వ్యవసాయ మార్కెట్‌కు సింగరేణి స్థలం | Singareni place for Agricultural market | Sakshi
Sakshi News home page

వ్యవసాయ మార్కెట్‌కు సింగరేణి స్థలం

Published Tue, Feb 16 2016 4:24 PM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM

Singareni place for Agricultural  market

ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు స్థల సమస్య తీరిపోనుంది. ఇక్కడ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు తగినంత ప్రభుత్వ స్థలం లేకపోవడంతో... సింగరేణి సంస్థలకు చెందిన స్థలం కేటాయించాలని ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు... మంగళవారం సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్‌ను కోరారు.

దీంతో త్వరలోనే స్థలాన్ని కేటాయిస్తామని జీఎం హామీ ఇచ్చారు. మార్కెట్‌యార్డ్ నిర్మాణానికి వీలుగా ప్రభుత్వం ఇప్పటికే రూ.2 కోట్లను విడుదల చేసినట్టు విప్ ఓదేలు తెలిపారు. మరోవైపు మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం సింగరేణి ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement