ఇసుక ట్రాక్టర్ ఢీకొని రైతు మృతి
Published Thu, Jul 21 2016 4:10 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM
చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామశివారులో ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఓ రైతు మృత్యవాతపడ్డాడు. స్థానిక వెదురుగట్టకు చెందిన భూత్కూరి గట్టయ్య(50) అనే రైతు మరొకరితో కలిసి చొప్పదండి నుంచి వెదురుగుట్టకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ డీకొట్టింది. దీంతో గట్టయ్య అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement