Gattaiah
-
‘మాదిగ జాతిని అంతం చేసే కుట్రలు జరుగుతున్నాయి’
సాక్షి, మంచిర్యాల: నల్లాల ఓదెలుకు టికెట్ రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డ గట్టయ్య మృతదేహానికి బుధవారం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గట్టయ్య మృతికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆందోల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాబు మోహన్ టికెట్‌ను.. ఒక జర్నలిస్టు అయిన మరో మాల వ్యక్తికే ఇచ్చారని తెలిపారు. కానీ చెన్నూరులో మాత్రం ఎమ్మెల్యేగా ఉన్న మాదిగ వ్యక్తి ఓదెలు టికెట్‌ను మాత్రం మాల వ్యక్తి ఒక ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌కు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనలో మాదిగ జాతిని అంతం చేసే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో అక్రమాలు, అవినీతి చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగించి.. నీతిగా న్యాయంగా కొనసాగిన మాదిగ బిడ్డ ఓదెలుకు టికెట్ నిరాకరించడంపై మండిపడ్డారు. కేసీఆర్ చేసిన సర్వేలో 78 శాతంతో ఓదెలు ముందన్న టికెట్ నిరాకరిస్తూ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు తెలుపాలని కోరారు. ఈ నెల 12న ఇందారంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్రచార ర్యాలీ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గట్టయ్య(35) 80శాతం కాలిన గాయాలతో హైదరాబాద్ మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 2.20 గంటలకు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
గట్టయ్య మృతి బాధాకరం : ఓదెలు
జైపూర్(చెన్నూర్): తాను నమ్ముకున్న నాయకుడికి ఎమ్మెల్యే టికెట్ రాలేదని మనస్తాపం చెందిన రేగుంట గట్టయ్య పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడి తన కుటుంబానికి తీరనిశోకాన్ని మిగిల్చాడు. ఈ నెల 12న ఇందారంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్రచార ర్యాలీ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గట్టయ్య(35) 80శాతం కాలిన గాయాలతో హైదరాబాద్ మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 2.20 గంటలకు మృతి చెందాడు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత సిటింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు స్థానంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను టీఆర్ఎస్ చెన్నూర్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. ఓదెలుకు టికెట్ ఇవ్వకపోవడంతో ముందు నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్న జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన రేగుంట గట్టయ్య మనస్తాపం చెందాడు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా, కేసీఆర్ సేవా దళం జిల్లా ఉపాధ్యక్షులుగా, ఇందారం 13వ వార్డు సభ్యులుగా ఉన్న గట్టయ్య ఓదెలు, ఆయన కుటుంబానికి దగ్గరయ్యారు. గట్టయ్య అనారోగ్యపరిస్థితుల్లో ఓదెలు ఆయనను ఆదుకోవడం అన్నివిధాలుగా సహకరించడంతో అభిమానం మరింత పెరిగింది. మరో సారి ఓదెలుకు టికెట్ వచ్చి మళ్లీ ఆయన గెలిస్తే తనకు కూడా ప్రాధాన్యతపెరుగుతుందని భావించిన గట్టయ్య టికెట్ రాకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలో చెన్నూర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ బాల్క సుమన్ 12న(బుధవారం) తొలిసారి నియోజకవర్గానికి రావడం ఇందారం వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అక్కడే ఉన్న గట్టయ్య తన నిరసనను వ్యక్తం చేయడానికి ప్రచార ర్యాలీ ప్రారంభించే ముందు ఎంపీ సుమన్ రాజీవ్ రహదారి పక్కన డీఎంఎఫ్టీ నిధులతో నూతనంగా నిర్మించనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తుండగా జై..కేసీఆర్..జై ఓదెలు అంటూ గట్టయ్య తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ సీసాను ఒంటిపై పోసుకోగా దాన్నిఅడ్డుకునే ప్రయత్నంలో అక్కడే ఎంపీకి స్వాగతం పలకడానికి మంగళహారతులతో వచ్చిన మహిళలపై పెట్రోల్ పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇందారం, రామారావుపేట, టేకుమట్ల, భీమారం గ్రామాలకు చెందిన 12మంది ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతోపాటు 3 రిపోటర్లకు గాయాలయ్యాయి. ముందు గట్టయ్య తనపై పెట్రోల్ పోసుకోవడంతో ఆయన 80శాతం కాలిపోయాడు. హుటాహుటిన మంచిర్యాలకు తరలించి అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు, అనంతరం హైదరాబాద్ మలక్‌పేట్ యశోద ఆస్పత్రి తరలించి వైద్యం అందించారు. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన గట్టయ్య మంగళవారం మృతి చెందాడు. ఇందారంలో విషాదం.. అందరితో కలివిడిగా ఉండే గట్టయ్య మృతి చెందడంతో ఇందారంలో విషాదం నెలకొంది. గట్టయ్య మరణ వార్త తెలిసి ఇందారం వాసులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. గట్టయ్య మృతితో ఆయన కుటుంబ రోడ్డున పడింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరులా రోధించారు. గట్టయ్యకు భార్య విజయ, కుమార్తె సాయినివేదిత(5), కుమారుడు సాయి విజ్ఞేశ్(3) ఉన్నారు. బుధవారం ఇందారంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాజ సేవలో గట్టయ్య.. ఇందారం గ్రామానికి చెందిన గట్టయ్య తన నాన్నమ్మ బుచ్చమ్మ దగ్గర పెరిగిన గట్టయ్య ఆమె మృతితో 2010లో గ్రాండ్ మా యూత్ స్థాపించారు. గ్రాండ్ మా యూత్ ద్వారా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రక్తదాన శిబిరాలు, దాతల సహకారంతో ఉచిత వైద్యశిబిరాల ఏర్పాటు, నిరుపేద విద్యార్థులకు విద్యాసామగ్రి తదితర సేవకార్యక్రమాలు చేపట్టి జిల్లా స్థాయిలో గుర్తింపు పొంది పలుమార్లు అవార్డులు సైతం అందుకున్నారు. ఇందారం ఓపెన్‌కాస్టుకు వ్యతిరేకంగా గట్టయ్య ఉద్యమించారు. జేఏసీ నేతృత్వంలో తలపెట్టిన ఓపెన్‌కాస్టు వ్యతిరేక పోరాటాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. గట్టయ్య మృతి బాధాకరం : ఓదెలు మంచి మనస్సున గట్టయ్య మృతి చెందడం చాలా బాధకరమని చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. గట్టయ్య కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటానని ఆయన కుమార్తె సాయినివేదిత, కుమారుడు సాయివిజ్ఞేశ్పై రూ.5 లక్షల చొప్పున ఇద్దరిపై రూ.10లక్షలు బ్యాంకులో ఫిక్స్‌డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. అంత్యక్రియల ఖర్చు మొత్తం బరించుకుంటామని కుటుం బానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. -
ఓదెలు అనుచరుడు గట్టయ్య మృతి
సాక్షి, హైదరాబాద్/జైపూర్: టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో మంచిర్యాల జిల్లా చెన్నూరు టికెట్‌ను నల్లాల ఓదెలుకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆత్మహత్యకు యత్నించిన రేగుంట గట్టయ్య (32) మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చెన్నూరు టికెట్ తనకు కాకుండా ఎంపీ బాల్క సుమన్‌కు ఇవ్వడంతో ఓదెలు ఈ నెల 11న మందమర్రిలోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలసి స్వీయ గృహ నిర్బంధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 12న జైపూర్ మండలం ఇందారంలో అభివృద్ధి పనులకు భూమిపూజతో పాటు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఎంపీ బాల్క సుమన్ వచ్చారు. ఈ కార్యక్రమంలో ఓదెలు అనుచరుడు, ఇందారం గ్రామానికి చెందిన గట్టయ్య పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్ పోసుకున్న గట్టయ్యకు మహిళల మంగళహారతుల నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గట్టయ్య సహా 16 మందికి గాయాలయ్యాయి. 60 శాతానికిపైగా కాలిన గట్టయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ నెల 13న మలక్‌పేట యశోదకు మార్చారు. కాగా, చికిత్సపొందుతూ మంగళవారం గట్టయ్య మృతి చెందాడు. ఉస్మానియా ఆసుపత్రిలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. గట్టయ్యకు భార్య విజయ, కుమార్తె సాయినివేదిత(5), కుమారుడు సాయివిజ్ఞేశ్(3) ఉన్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఉస్మానియా ఆసుపత్రికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గట్టయ్య ఇద్దరు పిల్లల పేరిట రూ. 5 లక్షల చొప్పున బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తానని తెలిపారు. ప్రభుత్వపరంగా వచ్చే ఎక్స్‌గ్రేషియా మంజూరయ్యేలా చూస్తానన్నారు. మృతుడి భార్యకు ప్రభుత్వ లేదా ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పించి అతని కుటుంబాన్ని అన్ని వి««ధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
టీఆర్ఎస్ కార్యకర్త రేగుంట గట్టయ్య మృతి
-
పాపం గట్టయ్య..
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ కార్యకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అనుచరుడు రేగుంట గట్టయ్య మృతి చెందారు. ఓదెలుకు చెన్నూరు టికెట్ ఇవ్వలేదని గట్టయ్య ఈ నెల 12న పెట్రోలు పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. గట్టయ్యకు ఉస్మానియాలో పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించనున్నారు. (నల్లాల ఓదేలు అనుచరుల ఆత్మహత్యాయత్నం) పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు చెన్నూర్ టీఆర్ఎస్ టికెట్టు ఇవ్వడాన్ని నిరసిస్తూ పెట్రోలు పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఘటన ఇటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు..అటు ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అనాలోచిత నిర్ణయం, ఆవేశంతో ఇందారం గ్రామానికి చెందిన తెలంగాణ ఎమ్మార్పీఎస్ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు రేగుంట గట్టయ్య ఓదెలుపై ఉన్న అభిమానంతో టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే టికెటు ఇవ్వకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. చదవండి: మెత్తబడ్డ ఓదెలు -
ప్రాణంమీదికి తెచ్చిన అభిమానం
జైపూర్(చెన్నూర్): చెన్నూర్ తాజా మాజీ ఎమ్మె ల్యే నల్లాల ఓదెలుపై ఉన్న అభిమానం ఓ వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చింది. ఇందారంలో ఈ నెల 12న చోటు చేసుకున్న ఈ ఘటన ఇటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు..అటు ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అనాలోచిత నిర్ణయం, ఆవేశంతో ఇందారం గ్రామానికి చెందిన తెలంగాణ ఎమ్మార్పీఎస్ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు రేగుంట గట్టయ్య ఓదెలుపై ఉన్న అభిమానంతో టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే టికెటు ఇవ్వకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. గట్టయ్య వెంట తెచ్చుకున్న పెట్రోల్ సీసానుంచి అక్కడే మంగళహారతులు పట్టుకున్న మహిళలపై పడడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరి నేతల మధ్య రగిలిన చిచ్చు ప్రజల ప్రాణాలమీదకు తెచ్చింది. ఒక్కసారిగా పెట్రోల్ మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న వందలాది మంది ప్రజలు, నాయకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. తోపులాటలో మహిళలు, వృద్ధులు కిందపడడంతో స్వల్పగాయాలయ్యాయి. యశోద ఆస్పత్రిలో చికిత్స ఇందారం ఘటనలో గాయపడ్డ ఎంపీటీసీలు సుంకరి విమల, ముదాం రాజేశ్వరి, పీఏ సీఎస్ డైరెక్టర్ జక్కుల గంగామణి, తాజా మాజీ సర్పంచ్ జక్కుల వెంకటేశ్, పెద్దపల్లి నిఖిత, నాయకులు సుంకరి శ్రీనివాస్, భాస్కర్ల శ్రీకాంత్, తొగరి శ్రీనివాస్, ఎండీ.జైనోద్దీన్, చుంచు రాజ య్య, నమస్తే తెలంగాణ జిల్లా ఫొటోగ్రాఫర్ శ్రీను, టీవీ–9 జిల్లా కెమెరామెన్ మహేందర్, వెలుగు జిల్లా ఫొటోగ్రాఫర్ అనీశ్బాబు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చేకూర్తి సత్యనారాణరెడ్డికి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎండీ.జైనోద్దీన్, చేకూర్తి సత్యనారాణరెడ్డి, ముదాం రాజేశ్వరి, సుంకరి విమల, జక్కుల గంగామాణి, పెద్దపల్లి నిఖితలు 30శాతంపైగా గాయపడగా మిగిలినవారు తక్కువగా గాయపడ్డారు. స్వల్పంగా గాయపడ్డ భాస్కర్ల శ్రీకాంత్ డిచార్జి అయ్యారు. కాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గట్టయ్యకు మలక్‌పేట్ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గట్టయ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కాగా రెండ్రోజుల్లో చెన్నూర్ రాజకీయం మారిపోయింది. ఎంపీ సుమన్, తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు వర్గం ఒక్కటయ్యారు. -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని రైతు మృతి
చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామశివారులో ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఓ రైతు మృత్యవాతపడ్డాడు. స్థానిక వెదురుగట్టకు చెందిన భూత్కూరి గట్టయ్య(50) అనే రైతు మరొకరితో కలిసి చొప్పదండి నుంచి వెదురుగుట్టకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ డీకొట్టింది. దీంతో గట్టయ్య అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పొడగరి గట్టయ్య మృతి
-
బంగారు నాణేలు స్వాధీనం
చెన్నూర్ : మరుగుదొడ్డి నిర్మాణ తవ్వకాల్లో ఇటీవల కూలీలకు లభ్యమైన 34 బంగారు నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని కోటబోగూడ ప్రాంతానికి చెందిన గడుదాసు గట్టయ్య ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మాణం కోసం 15 రోజుల క్రితం పట్టణానికి చెందిన కూలీలు పెరుకుల రాజు, సత్యనారాయణ, హరీశ్, గంగన్న, గుంజ్ర రమేశ్ గుంత తవ్వుతుండగా అందులో ఒక డబ్బా కనిపించింది. ఆ డబ్బాను రాజు చెరువు కట్ట ప్రాంతానికి తీసుకెళ్లి చూడగా అందులో బంగారు నాణేలు కనిపించాయి. విషయాన్ని సహచర కూలీలకు చెప్పి అందరూ కలిసి పంచుకున్నారు. ఈ క్రమంలో రాజు గురువారం బంగారు నాణెం అమ్మకానికి తీసుకురాగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు చేరుకొని రాజును అదుపులోకి తీసుకొని విచారించగా తవ్వకాల్లో బంగారు నాణేలు దొరికినట్లు తెలిపాడు. ఇంటి యజమాని గట్టయ్యకు సైతం నాణేల్లో వాటా ఇచ్చామని పేర్కొన్నాడు. ఈ మేరకు రాజు వద్ద ఎనిమిది బంగారు నాణేలు, సత్యనారాయణ, హరీశ్‌ల వద్ద 24, గంగన్న వద్ద రెండు మొత్తం 34 నాణేలు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. గుంజ్ర రమేశ్, ఇంటి యజమాని గట్టయ్య వద్ద ఉన్న నాణేలనూ త్వరలో స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఐదుగురు కూలీలు, ఇంటి యజమానిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
కష్టాలు గట్టెక్కని గట్టయ్య
హైదరాబాద్ : పొడగరి పొలిపాక గట్టయ్యను కష్టాలు చుట్టుముట్టాయి. ఏడు అడుగుల ఆరు అంగుళాల ఎత్తుతో.. యావత్ దేశాన్ని బాప్రే అనిపించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కినగట్టయ్య ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకున్నారు. శిల్పారామంలో కాంట్రాక్ట్ పద్దతిన తొమ్మిదేళ్లుగా అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గట్టయ్య కుడికాలుకు సెప్టిక్ కావటంతో ఇటీవలే దాన్ని పాదం వరకు తొలగించారు. దీంతో ఆయన కృత్రిమ పాదాన్ని పెట్టుకుని గంటల తరబడి నిలబడి శిల్పారామంలో వచ్చిపోయే వారిని పలకరిస్తూ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. అయితే కుడికాలుకు సెప్టిక్ అయి కాలు తొలగించే క్రమంలో చేతిలో చిల్లిగవ్వ లేకపోవటంతో కరీంనగర్ జిల్లాలో ఉన్న తన ప్లాట్‌ను అమ్మి వైద్యమైతే చేయించుకున్నారు గాని నెలనెలా మందుల కొనుగోలుకు ఇబ్బంది పడుతున్నారు. మందులు కొనుక్కోవడానికి అతనికి వచ్చే జీతం రూ.8000 ఎటూ సరిపోని పరిస్థితి. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గట్టయ్య శిల్పారామంలో ఉద్యోగంతో పాటు వికలాంగుల కోటా కింద బస్‌పాస్ మంజూరు చేయించారు. అయితే ఇటీవల బస్‌పాస్ గడువు ముగియగా, రెన్యువల్‌కు అధికారులు నిరాకరించారు. ఇటీవలే సొంతూళ్లో తల్లికి కాలు విరిగి మంచాన పడిందని, అప్పుడప్పుడు ఊరికి వెళ్లివచ్చే వాడినని, ప్రస్తుతం బస్‌పాస్ రెన్యువల్ కాకపోవటంతో తల్లిని చూసేందుకు కూడా వీలుపడటం లేదని గట్టయ్య ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. శిల్పారామరంలో అధికారులందరూ తననెంతో అప్యాయంగా చూసుకుంటున్నప్పటికీ భవిష్యత్తు గురించి తలచుకుంటే.. భయం వేస్తుందన్నారు. తన ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తే, తానంటే ఇష్టపడే అమ్మాయి దొరికితే ఓ ఇంటివాడిని కావాలనుకుంటున్నట్లు గట్టయ్య మనసులో మాటను వెలిబుచ్చారు.