nallala odelu
-
ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి షాక్...
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జెడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. కొంతకాలంగా ‘నల్లాల’ దంపతులు పార్టీ మార్పుపై ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపారు. పార్టీలో తగు ప్రాధాన్యం కల్పిస్తామనే హామీ మేరకు ‘హస్తం’ గూటికి చేరారు. హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, నల్లాల దంపతులతోపాటు వారి ఇద్దరు కుమారులకు శ్రావణ్, సందీప్, బీఆర్ఎస్ నాయకులు దుర్గం నరేశ్, బింగి శివకిరణ్, ముజాహిద్, ఇందాజ్, అనిల్ ప్రభాకర్ తదితరులకు కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం నల్లాల ఓదెలు ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా అందరూ స్థానికుడైన తనను ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని తెలిపారు. స్థానికేతరుడు తమను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. చెన్నూరు నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే కాంగ్రెస్‌లో చేరినట్లు వెల్లడించారు. రెండోసారి కాంగ్రెస్‌కే మొగ్గు.. మూడుసార్లు చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఓదెలు, జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న భాగ్యలక్ష్మికి పార్టీలో సుముచిత ప్రాధాన్యత ఇవ్వడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తొలుత బీజేపీవైపు చూస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ చివరకు కాంగ్రెస్‌వైపే మొగ్గు చూపారు. గతేడాది మే 19న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జెడ్పీ చైర్పర్సన్ తన కుమారులతో కలసి టీఆర్ఎస్ను వీడారు. ఢిల్లీలో అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆర్నెల్లు తిరగకుండానే అక్టోబర్ 5న తిరిగి ‘కారు’ పార్టీలో చేరారు. తాజాగా మరోసారి గులాబీ పార్టీని వీడి.. హస్తం గూటికి చేరారు. ఫలించని బుజ్జగింపులు ‘నల్లాల’ దంపతులు అసంతృప్తితో ఉండి, పార్టీ మారుతారని తెలిసిన క్షణం నుంచే పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ రంగంలోకి దిగారు. వారిని పలువిఽధాలుగా బుజ్జగించారు. అయితే అవేవి ఫలించలేదు. గతంలో పార్టీ మారినప్పుడు వారికి ఇచ్చిన హామీలు నేరవేర్చకపోవడం, రాజకీయంగా ఇబ్బందిగా మారడంతో మరోసారి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పార్టీ మారకుండా ఉండేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. నల్లాల లెక్క చేయకుండా ‘కారు’ దిగారు. చెన్నూరు నుంచే పోటీ? కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో చెన్నూరు నుంచే నల్లాల ఓదెలు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రధాన ప్రత్యర్థిగా ఉండడంతో ఆయన్ను ఓడించేందుకు, సానుభూతిని వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లా నాయకత్వం, చెన్నూరు నుంచి టికెట్ ఆశిస్తున్నవారంతా ఓదెలుకు మద్దతు ఇస్తారో లేదో తేలాల్సి ఉంది. గతంలో కాంగ్రెస్ జిల్లా నాయకత్వం నుంచి ఆశించిన మేర మద్దతు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు కొత్త, పాత కలయిక ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. -
మళ్లీ టీఆర్ఎస్ గూటికి నల్లాల ఓదెలు దంపతులు
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే నల్లాల దంపతులు తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరారు. కొద్దిరోజుల కిందట ఓదెలు తన భార్య, మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్మన్ భాగ్యలక్ష్మితో కలిసి టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా ఆయన మంత్రి కేటీఆర్ సమక్షంలో తిరిగి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. 2009, 2014లో టీఆర్ఎస్ తరపున చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా నల్లాల ఓదెలు గెలుపొందారు. చదవండి: (Hyderabad: బ్యాగ్‌లో 35 వజ్రాలు.. పార్క్ హయత్‌లో చోరీ జరిగిందా? మర్చిపోయారా?) -
సుమన్ వేధింపులు భరించలేకే పార్టీ వీడాం
మందమర్రి రూరల్: ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వేధింపులు భరించలేకే తాము టీఆర్ఎస్ను వీడామని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జెడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి తెలిపారు. మందమర్రిలోని తమ నివాసంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోవాలని బాల్క సుమన్ తమపై ఒత్తిడి చేశారని ఆరోపించారు. ‘నా భార్య, పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా.. విప్ వేధింపులు భరించలేకనే మేం టీఆర్ఎస్ను వీడాం’ అని నల్లాల ఓదెలు ఉద్వేగానికి లోనయ్యారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా భాగ్యలక్ష్మి కి సుమన్ ఏనాడూ గౌరవం ఇవ్వలేదన్నారు. కనీసం మహిళగానూ చూడలేదన్నారు. బాల్క సుమన్ నియంతలా వ్యవహరిస్తూ.. అక్రమాలపై ప్రశ్నించిన వారిని, ఎదురుతిరిగిన వారిపై పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. తన కేడర్ బలంతోనే గెలిచిన సుమన్.. గెలిచిన తర్వాత తమను ఏ కార్యక్రమానికీ పిలవలేదన్నారు. తన కొడుకులపై అక్రమకేసులు పెట్టిస్తానని, అరెస్ట్ చేయిస్తానని బెదిరించారని ఆరోపించారు. జాతీయ రహదారి కాంట్రాక్టర్‌ను బెదిరించి క్యాతన్‌పల్లిలో సుమన్ ఇల్లు కట్టించుకున్నారని చెప్పారు. సోనియాఆశీస్సులతో తాను ఎమ్మెల్యే అవుతానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి, టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు వారి పదవికి రాజీనామా చేస్తే తానూ జెడ్పీటీసీ పదవికి, జెడ్పీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తానని భాగ్యలక్ష్మి తెలిపారు. -
టీఆర్ఎస్లో చేరికలు.. నిష్క్రమణలు!
సాక్షి, హైదరాబాద్: ఉద్యమపార్టీగా ఆవిర్భవించిన నాటి నుంచి పలు పార్టీలోంచి వలసలను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా రాజకీయ పునరేకీకరణ పేరిట ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటూ వస్తోంది. దీంతో గ్రామస్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గస్థాయి వరకు అన్నిచోట్లా టీఆర్ఎస్లో బహుళ నాయకత్వం తయారైంది. కొన్నిచోట్ల నేతలు సర్దుబాటు చేసుకుని పనిచేస్తుండగా, చాలాచోట్ల ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఈ పోరు కొన్నిచోట్ల అంతర్గతంగా, తాండూరు, కొల్లాపూర్ వంటి నియోజకవర్గాల్లో బహిర్గతంగా జరుగుతోంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 103 చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చాలాచోట్ల ఎమ్మెల్యేలదే పైచేయిగా సాగుతోంది. గతంలో ఈ నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఆధిపత్యపోరులో పైచేయి సాధించలేక, ఇటు సొంత రాజకీయ అస్తిత్వాన్ని వదులుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయపరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇతర పార్టీల్లో తమ రాజకీయ భవిష్యత్తుకు ఉన్న అవకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. ఉద్యమ సమయం నుంచీ గుర్తింపు దక్కడం లేదని భావిస్తున్న నేతలు కూడా వచ్చే ఎన్నికలనాటికి సొంతదారి చూసుకోవాలనే యోచనలో ఉన్నారు. నల్లాల ఓదెలు బాటలో మరికొందరు ఉద్యమ సమయం నుంచి పార్టీని అంటిపెట్టుకుని మూడు పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ నిరాకరించింది. ఆ తర్వాత ఆయన భార్య భాగ్యలక్ష్మి మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అయితే నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో అధిపత్యపోరు సాగుతుండటంతో రెండురోజుల క్రితం అనూహ్యంగా కాంగ్రెస్‌లో చేరారు. గతేడాది మాజీమంత్రి ఈటల రాజేందర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తులా ఉమ తదితరులు పార్టీని వీడారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్(ఆలేరు) బీజేపీలో చేరగా పార్టీ కార్యదర్శి గట్టు రామచందర్‌రావు, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ పార్టీకి దూరమయ్యారు. అయితే కొద్దినెలల వ్యవధిలోనే రవీందర్‌సింగ్ తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. వచ్చే ఏడాది చివరలో శాసనసభ ఎన్నికలు ఉండటంతో మాజీమంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి, ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కోవా లక్ష్మి, ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఎటువైపు అడుగులు వేస్తారనే చర్చ జరుగుతోంది. 40కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నాటికి ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారనే ఉత్కంఠ నెలకొంది. ఏనుగు రవీందర్‌రెడ్డి తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరుకుంటారనే ప్రచారం సాగుతోంది. ‘టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం ఇప్పటి నుంచే అన్వేషణ సాగిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న నల్లాల ఓదెలు, బాబూమోహన్, చింతల కనకారెడ్డి, కొండా సురేఖ, సంజీవరావు, బొడిగె శోభకు టికెట్ నిరాకరించి కొత్తవారికి అవకాశం కల్పించారు. అదే తరహాలో వచ్చే ఎన్నికల్లోనూ సుమారు 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో పార్టీలోని గెలుపు గుర్రాలకు అవకాశం ఇస్తారు. అవసరమైతే ఇతర పార్టీల్లో ఉన్న గెలుపు గుర్రాలను కూడా పార్టీ లోకి రప్పించి టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వివిధ కారణాలతో పార్టీకి దూరమైన నేతలను కూడా అవసరాన్ని బట్టి తిరిగి చేర్చుకునే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తారు. చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు నామమాత్ర పోటీ ఇచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ లేకపోవడంతో టీఆర్ఎస్లోని అసంతృప్తులు, అవకాశం దక్కని వారిపై ఆ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి’అని పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే ఓ నేత వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్‌లో చేరిన నల్లాల కుటుంబం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, మంచిర్యాల: టీఆర్ఎస్ పార్టీ నేత, చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జెడ్పీ చైర్మన్ భాగ్యలక్ష్మిలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహల నేతృత్వంలో.. ఇద్దరు కుమారులు సందీప్, శ్రావణ్, ఇతర నేతలతో పాటు ఓదెలు దంపతులు ఢిల్లీ వచ్చారు. గురువారం మధ్యాహ్నం 11 జన్‌పథ్‌లోని సోనియా నివాసంలో ప్రియాంక గాంధీని కలిశారు. వారందరికీ ప్రియాంక కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో ఓదెలు పాత్రను ప్రియాంకకు రేవంత్‌రెడ్డి వివరించారు. జెడ్పీ చైర్మన్‌గా మరో రెండున్నరేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ టీఆర్ఎస్ అరాచక పాలన భరించలేక భాగ్యలక్ష్మి ఆ పార్టీని వీడుతున్న విషయాన్ని తెలియజేశారు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, సీనియర్లకు మాదిరి గౌరవం, మర్యాద ఇస్తామని ఓదెలు దంపతులకు హామీ ఇచ్చారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు: ఓదెలు ప్రియాంకతో భేటీ అనంతరం ఓదెలు మీడియాతో మాట్లాడారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అరాచకాల వల్లే టీఆర్ఎస్ను వీడుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసినట్లు చెప్పారు. ‘మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు 2018లో పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. తర్వాత సుముచిత స్థానం ఇస్తారని భావించినా ఇవ్వలేదు. నా భార్యకు జెడ్పీ చైర్మన్ పదవి ఇచ్చినా ఎలాంటి వసతులు, పాలనాధికారాలు కల్పించలేదు. ప్రొటోకాల్ పాటించడం లేదు. రెండేళ్లుగా ఎమ్మెల్యే సుమన్ మా ఇంటిపై నిఘా పెట్టి జైలుకు పంపుతానని హెచ్చరిస్తున్నాడు. ఫోన్ ట్యాప్ చేస్తున్నడు. బెదిరింపు మెసేజ్‌లు పెడుతున్నాడు. ఇవన్నీ భరించలేకే బయటకు వచ్చాం..’అని పేర్కొన్నారు. టీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యత దక్కడం లేదని, మంత్రివర్గంలోనూ అందరూ ద్రోహులే ఉన్నారని ఆరోపించారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ అనంతరం ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమన్న భావనతో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించాలి: రేవంత్‌రెడ్డి తెలంగాణ కలను సాకారం చేసిన సోనియాకు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉందని తెలంగాణ సమాజం గుర్తించి కాంగ్రెస్ వైపు నడుస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మాదిగల జీవితాలు బాగుపడతాయని, మాదిగ రిజర్వేషన్ సాధ్యమవుతుందని భావించారని, కానీ వారి ఆశలు అడియాశలయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించాల్సిన సమయం అసన్నమయిందని చెప్పారు. మూడుసార్లు ఎమ్మెల్యే.. ఓదెలు ఉద్యమం నాటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. 2009, 2010 (ఉప ఎన్నిక), 2014 ఎన్నికల్లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభుత్వ విప్‌గా పని చేశారు. 2018లో టికెట్ ఇవ్వనందుకు నిరసనగా టీఆర్ఎస్ కార్యకర్త గట్టయ్య పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలావుండగా బుధవారం సాయంత్రం వరకు హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ నిర్వహించిన పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో పాల్గొన్న భాగ్యలక్ష్మి కాంగ్రెస్‌లో చేరేందుకు అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లారు. -
టీఆర్ఎస్కు గుడ్ బై.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి.. టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గురువారం పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం టీపీసీసీ చీఫ్ నేతృత్వంలో వారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వారిద్దరికీ పార్టీ కండువా వేసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అయితే, భాగ్యలక్ష్మికి జడ్పీ చైర్‌పర్సన్‌గా మరో రెండేళ్ల కాలం ఉండటం విశేషం. ఇక, నల్లాల ఓదెలు 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ప్రభుత్వ విప్‌గా కూడా ఓదెలు పనిచేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణకు ప్రధాని మోదీ.. బీజేపీలో జోష్ Ex MLA Nallala Odelu garu & his wife Mancherial ZP chairperson Bhagyalakshmi garu joined Congress today in Delhi in presence of AICC Gen sec, Smt @priyankagandhi and TPCC president shri @revanth_anumula. pic.twitter.com/pUlSvcdgFk — Telangana Congress (@INCTelangana) May 19, 2022 -
మాజీ ఎమ్మెల్యే ఓదెలుకు మాతృవియోగం
మందమర్రిరూరల్: చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తల్లి నల్లాల పోశమ్మ (74) కొంత కా లంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జా మున మృతి చెందింది. పోశమ్మ భౌతికకాయం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి మందమర్రిలో ని రెండవ జోన్‌లోని ఇంటికి తీసుకువచ్చారు. సా యంత్రం స్థానికంగా అత్యక్రియలు నిర్వహిం చారు. రాష్త్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, బెల్లంపల్లి మా జీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, గ్రంధాల య చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్‌కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ ప్రబాకర్రావ్, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య , ప్రదాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతా రామ య్య, ఎంపీపీ బొలిశెట్టి కనుకయ్య, సర్పం చ్ల ఫోరం మండల అద్యక్షుడు ఒడ్నాల కొమురయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణ శంకర్ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. -
‘మాదిగ జాతిని అంతం చేసే కుట్రలు జరుగుతున్నాయి’
సాక్షి, మంచిర్యాల: నల్లాల ఓదెలుకు టికెట్ రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డ గట్టయ్య మృతదేహానికి బుధవారం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గట్టయ్య మృతికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆందోల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాబు మోహన్ టికెట్‌ను.. ఒక జర్నలిస్టు అయిన మరో మాల వ్యక్తికే ఇచ్చారని తెలిపారు. కానీ చెన్నూరులో మాత్రం ఎమ్మెల్యేగా ఉన్న మాదిగ వ్యక్తి ఓదెలు టికెట్‌ను మాత్రం మాల వ్యక్తి ఒక ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌కు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనలో మాదిగ జాతిని అంతం చేసే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో అక్రమాలు, అవినీతి చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగించి.. నీతిగా న్యాయంగా కొనసాగిన మాదిగ బిడ్డ ఓదెలుకు టికెట్ నిరాకరించడంపై మండిపడ్డారు. కేసీఆర్ చేసిన సర్వేలో 78 శాతంతో ఓదెలు ముందన్న టికెట్ నిరాకరిస్తూ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు తెలుపాలని కోరారు. ఈ నెల 12న ఇందారంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్రచార ర్యాలీ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గట్టయ్య(35) 80శాతం కాలిన గాయాలతో హైదరాబాద్ మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 2.20 గంటలకు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
గట్టయ్య మృతి బాధాకరం : ఓదెలు
జైపూర్(చెన్నూర్): తాను నమ్ముకున్న నాయకుడికి ఎమ్మెల్యే టికెట్ రాలేదని మనస్తాపం చెందిన రేగుంట గట్టయ్య పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడి తన కుటుంబానికి తీరనిశోకాన్ని మిగిల్చాడు. ఈ నెల 12న ఇందారంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్రచార ర్యాలీ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గట్టయ్య(35) 80శాతం కాలిన గాయాలతో హైదరాబాద్ మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 2.20 గంటలకు మృతి చెందాడు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత సిటింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు స్థానంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను టీఆర్ఎస్ చెన్నూర్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. ఓదెలుకు టికెట్ ఇవ్వకపోవడంతో ముందు నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్న జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన రేగుంట గట్టయ్య మనస్తాపం చెందాడు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా, కేసీఆర్ సేవా దళం జిల్లా ఉపాధ్యక్షులుగా, ఇందారం 13వ వార్డు సభ్యులుగా ఉన్న గట్టయ్య ఓదెలు, ఆయన కుటుంబానికి దగ్గరయ్యారు. గట్టయ్య అనారోగ్యపరిస్థితుల్లో ఓదెలు ఆయనను ఆదుకోవడం అన్నివిధాలుగా సహకరించడంతో అభిమానం మరింత పెరిగింది. మరో సారి ఓదెలుకు టికెట్ వచ్చి మళ్లీ ఆయన గెలిస్తే తనకు కూడా ప్రాధాన్యతపెరుగుతుందని భావించిన గట్టయ్య టికెట్ రాకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలో చెన్నూర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ బాల్క సుమన్ 12న(బుధవారం) తొలిసారి నియోజకవర్గానికి రావడం ఇందారం వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అక్కడే ఉన్న గట్టయ్య తన నిరసనను వ్యక్తం చేయడానికి ప్రచార ర్యాలీ ప్రారంభించే ముందు ఎంపీ సుమన్ రాజీవ్ రహదారి పక్కన డీఎంఎఫ్టీ నిధులతో నూతనంగా నిర్మించనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తుండగా జై..కేసీఆర్..జై ఓదెలు అంటూ గట్టయ్య తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ సీసాను ఒంటిపై పోసుకోగా దాన్నిఅడ్డుకునే ప్రయత్నంలో అక్కడే ఎంపీకి స్వాగతం పలకడానికి మంగళహారతులతో వచ్చిన మహిళలపై పెట్రోల్ పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇందారం, రామారావుపేట, టేకుమట్ల, భీమారం గ్రామాలకు చెందిన 12మంది ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతోపాటు 3 రిపోటర్లకు గాయాలయ్యాయి. ముందు గట్టయ్య తనపై పెట్రోల్ పోసుకోవడంతో ఆయన 80శాతం కాలిపోయాడు. హుటాహుటిన మంచిర్యాలకు తరలించి అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు, అనంతరం హైదరాబాద్ మలక్‌పేట్ యశోద ఆస్పత్రి తరలించి వైద్యం అందించారు. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన గట్టయ్య మంగళవారం మృతి చెందాడు. ఇందారంలో విషాదం.. అందరితో కలివిడిగా ఉండే గట్టయ్య మృతి చెందడంతో ఇందారంలో విషాదం నెలకొంది. గట్టయ్య మరణ వార్త తెలిసి ఇందారం వాసులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. గట్టయ్య మృతితో ఆయన కుటుంబ రోడ్డున పడింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరులా రోధించారు. గట్టయ్యకు భార్య విజయ, కుమార్తె సాయినివేదిత(5), కుమారుడు సాయి విజ్ఞేశ్(3) ఉన్నారు. బుధవారం ఇందారంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాజ సేవలో గట్టయ్య.. ఇందారం గ్రామానికి చెందిన గట్టయ్య తన నాన్నమ్మ బుచ్చమ్మ దగ్గర పెరిగిన గట్టయ్య ఆమె మృతితో 2010లో గ్రాండ్ మా యూత్ స్థాపించారు. గ్రాండ్ మా యూత్ ద్వారా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రక్తదాన శిబిరాలు, దాతల సహకారంతో ఉచిత వైద్యశిబిరాల ఏర్పాటు, నిరుపేద విద్యార్థులకు విద్యాసామగ్రి తదితర సేవకార్యక్రమాలు చేపట్టి జిల్లా స్థాయిలో గుర్తింపు పొంది పలుమార్లు అవార్డులు సైతం అందుకున్నారు. ఇందారం ఓపెన్‌కాస్టుకు వ్యతిరేకంగా గట్టయ్య ఉద్యమించారు. జేఏసీ నేతృత్వంలో తలపెట్టిన ఓపెన్‌కాస్టు వ్యతిరేక పోరాటాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. గట్టయ్య మృతి బాధాకరం : ఓదెలు మంచి మనస్సున గట్టయ్య మృతి చెందడం చాలా బాధకరమని చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. గట్టయ్య కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటానని ఆయన కుమార్తె సాయినివేదిత, కుమారుడు సాయివిజ్ఞేశ్పై రూ.5 లక్షల చొప్పున ఇద్దరిపై రూ.10లక్షలు బ్యాంకులో ఫిక్స్‌డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. అంత్యక్రియల ఖర్చు మొత్తం బరించుకుంటామని కుటుం బానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. -
ఓదెలు అనుచరుడు గట్టయ్య మృతి
సాక్షి, హైదరాబాద్/జైపూర్: టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో మంచిర్యాల జిల్లా చెన్నూరు టికెట్‌ను నల్లాల ఓదెలుకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆత్మహత్యకు యత్నించిన రేగుంట గట్టయ్య (32) మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చెన్నూరు టికెట్ తనకు కాకుండా ఎంపీ బాల్క సుమన్‌కు ఇవ్వడంతో ఓదెలు ఈ నెల 11న మందమర్రిలోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలసి స్వీయ గృహ నిర్బంధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 12న జైపూర్ మండలం ఇందారంలో అభివృద్ధి పనులకు భూమిపూజతో పాటు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఎంపీ బాల్క సుమన్ వచ్చారు. ఈ కార్యక్రమంలో ఓదెలు అనుచరుడు, ఇందారం గ్రామానికి చెందిన గట్టయ్య పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్ పోసుకున్న గట్టయ్యకు మహిళల మంగళహారతుల నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గట్టయ్య సహా 16 మందికి గాయాలయ్యాయి. 60 శాతానికిపైగా కాలిన గట్టయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ నెల 13న మలక్‌పేట యశోదకు మార్చారు. కాగా, చికిత్సపొందుతూ మంగళవారం గట్టయ్య మృతి చెందాడు. ఉస్మానియా ఆసుపత్రిలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. గట్టయ్యకు భార్య విజయ, కుమార్తె సాయినివేదిత(5), కుమారుడు సాయివిజ్ఞేశ్(3) ఉన్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఉస్మానియా ఆసుపత్రికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గట్టయ్య ఇద్దరు పిల్లల పేరిట రూ. 5 లక్షల చొప్పున బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తానని తెలిపారు. ప్రభుత్వపరంగా వచ్చే ఎక్స్‌గ్రేషియా మంజూరయ్యేలా చూస్తానన్నారు. మృతుడి భార్యకు ప్రభుత్వ లేదా ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పించి అతని కుటుంబాన్ని అన్ని వి««ధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
టీఆర్ఎస్ కార్యకర్త రేగుంట గట్టయ్య మృతి
-
పాపం గట్టయ్య..
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ కార్యకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అనుచరుడు రేగుంట గట్టయ్య మృతి చెందారు. ఓదెలుకు చెన్నూరు టికెట్ ఇవ్వలేదని గట్టయ్య ఈ నెల 12న పెట్రోలు పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. గట్టయ్యకు ఉస్మానియాలో పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించనున్నారు. (నల్లాల ఓదేలు అనుచరుల ఆత్మహత్యాయత్నం) పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు చెన్నూర్ టీఆర్ఎస్ టికెట్టు ఇవ్వడాన్ని నిరసిస్తూ పెట్రోలు పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఘటన ఇటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు..అటు ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అనాలోచిత నిర్ణయం, ఆవేశంతో ఇందారం గ్రామానికి చెందిన తెలంగాణ ఎమ్మార్పీఎస్ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు రేగుంట గట్టయ్య ఓదెలుపై ఉన్న అభిమానంతో టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే టికెటు ఇవ్వకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. చదవండి: మెత్తబడ్డ ఓదెలు -
మెత్తబడ్డ ఓదెలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ముందస్తు ఎన్నికల కోసం టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఉమ్మడి జిల్లాలో రాజకీయం ఎప్పటికప్పుడు రంగులు మారుతోంది. పది మంది తాజా మాజీ ఎమ్మెల్యేల్లో తొమ్మిది మందికి సీట్లిచ్చిన పార్టీ అధ్యక్షుడు చెన్నూర్‌లో మాత్రమే నల్లాల ఓదెలును మార్చారు. ఇక్కడ నుంచి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు అవకాశం కల్పించడంతో వారం రోజుల పాటు సాగిన హైడ్రామాకు వినాయక చవితి రోజు ముగింపు లభించింది. ముఖ్య మంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన తరువాత ఓదెలు తన మనసు మార్చుకున్నట్లు ప్రకటించారు. రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీతో చెన్నూర్‌లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని ఓదెలు చెప్పారు. అయితే ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలి యని పరిస్థితి. ఈ నేపథ్యంలో చెన్నూర్ రాజకీయం రసకందాయంలో పడింది. బోథ్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ ఎంపీ నగేష్ బీఫారం పంపిణీ నాటికి తనకే అవకాశం వస్తుందన్న ధీమాతో ఉన్నారు. అయితే పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్లు చేయకుండా తనదైన శైలిలో మంత్రాంగం నడుపుతున్నారు. ఖానా పూర్లో మాత్రం రమేష్ రాథోడ్ ఇప్పటికే రెబల్ అవతారం ఎత్తారు. ఇండిపెండెంట్‌గానైనా పోటీ ఖాయమని తేల్చేశారు. ఆయన కోసం కాంగ్రెస్ కూడా ఎదురుచూస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో అసంతృప్తి టీకప్పులో తుపాను వంటిదేనని అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయం రసంకందాయంలో పడింది. బోథ్‌లో టికెట్టుపై ఆశతో నగేష్ ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బోథ్ సీటుపై ఇప్పటికీ ఆశతోనే ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకే సీటు లభించింది. అయితే ఎంపీ అయినప్పటికీ శాసనసభకే పోటీ చేయాలనే ఆలోచనతో బోథ్‌లో పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న నగేష్ పార్టీ టికెట్ రాకపోవడంతో జీర్ణించుకోలేకపోయారు. ఆయనకు ఈనెల 3వ తేదీన స్వయంగా పార్టీలోని ఓ కీలక నాయకుడు సీటుపై హామీ ఇవ్వగా, ఆరో తేదీన ప్రకటించిన జాబితాలో మాత్రం ఆయన పేరు లేదు. ఈ విషయమై ఇప్పటికే నగేష్ ముఖ్యమంత్రిని రెండుసార్లు కలిసినట్లు సమాచారం. శుక్రవారం ఇచ్చోడలో పార్టీ నాయకులతో సమావేశమైన నగేష్ సీటు విషయంలో ఇప్పటికీ ఆశాభావంతోనే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. సర్వేలను ప్రభావితం చేయడం, కొందరు నాయకులు తన పట్ల తప్పుగా అధిష్టానానికి నివేదికలు ఇవ్వడం వల్లనే బోథ్ అభ్యర్థిత్వం విషయంలో పరిగణలోకి తీసుకోలేదని ఆయన చెపుతున్నారు. తప్పనిసరిగా తనకు బోథ్ బీఫారం వస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు. ఖానాపూర్‌లో రెబల్ స్టార్‌గా రాథోడ్ ఖానాపూర్‌లో రేఖా నాయక్‌ను మార్చి తనకు సీటివ్వాల్సిందేనని ఇప్పటికే రాథోడ్ రమేష్ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. సీటివ్వకపోతే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ నాయకులపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఖానాపూర్‌లో పోటీ చేయడం, గెలవడం ఇప్పటికే ఖరారైందని ఆయన చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో గందరగోళం నెలకొంది. ఒకవేళ టికెట్లు మార్చే పరిస్థితి ఎదురైనా... టీఆర్ఎస్ మీద బాహాటంగా విమర్శలు చేసిన రాథోడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఏమాత్రం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు సంపాదించే విషయంలో కూడా పునరాలోచిస్తున్నట్లు సమాచారం. చెన్నూర్‌లో కలిసి కాపురం సాధ్యమా..? చెన్నూర్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా ఓదెలు స్థానంలో బాల్క సుమన్‌కు సీట్విడంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. సామాజిక సమీకరణాల్లో కూడా రెండు భిన్న వర్గాలకు చెందిన వారు కావడంతో సమస్య తీవ్రమైంది. ఇందారంలో ఓదెలుకు మద్దతుగా పెట్రోలు బాటిల్‌తో హల్చల్ చేసి, చివరికి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రేగుంట గట్టయ్య కూడా సామాజికంగా ఓదెలు వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. ఓదెలు అంశాన్ని ఓ వర్గం రాష్ట్ర స్థాయి అంశంగా మార్చేందుకు ప్రయత్నించింది కూడా. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీతో ఓదెలు తన అసంతృప్తిని అటకెక్కించినట్లు కనిపించినా... మనస్ఫూర్తిగా పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేయడం అనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఓదెలుతో ఫోన్లో మాట్లాడేందుకు ‘సాక్షి ప్రతినిధి’ ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. -
ప్రాణంమీదికి తెచ్చిన అభిమానం
జైపూర్(చెన్నూర్): చెన్నూర్ తాజా మాజీ ఎమ్మె ల్యే నల్లాల ఓదెలుపై ఉన్న అభిమానం ఓ వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చింది. ఇందారంలో ఈ నెల 12న చోటు చేసుకున్న ఈ ఘటన ఇటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు..అటు ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అనాలోచిత నిర్ణయం, ఆవేశంతో ఇందారం గ్రామానికి చెందిన తెలంగాణ ఎమ్మార్పీఎస్ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు రేగుంట గట్టయ్య ఓదెలుపై ఉన్న అభిమానంతో టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే టికెటు ఇవ్వకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. గట్టయ్య వెంట తెచ్చుకున్న పెట్రోల్ సీసానుంచి అక్కడే మంగళహారతులు పట్టుకున్న మహిళలపై పడడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరి నేతల మధ్య రగిలిన చిచ్చు ప్రజల ప్రాణాలమీదకు తెచ్చింది. ఒక్కసారిగా పెట్రోల్ మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న వందలాది మంది ప్రజలు, నాయకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. తోపులాటలో మహిళలు, వృద్ధులు కిందపడడంతో స్వల్పగాయాలయ్యాయి. యశోద ఆస్పత్రిలో చికిత్స ఇందారం ఘటనలో గాయపడ్డ ఎంపీటీసీలు సుంకరి విమల, ముదాం రాజేశ్వరి, పీఏ సీఎస్ డైరెక్టర్ జక్కుల గంగామణి, తాజా మాజీ సర్పంచ్ జక్కుల వెంకటేశ్, పెద్దపల్లి నిఖిత, నాయకులు సుంకరి శ్రీనివాస్, భాస్కర్ల శ్రీకాంత్, తొగరి శ్రీనివాస్, ఎండీ.జైనోద్దీన్, చుంచు రాజ య్య, నమస్తే తెలంగాణ జిల్లా ఫొటోగ్రాఫర్ శ్రీను, టీవీ–9 జిల్లా కెమెరామెన్ మహేందర్, వెలుగు జిల్లా ఫొటోగ్రాఫర్ అనీశ్బాబు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చేకూర్తి సత్యనారాణరెడ్డికి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎండీ.జైనోద్దీన్, చేకూర్తి సత్యనారాణరెడ్డి, ముదాం రాజేశ్వరి, సుంకరి విమల, జక్కుల గంగామాణి, పెద్దపల్లి నిఖితలు 30శాతంపైగా గాయపడగా మిగిలినవారు తక్కువగా గాయపడ్డారు. స్వల్పంగా గాయపడ్డ భాస్కర్ల శ్రీకాంత్ డిచార్జి అయ్యారు. కాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గట్టయ్యకు మలక్‌పేట్ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గట్టయ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కాగా రెండ్రోజుల్లో చెన్నూర్ రాజకీయం మారిపోయింది. ఎంపీ సుమన్, తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు వర్గం ఒక్కటయ్యారు. -
బాల్క సుమన్‌పై నల్లాల ఓదేలు ఫైర్
-
నా భవిష్యత్తును కేసీఆర్ చేతిలో పెట్టాను
-
ఓదెలు ఆశలపై పెట్రోల్ మంట!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘అదృష్టం కలిసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుంది’ ఈ తెలుగు సామెత చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పరిస్థితికి చక్కగా సరిపోతుంది. చెన్నూర్‌లో మూడుసార్లు గెలిచి ప్రభుత్వ విప్‌గా నాలుగేళ్లు బాధ్యతలు నిర్వర్తించిన నల్లాల ఓదెలును దురదృష్టం వెంటాడి ఈసారి సీటు గల్లంతైన విషయం తెలిసిందే. తన సీటును తనకివ్వాలని ఆయనతో పాటు అనుచరులు కూడా గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆవేశపూరితంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ ఇందారంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటన. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు చెన్నూర్ టీఆర్ఎస్ టికెట్టు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇందారానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు, మాజీ వార్డు మెంబర్ రేగుంట గట్టయ్య బుధవారం మధ్యాహ్నం ఇందారంలో పెట్రోల్ సీసాతో హల్చల్ చేశాడు. రాజీవ్ర హదారి నుంచి ఇందారం గ్రామానికి వెళ్లే దారిలో ఓ సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి సుమన్ భూమిపూజ చేసి, ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి రాగా, మహిళలు హారతి పడుతున్నారు. అదే సమయంలో లీటరు పెట్రోల్ సీసాతో వచ్చిన రేగుంట గట్టయ్య జై కేసీఆర్.. జై ఓదన్న అని నినాదాలు చేస్తూ పెట్రోల్ పోసుకునేయత్నంలో సీసాను గట్టిగా ఒత్తడంతో పెట్రోల్ తనపైనే కాకుండా అక్కడున్న పలువురు నాయకులు, మహిళలపై పడింది. అతడు ఉద్దేశపూర్వకంగా చేశాడో, భయపెట్టేందుకు చేస్తున్నాడో తెలియకపోయినా... పెట్రోల్ మహిళల చేతుల్లోని హారతులపై పడడంతో ఒక్కసారిగా మంటలు లేచాయి. పెట్రోల్ పట్టుకొచ్చిన గట్టయ్యకు మంటలు అంటుకోగా, శ్రీరాంపూర్ సీఐ నారాయణ్‌నాయక్, మహ్మద్ జైనుద్దీన్ పక్కన ఉండడంతో సుమన్‌కు ప్రమాదం తప్పింది. సుమన్‌ను అక్కడినుంచి నారాయణ్ నాయక్ తోసివేయడంతో ఎలాంటి గాయం కాలేదు. అదే సమయంలో జైనుద్దీన్‌కు తీవ్ర గాయాలు కాగా, సీఐ నారాయణ్ నాయక్ చేతికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు సానుభూతిని కాకుండా వ్యతిరేకతకు కారణం కావడం గమనించాల్సిన విషయం. అవకాశాన్ని అనుకూలంగా మార్చుకున్న సుమన్ ఈ సంఘటనను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఎంపీ సుమన్ సఫలమయ్యారు. ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న సుమన్ తనను హత్య చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే గట్టయ్య పెట్రోల్ చిమ్మాడని ఆరోపించారు. అదే సమయంలో మరో వ్యక్తి అగ్గిపెట్టెతో సిద్ధంగా ఉన్నట్లు ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడుతూ చెప్పారు. తనను హతమార్చే ఉద్శేంతోనే పెట్రోల్‌తో ఒకరు, అగ్గిపెట్టెతో మరొకరు కార్యక్రమానికి హాజరైనట్లు ఆయన వివరించారు. పెట్రోల్ పోయగానే వేరే వ్యక్తి అగ్గిపెట్టె వెలిగించాల్సి ఉండగా, మంగళహారతి కారణంగా మంటలు లేసి కాలిపోవడం జరిగిందని వివరించారు. జైనుద్దీన్, సీఐ నారాయణ నాయక్ తనను కాపాడారని, వారు లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదురయ్యేవని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ఆ తర్వాత జైపూర్‌లో మీడియాకు చెప్పిన సుమన్, చెన్నూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కూడా స్పష్టం చేశారు. తనకు టికెట్టు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక ఓదెలు వర్గం చేస్తున్న ఈ ప్రయత్నాలను ఎదుర్కొంటానన్నారు. కేసీఆర్ శిష్యుడిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తానని చెప్పుకొచ్చారు. కాగా తనపై హత్యాయత్నం జరిగినట్లు సుమన్ ప్రకటించగా, శివ్వారం గ్రామ మాజీ సర్పంచ్ విశ్వాంబర్రెడ్డి పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 307 కింద హత్యాయత్నం కేసు నమోదైంది. ఇదంతా చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు చిక్కులు తెచ్చేదిగా తయారవడం గమనార్హం. స్వీయ గృహ నిర్బంధంపై పార్టీ సీరియస్ చెన్నూర్ అభ్యర్థిగా సుమన్‌కు టికెట్టు ఇవ్వడాన్ని నిరసిస్తూ మంగళవారం నల్లాల ఓదెలు మందమర్రిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వీయ గృహ నిర్బంధం విధించుకొని నిరసన వ్యక్తం చేశారు. తనకేమైనా సీఎం కేసీఆర్‌దే బాధ్యత అని మీడియాకు ఫోన్ ద్వారా తెలియజేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం ఓదెలు ప్రయత్నాన్ని విరమింపజేయాల్సిందిగా రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలను ఆదేశించారు. ఇంద్రకరణ్‌రెడ్డి మందమర్రికి వచ్చి ఓదెలును కలవాల్సి ఉన్నప్పటికీ, కొండగట్టులో బస్సు ప్రమాదం సంఘటన నేపథ్యంలో ఆయన రాలేదు. ఈ పరిస్థితుల్లో ఎంపీ సంతోష్‌కుమార్ ఓదెలుకు ఫోన్ చేసి బుధవారం ప్రగతిభవన్‌లో అందుబాటులో ఉండాలని చెప్పారు. దాంతో ఓదెలు నిరసన విరమించారు. అయితే ఓదెలు చర్య రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. సీఎంను కలవని ఓదెలు.. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతిభవన్‌కు బుధవారం ఉదయమే వెళ్లిన ఓదెలుకు మధ్యాహ్నం 3గంటలకు సీఎం అపాయింట్మెంట్ లభించినట్లు సమాచారం. దీంతో ఆయన వేచిచూస్తున్న సమయంలోనే ఇందారం సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు కారణమైన రేగుంట గట్టయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు సమాచారం రావడంతో ఓదెలు సీఎంను కలవకుండానే వరంగల్ బయలుదేరి వెళ్లారు. ఈ సంఘటనల నేపథ్యంలో ఓదెలుపై చర్యలు తీసుకునేందుకు కూడా పార్టీ వెనుకాడకపోవచ్చని సమాచారం. -
నాపై హత్యాయత్నం : బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మంచిర్యాల : చెన్నూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన టీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ, విద్యార్థి నాయకుడు బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి చేసి చంపాలనుకుంటున్నారని, తాను చస్తే చెన్నూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటే తాను చావడానికి కూడా సిద్ధమేనని ఆయన అన్నారు. ‘నా పైన దాడి చేసి నన్ను చంపాలి అనుకున్నారు. నేను చస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే నేను చావడానికి సిద్ధం’ అని పేర్కొన్నారు. జైపూర్ మండలం ఇందారంలో బుధవారం బాల్క సుమన్ ఓ కార్యక్రమం శంకుస్థాపన చేసేందుకు రాగా.. ఆయనకు వ్యతిరేకంగా ఓదెలు అనుచరులు ఆత్మహత్యాయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో బాల్క సమన్ మీడియాతో ఓదెలు వర్గం చేస్తున్న బెదిరింపులకు భయపడేది లేదని, టికెట్ ఇచ్చాక మొదటిసారి నియోజకవర్గంలో కాలుపెడితే తనపై హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆదేశం మేరకే తాను చెన్నూర్ నియోజకవర్గం నుండి పోటీలోకి దిగుతున్నానని తెలిపారు. సీనియర్ నేత వివేక్ పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి వీలుగా.. ఆ టికెట్ ఇచ్చేసి.. చెన్నూర్ నియోజకవర్గం నుండి పోటీకి దిగాలని అధిష్టానం ఆదేశించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తాను వివేక్‌ను, ఆయన సోదరుడు వినోద్‌ను కలిసి సహకరించాలని కోరానని, అందుకు వారు సానుకులంగా స్పందించారని తెలిపారు. నల్లాల ఓదెలును కూడా హైదరాబాద్‌లో కలిసి సహకరించాల్సిందిగా కోరానని చెప్పారు. నిజమబాద్ నుండి జగ్దల్పూర్ రహదారికి నిధులు వచ్చేలా చేసి చెన్నూర్ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. నల్లాల ఓదేలు అనుచరుల ఆత్మహత్యాయత్నం చెన్నూరు ఎమ్యెల్యే టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నల్లాల ఓదేలుకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆయన అనచరులు ఆత్మహత్యాయత్నం చేశారు. జైపూర్ మండలం ఇందారంలో బుధవారం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ పాల్గొన్న ఓ శంకుస్థాపన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంపీ రాకను తెలుసుకున్న ఓదేలు అనుచరులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ బాల్కసుమన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో ఘట్టయ్యా అనే కార్యకర్త తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకోని నిప్పంటించుకున్నాడు. అతని పక్కనే ఉన్న మరో నలుగురికి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన అక్కడున్నవారు వారి మంటలను ఆర్పి ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొని భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు అక్కడున్న వారిని అరెస్ట్ చేసి శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
జైపూర్ మండలం ఇందారంలో ఉద్రిక్తత
-
హైదరాబాద్ రా... మాట్లాడుదాం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్ సీటును పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించడంపై తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మందమర్రిలోని తన నివాసంలో సోమవారం రాత్రి నిద్రపోయిన ఓదెలు కుటుంబం మంగళవారం ఇంటి నుంచి బయటకు రాలేదు. క్వార్టర్స్ ప్రధాన గేటుతో పాటు ఇంటికి ఉన్న అన్ని దర్వాజాలను మూసివేసి స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. గన్మన్లను కూడా బయటే ఉంచిన ఓదెలు ఇంటి లోపలికి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సాయంత్రంలోగా తనకు చెన్నూర్ టికెట్టు ఇస్తున్నట్లు ప్రకటిస్తేనే తలుపులు తీస్తామని, లేదంటే ఏం జరుగుతుందో కూడా తెలియదని హెచ్చరించారు. ఉదయం నుంచి హైడ్రామా! ఓదెలు గృహ నిర్బంధంలోకి వెళ్లారనే ప్రచారం మంగళవారం ఉదయం 9.15 గంటలకు దావానలంలా వ్యాపించింది. దాంతో కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన నివాసం ఎదుట బైఠాయించారు. మంత్రులు, పార్టీ పెద్దల నుంచి పిలుపు వస్తే తప్ప తాను బయటకు వచ్చేది లేదంటూ ఓదెలు చాలా స్పష్టమైన సంకేతాన్ని పార్టీ వర్గాలకు ఇచ్చారు. అయితే.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్ ఓదెలుకు సర్ది చెప్పేందుకు విఫలయత్నం చేశారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో కేసీఆర్ స్వయంగా ఓదెలుకు ఫోన్ చేసి ‘రేపు ప్రగతిభవన్‌లో ఉండేలా హైదరాబాద్ బయలు దేరి వచ్చేయ్..’ అని చెప్పడంతో గృహ నిర్బంధం వీడారు. కేసీఆర్‌నే నమ్ముకున్నా: ఓదెలు తాను కేసీఆర్‌నే నమ్ముకున్నానని ఓదెలు స్పష్టం చేశారు. స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిన ఆయన ఫోన్లో ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. ఈనెల 6న ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేనందుకు మనస్తాపానికి గురైనట్లు వెల్లడించారు. ఉద్యమం పురుడు పోసుకున్న నాటి నుంచి కేసీఆర్ వెంటే ఉన్నానని తెలిపారు. ఇప్పటికీ కేసీఆర్ తననే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారన్న నమ్మకం ఉందని ఓదెలు స్పష్టం చేశారు. బాల్క సుమన్ తప్పుడు నివేదికలు ఇచ్చారని, కేసీఆర్ తన వేగుల ద్వారా సర్వే చేయించాలని, ఆ సర్వేలో వచ్చే రిపోర్టుకు తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఇప్పటికీ రేకుల ఇంట్లో ఉంటున్నానని, తనకు టిక్కెట్టు ఇవ్వాలని ఓదెలు ఉద్విగ్నంగా చెప్పారు. -
స్వీయ గృహ నిర్భంధంలోకి వెళ్లిన ఓదేలు
-
టికెట్ ఇస్తేనే తలుపు తీస్తా..
సాక్షి, మంచిర్యాల: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 105మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి ఆ పార్టీలో అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తొలి ప్రాధాన్యత అని పేర్కొన్న కేసీఆర్ తన విషయంలో మాత్రం ఎందుకు అన్యాయం చేశారని చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నూర్ టికెట్ అధిష్టానం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించడంపై నిరసన గళం తీవ్రం చేశారు. అందులో భాగంగా మంగళవారం తన ఇంట్లో స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. చెన్నూర్ టికెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇస్తేనే తలుపులు తీస్తానని స్పష్టం చేశారు. 24 గంటల్లో తనకు సానుకూల స్పందన రాకపోతే జరిగే పరిణామాలకు కేసీఆర్ బాధ్యత వహించాలని నల్లాల ఓదెలు హెచ్చరించారు. ఓదెలు చర్యతో కుటుంబ సభ్యులు, అభిమానుల ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు ఓదెలు ఇంటికి చేరుకొని బయటకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ కోసం నిరాహారదీక్ష టీఆర్ఎస్ పార్టీ తన భర్తకు టికెట్ కేటాయించాలని స్థానిక కార్పోరేటర్ నిరాహారదీక్ష చేపట్టారు. తన భర్త పన్నాల హరీష్ చంద్ర రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ కూకట్పల్లి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలంటూ కావ్య హరీష్ చంద్ర రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు. కావ్య హరీష్ చంద్ర రెడ్డి బాలాజీ నగర్ డివిజన్ కార్పోరేటర్ కావడం విశేషం. -
అభివృద్ధి కార్యక్రమాల్లో విప్
ఆదిలాబాద్ జిల్లా మందమర్రి పట్టణంలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు పాల్గొన్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ప్రారంభించారు. అనంతరం 8 మందికి మంజూరైన రూ.2.21 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో డీఎస్పీ రమణారెడ్డి, సీఐ సదయ్య తదితరులు పాల్గొన్నారు. -
వారసత్వం మళ్లీ సొంతం
ముఖ్యమంత్రి ప్రకటనతో కార్మికుడి బిడ్డగా గర్వపడుతున్నా.. ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు ఘన స్వాగతం పలికిన టీబీజీకేఎస్ శ్రేణులు మందమర్రి నుంచి రామకృష్ణాపూర్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ మందమర్రి : ఏళ్లుగా సింగరేణి కార్మికులు ఎదురుచూస్తున్న వారసత్వ ఉద్యోగ ప్రకటనతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన యావత్తు సింగరేణికి, కార్మికవర్గానికి ఎంతో సంతోషాన్నిచ్చిందని బతుకు నమ్మకాన్ని కలిగించిందని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు అన్నారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన చర్చల్లో పాల్గొని శుక్రవారం సాయంత్రం మందమర్రికి వచ్చిన ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలును టీబీజీకేఎస్ నాయకులు స్థానిక బస్టాండ్ ప్రాంతంలో ఘన స్వాగతం పలికారు. పెట్రోల్ బంక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ సెంటర్‌కు చేరుకోగా, విప్ ఓదేలు కార్మికులను, యూనియన్ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి గత వైభవం తీసుకురావాలనే ఆకాంక్ష బలంగా ఉండేదని తెలిపారు. వలస పాలకుల పాలనలో సింగరేణి ఛిద్రమైందని, దానిని రక్షించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డగా తనపై ఉందని కేసీఆర్ భావించే వారని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రకటించిన వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ ప్రకటనతో సింగరేణి కొంగు బంగారంగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు. నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి పరిసర ప్రాంత గ్రామాలు, అతిపెద్ద పారిశ్రామిక నగరాలుగా విలసిల్లుతాయని ఆయన తెలిపారు. అనంతరం సుమారు వెయ్యి మోటారు వాహనాలతో భారీ ర్యాలీగా రామకృష్ణాపూర్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, నాయకులు జె.రవీందర్, ఎస్.ప్రభాకర్, కాంపెల్లి సమ్మయ్య, దాసరి రామన్న, లక్ష్మణ్, అన్ని గనుల డిపార్ట్మెంట్ల ఫిట్ కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు. -
భట్టీ.. నోరు అదుపులో పెట్టుకో
ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు సాక్షి, హైదరాబాద్: వరుస ఓటములతో మతి స్థిమితం కోల్పోయిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు అన్నారు. పాలేరు ఉప ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్‌ను పాతరేసినా వారికి బద్ధి రాలేదని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అవినీతి గురించి మాట్లాడడం నవ్వు తెప్పిస్తోందని, వట్టి మాటలు కట్టిపెట్టి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. అవినీతిలో పేటెంట్ హక్కులన్నీ కాంగ్రెస్‌వేనని, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ గృహనిర్మాణ మంత్రిగా ఉన్నప్పు డు ఇందిరమ్మ ఇళ్లను అవినీతి కూపంగా మార్చారన్నారు. ఎన్నికల హామీల అమలుపై బహిరంగ చర్చకు రావాలన్నారు.