సాక్షి, వైఎస్సార్ జిల్లా: సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాల్సిందేనని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించినట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయన్నారు. ఆదేశాలను ధిక్కరిస్తే కేసులు తప్పవన్నారు. ప్రజా ప్రతినిధులు కూడా సామాజిక దూరం పాటించాలని సూచించారు. కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ ప్రథమస్థానంలో ఉందని జాతీయ మీడియాలో రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కొంతమంది బురదచల్లే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని..అవన్నీ అవాస్తవాలని ఆయన పేర్కొన్నారు.
(కరోనాతో ట్రంప్ స్నేహితుడి మృతి)
దేశంలో మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఒక్క కరోనా వైరస్‌తోనే పోరాడుతుంటే.. మన రాష్ట్రంలో కరోనాతో పాటు ఎల్లో వైరస్‌తో కూడా పోరాడాల్సి వస్తుందన్నారు. మంచి పనులను వక్రీకరించి అసత్యాలను ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. డ్వాక్రా సంఘాలు మూడు నెలల పాటు వాయిదాలు చెల్లించాల్సిన అవసరంలేదని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. వలంటీర్ల వ్యవస్థ మన రాష్ట్రానికి ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. దేశంలో ప్రతిఒక్క రాష్ట్రం ఏపీని ఆదర్శంగా తీసుకుంటుందన్నారు. యూరోపియన్ దేశాలు సైతం వలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడుకోవడం ఆనందంగా ఉందన్నారు. వలంటీర్లపై టీడీపీ నేతలు బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వలంటీర్ల ద్వారానే ఇప్పటి వరకు మూడు సార్లు సర్వేలు నిర్వహించగలిగామని పేర్కొన్నారు. వారిచ్చిన సమాచారం వలనే కరోనా నివారణ చర్యలు చేపట్టగలుగుతున్నామని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.
(కరోనాపై బ్రహ్మాస్త్రం ఇది : విజయసాయిరెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment