సాక్షి, వైఎస్సార్ కడప: నిత్యం రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమని... ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి మండల అభివృద్ది కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 42500 మంది రైతులకు రూ. 33 కోట్ల మెగా చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి సాయం అందించిన ముఖ్యమంత్రి వెఎస్ జగన్ అన్నారు. 42500 మంది రైతుల ఖాతాలోకి మొత్తం రూ. 33 కోట్లు జమ అయినట్టు తెలిపారు. గిట్టుబాటు ధర కల్పించి రైతుల మొహంలో సంతోషం కలిగేలా చేసిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. ('కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం')
కరోనా వైరస్ వంటి విపత్తు కాలంలో రుపాయి ఆదాయం లేదని చాలా రాష్ట్రాలు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా తప్పించుకుంటునాయని ఆయన చెప్పారు. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం సున్న వడ్డీ పథకం, ఫీజు రీయంబర్స్‌మెంట్, పూర్తి బకాయిల చెల్లింపు, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతున్నారని పేర్కొన్నారు. ఇంతవరకు రాయచోటి నియోజకవర్గమంతా గ్రీన్ జోన్‌లో ఉండేది. అయితే కోయంబేడు నుంచి వచ్చన వ్యక్తికి కరోనా పాజిటివ్ తెలిడంతో రెడ్‌జోన్‌కి వచ్చిందన్నారు. ఓ పక్క మహమ్మారిని ఎదుర్కొంటునే మరో పక్క పారదర్శకంగా ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తూ ఎక్కడా అవినీతి లేకుండా సువర్ణ పాలన అందిస్తున్నారని చీఫ్ విప్ అన్నారు. (విద్వేషాలు రగిల్చే దుష్ట ఆలోచన)
కరోనా నివారణ, సహయక చర్యలపై చీఫ్ విప్ వీడియో కాన్ఫరెన్స్...
కరోనా నివారణ సహయక చర్యలపై చీఫ్ విప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. సంబేపల్లి ఘటనతో అధికారులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కరోనా నియంత్రణపై అధికారులు బేషుగ్గా పనిచేస్తున్నారని వారిపై ప్రశంసల జల్లు కురిపించారు. అధికారులు మరింత ఉత్సహంతో పనిచేసి కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలన్నారు. వలస కార్మికులకు క్లియరెన్స్ వచ్చేంత వరకు నిత్యవసర సరుకులు అందించండని, బయట ప్రాంతాల నుంచి ఎవరూ వచ్చిన నేరుగా క్వారంటైన్‌కు పంపించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment