Government Chief Whip
-
Telangana: పదవుల పందేరం ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్ః రాష్ట్ర మంత్రి మండలిలో కేబినెట్ బెర్త్‌తో పాటు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పదవులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. శాసనసభ ఎన్నికలు మరో ఏడాది మాత్రమే ఉండటంతో ఖాళీగా ఉన్న కేబినెట్ మంత్రి పదవిపై కన్నేసిన ఆశావహులు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టిలో పడేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, కీలక పదవుల భర్తీ ఉంటుందనే వార్తలు ఎమ్మెలు, నేతలను ఆశలపల్లకిలో విహరింపజేస్తున్నాయి. మెదక్ జిల్లాలో రైతులకు సంబంధించిన భూ ఆక్రమణల ఆరోపణలపై ఈటల రాజేందర్‌ను 2021 మే చివరి వారంలో సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి తప్పించారు. తదనంతర పరిణామాలతో ఈటల బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఆయన నిర్వర్తించిన వైద్యారోగ్య శాఖ బాధ్యతలను ఆర్ధిక మంత్రి హరీష్‌రావుకు అప్పగించారు. ఈటలను కేబినెట్ నుంచి భర్తరఫ్ చేసి ఏడాదిన్నర గడిచినా ఆయన స్థానంలో కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరినీ తీసుకోలేదు. సంక్రాంతి తర్వాత జనవరి చివరి వారంలో మంత్రివర్గాన్ని పాక్షికంగా పునర్వ్యస్థీకరిస్తారనే ప్రచారం జరుగుతోంది.మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న కేబినెట్ బెర్త్‌తో పాటు మరో ఇద్దరు మంత్రులను తప్పించి కొత్తవారికి చోటు కల్పిస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. పునర్వ్యవస్థీకరణలో కేబినెట్ నుంచి బయటకు వెళ్లేవారు, కొత్తగా చేరేవారు ఎవరనే అంశంపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మండలి డిప్యూటీ చైర్మన్ పోస్టు ఎవరికో.. శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌తో పాటు మరో రెండు విప్ పదవులు కూడా దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్నాయి. గుత్తా సుఖేందర్‌రెడ్డి మరోమారు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో 2022 మార్చిలో రెండో పర్యాయం మండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరగకపోవడంతో 2021 జూన్ నుంచి ఖాళీగానే ఉంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్ ముదిరాజ్‌కు ఇంకా రెండున్నరేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే ఆయనను ఎమ్మెల్యే కోటాలో సీఎం కేసీఆర్ శాసన మండలికి నామినేట్ చేశారు. దీంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బండా ప్రకాశ్ డిసెంబర్ 2021లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనకు ఈటల స్థానంలో రాష్ట్ర మంత్రివర్గంలోకి లేదా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి లభిస్తుందనే ప్రచారం జరిగినా ముందుకు సాగలేదు. సుమారు ఏడాదిన్నరగా మండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉండటంతో ఆశావహులు కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఖాళీగానే ప్రభుత్వ విప్ పదవులు శాసన మండలిలో నలుగురు ప్రభుత్వ విప్‌లకు గానూ ప్రస్తుతం ఎంఎస్ ప్రభాకర్ ఒక్కరే కొనసాగుతున్నారు. బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రభుత్వ చీఫ్ విప్‌గా 2019–21 వరకు కొనసాగారు. ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆ స్థానంలో కొత్తగా ఎవరికీ అవకాశం దక్కలేదు. మరోవైపు ప్రభుత్వ విప్‌లుగా వ్యవహరించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2019లో, కర్నె ప్రభాకర్ 2020లో, కూచుకుంట్ల దామోదర్‌రెడ్డి, భానుప్రసాద్ 2022 జనవరిలో ఎమ్మెల్సీలుగా పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. కర్నె ప్రభాకర్ మినహా మిగతా ముగ్గురు మరోమారు శాసన మండలికి ఎన్నికైనా వీరిలో మళ్లీ ప్రభుత్వ విప్‌లుగా ఎవరికి అవకాశం దక్కకపోగా, సుదీర్ఘకాలంగా మండలిలో ప్రభుత్వ విప్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
రైతులకు రూ. 33 కోట్ల చెక్కు అందజేసిన చీఫ్ విప్
సాక్షి, వైఎస్సార్ కడప: నిత్యం రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమని... ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి మండల అభివృద్ది కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 42500 మంది రైతులకు రూ. 33 కోట్ల మెగా చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి సాయం అందించిన ముఖ్యమంత్రి వెఎస్ జగన్ అన్నారు. 42500 మంది రైతుల ఖాతాలోకి మొత్తం రూ. 33 కోట్లు జమ అయినట్టు తెలిపారు. గిట్టుబాటు ధర కల్పించి రైతుల మొహంలో సంతోషం కలిగేలా చేసిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. ('కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం') కరోనా వైరస్ వంటి విపత్తు కాలంలో రుపాయి ఆదాయం లేదని చాలా రాష్ట్రాలు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా తప్పించుకుంటునాయని ఆయన చెప్పారు. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం సున్న వడ్డీ పథకం, ఫీజు రీయంబర్స్మెంట్, పూర్తి బకాయిల చెల్లింపు, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతున్నారని పేర్కొన్నారు. ఇంతవరకు రాయచోటి నియోజకవర్గమంతా గ్రీన్ జోన్లో ఉండేది. అయితే కోయంబేడు నుంచి వచ్చన వ్యక్తికి కరోనా పాజిటివ్ తెలిడంతో రెడ్‌జోన్‌కి వచ్చిందన్నారు. ఓ పక్క మహమ్మారిని ఎదుర్కొంటునే మరో పక్క పారదర్శకంగా ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తూ ఎక్కడా అవినీతి లేకుండా సువర్ణ పాలన అందిస్తున్నారని చీఫ్ విప్ అన్నారు. (విద్వేషాలు రగిల్చే దుష్ట ఆలోచన) కరోనా నివారణ, సహయక చర్యలపై చీఫ్ విప్ వీడియో కాన్ఫరెన్స్... కరోనా నివారణ సహయక చర్యలపై చీఫ్ విప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. సంబేపల్లి ఘటనతో అధికారులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కరోనా నియంత్రణపై అధికారులు బేషుగ్గా పనిచేస్తున్నారని వారిపై ప్రశంసల జల్లు కురిపించారు. అధికారులు మరింత ఉత్సహంతో పనిచేసి కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలన్నారు. వలస కార్మికులకు క్లియరెన్స్ వచ్చేంత వరకు నిత్యవసర సరుకులు అందించండని, బయట ప్రాంతాల నుంచి ఎవరూ వచ్చిన నేరుగా క్వారంటైన్‌కు పంపించాలని సూచించారు. -
‘ఎల్లో వైరస్‌తో కూడా పోరాడుతున్నాం’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాల్సిందేనని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించినట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయన్నారు. ఆదేశాలను ధిక్కరిస్తే కేసులు తప్పవన్నారు. ప్రజా ప్రతినిధులు కూడా సామాజిక దూరం పాటించాలని సూచించారు. కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ ప్రథమస్థానంలో ఉందని జాతీయ మీడియాలో రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కొంతమంది బురదచల్లే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని..అవన్నీ అవాస్తవాలని ఆయన పేర్కొన్నారు. (కరోనాతో ట్రంప్ స్నేహితుడి మృతి) దేశంలో మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఒక్క కరోనా వైరస్‌తోనే పోరాడుతుంటే.. మన రాష్ట్రంలో కరోనాతో పాటు ఎల్లో వైరస్‌తో కూడా పోరాడాల్సి వస్తుందన్నారు. మంచి పనులను వక్రీకరించి అసత్యాలను ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. డ్వాక్రా సంఘాలు మూడు నెలల పాటు వాయిదాలు చెల్లించాల్సిన అవసరంలేదని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. వలంటీర్ల వ్యవస్థ మన రాష్ట్రానికి ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. దేశంలో ప్రతిఒక్క రాష్ట్రం ఏపీని ఆదర్శంగా తీసుకుంటుందన్నారు. యూరోపియన్ దేశాలు సైతం వలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడుకోవడం ఆనందంగా ఉందన్నారు. వలంటీర్లపై టీడీపీ నేతలు బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వలంటీర్ల ద్వారానే ఇప్పటి వరకు మూడు సార్లు సర్వేలు నిర్వహించగలిగామని పేర్కొన్నారు. వారిచ్చిన సమాచారం వలనే కరోనా నివారణ చర్యలు చేపట్టగలుగుతున్నామని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. (కరోనాపై బ్రహ్మాస్త్రం ఇది : విజయసాయిరెడ్డి) -
‘మంచి చేయకపోగా..మోసం చేశారు’
సాక్షి, కడప: చంద్రబాబు బీసీల వ్యతిరేకి అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. బీసీల ఓటు బ్యాంకుతో గెలిచిన చంద్రబాబు.. వారికి అన్యాయం చేశారని మండిపడ్డారు. బీసీలు, దళితులకు మంచి చేయకపోగా వారిని మోసం చేయడం దారుణమన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యోచిస్తే.. దాన్ని టీడీపీ అడ్డుకుందని ధ్వజమెత్తారు. చంద్రబాబులా బీసీలను వైఎస్ జగన్ వాడుకోలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి కి చంద్రబాబు సహకరించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. (బీసీల ఎదుగుదల ఓర్చుకోలేకపోతున్నారు) రాష్ట్రంలో ఎన్నికలు జరగకూడదని.. రాష్ట్రానికి నిధులు రాకూడదన్నదే చంద్రబాబు దురుద్దేశ్యమని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. అమ్మ ఒడి, ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ, రైతు భరోసాతో రికార్డు సృష్టించామని తెలిపారు. ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో రాబోయే నాలుగేళ్లలో జిల్లాను,రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయనకు మాట్లాడే అర్హత లేదు: సురేష్‌బాబు బీసీలను మోసం చేసింది చంద్రబాబేనని.. వారి గురించే మాట్లాడే అర్హత ఆయనకు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేయాలని నిరంతరం సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబును బీసీలు చీదరించుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికలు జరగకూడదనే దురుద్దేశ్యంతో తన అనుచరులతో కోర్టులో స్టే తెచ్చారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడు జైలుకెళ్లక తప్పదని సురేష్‌బాబు పేర్కొన్నారు. (చంద్రబాబు వల్లే బీసీలకు అన్యాయం) -
‘టీడీపీ నుంచి వారికి డబ్బులు అందుతున్నాయి’
సాక్షి, విజయవాడ: కమ్యూనిస్టు పార్టీలంటే గతంలో గౌరవం ఉండేదని.. నారాయణ, రామకృష్ణ లాంటి వ్యక్తులు వచ్చాకా ఆ పార్టీలపై గౌరవం పోయిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సీపీఐ నేత రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టులు చదివే బదులు కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం లో చేరండని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ మైనార్టీల పక్షపార్టీ, సెక్యులర్ పార్టీ అని అందరికీ తెలుసు. అంజాద్ బాషా మాటకు కట్టుబడి ఉంటామని సీఎం జగన్ బహిరంగ సభ సాక్షిగా ప్రకటించారని పేర్కొన్నారు. రామకృష్ణ లాంటి వారి మాటలు నమ్మొద్దని మైనార్టీలకు శ్రీకాంత్ రెడ్డి సూచించారు. నారాయణ, రామకృష్ణలకు టీడీపీ నుంచి డబ్బులు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిరోజు రామకృష్ణ లోకేష్ బండి ఎక్కుతారని.. డబ్బులు తీసుకుంటారని టీడీపీయే ప్రచారం చేస్తోందన్నారు. ‘చంద్రబాబు ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీకి, బీజేపీకి అక్రమ సంబంధం అంటగట్టాలని చూశారు.. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత బీజేపీతో సంబంధాలు నడుపుతున్నది టీడీపీ కాదా..?’ అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. -
ప్రభుత్వ చీఫ్ విప్‌గా పల్లె
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున చీఫ్ విప్‌గా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని నియమించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది. గతంలో కాలవ శ్రీనివాసులు చేపట్టిన ఈ పదవిని ఇప్పటివరకూ భర్తీ చేయలేదు. కాలవను మంత్రివర్గంలోకి తీసుకున్న సమయంలో ఉద్వాసనకు గురైన పల్లెకు ఆ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ వెంటనే దాన్ని అమలు చేయకపోవడంతో ఇప్పటి వరకు కాలవ ఆ పదవిని నిర్వహించారు. తాజాగా ఈ పదవిని భర్తీ చేయాలని నిర్ణయించి పల్లె, బొండా ఉమామహేశ్వరరావు, కాగిత వెంకట్రావు పేర్లను పరిశీలించారు. చివరకు పల్లె పేరునే ఖరారు చేశారు. మరోవైపు శాసన మండలిలో చీఫ్ విప్‌గా పయ్యావుల కేశవ్‌ను నియమించాలని నిర్ణయించారు. ఈ పదవి కోసం టీడీ జనార్దన్, వైవీబీ రాజేంద్రప్రసాద్, రామసుబ్బారెడ్డి పేర్లు వినిపించినా చంద్రబాబు పయ్యావుల వైపే మొగ్గు చూపారు. శనివారం పయ్యావుల, పల్లెను తన నివాసానికి పిలిపించుకున్న ముఖ్యమంత్రి వారి పేర్లు ఖరారు చేసిన విషయాన్ని తెలిపినట్లు సమాచారం. మండలిలో మూడు విప్ పదవులను కూడా వెంటనే భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. -
మండలి చీఫ్ విప్‌గా పాతూరి
విప్‌లుగా పల్లా, బోడకుంటి సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి నియమితులయ్యారు. విప్‌లుగా ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లును నియమించారు. ఏడాదిగా వాయిదా పడుతూ వచ్చిన చీఫ్ విప్, విప్ల నియామకాలకు ఎట్టకేలకు సీఎం కేసీఆర్ అనుమతివ్వడంతో ఈ మేరకు ప్రభుత్వం మూడు జీవోలను జారీ చేసింది. పాతూరి, పల్లా, బోడకుంటి శనివారం క్యాంపు ఆఫీస్‌లో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు. పాతూరి సుధాకర్‌రెడ్డి: కరీంనగర్ జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లికి చెందిన సుధాకర్‌రెడ్డి 1968 నుంచి 2005 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం (పీఆర్టీయూ) నేత గా, 1975 నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా, కార్యదర్శిగా పనిచేశారు. 2007లో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2011లో టీఆర్ఎస్లో చేరి 2013లో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నుంచి రెండోసారి మండలికి ఎన్నికయ్యారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి: వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం షోడశపల్లికి చెందిన పల్లా.. ఎమ్మెస్సీ (ఫిజిక్స్), పీహెచ్డీ పూర్తి చేశారు. విద్యార్థి సంఘాల్లో పని చేసి తర్వాత నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో విద్యా సంస్థలు నెలకొల్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీతో మమేకమై పనిచేశారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్ఎస్ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా పనిచేశారు. ఈ ఏడాది జరిగిన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మండలికి ఎన్నికయ్యారు. బోడకుంటి వెంకటేశ్వర్లు: వరంగల్ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బోడకుంటి.. బచ్చన్నపేట ఎంపీపీగా, వరంగల్ జెడ్పీ చైర్మన్‌గా, వరంగల్ ఎంపీగా పనిచేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటాలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై త ర్వాత టీఆర్ఎస్లో చేరారు. 2015లో జరిగిన ఎమ్మెల్యే కోటా మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. -
వ్యవసాయ మార్కెట్‌కు సింగరేణి స్థలం
ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు స్థల సమస్య తీరిపోనుంది. ఇక్కడ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు తగినంత ప్రభుత్వ స్థలం లేకపోవడంతో... సింగరేణి సంస్థలకు చెందిన స్థలం కేటాయించాలని ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు... మంగళవారం సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్‌ను కోరారు. దీంతో త్వరలోనే స్థలాన్ని కేటాయిస్తామని జీఎం హామీ ఇచ్చారు. మార్కెట్‌యార్డ్ నిర్మాణానికి వీలుగా ప్రభుత్వం ఇప్పటికే రూ.2 కోట్లను విడుదల చేసినట్టు విప్ ఓదేలు తెలిపారు. మరోవైపు మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం సింగరేణి ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. -
రాష్ట్రంలో సామాజిక వర్గాల గణన
రాష్ట్రంలో సామాజికవర్గాల గణన చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వారి ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలు తెలుసుకునేందుకు సర్వే చేయించి దానికనుగుణంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. దామాషా పద్ధతిలో ప్రతి సామాజికవర్గం ప్రభుత్వ ప్రయోజనాలు పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక సంఖ్యాకులుగా ఉన్న వాల్మీకి-బోయ కులస్తులను ఎస్టీలుగా గుర్తించే అంశాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు నేతృత్వంలో వాల్మీకి-బోయ సామాజికవర్గ ప్రతినిధులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి బీసీ-ఎ జాబితాలో ఉన్న తమను కర్నాటకలో మాదిరిగా ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఉత్తరప్రదేశ్, కేరళ, హర్యానా తదితర రాష్ట్రాల్లో వాల్మీకి-బోయలను ఎస్సీలుగా గుర్తించారని, రాష్ట్రంలోనూ వాల్మీకుల్ని ఎస్టీల్లో చేర్చేందుకు ఎన్టీఆర్ హయాం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తెలుగుదేశం మేనిఫెస్టోలోనూ దీనిపై హామీ ఇచ్చినట్లు వారు గుర్తుచేశారు. కర్నాటకలో హవనూర్ కమిషన్ వేసి 1991లో ఆర్డినెన్స్ ద్వారా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించారని తెలిపారు. కేబినెట్ నిర్ణయం, అసెంబ్లీ తీర్మానం లేదా కమిషన్ ఏర్పాటు ద్వారా సమస్య పరిష్కరించవచ్చని సూచించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఇచ్చిన హామీ ప్రకారం వాల్మీకి-బోయలను ఎస్టీలుగా గుర్తిస్తామని చెప్పారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులతో చర్చించి ఎస్టీ రిజర్వేషన్ ఎలా కల్పించాలనే దానిపై స్పష్టత తీసుకుంటామని తెలిపారు.