పాపం గట్టయ్య.. | Nallala Odelu Follower Gattaiah Died | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 18 2018 4:40 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

Nallala Odelu Follower Gattaiah Died - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ కార్యకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అనుచరుడు రేగుంట గట్టయ్య మృతి చెందారు. ఓదెలుకు చెన్నూరు టికెట్‌ ఇవ్వలేదని గట్టయ్య ఈ నెల 12న పెట్రోలు పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. గట్టయ్యకు ఉస్మానియాలో పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించనున్నారు. (నల్లాల ఓదేలు అనుచరుల ఆత్మహత్యాయత్నం)

పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు చెన్నూర్‌ టీఆర్‌ఎస్‌ టికెట్టు ఇవ్వడాన్ని నిరసిస్తూ పెట్రోలు పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఘటన ఇటు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు..అటు ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అనాలోచిత నిర్ణయం, ఆవేశంతో ఇందారం గ్రామానికి చెందిన తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు రేగుంట గట్టయ్య ఓదెలుపై ఉన్న అభిమానంతో టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎమ్మెల్యే టికెటు ఇవ్వకపోవడంతో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.

చదవండి:  మెత్తబడ్డ ఓదెలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement