తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీకి వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు శుక్రవారం మంచిర్యాలలో ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన వారు.. మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు చేరారు. వారి రాకతో తూర్పు జిల్లా నేతలంతా స్టేషన్‌కు వచ్చారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఖాళీ చేతులతో వెళ్తున్న తామంతా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర సాధనతోనే తిరిగి వస్తామని ముక్తకంఠంతో తేల్చిచెప్పారు.
ఎమ్మెల్యేలు వేణుగోపాలచారి, నల్లాల ఓదేలు, కావేటి సమ్మయ్య, జోగు రామన్న, కొప్పుల ఈశ్వర్, జూపల్లి కృష్ణారావు, హరీశ్వర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, భిక్షపతి, డాక్టర్ రాజయ్య, మహమూద్‌అలీ, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి రైలు నుంచి ప్లాట్‌ఫాం వద్ద దిగగా.. వారిని తెలంగాణవాదులు పూలమాలలతో ముంచెత్తారు. జై తెలంగాణ.. అమరవీరులకు జోహార్ అంటూ నినదించారు. నుదుటిన తిలకం దిద్ది తదుపరి వీడ్కోలు పలికారు.
ఇందులో టీఆర్‌ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు, నాయకులు చిట్ల సత్యనారాయణ, తోకల రాయమల్లు, సిరిపురం రాజేశ్, సుదమల్ల హరికృష్ణ, సురేశ్‌బల్దవా, ముక్త శ్రీనివాస్, కర్రె లచ్చన్న, అత్తి సరోజ, బండి పద్మ, తిరుమలయాదవ్, జోగుల శ్రీదేవి, విద్యార్థి నాయకులు సోహైల్‌ఖాన్, సుదమల్ల కృష్ణతోపాటు కోల్‌బెల్ట్, తూర్పు జిల్లా పరిధిలోని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. - న్యూస్‌లైన్, మంచిర్యాలటౌన్
గులాబీ దండుకు ఘన స్వాగతం
Published Sat, Feb 1 2014 6:51 AM | Last Updated on Sat, Aug 11 2018 4:48 PM
Advertisement
Advertisement