భట్టీ.. నోరు అదుపులో పెట్టుకో | nallala odelu fired on bhatti vikramarka | Sakshi
Sakshi News home page

భట్టీ.. నోరు అదుపులో పెట్టుకో

Published Tue, Jun 7 2016 3:34 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

భట్టీ.. నోరు అదుపులో పెట్టుకో - Sakshi

భట్టీ.. నోరు అదుపులో పెట్టుకో

ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు
సాక్షి, హైదరాబాద్: వరుస ఓటములతో మతి స్థిమితం కోల్పోయిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు అన్నారు. పాలేరు ఉప ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్‌ను పాతరేసినా వారికి బద్ధి రాలేదని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అవినీతి గురించి మాట్లాడడం నవ్వు తెప్పిస్తోందని, వట్టి మాటలు కట్టిపెట్టి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. అవినీతిలో పేటెంట్ హక్కులన్నీ కాంగ్రెస్‌వేనని, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ గృహనిర్మాణ మంత్రిగా ఉన్నప్పు డు ఇందిరమ్మ ఇళ్లను అవినీతి కూపంగా మార్చారన్నారు. ఎన్నికల హామీల అమలుపై బహిరంగ చర్చకు రావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement