హైదరాబాద్ : పొడగరి పొలిపాక గట్టయ్యను కష్టాలు చుట్టుముట్టాయి. ఏడు అడుగుల ఆరు అంగుళాల ఎత్తుతో.. యావత్ దేశాన్ని బాప్‌రే అనిపించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కినగట్టయ్య ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకున్నారు. శిల్పారామంలో కాంట్రాక్ట్ పద్దతిన తొమ్మిదేళ్లుగా అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గట్టయ్య కుడికాలుకు సెప్టిక్ కావటంతో ఇటీవలే దాన్ని పాదం వరకు తొలగించారు. దీంతో ఆయన కృత్రిమ పాదాన్ని పెట్టుకుని గంటల తరబడి నిలబడి శిల్పారామంలో వచ్చిపోయే వారిని పలకరిస్తూ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.
అయితే కుడికాలుకు సెప్టిక్ అయి కాలు తొలగించే క్రమంలో చేతిలో చిల్లిగవ్వ లేకపోవటంతో కరీంనగర్ జిల్లాలో ఉన్న తన ప్లాట్‌ను అమ్మి వైద్యమైతే చేయించుకున్నారు గాని నెలనెలా మందుల కొనుగోలుకు ఇబ్బంది పడుతున్నారు. మందులు కొనుక్కోవడానికి అతనికి వచ్చే జీతం రూ.8000 ఎటూ సరిపోని పరిస్థితి. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గట్టయ్య శిల్పారామంలో ఉద్యోగంతో పాటు వికలాంగుల కోటా కింద బస్‌పాస్ మంజూరు చేయించారు. అయితే ఇటీవల బస్‌పాస్ గడువు ముగియగా, రెన్యువల్‌కు అధికారులు నిరాకరించారు.
ఇటీవలే సొంతూళ్లో తల్లికి కాలు విరిగి మంచాన పడిందని, అప్పుడప్పుడు ఊరికి వెళ్లివచ్చే వాడినని, ప్రస్తుతం బస్‌పాస్ రెన్యువల్ కాకపోవటంతో తల్లిని చూసేందుకు కూడా వీలుపడటం లేదని గట్టయ్య ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. శిల్పారామరంలో అధికారులందరూ తననెంతో అప్యాయంగా చూసుకుంటున్నప్పటికీ భవిష్యత్తు గురించి తలచుకుంటే.. భయం వేస్తుందన్నారు. తన ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తే, తానంటే ఇష్టపడే అమ్మాయి దొరికితే ఓ ఇంటివాడిని కావాలనుకుంటున్నట్లు గట్టయ్య మనసులో మాటను వెలిబుచ్చారు.
కష్టాలు గట్టెక్కని గట్టయ్య
Published Mon, Nov 4 2013 1:01 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement