌లో ఐదు రోజుల పాటు పర్యటించి వెళ్లారు. నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింంది. భూటాన్‌తో భారత్ సంబంధాలు విశిష్టమైనవని తెలిపింది. కాగా, భూటాన్‌లో షెరిగ్ టోబ్గే ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరింది. ఇదీ చదవండి.. ప్రధాని మోదీ చెప్పినా నిర్ణయం మారదు -
అనకాపల్లిలో సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)
-
2024 కొత్త కొత్తగా వెల్కమ్
చూస్తూండగానే నూతన సంవత్సరం వచ్చేసింది. 2024కు గ్రాండ్‌గా వెల్కం చెప్పేందుకు అంతా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. అయితే కొన్ని దేశాల వారు కొత్త ఏడాదిని స్వాగతిస్తూ పార్టీ మూడ్‌లో ఉంటే.. మరికొన్ని దేశాల వారు ఇంకా రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తూనే ఉంటారు. అంతర్జాతీయ టైమ్ జోన్ల ప్రకారం.. ప్రపంచంలో మొట్టమొదటగా న్యూజిలాండ్ సమీపంలోని కిరిబతి దీవుల వారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. తర్వాత న్యూజిలాండ్, ఆ్రస్టేలియా స్వాగతం పలుకుతాయి. ఇదే సమయంలో పలు దేశాల్లో ఇంకా డిసెంబర్ 31వ తేదీనే మొదలవుతూ ఉంటుంది. మరి ఇలా ఏయే దేశాలు కొత్త సంవత్సరానికి ముందుగా వెల్కం చెప్తాయో చూద్దామా.. ► ప్రపంచంలో మొదట పసిఫిక్ మహాసముద్రంలోని దీవులైన కిరిబతిలో నూతన సంవత్సరం మొదలవుతుంది. మన దేశంలో డిసెంబర్ 31న మధ్యాహ్నం 3.30 గంటలు అవుతున్న సమయంలోనే.. కిరిబతిలో అర్ధరాత్రి 12.00 గంటలు దాటేసి జనవరి 1 మొదలైపోయింది. మన దేశ సమయంతో పోల్చి చూస్తే, కొన్ని దేశాల్లో ఎప్పుడు కొత్త సంవత్సరం మొదలవుతుందంటే.. ►న్యూజిలాండ్.. మనకు సాయంత్రం 4.30 ►ఆ్రస్టేలియా.. మనకు సాయంత్రం 6.30 ►జపాన్, దక్షిణ కొరియా.. మనకు రాత్రి 8.30 ►చైనా, మలేషియా, సింగపూర్.. మనకు రాత్రి 9.30 ►థాయిలాండ్, వియత్నాం.. మనకు రాత్రి 10.30 ►యూఏఈ, ఒమన్.. మనకు జనవరి 1 వేకువజాము1.30 ► గ్రీస్, దక్షిణాఫ్రికా, ఈజిప్‌్ట.. మనకు వేకువజామున 3.30 ►జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, మొరాకో, కాంగో.. మనకు జనవరి 1 తెల్లవారుజామున 4.30 ►యూకే, ఐర్లాండ్, పోర్చుగల్.. మనకు వేకువన 5.30 ►బ్రెజిల్, అర్జెంటీనా.. మనకు జనవరి 1 ఉదయం 8.30 ►ప్యూర్టోరికో, బెర్ముడా, వెనెజువెలా.. మనకు జనవరి 1 ఉదయం 9.30 ►అమెరికా తూర్పుతీర రాష్ట్రాలు, పెరూ, క్యూబా.. మనకు జనవరి 1 ఉదయం 10.30 ►మెక్సికో, కెనడా, అమెరికా మధ్య రాష్ట్రాలు.. మనకు జనవరి 1 ఉదయం 11.30 ►అమెరికా దక్షిణ తీర రాష్ట్రాలు (లాస్ ఎంజిలిస్, శాన్ఫ్రాన్సిస్కో..).. మనకు జనవరి 1 మధ్యాహ్నం 1.30 ►హవాయ్.. మనకు 1న మధ్యాహ్నం ఉదయం 3.30 ►సమోవా దీవులు.. మనకు జనవరి 1 సాయంత్రం 4.30 ►బేకర్, హౌలాండ్ దీవులు.. మనకు 1న సాయంత్రం 5.30 సమీపంలోనే ఉన్నా.. ఓ రోజు లేటు.. వివిధ దేశాలు చాలా విస్తీర్ణంలో ఉన్నా.. ఏదో ఒక సమయాన్ని మొత్తం దేశానికి పాటిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ దేశాల్లో ఒక చివరన ఉన్న ప్రాంతాల్లో సూర్యోదయం అయ్యాక కొన్ని గంటల తర్వాతగానీ మరో చివరన ఉన్న ప్రాంతాల్లో తెల్లవారదు. ఇలా వివిధ దేశాల ఆదీనంలో ఉన్న ప్రాంతాల్లో ఆయా దేశాల సమయాన్నే పాటించే క్రమంలో.. సమీపంలోనే ఉన్న ప్రాంతాల్లో కూడా వేర్వేరు తేదీలు, సమయం ఉంటుంటాయి కూడా. ►దీనివల్ల పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఉండే అంతర్జాతీయ డేట్లైన్ కూడా మెలికలు తిరిగి ఉంటుంది. ►మామూలుగా అయితే.. ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ముందే రోజు మారిపోయే కిరిబతి దీవులకన్నా రెండు గంటలు ఆలస్యంగా సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో అదే తేదీ, రోజు ఉండాలి. కానీ అమెరికా అధీనంలో ఉన్న ఈ దీవుల్లో ఆ దేశ సమయాన్ని పాటిస్తారు కాబట్టి.. అవి మొత్తంగా ఒక రోజు వెనకాల ఉంటాయి. ►ఉదాహరణకు కిరిబతిలో సోమవారం ఉదయం 8 గంటలు అవుతుంటే.. దానికన్నా రెండు గంటల తర్వాత సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో మాత్రం ఆదివారం ఉదయం 6 గంటల సమయమే ఉంటుంది. ►ఈ కారణంతోనే ప్రపంచంలో అన్ని ప్రాంతాలకన్నా చివరిగా.. ఈ దీవుల్లో కొత్త సంవత్సరం మొదలవుతుంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
CM YS Jagan Convoy Entry At Bhimavaram: భీమవరంలో జగనన్నకు ఘనస్వాగతం (ఫొటోలు)
-
సీఎం జగన్ కు ఘన స్వాగతం..నూజివీడులో జననీరాజనం..
-
Allu Arjun-69th National Film Award: అల్లు అర్జున్‌కు ఘనస్వాగతం.. ఇంటివద్ద ఫ్యాన్స్ కోలాహలం!(ఫొటోలు)
-
సీఎం జగన్‌కు ఘనస్వాగతం (ఫొటోలు)
-
హైదరాబాద్‌కు చేరుకున్న అమెరికా వెళ్లిన ఏపీ విద్యార్థులు
-
డల్లాస్ లో బండి సంజయ్ కి ఘన స్వాగతం
-
బీజేపీ కార్యాలయం వద్ద ప్రధానికి ఘన స్వాగతం
న్యూఢిల్లీ: ఇటీవల భారత్ సారథ్యంలో జీ20 శిఖరాగ్ర భేటీని విజయవంతంగా నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఘన స్వాగతం లభించింది. బుధవారం సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశానికి హాజరైన సందర్భంగా ప్రధానికి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితరులు స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ప్రధానిపై పూల వర్షం కురిపిస్తూ కార్యాలయంలోకి ఆహా్వనించారు. జీ20 విజయవంతంగా ముగియడం, ప్రపంచ నేతలు మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించడం తెలిసిందే. ఈ భేటీ తర్వాత బీజేపీ ప్రధాన కార్యాలయంలోకి ప్రధాని రావడం ఇదే మొదటిసారి. -
AP: రాష్ట్రానికి తిరిగి వచ్చిన సీఎం జగన్ దంపతులు
సాక్షి, విజయవాడ: లండన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు రాష్ట్రానికి వచ్చారు. ఈరోజు(మంగళవారం) తెల్లవారుజామున కృష్ణాజిల్లా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగిన సీఎం జగన్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. సీఎం జగన్‌కు గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద సీఎస్, మంత్రులు, డీజీపీ ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్ దంపతులు రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి బయల్దేరిన క్రమంలో దారి పొడువునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. -
టీటీడీ బోర్డ్ మెంబర్ మేకా శేషుబాబుకు ఘన స్వాగతం
-
CM Jagan Kalyandurgam Tour : కళ్యాణదుర్గంలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం (ఫొటోలు)
-
CM Jagan Chittoor Tour : చిత్తూరులో సీఎం జగన్‌కు ఘన స్వాగతం (ఫొటోలు)
-
శంషాబాద్ కు చేరుకున్న జేపీ నడ్డా
-
140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గొప్ప గౌరవమిది: మోదీ
వాషింగ్టన్: భారత్, అమెరికా సమాజాలు, సంస్థలు ప్రజాస్వామిక విలువలపై నిర్మితమై ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తమ వైవిధ్యాన్ని ఇరు దేశాలు గర్వకారణంగా భావిస్తున్నాయని చెప్పారు. నాలుగు రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికాలో అడుగుపెట్టిన మోదీకి గురువారం శ్వేతసౌధంలో సాదర స్వాగతం లభించింది. అధికారిక లాంఛనాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్, అమెరికా రాజ్యాంగాలు ‘దేశ ప్రజలమైన మేము’ అనే మూడు పదాలతోనే ప్రారంభమవుతాయని గుర్తుచేశారు. తనకు అద్భుతమైన స్వాగతం పలికిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ బైడెన్ దంపతులకు, అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఇక్కడ తనకు లభించిన స్వాగతం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గొప్ప గౌరవమని హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలో నివసిస్తున్న 40 లక్షల మందికిపైగా భారతీయులకు గర్వకారణమని అన్నారు. ప్రజాస్వామ్య బలానికి ఇదొక రుజువు: మోదీ ‘అందరి ప్రయోజనాల కోసం, అందరి సంక్షేమం కోసం’ అనే ప్రాథమిక సూత్రాన్ని భారత్, అమెరికా ఎంతగానో విశ్వసిస్తున్నాయని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాల క్రితం ఒక సామాన్యుడిగా అమెరికా వచ్చానని, అప్పుడు వైట్‌హౌస్ బయటి నుంచే చూశానని అన్నారు. ప్రధానమంత్రి హోదాలో చాలాసార్లు ఇక్కడికి వచ్చానని చెప్పారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భారతీయ–అమెరికన్ల కోసం వైట్‌హౌజ్ గేట్లు తెరవడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చని అన్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులు కష్టపడి పని చేస్తున్నారని, భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారని మోదీ ప్రశంసించారు. చదవండి: అది మా డీఎన్ఏలోనే ఉంది: బైడెన్‌తో కలిసి మీడియా సమావేశంలో మోదీ భారత్–అమెరికా స్నేహం మొత్తం ప్రపంచాన్ని బలోపేతం చేయడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యం, స్థిరత్వం కోసం ఇరుదేశాలు కలిసి పని చేస్తున్నాయని వివరించారు. ప్రజాస్వామ్య బలానికి భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యమే ఒక రుజువు అని వెల్లడించారు. కీలకమైన అంశాలపై అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చించబోతున్నానని పేర్కొన్నారు. చర్చలు సానుకూలంగా జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. అమెరికా పార్లమెంట్‌ను రెండోసారి ఉద్దేశించి ప్రసంగించే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు. భారత్ సహకారంతో ‘క్వాడ్’ బలోపేతం: బైడెన్ భారత్–అమెరికా సంబంధాలు 21వ శతాబ్దంలో అత్యంత ప్రభావశీల సంబంధాల్లో ఒకటి అని జో బైడెన్ స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లో మోదీని ఆహా్వనిస్తూ ఆయన మాట్లాడారు. ఈ రోజు రెండు దేశాలు కలిసి తీసుకుంటున్న నిర్ణయాలు రాబోయే తరాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ సేవల విస్తరణ, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి అంశాలపై ఇరుదేశాలు సన్నిహితంగా కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. స్వేచ్ఛాయుత, భద్రమైన ఇండో–పసిఫిక్ లక్ష్యంగా భారత్ సహకారంతో ‘క్వాడ్’ కూటమిని బలోపేతం చేస్తున్నామని బైడెన్ వివరించారు. చదవండి: Narendra Modi: ఎదురొచ్చి మరీ మోదీకి బైడెన్ దంపతుల సాదర స్వాగతం.. ప్రత్యేక విందు -
మీ అందరికి గ్రాండ్ వెల్కమ్
-
కోనసీమలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం (ఫొటోలు)
-
ఆస్ట్రేలియాలో మోదీ మ్యాజిక్.. ఓ రేంజ్లో భారతీయుల స్వాగతం!
సిడ్నీ/మెల్బోర్న్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వదేశంతో పాటుగా పలు దేశాల్లో అభిమానులు భారీ సంఖ్యలోనే ఉన్నారు. కాగా, మోదీ.. ఇప్పటికే పలు దేశాల పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో అభిమానులు, భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. తాజాగా ప్రధాని మోదీ.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న భారతీయులు ప్రధానికి వినూత్నంగా స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మోదీని కలిసేందుకు భారత సంతతి ప్రజలు ఏకంగా ఓ విమానాన్ని బుక్ చేసుకుని మరీ వచ్చారు. సోమవారం రాత్రి మెల్బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణించారు. తాము ప్రయాణించిన విమానానికి మోదీ ఎయిర్ వేస్ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఇక, మోదీ కోసం 170 మంది కలిసి ప్రత్యేకంగా ఓ విమానాన్ని బుక్ చేసుకున్నారు. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని, తలకు టర్బన్లను కట్టుకుని విమానంలో డ్యాన్స్ స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇండియన్ ఆస్ట్రేలియన్ డయాస్పొరా ఫౌండేషన్ (ఐఏడీఎఫ్) సిడ్నీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆస్ట్రేలియాలోని భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వస్తున్నారు. ఇందులో భాగంగానే మెల్బోర్న్లోని మోదీ మద్దతుదారులు, అభిమానులు కూడా సిడ్నీకి బయలుదేరారు. వీరంతా సోమవారం రాత్రి మెల్ బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణించారు. "Modi Airways" , a plane full of Indian diaspora members arriving in Sydney this morning for the Diapsora Event. https://t.co/GCjs4TSuag pic.twitter.com/RCpIBVWIyG — Sidhant Sibal (@sidhant) May 23, 2023 WATCH | Indian Diaspora from Melbourne ready to take off on special chartered flight @modiairways to meet PM @narendramodi in Sydney, Australia. pic.twitter.com/T8vhbRayXP — DD News (@DDNewslive) May 23, 2023 #Live Modi Airways arrives at Qudos Arena @EthnicLinkGuru @Pallavi_Aus @DrAmitSarwal https://t.co/welCRRSmwU — The Australia Today (@TheAusToday) May 23, 2023 ఇది కూడా చదవండి: భారత ప్రధాని మోదీకి అరుదైన గౌరవం -
నిజాంపట్నంకు చేరుకున్న సీఎం జగన్
-
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలుకు దారిపొడవునా ఘన స్వాగతం
-
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలుకు దారిపొడవునా ఘన స్వాగతం
సాక్షి, హైదరాబాద్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాదిలో తొలిసారి రి తెలంగాణకు వచ్చారు. తన పర్యటనలో ప్రధాని మోదీ మొత్తం రూ.11 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వాటిలో కొన్ని ప్రారంభోత్సవాలు, పలు శంకుస్థాపనలు ఉన్నాయి. తొలుత సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ ప్రారంభించారు. నల్లగొండ, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో తిరుపతి వందే భారత్ రైలుకు దారి పొడవునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. జాతీయ జెండాలతో స్వాగతం చెబుతూ.. వందే భారత్ రైలుతో సెల్ఫీలు దిగారు.స్టేషన్ల వద్ద స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా స్వాగతం పలికారు. కాగా శనివారం ఉదయం 11.30 నిమిషౠలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన మోదీని గవర్నర్ తమిళిసై, ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి వందే భారత్ రైలు ప్రారంభించడంతోపాటు రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్‌టీఎస్ సెకండ్ ఫేజ్‌లో భాగంగా 13 ఎమ్ఎమ్టీఎస్ రైళ్లను ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్ సభలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేసి ప్రసంగించారు. అనంతరం చెన్నైకు ప్రయాణమయ్యారు. -
Nikhat Zareen Photos: బాక్సర్ నిఖత్ జరీన్‌కు ఘన స్వాగతం (ఫొటోలు)
-
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో చంద్రబోస్ కు ఘన స్వాగతం
-
నా కోరిక నెరవేరింది.. చిట్టి పాదాల పారాణి ముద్రలతో స్వాగతం! మనసుకు హాయి..
మా ఇంటి మహాలక్ష్మి ఆడపిల్లపుట్టిందని సంబరం చేశారు. ఇంట్లోకి పూలతో రహదారి పరిచారు. చిట్టి పాదాల పారాణి ముద్రలు వేశారు. అమ్మాయి పుడితే ఇలా స్వాగతం పలకండి. ‘ఆడదే ఆధారం... మన కథ ఆడనే ఆరంభం...’ అంటూ పాడుకునే నేల మనది. ఆడపిల్ల పుట్టగానే గొంతులో వడ్ల గింజలు వేసిన నేల కూడా ఇది. తల్లి గర్భంలోనే శిశువును గుర్తించి పుట్టకముందే ప్రాణం తీస్తున్న పాపాలకూ కొదవలేదు. ఇక ఆడపిల్లను కన్నతల్లికి ఎదురయ్యే కష్టాలను ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆడపిల్ల పుట్టింది... అనగానే కోడలిపై చిర్రుబుర్రులాడే అత్తలు, భార్య–బిడ్డల ముఖం చూడని మగవాళ్లు ఉన్న సమాజం మనది. ఇన్ని దారుణాల మధ్య ఓ సంతోషవీచిక వెల్లివిరిసింది. పుట్టింది ఆడపిల్ల అని తెలియనే పండుగ చేసుకున్నారు. ఊరూ వాడా అందరినీ పిలిచి వేడుక చేసుకున్నారు. అమ్మమ్మగారింట్లో రెండు నెలలు పూర్తి చేసుకున్న బిడ్డ మూడవ నెల నానమ్మ దగ్గరకు ప్రయాణమైంది. ఆ బిడ్డనెత్తుకుని అత్తగారింటికి వచ్చిన తల్లికి పూలబాట పరిచారు అత్తింటివాళ్లు. పాపకు ఘన స్వాగతం పలికారు. ఆడబిడ్డ పుట్టడం అంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రావడమేనన్నారు. ఆదర్శంగా నిలిచిన కుటుంబం తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాలో ఉంది. కే సముద్రం మండలం, తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన పొడగంటి శ్రీనివాసాచారి, భద్రకాళి దంపతుల ఆదర్శవంతమైన ఆత్మీయత ఇది. పాపాయి కోసం పూజలు కోడలు గర్భిణి అని తెలియగానే మగ పిల్లవాడు పుట్టాలని అనుకుంటారు. కానీ భద్రకాళి కుటుంబీకులు మాత్రం ఆడపిల్ల కావాలని పూజలు చేశారు. వాళ్ల పెద్దకొడుకు సాయి కిరణ్‌కు సిరిసిల్ల పట్టణానికి చెందిన సంహితతో రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. సంహిత నెలతప్పినప్పటి నుంచి భద్రకాళితోపాటు ఆమె తోడికోడలు సుమ, మరదలు రమ్య కూడా ఆడపిల్లలు పుట్టాలని వ్రతాలు, పూజలు చేశారు. వాళ్లందరికీ మగపిల్లలే. ఈ తరంలోనైనా ఇంట్లో ఆడపిల్ల కావాలని వాళ్ల కోరిక. ప్రసవం రోజు వరంగల్‌లో ఆసుపత్రికి ఇంటిల్లిపాది తరలి వెళ్లారు. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే సంతోషంగా కేకలు వేస్తూ, హాస్పిటల్లో అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. అపూర్వ స్వాగతం కోడలు పుట్టింటికి వచ్చిన రోజు ఇంటిని పూలతో అలంకరించారు. ముత్తయిదువలతో స్వాగతం పలికారు. చిన్నపాప కాళ్లకు పారాణి రాసి తొలి అడుగుల గుర్తులు నట్టింట్లో ముద్రించుకున్నారు. ఆ అడుగులను కళ్లకు అద్దుకున్నారు. ఆ జ్ఞాపకం కలకాలం నిలిచి ఉండడానికి ఫొటోలు తీశారు. నా కోరిక తీరింది నాకు చిన్నప్పటి నుండి ఆడపిల్లలంటే ఇష్టం. మా వారు కూడా ఆడపిల్ల ఉన్న ఇంటి అందమే వేరు అంటూ ఉంటారు. అందుకోసమే మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆడ పిల్లలను ప్రతి పండుగకు పిలుస్తాం. వారు చేసే సందడి చూసి సంబుర పడుతాం. మా ఇంట్లో ఆడపిల్ల ఉండాలనే కోరిక నెరవేరింది. అందుకోసమే అలా స్వాగతం పలికాం. – భద్రకాళి, పాపాయి నానమ్మ – ఈరగాని భిక్షం, సాక్షి, మహబూబాబాద్ -
జూ.ఎన్టీఆర్‌కు ఘన స్వాగతం..కళ్లలో నీళ్లు తిరిగాయని భావోద్వేగం.
సాక్షి, హైదరాబాద్: ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చిందని అనౌన్స్ చేసిన క్షణంలో ఆనందం తట్టుకోలేక పోయామని ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. 'ఆస్కార్ వేదిక మీద ట్రిపుల్ ఆర్ టీం చేతికి ఆస్కార్ అందించినప్పుడు అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదనిపించింది. మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన అభిమానులకి, ప్రజలకి పేరుపేరునా ధన్యవాదాలు. రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవార్డు వచ్చిన విషయం నా ఫ్యామిలీలో మొదటగా నా వైఫ్ కి కాల్ చేసి షేర్ చేసుకున్నాను.' అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సాంగ్‌కు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫీ చేశారు. జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్ వేసిన స్టెప్పులు యావత్ ప్రపంచాన్ని ఊర్రూతలించాయి. -
న్యూజిలాండ్‌తో మూడో టీ20.. టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్! వీడియో వైరల్
India Vs New Zealand 3rd T20:న్యూజిలాండ్‌తో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా సిరీస్ డిసైడర్ మూడో టీ20లో బుధవారం కివీస్‌తో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు సోమవారం అహ్మదాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా టీమిండియాకు సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. "భారత్, న్యూజిలాండ్ ఆఖరి టీ20 కోసం అహ్మదాబాద్ చేరుకున్నాం" అని ఈ వీడియోకు బీసీసీఐ క్యాప్షన్ ఇచ్చింది. ఇక అహ్మదాబాద్‌కు చేరుకున్న భారత జట్టు మంగళవారం తమ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. ఇదిలా ఉంటే.. కీలకమైన మూడో టీ20లో భారత పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన గిల్ స్థానంలో పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా పేసర్ ముఖేష్ కుమార్‌కు కూడా ఆఖరి టీ20కు భారత తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. భారత తుది జట్టు(అంచనా): ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్ చదవండి: IND vs NZ: బ్యాటర్లకు చుక్కలు చూపించిన లక్నో పిచ్.. క్యూరేటర్పై వేటు! Hello Ahmedabad 👋 We are here for the third & final T20I of the #INDvNZ series 👏 👏#TeamIndia pic.twitter.com/gQ1jPEnPvK — BCCI (@BCCI) January 30, 2023 -
Hijab: అరెస్ట్ కాదు.. ఆమెకు ఘన స్వాగతం!
టెహ్రాన్: అంతర్జాతీయ క్రీడా వేదికలో హిజాబ్ లేకుండా పాల్గొని.. వార్తల్లో ప్రముఖంగా నిలిచింది ఇరాన్ అథ్లెట్ ఎల్నాజ్ రెకాబీ. అయితే.. ఆపై ఆమె ప్రభుత్వాగ్రహానికి గురికాకతప్పదని, జైలు శిక్ష ఖాయమని అంతా భావించారు. అంతేకాదు.. స్వయంగా ఆమె తన అరెస్ట్ భయాన్ని సైతం వ్యక్తం చేయడం, ఆ వెంటనే కనిపించడం లేదన్న కథనాలతో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఇక భయాందోళనల నడుమ బుధవారం వేకువజామున రాజధాని టెహ్రాన్‌కు చేరుకున్న ఆమెకు ఊహించని సీన్ కనిపించింది. వేల మంది ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ఆమెకు ఘనస్వాగతం పలికారు. హిజాబ్ లేకుండా పోటీల్లో పాల్గొన్న ఆమె తెగువకు సలాం చేస్తూ నినాదాలు చేశారు. ఆ గ్రాండ్ వెల్కమ్ను రెకాబీ సైతం అంతే ఆత్మీయంగా స్వీకరించింది. 33 ఏళ్ల వయసున్న రెకాబీ.. ఇరాన్ తరపున సియోల్(దక్షిణ కొరియా రాజధాని)లో ఆదివారం జరిగిన క్లయింబింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నారు. గతంలో హిజాబ్‌తోనే ఆమె ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు. అయితే ఆదివారం ఈవెంట్ సందర్భంగా ఆమె హిజాబ్ ధరించకపోవడంతో ఆమె ఇరాన్ ప్రభుత్వ ఆగ్రహానికి గురికాక తప్పదని అంతా భావించారు. ఇరాన్లో జరుగుతున్న హిజాబ్ నిరసనల్లో భాగంగానే ఆమె అలా చేసి ఉంటుందని అంతా చర్చించుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే అరెస్ట్ కాక తప్పదని అనుకున్నారు. కానీ, ఆ అంచనా తప్పింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెని గతంలో స్పందిస్తూ.. ఇరాన్ మహిళా అథ్లెట్లకు మెడల్స్ కంటే హిజాబ్ ముఖ్యమని సూచించారు. అయితే.. రెకాబీ మాత్రం హిజాబ్ తొలగించి మరీ పోటీల్లో పాల్గొంది. ఇక హిజాబ్ తొలగింపుపై ఇరాన్ నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. దీంతో ఆమె క్షమాపణలు చెప్తూ.. అది అనుకోకుండా జరిగిందంటూ ఓ సందేశం సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టెహ్రాన్‌లో ల్యాండ్ అయిన ఆమెకు.. ముందు ముందు ఎలా ఉంటుందన్నది చూడాలి మరి!. ఇదీ చదవండి: తప్పు జరిగిపోయింది.. క్షమించండి -
కొత్త కారుతో గ్రాండ్ ఎంట్రీ .... పల్టీ కొట్టిందిగా!
ఒక వ్యక్తి కొత్త కారుతో గ్రాండ్‌గా ఎంటీ ఇస్తున్నాడు. కానీ అతనికి కొత్త కారుతో వచ్చిన ఆనందం కాస్త చేదు అనుభవాన్ని మిగిల్చింది. బ్రాండెడ్ టాటా నెక్సాన్ కారుతో చక్కటి పూల దండతో అలకరింపబడి ఉన్న కారుతో ఇంటికి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఐతే సెక్యూరిటీ గార్డు కూడా గేట్ తీసి చక్కగా దారి ఇచ్చాడు కూడా. కానీ సదరు వ్యక్తి కారుని లోపలి పోనిచ్చి పక్కనే పార్క్ చేసిన బైక్‌లపైకి పోనిచ్చాడు. దీంతో కారు ఆ బైక్లన్నింటిని ఢీ కొడుతూ ఒక పక్కకు పల్టీ కొట్టబోయింది. ఇంతలో సెక్యూరిటీ గార్డు పరిగెత్తుకుంటూ వచ్చి సదరు కారు నడుపుతున్న వ్యక్తికి సాయం అందిస్తాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని వినోద్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. What a grand arrival home ? pic.twitter.com/ilSeNcKexD — Sqn Ldr Vinod Kumar (Retd) (@veekay122002) October 7, 2022 (చదవండి: విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు) -
విశాఖలో జగనన్నకు ఘన స్వాగతం
-
శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవం: అమెరికాలో టీటీడీ చైర్మన్ దంపతులకు ఘన స్వాగతం
డాలస్: అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న టీటీడీ శ్రీవెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవానికి హాజరయ్యేందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు అమెరికాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైవీ దంపతులకు ఘన స్వాగతం లభించింది. నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కడప రత్నాకర్ తదితరులు వీరిని సాదరంగా ఆహ్వానించారు. జూన్ 18న శాన్ఫ్రాన్సిస్కో, 19,సియాటెల్, డాలస్‌లో 25న , 26న సెంట్ లూయస్, 30న చికాగో, జూలై 2వ తేదీన న్యూఓర్లీన్స్, 3, వాషింగ్టన్ డీసీ, అట్లాంటాలో జూలై 9న, 10న అలబామాలో అత్యంత వైభవంగా శ్రీనివాస కల్యాణాన్ని నిర్వహిస్తారు. డాలస్‌లోని క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్లో తెలుగువారి ఆధ్వర్యంలో టీపాడ్ నేతృత్వంలో జూన్ 25న విశేష పూజాకార్యక్రమం, శ్రీనివాస కల్యాణం ఇతర సేవలు ఘనంగా నిర్వహించనున్నారు. సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకం, కల్యాణ సేవలను అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. (డాలస్‌లో శ్రీనివాసుడి కల్యాణం) -
గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్ కు ఘన స్వాగతం
-
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
-
రైతు కంట తడి పెట్టనివ్వను: మంత్రి కాకాణి
ముత్తుకూరు(నెల్లూరు జిల్లా): వ్యవసాయశాఖ మంత్రిగా, రైతు బిడ్డగా రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కంట తడి పెట్టనివ్వకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాజకీయంగా జన్మనిచ్చి ఎదుగుదలకు ఆశీస్సులందించిన సర్వేపల్లి ప్రజానీకాన్ని కంఠంలో ప్రాణమున్నంత వరకు రుణపడి ఉంటానని కాకాణి అన్నారు. చదవండి👉: టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం మంత్రి హోదాలో ఆదివారం సాయంత్రం తొలిసారిగా ముత్తుకూరుకు వచ్చిన కాకాణికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సభలో ఆయన ప్రసంగించారు. ఏ హోదాలో ఉన్నప్పటికీ నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.360 కోట్లతో సీసీరోడ్లు, సైడు డ్రెయిన్ల నిర్మాణం చేయించామన్నారు. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం కూడా చేపడతామన్నారు. ట్యాంకర్ల ద్వారా రవాణా చేసే దుస్థితి లేకుండా ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తున్నామన్నారు. ఇంటింటికీ కుళాయి పథకం అమలు చేస్తున్నామన్నారు. 80 రోజుల పాటు గ్రామాల్లో పర్యటన మే 10వ తేదీ తర్వాత ‘సిటిజన్ అవుట్‌రీచ్ కాంపైన్’ పేరుతో అధికారులతో కలసి ప్రతి ఇంటికి వెళ్లి పలకరిస్తామని, సంక్షేమ పథకాల అమలు, అవసరమైన పనులపై వాకబు చేస్తామన్నారు. ఈ కార్యక్రమం 9 నెలలు జరుగుతుందన్నారు. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసి తీరుతామన్నారు. ప్రతి పేద కుటుంబానికి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. -
సచిన్, అమితాబ్‌లా ఫీల్ అయ్యా: బ్రిటన్ ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన ఇండియాకు చేరుకున్నారు. మొదటిరోజు భారత ప్రధాన నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో బోరిస్ జాన్సన్ పర్యటించారు. రెండో రోజు ఢిల్లీలో ప్రధాని మోదీతో బోరిస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఇదిలా ఉండగా.. గురువారం గుజరాత్లో పర్యటనను బోరిస్ జాన్సన్ గుర్తు చేసుకొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తనకు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు భారత ప్రజలకు, ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్లో తన స్వాగత హోర్డింగ్స్ చూసి.. ఆయన ఓ సచిన్ టెండూల్కర్, బిగ్‌బీ అమిత్ బచ్చన్‌లా ఫీలయ్యానని అన్నారు. ఇలాంటి స్వాగతాన్ని తాను మరెక్కడా చూడలేనమోనని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని బోరిస్ ప్రకటించారు. మరోవైపు.. బోరిస్ జాన్సన్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో భారత్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటించడం ఆనందంగా ఉందన్నారు. ఇది ఓ చారిత్రక సందర్భం అంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఇది చదవండి: భారత్.. ఏ దేశానికీ ముప్పు కాదు -
KTR వరంగల్ పర్యటన
-
నగరి ప్రజల ప్రేమ మరువలేను (ఫోటోలు)
-
చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డికి ఘన స్వాగతం
-
వీధి కుక్కకు హారతి ఇచ్చి మరీ ఘన స్వాగతం!..ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Mumbai Society Gives A Grand Welcome To Stray Dog: ఇంతవరకు జంతువులకు సంబంధించిన పలు కథనాలను విన్నాం. పెంపుడు జంతువులు తన యజమాని పట్ల కనబరిచే విశ్వాసం, ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. . వీధి కుక్కలను ఆదరించే వాళ్లు కూడా ఉన్నారు. ఒకరో ఇద్దరో వాటికి ఆహారం పెట్టడం వంటివి చేస్తుంటారు. అవి కూడా వాళ్ల పట్ల మాత్రమే ప్రేమగా ఉంటాయి. కానీ ఈ వీధి కుక్క అందుకు భిన్నం అందరీ ప్రేమాభిమానలను గెలుచుకుంది ఎలాగో తెలుసా! అసలు విషయంలోకెళ్తే...ముంబైలో ప్రభాదేవిలోని ఒక సొసైటీ విస్కీ అనే వీధి కుక్క ఉంది. ఆ కుక్కని ఆ సోసైటీ వాళ్లంతా ప్రేమగా చూసుకునేవారు. ఒకరోజు ఉన్నట్టుండి హఠాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆ సోసైటి వాసుల నిద్రహారాలు మాని మరీ ఆ కుక్క కోసం వెతకడం ప్రారంభించారు. ఏడు రోజులు అనంతరం ఆ కుక్క విల్సన్ కాలేజీకి సమీపంలోని మైదానంలో కనిపించింది. దీంతో ఆ కాలనీ వాసులు ఆ కుక్కను సోసైటీకి కారులో తీసుకకువచ్చి హారతీ ఇచ్చి మరి ఘన స్వాగతం పలికారు. పైగా ఆ సోసైటీ వాసులు అది మాకు కుక్క కాదు అని చెప్పడం విశేషం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం ఇది అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by StreetdogsofBombay (@streetdogsofbombay) (చదవండి: అమ్మ నాన్న ఐ లవ్ యూ !..వైరల్ అవుతున్న ఉక్రెయిన్ సైనికుడి చివరి వీడియో!) -
Rohit Sharma: రోహిత్ శర్మకు గ్రాండ్ వెల్కమ్
దుబాయ్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఆ జట్టు ఆటగాళ్లు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం యూఏఈకి చేరుకున్న రోహిత్ శర్మ ఆరు రోజులపాటు క్వారంటైన్లో ఉన్నాడు. తాజాగా శనివారంతో క్వారంటైన్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్న రోహిత్ జట్టు సభ్యులతో కలిశాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌కు హగ్గులతో పాటు బెస్ట్ విషెస్ అందించారు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చదవండి: Dinesh karthik: బౌలర్ యార్కర్ దెబ్బ.. క్రీజులోనే కూలబడ్డ బ్యాట్స్‌మన్ '' మా కెప్టెన్‌కు ఇదే వెల్కమ్.. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టీమ్మేట్స్'' అని క్యాప్షన్ జత చేసింది. కాగా టి20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లి టీమిండియా టి20 కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకోనున్న సంగతి తెలిసిందే. కాగా కోహ్లి స్తానంలో రోహిత్ టి20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఆటగాళ్లు రోహిత్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ముంబై ఇండియన్స్ రెండో అంచె పోటీల్లో తన తొలి మ్యాచ్‌ను రేపు (సెప్టెంబర్ 19న) సీఎస్కేతో తలపడనుంది. ఇక రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమయ్యాడు. ఇప్పటికే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. ఇక ఈ సీజన్లోనూ ముంబై నిలకడ ఆటతీరును కనబరుస్తుంది. ఐపీఎల్ 2021 సీజన్లో ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్‌లాడి 4 విజయాలు.. మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. చదవండి: MS Dhoni: జోరు మీదున్న తలైవా.. ఫోర్లు, సిక్సర్ల వర్షం NZ Vs Pak Series Cancellation: కివీస్ సిరీస్ రద్దు.. కావాలనే మాపై కుట్రలు పన్నుతున్నారు View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
నీరజ్ చోప్రాకు స్వగ్రామంలో ఘన స్వాగతం
పానిపట్: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు హర్యానా పానిపట్‌లోని తన స్వగ్రామం సమల్ఖాలో ఘన స్వాగతం లభించింది. దారిపొడవునా అతన్ని అభినందిస్తూ గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో దేశానికి స్వర్ణం అందించిన వ్యక్తిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం అందుకున్నాడు. తన స్వగ్రామంలో గ్రామస్తులు చూపిన ప్రేమపై నీరజ్ సంతోషం వ్యక్తం చేశాడు. మీ నుంచి ఇంత ప్రేమను పొందడం చాలా సంతోషంగా ఉంది. జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నాకు రానున్న కాలంలోనూ ఇదే తరహా మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నా. దేశానికి మరిన్ని పతకాలు తీసుకొచ్చేందుకు మరింత కష్టపడతా అంటూ తెలిపాడు. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పీవీ సింధుకు ఘనస్వాగతం
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను మరోసారి రెపరెపలాడించిన తెలుగుతేజం పీవీ సింధుకు మంగళవారం స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను పీవీ సింధు కలవనుంది. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత ఒలింపిక్ బృందం ఆగస్టు 15 వేడుకలకు హాజరుకానుంది. వేడుకల్లో పాల్గొననున్న బృంద సభ్యులను ప్రధాని మోదీ తన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొత్త కోడలికి మెట్టుకో గిఫ్ట్
-
ఆత్మీయ ఆహ్వానం.. కొత్త కోడలికి మెట్టుకో గిఫ్ట్
వరకట్న పిశాచి మన సమాజంలో ఎందరు ఆడవాళ్లని బలి తీసుకుందో లెక్కేలేదు. భార్య తల్లిదండ్రులంటేనే నడిచే ఏటీఎంలా కనిపిస్తారు కొందరు భర్తలకు. పెళ్లికి ముందే భారీగా కట్నం తీసుకున్నప్పటికి వారి ధనదాహం తీరదు. వివాహం తర్వాత కూడా అదనపు కట్నం తేవాల్సిందిగా వేధింపులకు గురి చేస్తారు. చిత్రహింసలు పెట్టి.. చివరకు ప్రాణాలు తీస్తారు. అత్తమావలు, ఆడపడుచు, భర్తతో సహా అత్తింటివారందరూ ఆమెను కట్నం కోసం వేధింపులకు గురి చేస్తారు. అయితే అందరు ఇలానే ఉంటారు అనుకుంటే పొరపాటే. కొడలిని, కూతురుతో సమానంగా చూసే అత్తింటివారుంటారు. కోడలి నుంచి కట్నం ఆశించడం కాదు.. కన్నవాళ్లని విడిచిపెట్టి.. తమకోసం వచ్చిన కోడలికి.. బదులుగా బహుమతులు ఇచ్చే వారు కూడా ఉంటారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ సంఘటన మన తెలుగు రాష్ట్రాల్లోనే చోటు చేసుకుంది. అయితే ఎక్కడ అనే వివరాలు మాత్ర లేవు. ఇక వివాహం చేసుకుని.. తమ ఇంట్లోకి అడుగుపెడుతున్న కొత్త కోడలికి జీవితాంతం గుర్తుండిపోయే రీతిలో అద్భుతంగా స్వాగతం పలికారు ఈ అత్తింటివారు. మేళతాళాలతో నూతన దంపతులను ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఇంట్లోకి అడుగుపెడుతున్న కోడలికి మెట్టుకొక బహుమతిచ్చారు. ఇక పెద్ద మెట్టు మీద ఏకంగా 50 వేల రూపాయల నగదు ఇచ్చారు. ఈ ఆత్మీయ ఆహ్వానానికి సదరు పెళ్లి కుమార్తె భావోద్వేగానికి గురైంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో నిజమా కాదా తెలియదు కానీ ఇంత మంచి అత్తింటివారు దొరికిన ఆ అమ్మాయి అదృష్టవంతురాలు.. అందరు మీలానే ఆలోచిస్తే.. ఇక ఈ లోకంలో ఆడపిల్లలను వద్దునుకునే తల్లిదండ్రులే ఉండరు అని ప్రశంసిస్తున్నారు. -
చెన్నై చేరుకున్న చిన్నమ్మ
చెన్నై: అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న మాజీ సీఎం దివంగత జయలలిత స్నేహితురాలు, అన్నా డీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ తమిళనాడుకు చేరుకున్నారు. చెన్నైలోని ఎంజీఆర్ నివాసానికి చేరుకుని జయలలిత చిత్రపటానికి నివాళులర్పించారు. అంతకుముందు తన అనుచరులతో సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో మళ్లీ రాజకీయ అరంగేట్రం చేస్తానని ప్రకటించారు. కర్నాటక రాజధాని బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవించి జనవరి 27న విడుదల అయ్యారు. అయితే ఆమె ఇటీవల కరోనా బారినపడడంతో అస్వస్థతకు గురయ్యారు. చికిత్స తీసుకున్న అనంతరం క్వారంటైన్ కాలం పూర్తి చేసుకుని సోమవారం బెంగళూరు నుంచి తమిళనాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా శశికళకు పెద్ద ఎత్తున అభిమానులు, ఆమె అనుచరులు భారీ స్వాగతం పలికారు. పదుల సంఖ్యలో కాన్వాయ్‌లు బారులు తీరాయి. వేలాది మంది అభిమానులు ఆమె వెంట ఉన్నారు. అయితే శశికళ జైలు నుంచి విడుదల కాకముందే అన్నాడీఎంకే రెండాకుల గుర్తుపై కేసు వేసిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ఇంకా తన పార్టీగా పేర్కొంటూ శశికళ రెండాకుల పార్టీ పతాకాన్ని ఆమె తన వాహనానికి వినియోగించుకున్నారు. తాజాగా తమిళనాడుకు చేరుకున్న సమయంలో కూడా అదే గుర్తు ఉన్న జెండాలు కనిపించాయి. ఇక ప్రత్యక్ష రాజకీయాలతో శశికళ బిజీ కానున్నారు. దీంతో తమిళనాడులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయోనని తమిళ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. అయితే శశికళ రాకపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధించింది. జయలలిత సమాధి, స్మారక మందిరం మూసివేయగా.. శశికళ పోస్టర్లు అతికించవద్దని నిషేదాజ్ఞలు విధించింది. దీంతోపాటు రెండాకుల గుర్తు వాడకంపై ఇప్పటికే అన్నాడీఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం 2 కేసులు నమోదు చేయించిన విషయం తెలిసిందే. -
రాష్ట్రపతికి సీఎం జగన్ ఘన స్వాగతం
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హెలికాఫ్టర్ ద్వారా మదనపల్లెకి సమీపంలోని చిప్పిలిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మదననపల్లెలోని సత్సంగ్ ఆశ్రమానికి వెళ్లిన రామ్‌నాథ్ కోవింద్.. భారత్ యోగా విద్యా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆశ్రమంలో యోగా శిక్షకులు, విద్యార్థులతో రామ్‌నాథ్ మాట్లాడారు. యోగాభ్యాసంలో అనుభవాలను ఆశ్రమ విద్యార్థులు వివరించారు. (చదవండి: హైకోర్టులో నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఊరేగింపు... మేళతాళాలు...
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో ఆస్ట్రేలియానే నేలకు దించి చరిత్ర తిరగరాసిన భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ముందుగా ముంబై చేరుకున్నారు. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పయనమయ్యారు. సిరీస్ గెలిపించిన కెప్టెన్ అజింక్య రహానే మాతుంగాలోని తన స్వగృహానికి చేరగానే హౌజింగ్ సొసైటీలోని స్థానికులంతా ఎర్రతివాచీ పరిచి మరీ నాయకుడికి ఘన స్వాగతం పలికారు. భార్యతో పాటు రహానే తన రెండేళ్ల కుమార్తెను ఎత్తుకొని నడుస్తుండగా ఇరుగు పొరుగువారు, స్థానికులు అతనిపై అడుగడుగున పూలజల్లు కురిపించారు. అనంతరం రహానేతో కేక్ కట్ చేయించి వేడుక జరుపుకున్నారు. అంతకుముందు ముంబై క్రికెట్ సంఘం రహానే, రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్, పృథ్వీ షాలను ఘనంగా సన్మానించింది. బ్రిస్బేన్ టెస్టు హీరో రిషభ్ పంత్ ఢిల్లీలో హర్షధ్వానాల మధ్య ఇంటికి చేరుకున్నారు. తమిళ సీమర్ నటరాజన్‌కు సొంతూరైన ‘చిన్నప్పంపట్టి’ గ్రామస్థులంతా రథంపై ఊరేగించి బ్రహ్మరథం పట్టారు. ఈ స్వాగత కార్యక్రమంలో ఊరంతా పాల్గొనడం విశేషం. ఓ నెట్ బౌలర్‌గా జట్టుతో పాటు వెళ్లిన ఈ తమిళ తంబి అన్ని ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా ఘనత వహించాడు. కరోనా దృష్ట్యా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం రహానే, రోహిత్, శార్దుల్, పృథ్వీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిలను ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్ కావాలని అధికారులు సూచించారు. -
బ్యాండ్ బాజాతో రహానేకు ఘన స్వాగతం..
-
అజింక్య రహానేకు గ్రాండ్ వెల్కమ్ : వీడియో వైరల్
సాక్షి, ముంబై: ఆస్ట్రేలియా గడ్డపై సరికొత్త చరిత్రను లిఖించిన టీమిండియా కెప్టెన్ అంజిక్య రహానేకు ముంబైలో ఘన స్వాగతం లభించింది. అపూర్వ విజయయంతో బోర్డర్-గావస్కర్ ట్రోఫిని దక్కించుకున్న రహానే టీంపై దేశవ్యాప్తంగా ప్రశంసలజల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని ఆయన అభిమానులు, స్థానికులు కూడా రహానే ఘన స్వాగతం పలికారు. గురువారం ముంబైలోని ఆయన నివాసానికి తిరిగివచ్చిన తరుణంలో బాండ్ బాజాలతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. టీమిండియా విజయంతో దేశం గర్వపడేలా చేసిన కూల్ కెప్టెన్ రహానేకు అపూర్వ స్వాగతం పలికారు అభిమానులు. కుమార్తె ఆర్యను ఎత్తుకుని వస్తున్న రహానేపై పూల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను రహానె భార్య రాధిక ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది ఆస్ట్రేలియాలో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతో టీమ్ ఇండియాకు నాయకత్వం వహించిన అజింక్య రహానే నేతృత్వంలోని యంగ్ ఇండియా టీం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా రహానే తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా దొపావ్కర్‌ను సెప్టెంబర్ 26, 2014లో లవ్ కమ్ ఆరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతుల ముద్దుల కూతురే ఆర్య . Skipper Ajinkya Rahane received a grand reception at his home in Mumbai. ❤🤩 pic.twitter.com/2h3W0Khest — Anish Singh (@The_anishsingh) January 21, 2021 -
భూటాన్ లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం
-
అఖండ విజేతకు అపూర్వ స్వాగతం
-
కొత్త వత్సరానికి ఘన స్వాగతం
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): కొత్త సంవత్సరానికి నగర ప్రజలు ఘన స్వాగతం పలికారు. 2018కు బైబై చెప్పి.. 2019కు స్వాగతం చెబుతూ.. సోమవారం అర్ధరాత్రి వరకు డ్యాన్సులు, పాటలతో సరదాగా గడిపారు. నగరంలోని పలు హోటళ్లలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఇందులో యువతీయువకులు పెద్ద ఎత్తున పాల్గొని, వేడుకలు జరుపుకున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాగరతీరంలో యువత సందడి చేశారు. బీచ్‌రోడ్డు మొత్తం జాతరను తలపించింది. అల్లిపురం(విశాఖ దక్షిణ): నగరాన్ని ప్రశాంతంగా ఉంచేం దుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తద్వారా విశాఖను సేఫ్ జోన్‌గా మార్చాలని అధికారులు, సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మంగళవారం సూర్యాభాగ్ ఏఆర్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేక్ కట్ చేసి, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రూపొందించిన హేండ్‌బుక్, డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర శాంతిభద్రతలు కాపాడటంలో సిబ్బంది ముఖ్యపాత్ర వహించాలన్నారు. 2019లో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. పాపాహోంలో..: పోలీస్ కమిషనరేట్‌లోని పాపాహోం, సీతమ్మధారలోని బాలికల పాపాహోంలో జరిగిన వేడుకల్లో సీపీ పాల్గొన్నారు. చిన్నారులతో కలసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆయనకు కేక్ తినిపించేందుకు పోటీ పడ్డారు. నగర డీసీపీ–1 రవీంద్రనాథ్‌బాబు, డీసీపీ–2 అద్మన్ నయీమ్ అశ్మీ, క్రైం డీసీపీ ఏఆర్ దామోదరరావు, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు మంగళవారం అన్ని శాఖల ఉన్నాతాధికారులు కలెక్టరేట్‌కు క్యూ కట్టారు. జాయింట్ కలెక్టర్ సృజన ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఉప రవాణాశాఖాధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో తేజ్, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. -
అర్చరీ క్రీడకారిణి జ్యోతి సురేఖకు గన్నవరంలో ఘనస్వాగతం
-
పారిస్‌లో ఫ్రాన్స్ ఆటగాళ్లకు ఘన స్వాగతం
-
విశ్వ సుందరి కిరీటమే లక్ష్యం
మిస్ ఇండియా అనుకృతి వాస్ సొంత రాష్ట్రంలో అడుగుపెట్టారు. మిస్ ఇండియా కిరీటంతో స్వగ్రామం చేరుకున్న ఆమెకు ఆప్తులు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అనుకృతి వాస్ అందరితోనూ ఆనంద క్షణాల్ని పంచుకున్నారు. సాక్షి, చెన్నై : మిస్ ఇండియాగా ఎంపికైన అనుకృతి వాస్ తమిళనాడుకు చెందిన వారే. తిరుచ్చి కోట్టూరు సరస్వతి నగర్లో నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రశాంత్, షెలినా దంపతుల కుమార్తె ఈ అనుకృతి వాస్. ఈమెకు ఇంజినీరింగ్ చదువుతున్న సోదరుడు గౌతమ్ కూడా ఉన్నారు. అనుకృతి వాస్కు నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆమె తండ్రి కుటుంబాన్ని వీడి ఎక్కడికో వెళ్లిపోయారు. దీంతో తల్లి షెలినా సంరక్షణలో పెరిగారు. బాల్యం, ప్రాథమిక, మాధ్యమిక విద్యా భ్యాషం అంతా తిరుచ్చిలో సాగింది. ఉన్నత చదువు చెన్నై లయోల కళాశాలలో బీఏ –ఫ్రెంచ్ చదువుతున్నారు. తమ బిడ్డ మిస్ ఇండియాగా ఎంపిక కావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేవు. ఆప్తులు, సరస్వతి నగర్ వాసులే కాదు, సహచర విద్యార్థినులు, స్నేహితులు అను రాకకోసం ఎదురు చూశారు. అయితే, శనివారం స్వస్థలానికి ఆమె వస్తున్న సమాచారాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. ఉదయాన్నే సరస్వతి నగర్‌కు చేరుకున్న అనుకృతి వాస్కు కుటుంబీకులు, బంధువులు, ఆప్తులు, స్నేహితులు ఆహ్వానం పలికారు. మిత్రులతో కలిసి స్వీట్లు పంచుకుంటూ అను ఆనందాన్ని పంచుకున్నారు. చెన్నైలోనూ.. తిరుచ్చిలో కుటుంబీకులు, ఆప్తులతో ఆనందాన్ని పంచుకునేందుకు అను వచ్చిన సమాచారంతో అభిమానులు పోటెత్తారు. సరస్వతి నగర్ పరిసర వాసులు, తిరుచ్చిలోనూ పలు సంస్థలు, యువజనులు తరలివచ్చి ఆమెను అభినందించారు. అక్కడి నుంచి అనుకృతి వాస్ సాయంత్రం చెన్నైకి చేరుకున్నారు. ఇక్కడి ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెను పలు సంస్థలు సత్కరించి, అభినందించాయి. కాగా, తల్లి సంరక్షణలో పెరిగినా, తన వంతుగా సామాజిక సేవను సైతం అనుకృతి వాస్ సాగిస్తుండడం విశేషం. హిజ్రాలకు విద్యను బోధిస్తున్నారు. అగ్ని అనే ప్రాజెక్ట్ ద్వారా అందరికీ విద్య లభించాలన్న సంకల్పంతో ప్రత్యేక కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. చిన్న అనాథాశ్రమాన్ని సైతం నిర్వహిస్తున్న అనుకృతి వాస్‌ను ప్రముఖులు పొగడ్తలతో, ప్రశంసలతో ముంచెత్తారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, విశ్వ సుందరి కిరీటం లక్ష్యం అని ఆకాంక్షను వ్యక్తం చేశారు. విశ్వ సుందరి కిరీటం లక్ష్యం విశ్వ సుందరి 2018 పోటీలకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అనుకృతి తన సామాజిక సేవను, తన లక్ష్యాన్ని మీడియా ముందు ఉంచారు. 30 మంది పిల్లలతో తాను చిన్న అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సమాజంలో అందరికీ విద్య దక్కాలని, స్వయం ప్రతిభతో ప్రతి ఒక్కరూ జీవించాలన్నారు. ఇందులో భాగంగా ముప్ఫై మంది హిజ్రాలకు తన వంతు సాయాన్ని అందిస్తున్నట్టు వివరించారు. సమాజానికి తన వంతు సహకారం అందించే రీతిలో బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్టు ద్వారా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామిని కలవనున్నట్టు పేర్కొన్నారు. ఇక, తన విజయానికి కారణం తల్లి అని ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఆమె ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు అని, తనను సూపర్ ఉమెన్‌గా ఆమె భావించే వారు అని తెలిపారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మహిళలు ప్రతికూల దృక్పథాన్ని వీడి అనుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలని సూచించారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు అని, అన్నింటా జయ కేతనం ఎగుర వేయగలరని వ్యాఖ్యానించారు. కృషి, పట్టుదల, ఆత్మ స్తైర్యంతో లక్ష్య సాధనపై దృష్టిని సారించిన పక్షంలో విజయం తప్పకుండా వరిస్తుందన్నారు. అనుకృతి వాస్ ఆదివారం నగరంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
రేణిగుంట రైల్వేస్టేషన్లో వరప్రసాద్‌కు ఘనస్వాగతం
-
కాపులంతా జగన్ వెంటే
సాక్షి, తిరుపతి తుడా : కాపులు సీఎం చంద్రబాబునాయుడి మోసాలను గుర్తించారని, అందుకే వారంతా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో ఎన్టీఆర్ కుటుంబా నికి అత్యంత ఆప్తులుగా ఉన్న నైనారు కుటుంబానికి చెందిన నైనారు మధుబాల బంధుమిత్రులు, అనుచరులతో కలిసి బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. భూమన కరుణాకరరెడ్డి నివాసంలో జరి గిన ఈ కార్యక్రమంలో నైనారు మధుబాలకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. కరుణాకరరెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ నైనారు కుటుంబంతో తనకు చిన్ననాటి నుంచి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఆ కుటుంబం పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఓటు బ్యాంకు కోసం గత ఎన్నికల్లో కాపులను వాడుకున్న సీఎం చంద్రబాబు వారిని దారుణంగా మోసం చేశారని దుయ్యబట్టారు. కుల రాజకీయాలతో చంద్రబాబు పార్టీని నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్న సామెతను నిజం చేస్తూ కుల రాజకీయాలే ఆయన్ను ముంచనున్నాయని జోస్యం చెప్పారు. కాపులకు వైఎస్సార్ సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. నైనారు మధుబాల మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. కాపు నాయకులు దుద్దేల బాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బాలిశెట్టి కిశోర్ మాట్లాడుతూ కాపు ఉద్యమానికి జగన్మోహన్రెడ్డి సంపూర్ణ మద్దతు తెలపడంతో బలిజలు వైఎస్సార్ సీపీపై నమ్మకంతో ఉన్నారన్నారు. పార్టీ ఎస్సీ సెల్ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు టి.రాజేంద్ర, అజయ్‌కుమార్ మాట్లాడుతూ మానవత్వమే వైఎస్సార్సీపీ కులమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కుసుమకుమారి, బొమ్మగుంట రవి, బండ్ల లక్ష్మీపతి పాడి శివప్రసాద్ యాదవ్, పుల్లయ్య, రాధామాధవి, శైలజ, లక్ష్మీరెడ్డి, వాసుయాదవ్, కేతం జయచంద్రారెడ్డి, గీతా యాదవ్, సాయికుమారి తదితరులు పాల్గొన్నారు. -
కామన్వెల్త్ క్రీడా విజేతలకు ఘనస్వాగతం
సాక్షి, న్యూఢిల్లీ: గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు గెల్చుకుని వచ్చిన భారత క్రీడాకారులకు దేశంలో ఘన స్వాగతం లభిస్తోంది. రెజ్లింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన సుశీల్ కుమార్‌కి, బాక్సింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన మేరికోమ్‌కి సొంత రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో దేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారిణి మనికా బత్రాకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. మంగళవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మనికాకు అభిమానులు పెద్దఎత్తున స్వాగత ర్యాలీ నిర్వహించారు. మనికా దేశం గర్వపడేలా చేసిందని, ఇలాగే మరిన్ని స్వర్ణ పతకాలు గెలవాలని క్రీడాభిమానులు కోరుకున్నారు. మనికా బత్రా మాట్లాడుతూ.. ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. కామన్వేల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించడం సంతోషంగా ఉందని, ఇలాగే మరిన్ని పతాకాలను భారత్‌కు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో భారతదేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించింది క్రీడాకారిణి మనికా బత్రా. సింగపూర్ క్రీడాకారిణి మెయినగ్యు యూతో జరిగిన హోరాహోరీ పోరులో మనికా 11-7, 11-6, 11-2, 11-7 పాయింట్లతో గెలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో కామన్వెల్త్ చరిత్రలో భారతదేశానికి టేబుల్ టెన్నిస్‌లో స్వర్ణపతకం తీసుకొచ్చిన మొదటి మహిళగా రికార్డులకెక్కింది. సెమీ ఫైనల్లో ఈమె వరల్డ్ నెంబర్ ఫోర్ మరియు ఒలింపిక్ మెడల్ గ్రహీతైన సింగపూర్ క్రీడాకారిణి తియాన్వై ఫెంగ్‌ను ఓడించడం విశేషం. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యలను భారత అథ్లెట్లు సొంతం చేసుకున్నారు. మొత్తం 66 పతకాలతో భారత్ మూడోస్థానంలో నిలిచింది. భారత మెన్స్ అథ్లెట్లు 13 స్వర్ణాలతో పాటు 9 రజతాలు, 13 కాంస్యా పతకాలు సాధించారు. ఇక ఉమెన్స్ విభాగంలో 12 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్యా పతకాలు వచ్చాయి. మిక్స్ డ్ టీమ్ విభాగం లో ఒక్కో స్వర్ణం, రజతం, కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. -
అంబరాన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు
-
షేర్ బహదూర్ దేవ్‌బాకు ఘనస్వాగతం
-
మిథాలీ సేనకు ముంబయిలో ఘనస్వాగతం
-
మహిళా క్రికెటర్లకు ఘనస్వాగతం..
ముంబై: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడి తిరిగి స్వదేశం చేరుకున్న మిథాలీ సేనకు ఘనస్వాగతం లభించింది. బుధవారం తెల్లవారుజామున ఇంగ్లండ్ నుంచి ముంబై చేరుకున్న జట్టుకు బీసీసీఐ సిబ్బంది, అభిమానులు ఇండియా.. ఇండియా అంటూ హర్షాతిరేకల మధ్య ఘనంగా ఆహ్వానించారు. జులై 23న ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 9పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. టోర్ని ఆసాంతం భారత మహిళల ప్రదర్శన భారత అభిమానుల మనసులను గెలుచుకొంది. కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్‌కౌర్, జులన్ గోస్వామితో పాటు పలువురు క్రికెటర్లకు ముంబైలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానంలో ఘనస్వాగతం లభించింది. ఈ స్వాగతం అంచనా వేయలేదు.. ఈ సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ.. ‘స్వదేశంలో ఇంతటి ఘనస్వాగతం లభిస్తోందని ఏ ఒక్కరమూ అంచనా వేయలేదు. ప్రస్తుతం క్రీడల్లో అమ్మాయిలు అద్భుతంగా రాణిస్తున్నారు. వారంతా వేడుకలు చేసుకోవాలి. గతంలో మహిళా క్రికెట్ గురించి ఎక్కువగా మాట్లాడుకునే వారు కాదు. ప్రపంచకప్‌లో మా ప్రదర్శనతో ఇప్పుడు అందరూ మా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది చాలా సంతోషకరం’ అని మిథాలీ తెలిపారు. త్వరలో బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి మిథాలీ సేనను సత్కరించనుంది. ఈ కార్యక్రమంలోనే గతంలో ప్రకటించిన నజరానా(ఒక్కొక్క మహిళా క్రికెటర్‌కు రూ.50లక్షలు)ను అందజేయనుంది. త్వరలో ప్రధాని మోదీని మిథాలీ సేన కలిసే అవకాశం ఉంది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షా
-
తిరుమలలో సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం
తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. మంగళవారం సాయంత్రం విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తిరుమల గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. టీటీడీ అతిథి గృహంలో సీఎం కేసీఆర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని ఆత్మీయంగా పలకరించారు. బుధవారం ఉదయం సీఎం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ. 5 కోట్ల 59 లక్షల విలువైన బంగారు ఆభరణాలను శ్రీవారికి అందజేస్తారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మ వారిని దర్శించుకుంటారు. ఆయనతో పాటు కేటీఆర్, కవిత కుటుంబసభ్యులు, మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, పద్మారావు, ఐకే రెడ్డి తదితరులు ఉన్నారు. -
రేణిగుంటలో కేసీఆర్‌కు ఘనస్వాగతం
-
రాష్ట్రపతికి ఘన స్వాగతం
హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో శీతాకాల విడిదికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం వైమానిక దళ ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ నుంచి హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, పలువురు ఉన్నతాధికారులు రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి రాష్ట్రపతి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకున్నారు. ఈ నెల 31 వరకు రాష్ట్రపతి నిలయంలోనే బస చేస్తారు. ఇక్కడినుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. 23న సికింద్రాబాద్‌లోని ఆర్మీ దంతవైద్య కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అదేరోజు తెలంగాణ, ఏపీ వాణిజ్య పారిశ్రామిక మండలి (ప్యాఫ్సీ) శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతారు. 24న హైదరాబాద్‌లో మహిళా దక్షత సమితి, బన్సీలాల్ మాలాని నర్సింగ్ కళాశాలను ప్రారంభిస్తారు. 25న బెంగళూరుకు వెళ్లి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేరోజు హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. 30న రాష్ట్రపతి నిలయంలో జరిగే తేనీటి విందుకు గవర్నర్, సీఎం, ఇతర ప్రముఖులు హాజరవుతారు. -
ధూం ధాంగా స్వాగతం
సాక్షి, హైదరాబాద్: గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని బుధవారం హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. ప్రాజెక్టుల ద్వారా లబ్ధి పొందనున్న ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు తరలివచ్చారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ స్వాగత కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేసింది. బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గంలో పెద్దఎత్తున బ్యానర్లు ఏర్పాట్లు చేశారు. సీఎం ముంబై నుంచి మధ్యాహ్నం రెండు గంటల కు చేరుకుంటారని, ఒంటి గంటకల్లా సభా స్థలికి చేరుకోవాలని శ్రేణులకు సూచించారు. కానీ సీఎం సాయంత్రం నాలుగు గంటల తర్వాతే బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మంత్రులు హరీశ్, నాయిని, తలసాని, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి తదితరులు సీఎంను స్వాగతించి ఓపెన్ టాప్ బస్సులో తీసుకువచ్చారు. పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంతోపాటు బస్సుపై నుంచి కార్యకర్తలకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. సీఎం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి కాక బస్సుపై నుంచే ప్రసంగించారు. అదే బస్సుపైనే ప్రజలకు అభివాదం చేస్తూ తన అధికారిక నివాసానికి వెళ్లిపోయారు. కేసీఆర్ రాక సుమారు రెండు గంటల పాటు ఆలస్యం కావడంతో ప్రభుత్వ సాంస్కృతిక సారథి విభాగానికి చెందిన కళాకారులు ఆటపాటలతో అలరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ఆట పాటలతో ఆకట్టుకున్నారు. సీఎంకు స్వాగతం పలికేందుకు చేసిన ఏర్పాట్లను మంత్రి తలసాని పర్యవే క్షించగా, టీఎస్ఎండీసీ చైర్మన్ ఎస్.సుభాష్‌రెడ్డి అధికారులను, వివిధ శాఖలను సమన్వయం చేశారు. చరిత్రాత్మక ఒప్పందం చేసుకుని నగరానికి చేరుకున్న సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు అధికార టీఆర్ఎస్ రెండు రోజులుగా ఏర్పాట్లు చేసుకుని అనుకున్న స్థాయిలో జనాలను సమీకరించిందని పార్టీ నేత ఒకరు చెప్పారు. -
సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం
-
స్వదేశానికి రెజ్లర్ సాక్షి మాలిక్
-
'పతకం కోసం 12 ఏళ్లు కష్టపడ్డా'
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ లో దేశానికి పతకం సాధించిపెట్టాలన్న తన కలం సాకారమైందని మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ తెలిపింది. దీని కోసం గత 12 ఏళ్లుగా శ్రమిస్తున్నానని చెప్పింది. రియో ఒలింపిక్స్ భారత్‌కు తొలి పతకం అందించిన సాక్షి మాలిక్ బుధవారం ఢిల్లీ చేరుకుంది. విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తనను ఘనంగా స్వాగతించడం పట్ల సాక్షి మాలిక్ సంతోషం వ్యక్తం చేసింది. ఇదో అద్భుతమైన అనుభవమని వ్యాఖ్యానించింది. దేశానికి పతకం సాధించిపెట్టడం గర్వకారణంగా ఉందని పేర్కొంది. విమానాశ్రయంలో ఇంత ఘనంగా తన కుమార్తెకు స్వాగతం లభిస్తుందని ఊహించలేదని ఆమె తండ్రి సత్బీర్ అన్నారు. ఇది గర్వించదగ్గ క్షణమని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి హర్యానాలోని రోహ్తక్ జిల్లా మొఖ్రా ఖాస్ గ్రామంలోని తన ఇంటికి సాక్షి మాలిక్ చేరుకుంది. ఇక్కడే భారీ జనసమూహం మధ్య ఆమెకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సన్మానం చేయనున్నారు. -
సింధుకు ఘనస్వాగతం
-
వెండికొండకు స్వాగతం
-
మరిన్ని విజయాలతో మీ ముందుకు వస్తా
మున్ముందు మరిన్ని విజయాలు సాధించి, మరిన్ని పతకాలతో మళ్లీ మీ అందరి ముందుకు వస్తానని ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు తెలిపింది. రియోలో పతకం సాధించిన తర్వాత తొలిసారి నగరానికి వచ్చిన సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌లకు అపురూపమైన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి గచ్చిబౌలి స్టేడియానికి వచ్చేవరకు అడుగడుగునా పుష్పగుచ్ఛాలు, దండలతో వాళ్లను ముంచెత్తారు. అనంతరం స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ''మీ అందరి మద్దతు, ఆశీర్వాదాల వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఇందుకు గాను మా గురువు గోపీచంద్‌కు చాలా థాంక్స్. మా తల్లిదండ్రులు కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు, మోటివేట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్, కేటీఆర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు స్టేడియానికి ఇంతమంది వస్తారని ఏమాత్రం అనుకోలేదు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించి మళ్లీ మీ ముందుకు వస్తానని అనుకుంటున్నాను'' అన్నారు. సింధు స్ఫూర్తితో మున్ముందు మరింతమంది మరిన్ని పతకాలను దేశానికి తీసుకురావాలని సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఇంత మంచి స్వాగతం ఏర్పాటుచేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు అని తెలిపారు. విమానాశ్రయం నుంచి వస్తుంటే దారి పొడవునా చిన్నా పెద్దా అందరూ సాదరంగా స్వాగతం పలికారని, మాకు ఇన్ని రోజుల నుంచి మద్దతిచ్చిన మీకు, ప్రభుత్వానికి చాలా చాలా ధన్యావాదాలని అన్నారు. ఇక్కడకు వచ్చిన చాలామంది లాగే తాను కూడా 2000 సంవత్సరంలో కరణం మల్లేశ్వరి పతకం గెలిచినప్పుడు ఆమెను చూసి స్ఫూర్తి పొందానని చెప్పారు. ఇప్పుడు ఉన్న పిల్లల్లో కూడా చాలామంది సింధును స్ఫూర్తిగా తీసుకుని మున్ముందు దేశానికి మరిన్ని పతకాలు తెస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మీరు అందిస్తున్న సహకారం చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. క్రీడల్లో కూడా మన రాష్ట్రం ముందు నిలుస్తుందని భావిస్తున్నానని తెలిపారు. తెలంగాణ నుంచి దేశం పేరు ప్రఖ్యాతులను పెంచేలా ఒలింపిక్స్‌లో గెలవడం సంతోషించదగ్గ విషయమని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు ''ప్రపంచస్థాయికి తెలంగాణ గౌరవాన్ని కాపాడినందుకు సింధును అభినందిస్తున్నాం. క్రీడాకారులను ఇంకా ప్రోత్సహించడానికి సీఎం ఇంకా చాలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ క్రీడాకారులంతా సింధును ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నాం'' అని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చెప్పారు. ''గోపీచంద్ ఇంతమంది ఛాంపియన్లను ఎలా తయారుచేశారో తెలుసుకోడానికి మీరు వచ్చారు.. ప్రధానమంత్రి బేటీ బచావో, బేటీ పఢావో అన్నారు. ఇద్దరు బేటీలు భారతదేశాన్ని బచాయించారు. దేశ కీర్తిపతాకాన్ని ప్రపంచంలో నిలబెట్టారు. మీ అమ్మాయి భారతదేశ పుత్రికగా ఎదిగింది.. అందుకు రమణ, విజయలకు అభినందనలు. మీ త్యాగాల నుంచి కోచ్ శిక్షణ నుంచే ఆమె ఇంత స్థాయికి ఎదిగింది. మంచి క్రీడా విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం. సింధు వెనకే ఉండి గోపీ మంత్రాలు చదివారు.. ఆ మంత్రాలు ఏంటో మాకు చెప్పలేదు గానీ, అవే ఆమెకు పతకం సాధించిపెట్టాయి'' అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ''ఒలింపిక్ ఛాంపియన్‌గా దేశ కీర్తిప్రతిష్ఠలను సింధు, ఆమె గురువర్యులు గోపీచంద్, తల్లిదండ్రులతో పాటు మా అందరికీ ఇది చాలా సంతోషకరమైన రోజు. దేశ పరువును నిలబెట్టింది ముగ్గురూ ఆడబిడ్డలే. సింధు, సాక్షి మాలిక్ పతకాలు సాధించగా దీపా కర్మాకర్ కూడా శాయశక్తులా ప్రయత్నించింది. భవిష్యత్తులో తప్పకుండా గోల్డ్ మెడల్ వస్తుంది'' అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ''జై సింధు.. జై తెలంగాణ.. జై హింద్. దేశం పేరు, తెలంగాణ పేరు నిలబెట్టిన సింధుకు, ఆమె తల్లిదండ్రులకు అభినందనలు. సీఎం కేసీఆర్ నెంబర్ 1 సీఎం అయితే సింధు ప్రపంచంలోనే నెంబర్ 2గా నిలిచింది. సింధు స్ఫూర్తితో తెలంగాణ నుంచి మరింత మంది మరిన్ని పతకాలు తేవాలి. సింధు కూడా ఈసారి తప్పనిసరిగా స్వర్ణపతకం సాధిస్తుంది'' అని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. -
'మరిన్ని విజయాలతో మీ ముందుకు వస్తా'
-
ఎయిర్‌పోర్టులో సింధుకు ఘనస్వాగతం
-
ఎయిర్‌పోర్టులో సింధుకు ఘనస్వాగతం
ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించి మువ్వన్నెల పతాకాన్ని వినువీధిలో సగర్వంగా ఎగరేసిన పీవీ సింధు, ఆమె కోచ్ గోపీచంద్‌లకు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఉదయం 9 గంటల సమయంలో విమానాశ్రయంలో దిగిన పీవీ సింధుకు స్వాగతం పలికేందుకు ముందుగానే ఆమె తల్లిదండ్రులు పీవీ రమణ, విజయలతో పాటు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, నాయిని నరసింహారెడ్డి, వి.హనుమంతరావు, మేయర్ బొంతు రామ్మోహన్, ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఇంకా పలువురు క్రీడా, అధికార, అనధికార ప్రముఖులు శంషాబాద్ చేరుకున్నారు. ముంబై నుంచి ప్రత్యేకంగా తెప్పించిన డబుల్ డెక్కర్ ఓపెన్ టాప్ బస్సును పూలదండలతో అలంకరించారు. బస్సు మొత్తాన్ని చివరి నిమిషంలో కూడా పోలీసు శునకాలతోను, మెటల్ డిటెక్టర్లతోను క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. గోపీచంద్ అకాడమీ నుంచి వచ్చిన పలువురు విద్యార్థులు కూడా తమ తోటి క్రీడాకారిణి సింధును సాదరంగా స్వాగతించారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆమె ప్రముఖుల నుంచి బొకేలు అందుకుని.. తన కోసం సిద్ధంగా ఉన్న ఓపెన్ టాప్ బస్సు ఎక్కింది. చాలామంది ఆమెకు స్వయంగా పూల బొకేలు, దండలు చేతికి ఇవ్వలేకపోవడంతో.. ఓపెన్ టాప్ బస్సు ఎక్కిన తర్వాత కూడా కింది నుంచి పైకి వాటిని విసిరారు. వాటిని ఆమె అందిపుచ్చుకుని, అక్కడి నుంచే వారికి అభివాదాలు తెలిపారు. -
సింధుకు గ్రాండ్ వెల్కం ఏర్పాట్లు
-
అనంతలో విజయమ్మకు ఘనస్వాగతం
-
‘పేట’లో సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం
సూర్యాపేట : ఖమ్మంలో బుధవారం నిర్వహించనున్న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మంగళవారం సూర్యాపేటలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సుమారు గంట సేపు జాతీయ రహదారిపై వందలాది మంది నాయకులు, కార్యకర్తలు వేచి ఉన్నారు. ముఖ్యమంత్రి కొత్త బస్టాండ్ వద్దకు చేరుకొని తన కాన్వాయ్ నుంచే పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. స్వాగతం పలికిన వారిలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పార్టీ అధ్యక్షులు బండా నరేందర్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, తహ సీల్దార్ మహమూద్‌అలీ, సూర్యాపేట, కోదాడ మున్సిపల్ చైర్పర్సన్లు గండూరి ప్రవళిక, వంటిపులి అనిత, నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, సోమా భరత్‌కుమార్, నంద్యాల దయాకర్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, కట్కూరి గన్నారెడ్డి, గండూరి ప్రకాశ్, వైవీ, గోదల రంగారెడ్డి, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, గుడిపూడి వెంకటేశ్వరరావు, ఉప్పల ఆనంద్, కెక్కిరేణి నాగయ్యగౌడ్ తదితరులు ఉన్నారు. సూర్యాపేట డీఎస్పీ ఎంఏ రషీద్ పర్యవేక్షణలో పట్టణ సీఐ వై.మొగలయ్య ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. -
సీఎం రాకకు ఏర్పాట్లు
బాన్సువాడ : జిల్లాకు రానున్న సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి భారీ ఏర్పాట్లు చేయిస్తున్నారు. పలు గ్రామాల్లో ఫ్లెకీలు, స్వాగత తోరణాలు, ప్లకార్డులు తయారు చేయిస్తున్నారు.సోమవారం మంత్రి బాన్సువాడలోని తన స్వగృహం వద్ద నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మంజూరుపై నాయకులతో సమీక్షించారు. కలెక్టర్ సమీక్ష నిజామాబాద్‌అర్బన్: ఏప్రిల్ ఒకటి, రెండు తేదీలలో సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ యోగితారాణా తెలి పా రు. సోమవారం అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ఒకటో తేదీ న నర్సింగ్‌పల్లి, మాక్లూర్‌లో పర్యటన అనంతరం జిల్లా కేంద్రంలో మిషన్ భగీ రథ, మిషన్ కాకతీయ, రెండు పడక గదు లు, దళితులకు భూపంపిణీ, గ్రామజ్యోతి, ఆర్మూర్, నిజామాబాద్ పట్టణ అభివృద్ధి, కరువు నివారణ పనులు, కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్లను సమీక్షిస్తారని తెలి పా రు. డిచ్పల్లి బెటాలియన్, తిమ్మాపూర్ వద్ద హెలిపాడ్లను సిద్ధంగా చేయనున్న ట్లు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. -
వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం
విజయనగరం నుంచి భారీ బైక్, కార్ల ర్యాలీలతో తరలి వెళ్లిన నాయకులు, కార్యకర్తలు పోలీసుల ఆంక్షలను లెక్క చేయని అభిమానం విజయనగరం మున్సిపాలిటీ/ డెంకాడ : భోగాపురంలోని ఎయిర్‌పోర్టు బాధితులకు ధైర్యం చెప్పేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డెంకాడ మండలం మోదవలస సమీపంలోని రాజాపులోవ జాతీయ రహదారికి వద్దకు చేరుకోగానే పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణారంగారావు, పీడిక రాజన్నదొరలతో పాటు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, మజ్జి శ్రీనివాసరావు తదితరులు పుష్పగుచ్ఛాలతో ఆయనకు సాదర స్వాగతం పలికారు. పార్టీ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు విజయనగరం పట్టణం నుంచి వందలాది మంది యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్‌లపై, కార్లపై ర్యాలీగా తరలివెళ్లారు. ప్రతిపక్ష నేత పర్యటన విజయవంతం కాకుండా చేసేందుకు పోలీసు యంత్రాంగం పెట్టిన ఆంక్షల సంకెళ్లను సైతం లెక్క చేయలేదు. ముందుస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిర్ణీత సమయానికి వారంతా భారీగా ర్యాలీగా తరలివచ్చి అభిమాన నేతకు అపూర్వంగా స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా వాహనాలతో తరలి రావటంతో జాతీయ రహదారి వైఎస్సార్ పార్టీ జెండాలతో కూడిన వాహనాలతో నిండిపోయింది. విజయనగరం నుంచి విశాఖ వైపు వెళ్లే జాతీయ రహదారి వైపుగా ఎదురు చూస్తున్న సమయంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని భావించిన పోలీసులు జగన్ కాన్వాయ్‌ను శ్రీకాకుళం-విశాఖ జాతీయ రహదారి నుంచి మళ్లించారు. దీంతో జగన్ కాన్వాయ్‌ను గుర్తించి కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా వచ్చేశారు. దీన్ని గమనించిన జగన్ కాన్వాయ్‌ను ఆపి అందరినీ పలకరించారు. జాతీయ రహదారి పొడవునా జనం ఉండటంతో చాలా దూరం వరకూ కారులో నించుని అభివాదం చేశారు. -
జగన్‌కు ఘనస్వాగతం
తుని :ప్రకృతి విపత్తులు, దుర్ఘటనల బాధితులను పరామర్శించేందుకు విశాఖ జిల్లా నుంచి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి తునిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం 4.45 గంటలకు వచ్చిన ఆయనకు జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ తుని జాతీయరహదారి కొట్టం సెంటర్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. 15 నిమిషాలకు పైగా వారితో ముచ్చటించారు. జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురామ్, తాడి విజయభాస్కరరెడ్డి, సంగిశెట్టి అశోక్, గుండా వెంకటరమణ, కొల్లి నిర్మల కుమారి, మిండగుదిటి మోహన్, చెల్లుబోయిన శ్రీనివాసరావు, వట్టికూటి రాజశేఖర్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, కో ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, చెల్లుబోయిన వేణు, పెండెం దొరబాబు, కొండేటి చిట్టిబాబు, ఆకుల వీర్రాజు, గిరజాల వెంకటస్వామినాయుడు, వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, తోట సుబ్బారావునాయుడు, బొంతు రాజేశ్వరరావు, గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శెట్టిబత్తుల రాజబాబు, అత్తిలి సీతారామస్వామి, యువజన విభాగం కార్యదర్శులు గిరజాల వీర్రాజు, గుత్తుల నాగభూషణం, పెంకే వెంకట్రావు, సుంకర చిన్ని, ఎం.మురళీకృష్ణ, జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి సిరిపురపు శ్రీనివాసరావు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. -
రాష్ట్రపతికి ఘనస్వాగతం
-
రాష్ట్రపతికి ఘనస్వాగతం
పుష్పగుచ్ఛ్చం అందించిన గవర్నర్, పాదాభివందనం చేసిన సీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పది రోజుల విడిది కోసం సోమవారం హైదరాబాద్ వచ్చారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సహా త్రివిధ దళాల అధికారులు, రాజకీయ ప్రముఖులు రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. గవర్నర్ పుష్పగుచ్ఛం అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతికి పాదాభివందనం చేశారు. మధ్యాహ్నం 2 గంటల 13 నిముషాలకు రాష్ట్రపతి భారత వాయుసేన విమానంలో హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడకు చేరుకుని స్వాగత ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర మంత్రివర్గం దాదాపుగా రాష్ట్రపతి స్వాగత కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతికి పరిచయం చేశారు. అనంతరం రాష్ట్రపతి తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, త్రివిధ దళాలకు చెందిన అధికారులతో కొద్దిసేపు గడిపారు. పది రోజుల పాటు ఇక్కడే ఉండే రాష్ట్రపతి కోసం అన్ని ఏర్పాటు చేయాలని, ఏ చిన్న అసౌకర్యం కలగనీయవద్దని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. నేడు రాష్ట్రపతికి గవర్నర్ విందు: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ మంగళవారం విందు ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్‌లో రాత్రి ఏడు గంటలకు నిర్వహించే విందుకు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులను సతీసమేతంగా హాజరుకావాలని ఆహ్వానించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులను కూడా విందుకు ఆహ్వానించారు. -
జగన్‌కు ఘన స్వాగతం
కోరుకొండ/రాజమండ్రి రూరల్ : రాజమండ్రిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభా పక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం జగన్ మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు వైఎస్సార్ సీపీ శాసన సభాపక్ష ఉప నేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టిరాజా, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ గిరిజాల వెంకట స్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కుడుపూడి చిట్టబ్బాయి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, అల్లూరి కృష్ణంరాజు, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్, కాకినాడ పార్లమెంటరీ నాయకుడు చలమలశెట్టి సునీల్ తదితరులు స్వాగతం పలికారు. అలాగే నియోజకవర్గ కన్వీనర్లు ఆకుల వీర్రాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, తోట సుబ్బారావునాయుడు, నగర, మున్సిపాలిటీల ప్రతిపక్ష నాయకులు మేడపాటి షర్మిలారెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస్, కాశి మునికుమారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జక్కంపూడి రాజా, కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, మింది నాగేంద్ర, కొల్లి నిర్మలకుమారి, ఇసుకపల్లి శ్రీని వాస్, మంచాల బాబ్జీ, వివిధ విభాగాల జిల్లా కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్ (బాబు), పెట్టా శ్రీనివాస్, మండపాక అప్పన్నదొర, రాష్ట్ర సేవాధళ్ ప్రధాన కార్యదర్శి సుంకరచిన్ని, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు పోలు కిరణ్ మోహన్‌రెడ్డి, గిరజాల బాబు, గుత్తుల బాబి, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి మిండగుదిటి ఆనంద న్యూటన్, పార్టీ నాయకులు విప్పర్తి వేణుగోపాలరావు, అడపా హరి, రావిపాటి రామచంద్రరావు, శెట్టిబత్తుల రాజబాబు, తాడి విజయభాస్కరరెడ్డి, అత్తిలి సీతారామస్వామి, సత్యనారాయణచౌదరి, వాసిరెడ్డి జమీల్, ఆదిరెడ్డి వాసు, యాదల సతీష్ చంద్ర స్టాలిన్‌తో పాటు పార్టీ అనుబంధ కమిటీల నాయకులు, మండల పార్టీల కన్వీనర్లు కూడా ఘన స్వాగతం పలికారు. -
శ్రీకాంత్‌కు ఘనస్వాగతం
సాక్షి, హైదరాబాద్: స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆదివారం టోర్నమెంట్ గెలిచిన శ్రీకాంత్, విజయానంతరం మంగళవారం నగరానికి చేరుకున్నాడు. విమానాశ్రయంలో అతనికి తల్లిదండ్రులు, సోదరుడు నందగోపాల్ స్వాగతం పలికారు. పుల్లెల గోపీచంద్ అకాడమీ తరఫున గోపీచంద్ తల్లి సుబ్బారావమ్మతో పాటు అకాడమీలో శిక్షణ పొందుతున్న పలువురు చిన్నారి షట్లర్లు కూడా శ్రీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన స్విస్ ఓపెన్‌ను గెలుచుకున్న శ్రీకాంత్ ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. శ్రీకాంత్ 24 నుంచి జరిగే ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో తలపడతాడు. రాష్ట్రపతి ప్రణబ్ అభినందన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శ్రీకాంత్‌కు అభినందనలు తెలిపారు. ‘స్విస్ ఓపెన్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించిన శ్రీకాంత్ యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలి చాడు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిం చాలని ఆకాంక్షిస్తున్నాను’ అని రాష్ట్రపతి ఒక ప్రకటనలో తెలిపారు. -
విమానాశ్రయంలో జ్యోతులకు ఘనస్వాగతం
కోరుకొండ :వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూకు మధురపూడి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అనేకమంది ఆయనకు స్వాగతం పలికి, పుష్పమాలలతో సత్కరించారు. ఎయిర్‌పోర్టు పరిసరాలు అభిమానులతో కిక్కిరిసి పోయాయి. స్వాగతం పలికినవారిలో పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాస్‌చంద్రబోస్, సీజీసీ సభ్యులు పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, దాడిశెట్టి రాజా, రాష్ట్ర, జిల్లా నాయకులు గిరజాల వెంకట స్వామినాయుడు, పెండెం దొరబాబు, కొండేటి చిట్టిబాబు, చెల్లుబోయిన వేణు, ఆకుల వీర్రాజు, కర్రి పాపారాయుడు, జ్యోతుల నవీన్, అనంత ఉదయ భాస్కర్, ఎం.మోహన్, వట్టికూటి రాజశేఖర్, శెట్టిబత్తుల రాజబాబు, నక్కా రాజబాబు, రావు చిన్నారావు, నక్కా రాంబాబు, వెంగల సుబ్బారావు, పి.కె.రావు, గట్టి రవి, కాళ్ళ లక్ష్మణరావు, మూర వెంకటేశ్వరావు, నూటన్ ఆనంద్, దంగేటి రాంబాబు, మంచాల బాబ్జీ, ఆర్‌వీవీఎస్ చౌదరి, వాసిరెడ్డి జమీలు, సుంకర చిన్ని, కర్రి వెంకట సత్తిరెడ్డి, మంగిన సింహాద్రి, దొంగ యేసుబాబు, దూలం వెంకన్నబాబు, కొమ్మిశెట్టి బాలకృష్ణ, విప్పర్తి వేణుగోపాల్, కుంజం వెంకన్నదొర, పోలి కిరణ్‌రెడ్డి, మండపాక అప్పన్నదొర, చాటిపర్తి దుర్గారావు, కొండమీద కోటేశ్వరరావు, బొంత శ్రీహరి, మట్టపర్తి రాజేంద్ర, కనితి జోగారావు, కాటం రజనీకాంత్, మేడపాటి షర్మిలారెడ్డి, బొత్సా రమణ, బద్రి బాబ్జీ, మోటూరి సాయి, నల్ల రామాంజనేయులు, గిరిజాల బాబు, అత్తిలి సీతారాస్వామి, మట్టపర్తి మురళీకృష్ణ, పెంటా శ్రీనివాసరావు, చిరుపురపు శ్రీనివాస్, మార్గాని గంగాధర్, అడపా వాసు, మాలెం విజయలక్ష్మి, చిన్నం అపర్ణదేవి, సాకా ప్రసన్నకుమార్, గొల్లపల్లి డేవిడ్, మట్టా రాణి, పండా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వివిధ సమస్యలపై పలువురు జ్యోతుల నెహ్రూకు వినతి పత్రాలు అందజేశారు. -
రేణిగుంటలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
చిత్తూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి బయల్దేరిన వైఎస్ జగన్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నెల్లూరు చేరుకుంటారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె వివాహానికి ఆయన హాజరు అవుతారు. వధూవరుల్ని ఆశీర్వదించి వైఎస్ జగన్ తిరిగి రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం 2.30కు హైదరాబాద్ బయల్దేరి వెళతారు. -
గ్రాండ్ వెల్కమ్
ఓ పిల్లకు తల్లి అయిన బాలీవుడ్ అందాల రాశి ఐశ్వర్యారాయ్ చాలా కాలం తరువాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చిన సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ లభించిందట. సంజయ్‌గుప్తా ‘జజ్బా’లో ఐష్ ఓ లాయర్ పాత్రలో కనిపిస్తుంది. ఇర్ఫాన్‌ఖాన్ సస్పెండెడ్ కాప్‌గా, షబనా ఆజ్మీ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ముంబైలో బిజీగా ఉండే జుహూలో షూటింగ్ జరుగుతోంది. ఐశ్వర్య, ఇర్ఫాన్‌ల మధ్య వాడివేడి సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నీలి కళ్ల సుందరి తన నటనతో అందరి హృదయాలూ కొల్లగొట్టేసిందట. చాన్నాళ్ల తరువాత అమ్మడి పెర్ఫార్మెన్స్ లైవ్‌లో చూసిన యూనిట్ సభ్యులంతా నిలుచుని చప్పట్లు కొట్టి అభినందించారట! -
ఒబామాకు ఘన స్వాగతం
న్యూఢిల్లీ: భారత సందర్శనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అపూర్వంగా కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం లభించింది. ప్రొటోకాల్ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఒబామా దంపతులకు స్వాగతం పలకగా... రాష్ట్రపతి భవన్లో దేశంలోనే అత్యుత్తమమైన ‘21 గన్ శాల్యూట్’ గౌరవంతో.. రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. ‘సైనిక వందనం (గార్డ్ ఆఫ్ హానర్)’తోనూ గౌరవించారు. ఇంతకు ముందు 2010లో ఒబామా భారత పర్యటనకు వచ్చినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ దంపతులు కూడా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు. అయితే ఈ సారి దేశ గణతంత్ర వేడుకలకు ఒబామా ముఖ్య అతిథిగా హాజరవుతుండడంతో మరింత ప్రాధాన్యత దక్కుతోంది. తొలుత విమానాశ్రయంలో ఒబామాకు ప్రధాని మోదీ స్వయంగా ఎదురేగి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఒబామా, మోదీ ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఒబామా దంపతులను మోదీ స్వయంగా తోడ్కొని విమానాశ్రయంలోకి వెళ్లారు. అక్కడి నుంచి తాము బస చేసే హోటల్‌కు వెళ్లిన ఒబామా దంపతులు అనంతరం రాష్ట్రపతి భవన్‌కు వచ్చారు. ఒబామా రాక సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఆవరణను అత్యంత సుందరంగా అలంకరించారు. అక్కడి వేదికను కూడా అలంకరించి సిద్ధం చేశారు. రాష్ట్రపతి భవన్ గేటు వద్ద నుంచే ఒబామాకు ఘన స్వాగతం లభించింది. ఎరుపురంగు డ్రెస్, నీలిరంగు తలపాగాలు చుట్టుకున్న రాష్ట్రపతి బాడీగార్డుల అశ్విక దళం ఒబామా వాహనం ‘ది బీస్ట్’కు ముందు వెనుక నిలిచి లోపలికి తోడ్కొని వెళ్లింది. భవనం ప్రాంగణంలోకి వారు చేరుకోగానే... అప్పటికే అక్కడకి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ఒబామా దంపతులకు చిరునవ్వుతో స్వాగతం పలికారు. పలకరింపులు, కుశల ప్రశ్నల అనంతరం.. ఒబామాను రాష్ట్రపతి గార్డులు వేదికపైకి తోడ్కొని వెళ్లారు. భారత, అమెరికా జాతీయ గీతాల నేపథ్య సంగీతం వినిపిస్తుండగా.. మిలటరీ బ్యాండ్ వాయించారు. అనంతరం వింగ్ కమాండర్ పూజా ఠాకూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రివిధ దళాల సైనిక వందనాన్ని ఒబామా స్వీకరించారు. తర్వాత ఒబామాకు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరిచయం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్ పారికర్, వెంకయ్యనాయుడు, పీయూష్‌గోయల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఒబామా దంపతులు మహాత్మాగాంధీకి నివాళులు అర్పించేందుకు రాజ్‌ఘాట్‌కు బయలుదేరి వెళ్లారు. చాలా సంతోషం..! తమకు లభించిన ఘన స్వాగతం, ఆతిథ్యం ఎంతో అపూర్వమని అమెరికా అధ్యక్షుడు ఒబామా సంతోషం వ్యక్తం చేశారు. సైనిక వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు ఉన్న చోటికి వచ్చిన ఆయన భారతీయ సాంప్రదాయంలో రెండు చేతులనూ జోడించి ‘నమస్తే’ చెప్పారు. భారత్‌కు మరోసారి వచ్చిన తమకు ఇంత గౌరవం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. మిషెల్ డ్రెస్ జిగేల్! న్యూఢిల్లీ: నలుపు రంగు డ్రెస్‌పై తెల్ల గీతలు.. వాటిపై నీలి రంగు పూల డిజైన్‌తో ఒబామా సతీమణి మిషెల్ మెరిసిపోయారు! మోకాల్ల వరకున్న ఈ డ్రెస్‌పై మ్యాచింగ్ కోటు ధరించారు. ఈ దుస్తులను న్యూయార్క్‌లోని భారతీయ డిజైనర్ బిహు మహాపాత్ర రూపొందించారు. ఒడిషాలోని రూర్కెలాకు చెందిన బిహు అమెరికాలో ప్రఖ్యాత డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నట్టూ.. మోదీ నియోజకవర్గమైన బెనారస్‌లో ఓ ప్రత్యేకమైన పట్టుచీర మిషెల్ కోసం రూపొందించారు. పూర్తిగా చేతితో నేసిన ఈ చీరలో సన్నని బంగారు, వెండి పోగులు వాడారు. 400 గ్రాములు ఉండే ఈ చీర ఖరీదు రూ.1.5 లక్షలు. బెనారస్‌కు చెందిన ముగ్గురు నిపుణులు దీన్ని మూడు నెలలు కష్టపడి తయారు చేశారు. శనివారమే దీన్ని దేశ రాజధానికి తీసుకెళ్లారు. మిషెల్ ఒబామాకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి కశ్మీరీ శాలువ బహూకరించారు. భర్త ఒబామాతో కలిసి ఆదివారం రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన ఆమెకు ప్రత్యేక ఎంబ్రాయిడరీ వర్క్‌తో రూపొందించిన ఈ శాలువాను అందజేశారు. ఈ సందర్భంగా ప్రణబ్ కూడా.. రాజస్థాన్ కళాకారుడు సుకుమార్ బోస్ రూపొందించిన ‘టీ సెట్’ను మిషెల్‌కు బహూకరించారు. ఒబామా రావడం శుభపరిణామం: తొగాడియా జైపూర్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌కు రావడం శుభ పరిణామమని విశ్వహిందూ పరిషత్ సీనియర్ నేత ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఒబామా పర్యటనను అడ్డుకుండామన్న వార్తలను ఆదివారం ఆయన తోసి పుచ్చారు. ‘భారత్ ఎల్లప్పుడూ వ్యాపారవేత్తలకు స్వాగతం పలుకుతుంది. భవిష్యత్తులో ఇండియా కూడా అమెరికా సరసన నిలుస్తుంది.’ అని అన్నారు. మోదీ.. అదరహో! ఒబామాకు ఉదయం విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు ప్రధాని మోదీ గోధుమ రంగు కుర్తా పైజామా ధరించి, దానిపై నెహ్రూ జాకెట్ వేసుకుని వచ్చారు. భుజంపై ఎరుపు రంగు శాలువా ధరించారు. రాష్ట్రపతిభవన్‌లో కార్యక్రమానికి వచ్చినప్పుడు నలుపు రంగు బంద్‌గల్లా సూట్ ధరించి వచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రపతి ప్రణబ్ కూడా నలుపు రంగు బంద్‌గల్లా సూట్ ధరించారు. పూజాఠాకూర్.. తొలి ‘లీడర్’ త్రివిధ దళాల సైనిక వందనం కార్యక్రమానికి దేశంలోనే తొలిసారిగా ఒక మహిళా అధికారి నేతృత్వం వహించింది.. అది కూడా అమెరికా అధ్యక్షుడికి గౌరవసూచకంగా నిర్వహించిన కార్యక్రమంతో.. ఆ అధికారి వైమానిక దళంలో వింగ్ కమాండర్ పూజాఠాకూర్. కాగా ఈ అవకాశం లభించడంపై ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పూజాఠాకూర్ పేర్కొన్నారు. ‘‘పురుషులైనా, మహిళలైనా ఒకేలా శిక్షణ ఇస్తారు. ఇద్దరూ సమానమే. కానీ సైనిక వందనానికి నేతృత్వం వహించే అవకాశం రావడం, అది కూడా ఒబామా కార్యక్రమానికి కావడం గర్వంగా ఉంది..’’ అని ఆమె చెప్పారు. 2000వ సంవత్సరంలో భారత వైమానిక దళంలో అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో చేరిన పూజాఠాకూర్ ప్రస్తుతం వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో డెరైక్టరేట్ ఆఫ్ పర్సనల్ ఆఫీసర్స్ విభాగంలో పనిచేస్తున్నారు. -
నీరాజనం
భువనగిరి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి నీరా‘జనం’ పలికారు. బీబీనగర్ నుంచి జిల్లా సరిహద్దు పెంబర్తివద్దగల కాకతీయ తోరణం వరకు యువనేతకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. జగన్‌రాక సందర్భంగా మహిళలు, యువకులు పెద్దఎత్తున తరలివచ్చారు. మహిళలు మంగళహారతులు పట్టారు. యువకులు బాణసంచాకాల్చి స్వాగతం పలికారు. తనను కలిసిన వారందరితో జగన్ చేతులుకలిపి ఆత్మీయంగా పలకరించారు. జగన్‌పై అభిమానులు పూల వ ర్షం కురిపించారు. జగన్ చూడడానికి యువకులు, మహిళలు, వృద్ధులు తాపత్రయపడ్డారు. బీబీనగర్, టోల్గేట్, గూడురు, ఆలేరులో ఆయన దిగి జనానికి అభివాదం చేశారు. హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాకు వెళ్తున్నా వైఎస్ జగన్, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఉదయం 11.15 గంటలకు బీబీనగర్ చేరుకున్నారు. అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర సహా య కార్యదర్శి గూడూరు జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, బొకేలు ఇచ్చి ఆయనకు సత్కరించారు. అనంతరం టోల్గేట్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహం వద్ద కొద్దిసేపు ఆగారు. అక్కడ భువనగిరి పట్టణ కన్వీనర్ చల్లగురుగులు రఘుబాబు జగన్‌కు పూలదండ వేశారు. అనంతరం బీబీనగర్ మండలంలో గూడూరు వద్ద జైపాల్‌రెడ్డి నాయకత్వంలో భారీగా తరలివచ్చిన మహిళలు జగన్‌కు స్వాగతం పలికారు. మంగళహారతులు పట్టారు. యువకులు ఆయనతో కరచాలనం చేయడానికి పోటీపడ్డారు. తనను పలకరించిన గూడూరు గ్రామ మహిళలు, వృద్ధులను ఆత్మీయంగా ‘బాగున్నారా’ అని కుశల ప్రశ్నలు వేశారు. కారులోంచి దిగి సుమారు 5 నిమిషాలపాటు ముచ్చటించారు. యువకులు అయనపై గులా బీ పూల వర్షం కురిపించారు. అక్కడినుంచి అందరికి అభివాదం చేస్తూ భువనగిరి బైపాస్ మీదుగా ఆలేరుకు వెళ్లారు. ఆలేరులో పార్టీ రాష్ట్రకార్యదర్శి వడ్లోజు వెంకటేష్ నాయకత్వంలో పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆగిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అక్కడికి వచ్చిన మహిళలను పలకరించారు. అక్కడి జిల్లా సరిహద్దులోని పెంబర్తివద్దగల కాకతీయ తోరణం వ రకు వెళ్లారు. అక్కడ వరంగల్ జిల్లా వైఎస్ఆర్సీసీ నాయకులు స్వాగతం పలికారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ వ్యస్థాపక సభ్యుడు శివకుమార్, రాష్ట్ర నాయకులు నల్లా సూర్యప్రకాశ్, గున్నం నాగిరెడ్డి, నంద్యాల కరుణాకర్‌రెడ్డి, ఇరుగు సునిల్‌కుమార్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, నంద్యాల కరుణాకర్‌రెడ్డి, వెల్లాల రామ్మోహన్‌రెడ్డి, ప్రఫుల్రెడ్డి, శ్రీరంగం, కొండా రాఘవరెడ్డి, సిద్దార్థరెడ్డి, మొలుగురాములు, మోడెపు జీవన్‌గౌడ్, జి.యాదగిరి, బండ్రు అంజనేయులు, చెన్న రాజేష్, బండారు ఆనంద్‌గౌడ్, డొంకెన నవీ న,భాస్కర్, పడాల శ్రీకాంత్ ఉన్నారు. -
జగన్‌కు ఘన స్వాగతం
ఘట్కేసర్: వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి ఘట్కేసర్ మండలం జోడిమెట్ల వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సోమవారం వైఎస్ జగన్ వరంగల్ జిల్లాలో సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తూ మార్గమధ్యంలో జోడిమెట్ల వద్ద కొద్దిసేపు ఆగి కార్యకర్తలు, నాయకులతో చరచాలనం చేశారు. జగన్మోహన్రెడ్డి రాక సందర్భంగా పార్టీ శ్రేణులు బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. గం.10.30 సమయంలో జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ జోడిమెట్లకు చేరుకోవడంతో కార్యకర్తలు ‘జై జగన్, జైజై జగన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. పూలదండలు వేసి పుష్ఫగుచ్ఛాలు అందచేశారు. జగన్మోహన్రెడ్డి వెళ్లిపోయిన అనంతరం స్థానిక నాయకులు సుధీర్‌రెడ్డి చిత్ర పటానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆ పార్టీ మేడ్చల్ నియోజవర్గ నాయకుడు సామల యాదిరెడ్డి, రవీందర్‌రెడ్డి, పెరుమాళ్ల అశోక్, మహేష్, రాజు, సంజీవరెడ్డి, కట్ట సంజీవరెడ్డి, సంజీవరెడ్డి, జైపాల్‌రెడ్డి, పోచారం గ్రామశాఖ అధ్యక్షుడు రమేష్ గుప్త, సురేందర్, సుందర్, కొండయ్య, విజయ్, నాగేష్, మురళీ పాల్గొన్నారు. -
న్యూ సంబరాలు
బెంగళూరు: ఉల్లాసాలు, ఉత్సాహాలు, అవకాశాలు, ఆనందాలు, కొత్త అనుభవాలు, సరికొత్త అనుభూతులను మోసుకుంటూ 2015 అడుగుపెట్టేసింది. 2014కి గుడ్ బై చెబుతూ న్యూఇయర్‌కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు మెట్రో వాసులు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని విద్యుద్దీపాల కాంతులతో నగరంలోని ప్ర ధాన కూడళ్లన్నీ సుందరంగా ముస్తాబ య్యాయి. నగరంలోని ఎంజీరోడ్డు, బ్రిగేడియర్ రోడ్డు బుధవారం ఎనిమిది గంటల నుంచే యువతతో కిక్కిరిసిపోయాయి. ఈ రోడ్లపైకి చేరిన యువత ఫోమ్‌ను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ న్యూ ఇయర్ విషెష్ చెప్పుకున్నారు. మరోవైపు నగరంలోని పబ్‌లు, హోటళ్లు న్యూఇయర్ పార్టీలు, హోరెత్తించే డీజేల రీమిక్స్ సాంగ్స్‌తో నగరవాసులకు హుషారెత్తించే కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని దృష్టిలో ఉంచుకొని బీఎంటీసీ, నమ్మ మెట్రోలు అర్ధరాత్రి వరకు సర్వీసులను నడిపాయి. -
గ్రాండ్ వెల్కమ్
నూతన సంవత్సరం 2015కు బుధవారం రాత్రి నగరవాసులు ఘనంగా స్వాగతం పలికారు. స్వాగత సంరంభంలో భాగంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ఉత్సాహం ఉరకలేసింది. నగరంలోని రహదారులపై కుర్రకారు కేరింతలు కొట్టారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమాలు అలరించాయి. కొత్త సంవత్సరానికి నగర ప్రజలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అర్ధరాత్రి 12 గంటలు కాగానే కేక్‌లు కట్‌చేసి, బాణసంచాపేల్చి సందడి చేశారు. బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. యువకులు రోడ్లపై సందడిచేశారు. నగరంలోని పలు హోటళ్లలో 2014కు వీడ్కోలు, 2015కు స్వాగతం పలుకుతూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యుత్ దీపాల వెలుగుల మధ్య వెండితెర, బుల్లితెర తారలు నృత్యాలతో అలరించారు. ఫార్చ్యూన్లో అంబరాన్నంటిన సంబరాలు మిరుమిట్లుగొలిపే విద్యుత్ దీపాల వెలుగులు... హై ఓల్టేజీ మ్యూజిక్.. దుమ్మురేపే డిస్కో.. హోరెత్తించిన డీజేల నడుమ నూతన సంవత్సర ఆగమన సంబరాలు జరిగాయి. మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ ఫార్చ్యూన్ మురళీపార్క్‌లో కౌంట్‌డౌన్ 2015 పేరిట నిర్వహించిన ఈ సంబరాలు అంబరాన్నంటాయి. వయోభేదం లేకుండా చిన్న, పెద్దా అంతా కలిసి చిందులతో సందడిచేశారు. బోల్ బేబీ బోల్ ఫేమ్ మానస ఆచార్య, పాప్‌సింగర్ సిద్దూ లేటెస్ట్ సాంగ్స్‌తో హుషారె త్తించగా, సురేష్ మిమిక్రీ కడుపుబ్బా నవ్వించింది. వేడుకల మధ్యలో ఫన్నీ గేమ్స్‌లో దంపతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈవెంట్స్ మధ్యలో లక్కీడిప్‌లు నిర్వహించి చిరు బహుమతులు అందిస్తూ యాంకర్లు ఉత్సాహపరి చారు. తాజ్ గేట్‌వే హోటల్లోనూ నూతన సంవత్సరం వేడుకలు జోరుగా సాగాయి. నగరంలో ఎక్కడ చూసినా న్యూ ఇయర్ జోష్ కనిపించింది. నగరంలో కేక్‌లు, స్వీట్లు, ఫ్లవర్ బొకేల విక్రయాలు జోరుగా సాగాయి. - లబ్బీపేట ఫన్‌టైమ్ క్లబ్లో సందడే సందడి సినిమా, సీరియల్ ఆర్టిస్టుల నృత్యాలు, మోడరన్ ఈవెంట్లు యువతలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఈ వేడుకలకు భారతి యాంకరింగ్ చేయగా నిరుపమ్, మంజుల, రవికృష్ణ, చందన బ్లాస్టింగ్, థ్రిల్లింగ్ డ్యాన్స్‌లతో అలరించారు. అనంతరం జరిగిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. సభ్యులకు తంబోలా, లక్కీడిప్, లక్కీ మేల్, లక్కీ ఫీమేల్, లక్కీ కిడ్, లక్కీ కపుల్ విభాగాల్లో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. క్లబ్ సొసైటీ కార్యదర్శి అజిత్‌బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గాంధీ, ప్రతినిధి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. - పటమట -
సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం
మిర్యాలగూడ : కృష్ణపట్టె ప్రాంతంలో పవర్ ప్లాం ట్ల నిర్మాణానికి గాను ఏరియల్ సర్వే నిర్వహించడానికి వచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మంగళవారం స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో ఏర్పా టు చేసిన హెలీ పాడ్ వద్ద మంత్రులు లకా్ష్మరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌లతో కలిసి వచ్చిన సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. స్వాగతం పలికిన వారిలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ ఎమ్మెల్యేలు నోముల నర్సింహ్మ య్య, వేనేపల్లి చందర్రావు, టీఆర్ఎస్ నాయకులు అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, సాముల శివారెడ్డి, రాంచందర్‌నాయక్, గోలి అమరేందర్‌రెడ్డి, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, జొన్నలగడ్డ రంగారెడ్డి, గాయం ఉపేందర్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్, రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, జెడ్పీటీసీ శంకర్‌నాయక్, ఎంపీపీ మంగమ్మ తదితరులు ఉన్నారు. అధికారుల హడావిడి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వేలో భాగంగా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని భావించిన అధికారులు హడావిడి చేశారు. మధ్యాహ్నం సీఎం భోజనం చేసిన అనంతరం జిల్లా అధికారులంతా సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. కేవలం అవసరమైన జిల్లా అధికారులతో మాత్రమే ముఖ్యమంత్రి మాట్లాడారు. పలు అంశాలపై చర్చించారు. -
షర్మిలకు ఘన స్వాగతం
మాడ్గుల: జిల్లాలో సోమవారం ప్రారంభమైన పరామర్శ యాత్రకు వచ్చిన షర్మిలకు నల్గొండ జిల్లా కుర్మేడు వద్ద వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎడ్మ కిష్టారెడ్డి షర్మిలకు పుష్పగుచ్ఛం అందజేసి జిల్లాలోకి స్వాగతం పలికారు. అలాగే ఆమె వెంట ఉన్న పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ వై.సుబ్బారెడ్డిలకు ఆయన స్వాగతం పలికారు. మహబూబ్‌నగర్, అలంపూర్, నారాయణపేట, కొడంగల్, అచ్చంపేట, కల్వకుర్తి, జడ్చర్ల తదితర నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ శ్రేణులు అధికసంఖ్యలో తరలొచ్చారు. జిల్లాలోని కొత్త బ్రాహ్మణపల్లి వద్ద షర్మిల జిల్లాలోకి ప్రవేశించారు. డప్పువాయిద్యాలతో మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ జిల్లానాయకులు రవీందర్‌రెడ్డి, సత్యం, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, జెట్టి రాజశేఖర్, జమీర్‌పాషా, బంగి లక్ష్మణ్, నసీర్, హైదర్అలీ, ఆరోగ్యరెడ్డి, సత్తయ్యగౌడ్, సంబు పుల్లయ్య, యాదగిరిరెడ్డి, లక్ష్మినారాయణ, యూసుఫ్‌తాజ్, నాగరాజు, చంద్రశేఖర్, మద్దిలేటి, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఎంపీ కవితకు ఘన స్వాగతం
హైదరాబాద్ : నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విదేశీ పర్యటన ముగించుకుని శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. కాగా నవంబర్ రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు లండన్ లోని కింగ్స్ కాలేజీలో నిర్వహించిన సెమినార్‌కు కవిత హాజరయ్యారు. పదవ తేదీ వరకు లండన్‌లో ఉన్న ఆమె అనంతరం స్కాట్లాండ్లో పర్యటించారు. -
బేగంపేటలో రాష్ట్రపతికి ఘన స్వాగతం
హైదరాబాద్: హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఇక్కడకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. నగరంలో జరిగే నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొంటారు. విమానాశ్రయంలో చంద్రబాబు, కేసీఆర్ పరస్పరం పలకరించుకున్నారు. -
ఎంపీ మేకపాటికి ఘనస్వాగతం
నాయుడుపేట టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి నాయుడుపేటలో శనివారం ఘనస్వాగతం లభించింది. పార్లమెంట్ సమావేశాల అనంతరం మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆయనకు పార్టీ నాయకులు స్థానిక గోమతి సెంటర్లో స్వాగతం పలికారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓడూరు గిరిధర్‌రెడ్డి, మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు సత్కరించారు. రాజమోహన్‌రెడ్డి వెంట ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్‌ను కూడా అభినందించారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి రాలేదని అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తారన్నారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, అవి పరిష్కారమయ్యేందుకు పార్టీ తరపున కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మండల పరిధిలోని ఎన్నికల ఫలితాలపై నాయకులతో కాసేపు చర్చించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఓడూరు సుందరరామిరెడ్డి, కట్టా వెంకటరమణారెడ్డి, కామిరెడ్డి మోహన్‌రెడ్డి, పోతిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, నవీన్‌కుమార్‌నాయుడు, అన్నమనేని రామకృష్ణ, పాదర్తి హరనాథ్‌రెడ్డి, అత్తలపాళెం మధురెడ్డి, పేట చంద్రారెడ్డి, ముప్పాళ్ల జనార్దన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, గంధవల్లి సిద్ధయ్య, మైలారి నాగరాజు, జేష్టాది అంజనీ, దొంతాల రాజశేఖర్‌రెడ్డి, ఆబోతుల బాబు, దుప్పల రవీంద్ర, షేక్ షబ్బీర్‌భాషా,జలదంకి రాజగోపాల్‌రెడ్డి,పట్టుకోట రఘు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాభిమానం వల్లే..
విజయనగరం ఫూల్‌బాగ్: ప్రజాభిమానం వల్లే తాను కేంద్రమంత్రి స్థాయికి ఎదిగానని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పూసపాటి అశో క్‌గజపతిరాజు అన్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత గురువారం ఆయన తొలిసారిగా జిల్లాకు వచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన భారీ సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ తాను చాలా అదృష్టవంతుడ్ని అని, ఎనిమిది సార్లు విజయనగరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ప్రజ లు తనను ఏడుసార్లు గెలిపించారన్నారు. వారి రుణా న్ని తప్పకుండా తీర్చుకుంటానని చెప్పారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తనను చాలాసార్లు ఎంపీగా పోటీ చేయాలని అడిగారని,నాడు తనకు అనుభవం లేదని చెప్పానని గుర్తు చేశారు. తనతాత, తండ్రి, అన్న య్య ఎంపీలుగా ఉన్నా.. వారెవరికీ దక్కని కేంద్రమంత్రి పదవి తనకు దక్కిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ర్టం, జిల్లాలో తాగునీటికి ఇబ్బందులున్నా.. మద్యానికి మాత్రం కొరత లేదన్నారు. నాటి కాంగ్రెస్ పాలనే ఇందుకు కారణమని విమర్శించారు. విద్యార్థులు చదువుకునేందుకు ప్రోత్సహించాలని, మద్యాన్ని కాదని పరోక్షంగా మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే... తమ ప్రభుత్వంలో ప్రజలకు స్వతంత్రాన్ని అందించామని చెబుతున్నారని, స్వతంత్రం అంటే ప్రజలపై కర్ఫూలు విధించడం, 144 సెక్షన్లు పెట్టడం కాదని వి మర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పట్టణంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రజలు తమపై పెట్టిన బాధ్యతను క్రమ శిక్షణతో నిర్వర్తిస్తానన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ అధ్యక్షతన జరి గిన ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ర్ట అధ్యక్షురాలు శోభా హైమావతి, ఎమ్మెల్యేలు మీసాల గీత, కె. ఎ.నాయుడు, పతివాడ నారాయణస్వామినాయుడు, బొబ్బిలి చిరంజీవులు, కోళ్ల లలితకుమారి, అశోక్ సతీ మణి సునీలా గజపతి, కుమార్తె అతిథి గజపతి, అరకు పార్లమెంట్ టీడీపీ ఇన్‌ఛార్జి గుమ్మడి సంధ్యారాణి, మాజీ మంత్రి గద్దె బాబూరావు, సాలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జి భంజ్‌దేవ్, టీడీపీ పట్టణ అధ్యక్షు డు ప్రసాదుల రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి, ఆ పార్టీ మండల అధ్యక్షుడు సైలాడ త్రినాథరావు, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కర్రోతు నర్సింగరావు, జిల్లా తెలుగు యువత కార్యదర్శి ఈగల సత్యారావు యాదవ్, తదితరులు పాల్గొన్నారు. అశోక్‌కి ఘన స్వాగతం కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా జిల్లాకు వచ్చిన అశోక్‌గజపతిరాజుకి జిల్లా టీడీపీ నా యకులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరు కున్నారు. అక్కడ తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో సుమారు గంట పాటు మాట్లాడారు. అనంతరం సాయంత్రం 5 గంట లకు ఐనాడ జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడ విజయనగరం నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో ఆయనకు స్వాగతం పలికారు. ఓపె న్ టాప్ జీపులో అశోక్ ఐనాడ జంక్షన్ నుంచి విజయనగరం ఎత్తుబ్రిడ్జి మీదుగా రైల్వేస్టేషన్ రోడ్డు, వెంకటలక్ష్మి థియేటర్ జంక్షన్, ఎస్బీఐ మెయిన్ బ్రాంచి, కన్యకాపరమేశ్వరి కోవెల, గంట స్తంభం మీదుగా మూడు లాంతర్ల జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని, అనంతరం కోట జంక్షన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన సన్మాన సభలో మాట్లాడారు. -
21న ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం!
న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఈనెల 21న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పార్టీ అగ్రనేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ఆయనకు ఎల్కే అద్వానీ, రాజ్‌నాధ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ తదితరులు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మోడీ ఎన్నికపై చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎయిర్ పోర్ట్ నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయం వరకూ మోడీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆయన రాకతో కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు కార్యాలయాన్ని పూలతో అలంకరించి, పూల జల్లు కురిపించి ఘనంగా స్వాగతం పలికారు. మోడీ మోడీ అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో ప్రధాన కార్యాలయం హోరెత్తింది. అనంతరం కార్యకర్తల నుద్దేశించి మోడీ ప్రసంగించారు. బీజేపీ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. -
హైదరాబాద్‌కు చేరుకున్న జగన్
-
నేడు హైదరాబాద్‌కు కేసిఆర్
-
గులాబీ దండుకు ఘన స్వాగతం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీకి వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు శుక్రవారం మంచిర్యాలలో ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన వారు.. మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు చేరారు. వారి రాకతో తూర్పు జిల్లా నేతలంతా స్టేషన్‌కు వచ్చారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఖాళీ చేతులతో వెళ్తున్న తామంతా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర సాధనతోనే తిరిగి వస్తామని ముక్తకంఠంతో తేల్చిచెప్పారు. ఎమ్మెల్యేలు వేణుగోపాలచారి, నల్లాల ఓదేలు, కావేటి సమ్మయ్య, జోగు రామన్న, కొప్పుల ఈశ్వర్, జూపల్లి కృష్ణారావు, హరీశ్వర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, భిక్షపతి, డాక్టర్ రాజయ్య, మహమూద్‌అలీ, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి రైలు నుంచి ప్లాట్‌ఫాం వద్ద దిగగా.. వారిని తెలంగాణవాదులు పూలమాలలతో ముంచెత్తారు. జై తెలంగాణ.. అమరవీరులకు జోహార్ అంటూ నినదించారు. నుదుటిన తిలకం దిద్ది తదుపరి వీడ్కోలు పలికారు. ఇందులో టీఆర్ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు, నాయకులు చిట్ల సత్యనారాయణ, తోకల రాయమల్లు, సిరిపురం రాజేశ్, సుదమల్ల హరికృష్ణ, సురేశ్‌బల్దవా, ముక్త శ్రీనివాస్, కర్రె లచ్చన్న, అత్తి సరోజ, బండి పద్మ, తిరుమలయాదవ్, జోగుల శ్రీదేవి, విద్యార్థి నాయకులు సోహైల్‌ఖాన్, సుదమల్ల కృష్ణతోపాటు కోల్‌బెల్ట్, తూర్పు జిల్లా పరిధిలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. - న్యూస్‌లైన్, మంచిర్యాలటౌన్ -
విమానాశ్రయం జనసాగరం
అన్నానగర్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సమైక్యాంధ్ర ఉద్యమ సారథి వైఎస్.జగన్మోహన్రెడ్డికి చెన్నైలో ఘనస్వాగతం లభించింది. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు నీరాజనం పట్టారు. బుధవారం ఉదయం 10.15 గంటలకు హైదరాబాద్ నుంచి ఆయన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయూనికి చేరుకున్నారు. వందలాది వాహనాల్లో వేలాది మంది అభిమానులు ఆయన్ను అనుసరించడం, అందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించడంతో విమానాశ్రయం నుంచి రోడ్డుపైకి చేరుకునేందుకు 20 నిమిషాలు పట్టింది. పొరుగు రాష్ట్రానికి విచ్చేసిన నేతకు ఇంతటి ఘనస్వాగతమా? ఇన్ని వేల మంది అభిమానులా అంటూ స్థానికులు ఆశ్చర్యపోయారు.10.45గంటలకు కారులో బయలుదేరిన ఆయన ఆళ్వారుపేటలోని సోదరుని ఇంటికి చేరుకునే సరికి మధ్యాహ్నం 12 గంటలు దాటింది. సాధారణంగా ఎయిర్‌పోర్టు నుంచి ఆళ్వారుపేట చేరడానికి 30 నిమిషాలు పడుతుంది. ఎయిర్‌పోర్టు నుంచి గిండీ, కత్తిపార జంక్షన్, నందనం, టీటీకే రోడ్డు వద్ద వేలాదిమంది జగన్మోహన్రెడ్డి అభిమానులు ఆయన కారు నుంచి బయటకు రావాలని పట్టుపట్టారు. అభిమానల కోరిక మేరకు ఆయన వాహనం దిగి వారికి నమస్కరిస్తూ ముందుకు సాగారు.స్వాగతించిన ప్రముఖులు: వైఎస్.అనిల్ రెడ్డి, వైఎస్.సునీల్‌రెడ్డి, ఎంపీ రాజమోహన్‌రెడ్డి, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, బాలశౌరి, పి.అక్కిరెడ్డి, ఆనందకుమార్ రెడ్డి, జేకే రెడ్డి, నల్లా సూర్యప్రకాశరావు, అనిల్‌కుమార్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కేతిరెడ్డి జగదీశన్ రెడ్డి, పి.అక్కిరెడ్డి, మేరిగ మురళి, హరిరెడ్డి, నన్నపరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, బి.రాఘవేంద్రరెడ్డి, గౌతం రెడ్డి, తాడి వీరభద్రరావు, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్‌కుమార్, కిరణ్‌మోహన్, మైసూరారెడ్డి, జి.ప్రతాప్‌రెడ్డి, ఎల్లగిరి గోపాల్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కెన్సెస్ నరసారెడ్డి, పల్లవా సుబ్బారెడ్డి, కొమ్ముల లక్ష్మయ్య నాయుడు, మాజీ ఎమ్మెల్సీ రాఘవేంద్రరెడ్డి, సతీష్‌రెడ్డి, ప్రతాప్ సి రెడ్డి వంటి ప్రముఖులు ఎయిర్‌పోర్టుకు వచ్చి జగన్‌కు పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు. విజయేంద్రరాజు, ఆర్.ప్రతాపకుమార్‌రెడ్డి, మణివన్నన్, రాజేంద్రన్, కృష్ణారెడ్డి, బేతిపూడి శేష ప్రసాద్, ప్రవీణ్‌రెడ్డి, పి.కృష్ణారెడ్డి, ముంగర మధుసూదనరావు, శశిధర రెడ్డి, హరిరెడ్డి, వి.నర్శింగరెడ్డి, డి.రాజారెడ్డి, జి.సురేష్‌రెడ్డి, కె.శేఖర్ రెడ్డి, కర్రల సుధాకర్, లక్ష్మీపతి రాజు, చక్రపాణి రెడ్డి, రమేష్‌రెడ్డి, యతిసాలరాజు, శేఖర్‌రాజు, గొల్లపల్లి ఇజ్రాయెల్, విజయకుమార్‌రెడ్డి, ఏకే రాజ్, జైపాల్ జగన్‌ను స్వాగతించడానికి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఎయిర్‌పోర్టులోని విజిటర్స్ లాంజ్ మొత్తం జగన్‌ను స్వాగతించడానికి విచ్చేసిన ప్రముఖులతో క్రిక్కరిసిపోయింది. ఆళ్వార్‌పేటలో బ్రహ్మరథం: నగరంలోని ఆళ్వార్‌పేటలో పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. జగన్ సోదరుడు వై.ఎస్.అనిల్‌రెడ్డి నివాసం వద్దకు ఉదయాన్నే జన సందోహం తరలి వచ్చింది. గంటల తరబడి ఓపిగ్గా జననేత కోసం ఎదురు చేశారు. తమిళనాడు వైఎస్సార్ సీపీ నేతలు జకీర్, శరవణన్ అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ప్రముఖ కాంట్రాక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరుతుండడంతో ఆయన మద్దతుదారులు అట్టహాసంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ప్రాంతంలోని రహదారుల్లో జగన్ అభిమానులు బారులు తీరారు. రోడ్లకిరువైపులా కార్లు, వ్యాన్లు నిండిపోయాయి. జగన్ కాన్వాయ్ ఆళ్వారుపేట ప్రాంతానికి చేరుకోగానే వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. జగన్ టీ షర్టులు ధరించిన కార్యకర్తలు, పోలీ సులు, జగన్మోహన్రెడ్డికి కాన్వాయ్ వెళ్లేందుకు మార్గం సు గమం చేశారు. మహిళలు జగన్ కారుపై పూలవర్షం కురిపిం చారు. కోవూరు మ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నెల్లూరు నియోజకవర్గం కో ఆర్డినేటర్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, గూడూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ పాశం సునీల్‌కుమార్, రాజమండ్రి వైఎస్సార్ సీపీ యువజన నేత పి.కిరణ్‌మోహన్‌రెడ్డి విచ్చేశారు. వేలాది మందితో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. -
సాదరంగా ఆహ్వానం
జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం కోల్‌కతా చేరుకున్నపుడు ఘనస్వాగతం లభించింది. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరిన జగన్ బృందం మధ్యాహ్నం 12.40 గంటలకు కోల్‌కతాకు చేరుకుంది. అప్పటికే అక్కడ వేచి ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు (క్విజ్ మాస్టర్ కూడా) డెరెక్ ఓబ్రియెన్ వారికి స్వాగతం పలికారు. జగన్ రాకను తెలుసుకుని కోల్‌కతాలోని తెలుగువారు పెద్ద సంఖ్యలో విమానాశ్రయం వద్ద గుమిగూడి ‘జై జగన్...’ అంటూ నినాదాలు చేస్తూ స్వాగతించారు. వారిని చూసి జగన్ ఇంత మంది తెలుగువారు ఇక్కడ ఉన్నారే అని వ్యాఖ్యానించారు. వారికి అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. నేరుగా పశ్చిమబెంగాల్ రాష్ట్ర సచివాలయానికి 1.30 గంటలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో మమత , జగన్‌కు ఎదురేగి ఆత్మీయంగా పలకరించి లోనికి ఆహ్వానించారు. అమ్మ ఎలా ఉంది? అని మమత పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గురించి కుశల ప్రశ్నలు వేశారు. తనకు తొలి నుంచీ వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని ఆమె ఈ సందర్భంగా అన్నారు. జగన్ తనకు తమ్ముడులాంటి వాడని, ఆయనతోనే తానుంటానని (ఐ యామ్ విత్ జగన్) మమత ఆ తరువాత విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. తొలుత జగన్, మమత ఇద్దరూ ఏకాంతంగా సుమారు పదిహేను నిమిషాలు దేశ రాజకీయాలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ తరువాత నలభై నిమిషాల సేపు అందరూ కలిసి చర్చలు జరిపారు. చర్చలు ముగిశాక మమత స్వయంగా జగన్‌కు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. భోజనం చేశాక తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ను విమానాశ్రయం వరకూ వెళ్లి వీడ్కోలు పలికి రావాల్సిందిగా ఆమె కోరారు. -
జగన్‌కు పూలతో ఘనస్వాగతం
హైదరాబాద్: చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి అభిమానులు పూలతో ఘనస్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన జగన్‌ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు తోచుకువచ్చారు. కిక్కిరిసిన జనంలో నుంచి వాహనం కదలడం కూడా కష్టమైపోయింది. ఎటు చూసినా జనమే జనం. రాష్ట్రం నలుమూల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో కదిలి వచ్చారు. జై జగన్ అన్న నినాదాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. 485 రోజులు జైలులో ఉండి, బయటకు వచ్చిన యువనేతను చూసేందుకు యువత ఉత్సాహంగా తోసుకొనితోసుకొని ముందుకు వస్తున్నారు. చిరునవ్వుతో అందరికీ రెండు చేతులు జోడించి అభివాదం చేస్తున్నారు. జైలు నుంచి ఆయన వాహనం వెళ్లే రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. కాన్వాయ్ వెంటే జనం నడుస్తున్నారు. జైలు వద్ద నుంచి ఆయన నివాసం లోటస్పాడ్ వరకు రోడ్డుకు ఇరువైపుల జనం బారులు తీరి ఉన్నారు. ఆ జనవాహినిని తప్పించుకొని ఆయన ఇంటికి చేరుకోవడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. -
విజయమ్మకు ఘన స్వాగతం
గన్నవరం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరులో జరగనున్న ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొనేందుకు గన్నవరం వచ్చిన వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి జెట్ ఎయిర్వేస్ విమానంలో పార్టీ రాష్ట్ర నాయకులు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డితో కలిసి ఆమె ఉదయం 10.40 గంటలకు ఇక్కడికి విచ్చేశారు. విమానాశ్రయంలో ఆమెకు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. విజయమ్మకు, వైవీ సుబ్బారెడ్డికి విజయవాడ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ శాలువాలు కప్పారు. పార్టీకి చెందిన పలువురు నాయకులు విజయమ్మను పూలదండలతో ముంచెత్తారు. గన్నవరం విమానాశ్రయం బయట పెద్దఎత్తున వచ్చిన సమైక్యవాదులు విజయమ్మకు సంఘీభావం తెలిపారు. విజయమ్మకు స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ కేంద్ర పాలకవర్గ మండలి సభ్యురాలు సభ్యులు కె.నాగేశ్వరరావు, ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, వంగవీటి రాధ, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, జ్యేష్ఠ రమేష్‌బాబు, అడుసుమిల్లి జయప్రకాష్, ముసునురు రత్నబోస్, ఇందుకూరి రామకృష్ణంరాజు, మద్దాల రాజేష్, ప్రసాదరాజు, నియోజకవర్గాల సమన్వకర్తలు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పి.గౌతమ్‌రెడ్డి, వాకా వాసుదేవరరావు, పడమట సురేష్ బాబు, తాతినేని పద్మావతి, విజయవాడ నగర అధికార ప్రతినిధి తాడి శకుంతల, మహిళా కన్వీనర్ సునీత, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు. -
శంషాబాద్‌లో వైఎస్ తనయకు ఆత్మీయ స్వాగతం
మిన్నంటిన ‘జై జగన్’ నినాదాలు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా వెళ్లి జగన్‌ను కలిసిన షర్మిల సాక్షి, హైదరాబాద్: అభిమానం వెల్లువెత్తింది. జోరు వానను సైతం లెక్కచేయక.. ‘జై జగన్.. జయహో జగన్’ అన్న నినాదం శంషాబాద్ ఎయిర్‌పోర్టును హోరెత్తించింది. పద్నాలుగు జిల్లాల మీదుగా 3,112 కిలోమీటర్ల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రను ముగిం చుకుని సోమవారం ఉదయం విశాఖపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ షర్మిల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మలకు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నినాదాల మధ్య షర్మిల శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చంచల్‌గూడ జైలుకు వెళ్లి తన సోదరుడు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని ములాఖత్‌లో కలుసుకున్నారు. పాదయాత్ర సాగిన తీరును షర్మిల ఈ సందర్భంగా జగన్‌తో పంచుకున్నారు. ములాఖత్ అనంతరం షర్మిల వేల మంది అభిమానులు భారీ కాన్వాయ్‌తో వెంటరాగా తన నివాసానికి చేరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి నర్సింగ్‌రావు, కె.శివకుమార్, బి.జనార్ధన్‌రెడ్డి, అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు, మైనారిటీ సెల్ కన్వీనర్ రహమాన్, కార్మిక విభాగం కన్వీనర్ జనక్‌ప్రసాద్, సీఈసీ సభ్యులు మతీన్ముజదాది, పి.విజయారెడ్డి, యువజన, సేవాదళం కన్వీనర్లు పుత్తా ప్రతాప్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, నగర కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్, నియోజకవర్గాల సమన్వయకర్తలు దేప భాస్కర్‌రెడ్డి, ధన్‌పాల్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, లింగాల హరిగౌడ్, సాయినాథ్‌రెడ్డి, నాయకులు సురేష్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, రాచమళ్ల సిద్ధేశ్వర్, రూపానందరెడ్డి, కొండా రాఘవరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు షర్మిలకు స్వాగతం పలికారు. షర్మిల పాదయాత్ర చరిత్రాత్మక ఘట్టం: బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ‘మరో ప్రజాప్రస్థానం’ పేరుతో షర్మిల చేపట్టిన పాదయాత్ర చరిత్రాత్మక ఘట్టమని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన కార్యకర్తలతో కలిసి షర్మిల వెంట చంచల్‌గూడ జైలుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ను అక్రమంగా జైల్లో నిర్బంధించినప్పటికీ షర్మిల తండ్రి బాటలో నడుస్తూ ప్రజల బాగోగుల కోసం పాదయాత్ర చేయటంతో ఆమె చరిత్ర సృష్టించారని చెప్పారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే పార్టీ ఉద్దేశమని అన్నారు. మహానేత వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చేందుకే వైఎస్ఆర్సీపీ స్థాపించారన్నారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల ప్రపంచ చరిత్రలో నిలిచిపోతారన్నారు. పాదయాత్ర ప్రజలకు భరోసానిచ్చింది: జనక్ ప్రసాద్ కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, షర్మిల పాదయాత్ర ప్రజలకు భరోసానిచ్చిందని పార్టీ నేత జనక్ ప్రసాద్ అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎందరో నాయకులు బయటకు వెళితే మాట్లాడని వారు తమ పార్టీ నుంచి కొందరు వెళ్లిపోతే తెలంగాణ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ లేదనడం సరికాదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలోకి వచ్చిన వారే తిరిగి వెళ్లిపోయారన్నారు. తెలంగాణలో ఉన్న నాయకులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, ఆ ప్రాంతంలో పార్టీని మరింత పటిష్ట పరచాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షం: గట్టు వైఎస్ఆర్ సీపీ ప్రజల పక్షానే ఉందని ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్రతో కాంగ్రెస్, టీడీపీ నేతలు భయకంపితులయ్యారన్నారు. జగన్‌ను అక్రమంగా నిర్బంధించాక ప్రాంతాలకతీతంగా, మతాలకతీతంగా, కులాలకతీతంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కసితో పని చేస్తున్నారన్నారు. వైఎస్సార్ పాలన మళ్లీ జగన్ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారని చెప్పా రు. పదవుల కోసం వ చ్చిన వారే పార్టీని విడిచిపెట్టారని, వారు వైఎస్ఆర్పై అభిమానంతో వచ్చిన వారు కాదన్నారు. తెలంగాణ ఏర్పడినా ఆ ప్రాంతంలో పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. వైఎస్ఆర్ సీపీ జాతీయ పార్టీగా అభివృద్ధి చెందుతుందన్నారు. షర్మిల పాదయాత్రతో గర్వపడుతున్నాం: రహమాన్ రాష్ట్ర ప్రజల సాధకబాధకాలను తెలుసుకుని వారికి భరోసా ఇస్తూ షర్మిల దాదాపు 3 వేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేయడం గర్వంగా భావిస్తున్నామని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ రహమాన్ అన్నారు. మహిళ అయినప్పటికీ వేల కిలోమీటర్ల మేర పాదయాత్రను చేయడంతో షర్మిల చరిత్రపుటల్లో నిలిచిపోతారన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఏకమై జగన్‌ను సీఎం చేయాలన్నారు. షర్మిలకు ఘన స్వాగతం సాక్షి ప్రతినిధి, బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ పాదయాత్ర ద్వారా రికార్డు సృష్టించిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి తనయ షర్మిలకు సోమవారం సాయంత్రం బెంగళూరు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆమెకు సాదర స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో వైఎస్ అభిమానులు విమానాశ్రయానికి తరలివచ్చారు. డాక్టర్ వైఎస్సార్ స్మారక ఫౌండేషన్ కర్ణాటక అధ్యక్షుడు వెంకట కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు భక్తవత్సల రెడ్డి, కార్యదర్శి బత్తుల అరుణాదాస్, కోశాధికారి రాకేశ్‌రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి సీహెచ్ బాలకృష్ణారెడ్డి, పదాధికారులు దామోదర రెడ్డి, రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.