government whip
-
ప్రభుత్వ విప్ గణబాబుకు అవమానం
సాక్షి,విశాఖపట్నం : ప్రభుత్వ విప్ గణబాబుకు అవమానం జరిగింది. ప్రధాని మోదీ పర్యటన రివ్యూ మీటింగ్‌లో గణబాబుకు గౌరవం దక్కలేదు. గణబాబుకు బదులుగా మంత్రి నారా లోకేష్ తొడల్లుడు ఎంపీ భరత్‌కు అందలం ఎక్కించారు. విప్ గణబాబు కుర్చీలో ఎంపీ భరత్‌కు అవకాశం కల్పించారు. సాధారణ ఎమ్మెల్యేలా గణబాబును అధికారులు ట్రీట్ చేశారు. దీంతో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని గణబాబు అసహనం వ్యక్తం చేశారు. -
Telangana: ప్రమాదంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కు గాయాలు
సాక్షి, జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురయ్యారు. ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లక్ష్మణ్ కుమార్‌తో పాటు కారులో ఉన్న ఇతరులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కరీంనగర్‌కు తరలించి చికిత్స అందిచగా.. అడ్లూరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలిస్తున్నట్లు సమాచారం. -
ప్రభుత్వ విప్‌పై దాడికి టీడీపీ కార్యకర్త యత్నం
గుమ్మఘట్ట: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట మండలం భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ) గ్రామంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై టీడీపీ కార్యకర్త బెస్త మూర్తి దాడికి యత్నించారు. కాపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామానికి వెళ్లారు. ఈ మూడేళ్లలో ఏయే పథకాల ద్వారా ఎంతెంత లబ్ధిచేకూరిందన్న వివరాలతో బ్రోచర్లను లబ్ధిదారులకు అందించారు. బెస్త మూర్తి కుటుంబానికి అమ్మఒడి పథకం ద్వారా రూ.29 వేలు, రైతుభరోసా రూ.27 వేలు, సున్నావడ్డీ పథకం ద్వారా రూ.4,619, వైఎస్సార్ ఆసరా కింద రూ.20,562 లబ్ధిచేకూరిందనే విషయాన్ని వివరిస్తుండగా మూర్తి దురుసుగా మాట్లాడాడు. అక్కడే ఉన్న ఎస్ఐ సునీత జోక్యం చేసుకుని వారిస్తున్నా రెచ్చిపోయాడు. ప్రభుత్వ విప్‌ను అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు చేతిని నలిపి, గోరు గుచ్చడంతో రక్త గాయమైంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే మూర్తి ఈ దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ధర్మశ్రీకి అందలం.. అభిమానుల ఆనందం
చోడవరం(అనకాపల్లి జిల్లా): అనుభవజ్ఞుడికి సముచిత స్థానం లభించింది. ఆయన సేవలకు తగిన గుర్తింపు దక్కింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని ప్రభుత్వ విప్‌గా నియమించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చోడవరం నియోజకవర్గంతోపాటు అనకాపల్లి జిల్లాలో అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బీఈడీ బీఎల్ చదవిన ధర్మశ్రీ రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలని భావించి యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2004లో వైఎస్సార్ హయాంలో మాడుగుల ఎమ్మెల్యేగా, డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ధర్మశ్రీ వైఎస్సార్సీపీలో రాష్ట్ర కార్యదర్శిగా పదవి నిర్వహించారు. 2019లో చోడవరం ఎమ్మెల్యేగా 30 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన ఆ యనను ఈ ఏడాది ప్రారంభంలో కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి పార్టీని బలోపేతంగా చేస్తూ నియోజకవర్గాల పార్టీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. ఈ పరిస్థితుల్లో తాజాగా రాష్ట్రప్రభుత్వంలో కీలకమైన ప్రభుత్వ విప్ పదవికి ధర్మశ్రీని నియమించడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమైంది. చోడవరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి, బాణసంచాలు కాల్చి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడువాక సత్యారావు, జెడ్పీటీసీ మారిశెట్టి విజయశ్రీకాంత్, ఎంపీపీ గాడి కాసు అప్పారావు, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, వైఎస్ ఎంపీపీలు బైన ఈశ్వరరావు, బుద్ద గంగరాజు, ఎంపీటీసీల ఫ్లోర్‌లీడర్ పల్లా రమణ, మార్కెట్ కమిటీ చైర్మన్ గూనూరు శంకరరావు, మండల ప్రతినిధి దొడ్డి వెంకట్రావు(డీవీఆర్), పట్టణ ప్రతినిధి దేవరపల్లి సత్య పాల్గొన్నారు. -
ఆందోళన వద్దు.. 10 రోజుల్లో ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నింపుతాం..!
కృష్ణా: పులిచింతల స్టాప్‌లాగ్ గేట్ పనులను ప్రభుత్వ విప్ ఉదయ భాను పరిశీలించారు. స్టాప్ లాగ్ గేట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. నేటి రాత్రి (శనివారం)కి స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు పూర్తవుతుందన్నారు. 16వ గేటు కొట్టుకువపోవడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని ఉదయ భాను పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు భవిష్యత్తులో హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటును పరిశీలిస్తామని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాల వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన విమర్షించారు. లోకేష్ విషయం తెలియకుండా ట్వీట్లు చేస్తున్నారని దుయ్య బట్టారు. మచిలీపట్నం కోర్టు తీర్పుపై హైకోర్టుకి అపీల్‌కి వెళ్లకుండా.. చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేసింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాన్ని అప్పనంగా దోచిపెట్టే ప్రయత్నం చేయలేదా? అని అడిగారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే గత ప్రభుత్వం అన్ని రకాల సహాయం చేసిందని విమర్షించారు. 10 రోజుల్లో ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నింపుతామని, కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ ఉదయభాను తెలిపారు. -
ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ల సమావేశం
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. సమగ్ర భూ సర్వే, ఇళ్ల స్థలాలు, నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. అంతే కాకుండా ప్రభుత్వ విప్‌లు ఎమ్మెల్యేల వినతులు, ఫిర్యాదులను పరిశీలించారు. చదవండి: బీసీలు బలమైన నాయకులుగా ఎదగాలి: సజ్జల -
మీ అవినీతిని రాస్తే పెద్ద గ్రంథం అవుతుంది: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: భూములు అమ్మేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పత్రికలు గగ్గోలు పెడుతున్నారని, అది వృధా ప్రయాస అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవరత్నాలు, నాడు-నేడు నిధుల కోసం భూములు వేలం వేస్తున్నామని స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకత దేశంలో ఎవరైనా వాటిని కొనుగోలు చేసేలా ఈ-వేలం వేస్తున్నామన్నారు. గడిచిన మీ హయాంలో ఎన్నికల్లో లబ్ది చేకూర్చిన వారికి ఎన్ని భూములు కట్టాబెట్టారో ప్రపంచానికి తెలుసని వ్యాఖ్యానించారు. అయితే తాము సద్వివిమర్శను ఆహ్వానిస్తామని, మీ అవినీతిని రాస్తే పెద్ద గ్రంథం అవుతుందని విమర్శించారు. రాజధాని పేరుతో పేదల నుంచి బలవంతంగా అసైన్డ్ భూములు సేకరించింది మీరు కాదా? అని వాటిని పెద్దలకు కట్టబెట్టింది మీ హయాంలోనే కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజా కోర్టులో స్ఫష్టమైన తీర్పు వచ్చిదన్నారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుని అచ్చెన్నాయుడు రాషష్ట్రంలో తిరుగుతా అంటున్నారని వెంటనే తిరగండని పేర్కొన్నారు. విశాఖలో భూ కుంభకోణం చూసి మీ హయాంలో మంత్రులే రోడ్డున పడ్డారని, త్వరలో సమగ్ర భూ సర్వేకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 100 ఏళ్లనాటి రికార్డులు ప్యూరిఫికేషన్ చేస్తామని, మొబైల్ కోర్టులు ఏర్పాటు చేసి భూ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు మీటర్లు బిగిస్తున్నామని, త్వరలో అంత: రాష్ట్ర వివాదాలు పరిష్కరించి నేరడి బ్యారేజ్ నిర్మించి తీరుతామని ధర్మాన పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాతయాత్ర కృష్ణా జిల్లా: ప్రజాసంకల్ప యాత్రకు మూడేళ్లు అయిన సందర్బంగా ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. పెనుగ్రంచిప్రోలు పాత సినిమా హాలు సెంటర్ నుంచి మున్నేరు వంతెన మీదగా ముచ్చింతల వరకు ఈ పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలని నేరుగా తెలుసుకున్న నేత సిఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. ఏడాదిన్నర పరిపాలనలో 90 శాతానికి పైగా హామీలను ఆయన నెరవేర్చారన్నారు. ప్రజలకిచ్చిన నవరత్నాల హామీలే కాకుండా 16 రకాలకు పైగా సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ అందిస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాలకు అండగా నిలబడిన ప్రభుత్వం తమదని, గత ప్రభుత్వం అభివృద్దిని, సంక్షేమాన్ని రెండింటినీ విస్మరించిందన్నారు. నాడు-నేడు కార్యక్రమంతో విద్య, వైద్యంలో విప్లకాత్మకమైన మార్పులకి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తే... సీఎం వైఎస్ జగన్ వైద్య ఖర్చు వెయ్యి రూపాయిలు దాటితే ఆరోగ్యశ్రీలోకి చేర్చి పేదలకి అండగా నిలబడ్డారన్నారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మరో 30 ఏళ్లు కొనసాగుతారని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు. కాగా ఈ పాదయాత్రలో భారీ సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో పండుగ వాతావరణం: దాడిశెట్టి రాజా
సాక్షి, తుని: శ్రావణ శుక్రవారం పూట రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా పెర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ అమోదం తెలపడంతో కర్నూల్, విశాఖపట్నం, తుని ప్రతి చోట ప్రజలు పండుగ చేసుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు వికేంద్రీకరణ బిల్లు ఆమోదాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. రెండు వందల రోజులు రాజధాని కోసం కృత్రిమ ఉద్యమం చేశామని చెప్పుకునే చంద్రబాబు తాబేదార్లు మాత్రం స్వాగతించడం లేదని పేర్కొన్నారు. రాజధాని ప్రకటించక ముందే రూ. 30 లక్షలు కూడా విలువ చేయని భూములను చంద్రబాబు తాబేదార్లు కొనుక్కున్నారన్నారు. ప్రకటన వచ్చాక వారిలో కొందరు ఎకరం రూపాయలు కోటిన్నర, రెండు కోట్లకు అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు. ఇంకా అత్యాశకు పోయి కొంత మంది ఎకరం 10 కోట్ల రూపాయలు వస్తుందన్న దురాశతో ఆ భూములును ఉంచుకున్న వారే వికేంద్రీకరణ బిల్లుతో యిబ్బంది పడుతున్నారన్నారు. వికేంద్రీకరణ బిల్లుకు అనేక అడ్డంకులు సృష్టించాలని చంద్రబాబు త్రయం అనేక ప్రయత్నం చేసినప్పటికీ అవి సఫలీకృతం కావన్నారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు అవుతుందని ఆ భారం అంతా తమ నెత్తిన చంద్రబాబు పెడుతున్నాడని తెలిసే రాష్ట్ర ప్రజలు టీడీపీకి 23 సీట్లు ఇచ్చి ఘన సత్కారం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఈ విషయాన్ని మరిచిపోయినట్లు ఉన్నారని, ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతున్నానని ప్రభుత్వ విప్ విమర్శించారు. -
దిక్కుతోచని స్థితిలో టీడీపీ: దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన అనుకూల మీడియాతో చంద్రబాబు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను విమర్శించే స్థాయికి చంద్రబాబు దిగజారారని నిప్పులు చెరిగారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తి చేశారని, మిగిలిన 10 శాతాన్ని కూడా ఎప్పుడు పూర్తి చేస్తామో కూడా వెల్లడించామన్నారు. (సమగ్ర భూ సర్వేలో ఆలస్యం వద్దు: సీఎం జగన్) సంక్షేమ పాలన అందించి, సీఎం జగన్ ప్రజల మన్ననలు పొందడంతో టీడీపీ నేడు దిక్కుతోచని పరిస్థితిలో పడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావని టీడీపీకి అర్థమైందన్నారు. ఆక్వా రంగంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. తుని నియోజకవర్గం ఆక్వాజోన్‌లో చంద్రబాబు తన బినామీ కంపెనీ అయిన దివిస్ పరిశ్రమను తీసుకొచ్చే యత్నం చేశారని ఆయన ఆరోపించారు. కరోనా సమయంలో కూడా ఆక్వారంగాన్ని మద్దతు ధరతో సీఎం జగన్ ఆదుకున్నారని దాడిశెట్టి రాజా గుర్తుచేశారు. (డబ్బా కొట్టి, పత్తా లేకుండా పోయారు!) -
బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోపన్‌పల్లిలో దళితుల భూములను లాక్కున వ్యక్తి రేవంత్ అని.. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికే బురద చల్లుతున్నారని ధ్వజమెత్తారు. 111 జీవో పరిధిలో ఎరెవరికి భూములున్నాయో బయటపెడతామన్నారు. రేవంత్‌రెడ్డి చూపించిన భూములు కేటీఆర్‌వి కావని ఆయన స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ ఎదుగుదలను జీర్ణించుకోలేకే కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. (కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి) సంచలనాలు కోసమే.. సంచలనాలు కోసమే రేవంత్ రెడ్డి మాట్లాడతారని, అలాంటివారు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ విమర్శించారు. జాతీయ పార్టీకి ఇలాంటి నాయకుడు అవసరమా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులమంతా ధర్మానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. కోర్టులంటే తమకు గౌరవం ఉందన్నారు. ప్రజలంతా ఒక్క వైపు ఉంటే.. రేవంత్ బృందం అంతా ఓ వైపు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడటం మానుకోవాలని రేవంత్‌కు ఆయన హితవు పలికారు. (జీవో 111 ఉల్లంఘనలపై నిజ నిర్ధారణ కమిటీ) వేల కోట్లు ఎలా సంపాదించారు.. బ్లాక్‌మెయిల్‌కి కేరాఫ్ అడ్రాస్‌గా రేవంత్‌రెడ్డిని పీయూసీ ఛైర్మన్ జీవన్‌రెడ్డి అభివర్ణించారు. రేవంత్ ఆరోపణలకు కేటీఆర్ సమాధానం కూడా చెప్పారని, అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పెయింటర్‌గా జీవితాన్ని ప్రారంభించిన రేవంత్.. వేల కోట్లు ఎలా సంపాదించారని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజలు నవ్వుకుంటున్నారు.. ప్రపంచం మెచ్చిన నేత కేటీఆర్ అని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఓటుకు నోటు కేసు చూసి రాజకీయాలు ఇలా ఉంటాయా అని సిగ్గుపడ్డామన్నారు. ఉప్పల్‌లో నువ్వు కొనుగోలు చేసిన భూముల సంగతి ఏమిటని రేవంత్‌ను ప్రశ్నించారు. వాటిని బయటపెడితే ఇప్పటి వరకు సమాధానం లేదన్నారు. పీసీసీ పదవి కోసమే ఆయన ఆరోపణలు చేస్తున్నారని సైదిరెడ్డి మండిపడ్డారు. -
ఆయన అంటెండర్‌గా కూడా పనికిరాడు..!
సాక్షి, కాకినాడ: లోకేష్.. చంద్రబాబు కుమారుడు కాకపోతే శాసనమండలిలో అంటెండర్ ఉద్యోగానికి కూడా పనికిరాడని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. శుక్రవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. మండలి జరుగుతున్నప్పుడు లోకేష్ ఒక పప్పులా వ్యవహరించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక యువ నాయకుడు ఎలా వ్యవహరించాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి నేర్చుకోవాలని లోకేష్‌కు దాడిశెట్టి రాజా హితవు పలికారు. యనమల టెర్రరిజం గురించి ప్రజలకు తెలుసు.. యనమల రామకృష్ణుడు టెర్రరిస్టు కన్నా దారుణంగా వ్యవహరించారని.. యనమల టెర్రరిజం గురించి తుని నియోజకవర్గంలో ప్రతిఒక్కరికి తెలుసునన్నారు. కాపు ఉద్యమ సమయంలో అప్పటి జిల్లా ఎస్పీ, ఎఎస్పీని వెంటేసుకుని జిల్లాను ఏవిధంగా భయబ్రాంతులకు గురిచేశారో జిల్లా అంతా తెలుసునన్నారు. గత ఎన్నికల్లో యనమల, ఆయన సోదరుడిని జిల్లా ప్రజలు తరిమికొట్టిన విషయాన్ని వారు గుర్తించుకోవాలన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దేశ ద్రోహి యనమల అని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రలోభాల గేట్లు తెరిస్తే.. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజలు పన్నులు కడుతున్నారు తప్ప.. చంద్రబాబు బినామీలు కోసం కాదన్నారు. చంద్రబాబు బినామీల కోసం.. తమ కష్టాలను త్యాగం చేసే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. అమరావతిని రాజధానిగా అంగీకరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని స్పష్టం చేశారు. తాము ప్రలోభాల గేట్లు తెరిస్తే..నీ పక్కన కొడుకు, బావమరిది తప్ప మరెవ్వరు ఉండరన్న సంగతి చంద్రబాబు గుర్తించుకోవాలని దాడిశెట్టి రాజా నిప్పులు చెరిగారు. -
పగటి వేషగాళ్లలా.. కృత్రిమ ఉద్యమాలు
సాక్షి, కాకినాడ: సంక్రాంతి పగటి వేషగాళ్లలా బినామీలతో రాజధానిలో కృత్రిమ ఉద్యమాలు సృష్టించొద్దని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో మూడు రాజధానులకు మద్దతుగా వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దాడిశెట్టి మాట్లాడుతూ.. రాజధానిపై రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్ళి మాట్లాడే దమ్ము చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు ఉందా అని ప్రశ్నించారు. అమరావతిపై చంద్రబాబు తాపత్రయం అంతా తన బినామీల ఆస్తులను కాపాడుకోవడం కోసమేనని ప్రజలకు అర్థమైందన్నారు. రాజధానిపై ఎందుకు రిఫరెండం పెట్టాలని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, విప్ల మీద చంద్రబాబు గూండాలు దాడి చేసినా.. కుల, మత ఘర్షణలు తెచ్చినా మాట్లాడకుండా మౌనంగా ఉండాలా అని ధ్వజమెత్తారు. టీడీపీ దుర్మార్గాలను అరికడుతున్నారు కాబట్టే.. పోలీసులపై చంద్రబాబు నెపం నెట్టుతున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలకు కామెడీ చూపిస్తున్నారు... ఎన్నికలకు ముందు కేఏ పాల్ కామెడీ చేసేవారని.. ఇప్పుడు ‘పవన్ నాయుడు పాల్’ రాష్ట్ర ప్రజలకు కామెడీ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పవన్ మాటల్లో చిత్తశుద్ధి లేదన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా..పవన్ ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలన్నారు. ఇవాళ చంద్రబాబుకు ఇబ్బంది వస్తే పవన్ కల్యాణ్ వెంటనే వచ్చి వాలిపోతున్నారన్నారు. ‘గత నాలుగు వారాలుగా రెండు పత్రికలు, ఐదు టీవీ ఛానెళ్లు రాష్ట్ర ప్రజలకు నిజం చెప్పడం మానేశాయి. ఆ పత్రికలకు హెడ్ ఆఫీస్ హైదరాబాద్‌లో.. బ్రాంచ్ ఆఫీసులు జిల్లా వారీగా ఉండొచ్చు.. ఆ పత్రికలు, టీవీ ఛానెళ్ల యాజమానులకు కూడా అమరావతిలో బినామీ ఆస్తులు ఉన్నాయోమోనని అనుమానంగా ఉంది. వాటిపై కూడా దర్యాప్తు చేయాలని’ ముఖ్యమంత్రిని దాడిశెట్టి రాజా కోరారు. మూడు రాజధానులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. (చదవండి: మూడు రాజధానులు కావాల్సిందే..) -
చంద్రబాబూ..భాష మార్చుకో..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు తప్పుబట్టారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలి పెట్టిన సీఎం పై టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తప్పుడు ఆరోపణలు చేయటం తగదన్నారు. టీడీపీ సభ్యుల పట్ల మార్షల్స్ మర్యాద పూర్వకంగానే వ్యవహరించారని, అయినా గాని సీఎం జగన్‌పై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో చంద్రబాబు అనుచిత ప్రవర్తనపై వీడియో కూడా ప్రదర్శించామని చెప్పారు. సభలో కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో టీడీపీ సభ్యులు ఈ విధంగా వ్యవహరించటం సరైన పద్దతి కాదన్నారు. బిల్లులకు ఆటంకం కలిగించాలనే దురుద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
అమ్మలేని వాడని ఆదరించారు
సాక్షి, గుమ్మఘట్ట: ‘చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది. 1 నుంచి 5 వరకు స్వగ్రామం నాగిరెడ్డిపల్లిలో చదువు పూర్తిచేశాను. తర్వాత చదువుకెళ్లేందుకు ఆర్థిక ఇబ్బంది అడ్డుతగిలింది. చదివింది చాలు.. పశువులు తోలుకెళ్లమని ఇంట్లో వాళ్లు ఆదేశించారు.. జొన్న సంకెటి ఓ పూట తింటే మరో పూట ఉండేదికాదు. కడు పేదరికం అనుభవించా.. గుణిగానపల్లిలో ప్రారంభమైన ప్రాథమికోన్నత పాఠశాల మూతపడకుండా ఉండటం కోసం సమీప బంధువు ఒకరు 6 వ తరగతికి అక్కడ చేర్చారు. ఎన్నో రోజులు ఉపావాసం ఉండి చదువుకున్నా.. అమ్మలేని పిల్లోడని అందరు నాపై జాలిపడి ఆదరించేవారు. 7వ తరగతిలో ఫస్ట్‌క్లాస్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించా.. 8లో మీరంతా నాకు మిత్రులు అయ్యారు. పట్టుదల, క్రమశిక్షణే నన్ను ఇంతటిస్థాయికి చేర్చింది. మిమ్మల్ని ఇలా చూడటం చాల అదృష్టంగా భావిస్తున్నా’ అని రాష్ట్ర ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. 40 ఏళ్ల తర్వాత... గుమ్మఘట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం 1975 – 85 మధ్యగల హైస్కూల్ విద్యార్థులంతా ఆత్మీయ కలయిక సమావేశం ఏర్పాటు చేశారు. కాపు రామచంద్రారెడ్డితో పాటు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా హాజరై పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తమ ఆత్మీయ మిత్రుడు ముచ్చటగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం గర్వించదగ్గ విషయమని మిత్రులంతా కొనియాడారు. అనంతరం పాఠశాల హెచ్ఎం శ్రీదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ల తర్వాతా ఇలా అందరు కలవడం హర్షణీయమన్నారు. ఇకపై ఈ ఆత్మీయ కలయికను ఊపిరి ఉన్నంత వరకు కొనసాగిద్దామన్నారు. అందరం కలిసి చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. మనలో ఏ ఒక్కరికి ఆపద వచ్చినా చేయిచేయి కలిపి ఆదుకునే ప్రయత్నం చేసినప్పుడే మన జీవితాలకు సార్థకత లభిస్తుందన్నారు. అమ్మలేని నాకు.. నియోజకవర్గ ప్రజలే అమ్మాలాంటి వారని.. వీరి ఆశీర్వాదం ఉన్నంత కాలం ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు. ఎమ్మెల్యేను సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు ఇంటర్ కళాశాల ఏర్పాటుకు కృషి.. ఎంత ఉన్నత శిఖరాలకు ఎదిగినా చదువుకున్న గుమ్మఘట్ట పాఠశాలను మరిచిపోలేనని.. మిత్రులందరి విజ్ఞప్తి మేరకు గుమ్మఘట్టలో ఇంటర్ కళాశాలను వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఏర్పాటయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కాపు హామీ ఇచ్చారు. అందరు మన కళాశాల వైపే చూసేలా మంచి మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ఆత్మీయ కలయికకు కారకులైన గోనబావి వడ్డే మారెప్పను మిత్రులంతా అభినందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థునులు కాపు రామచంద్రారెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమార్తె స్రవంతిరెడ్డి, మిత్రులు వడ్డే మారెప్ప, క్రిష్టప్ప, సక్రప్ప, సిద్ద రామప్ప, లక్ష్మినారాయణ, ప్రకాష్, మల్లికార్జున, తిప్పేస్వామి, నాగప్ప, శ్రీనివాసులు, ధనుంజయ్యశెట్టి, అనంతరెడ్డి, నాగభూషన, రామాంజినేయులు, ఇబ్రహీమ్, విజయబాస్కర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న రుణం తీర్చుకుంటా.. .ప్రభుత్వ విప్
సాక్షి, విశాఖపట్నం: అతి సామాన్య జీవితం నుంచి రాజకీయాలోకి వచ్చిన తనకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా అవకాశమిచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకుంటానని, జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిస్తానని మాడుగుల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. తనకు తుది శ్వాస ఉన్నంతవరకూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో నడుస్తానని... మరో 25 ఏళ్ల పాటు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డినే ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేపట్టి ఆదివారం అమరావతి నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా టీడీపీ అరాచక పాలనతో విసుగు చెం దిన రాష్ట్ర ప్రజలందరూ రాజన్న రాజ్యం కావాలని కోరుకుని, తనను అత్యధిక మెజారిటీతో గెలిపిం చారన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్రెడ్డి మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా హామీలను అమలు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఆశ వర్కర్లు, మధ్యాహ్నం భోజన సహా యకులు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల జీతా లు, పోలీసులకు వీక్లీ ఆఫ్, వృద్ధాప్య పింఛన్లు పెంచి రాజన్న రాజ్యానికి స్వాగతం పలికారన్నా రు. మంత్రివర్గ కూర్పులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యం కల్పిస్తూ.. అణగారిన కూలాలకు పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన కులానికి చెందిన తమ్మినేని సీతారాంని స్వీకర్‌గా, తనను ప్రభుత్వ విప్‌గా నియమించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమైందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి పేద, బడుగు బలహీనవర్గాల ప్రజల గుండెల్లో జగన్మోహన్రెడ్డి చెరగని ముద్ర వేసుకుంటారన్నారు. అడుగడుగునా బ్రహ్మరథం సుమారుగా 5 వేలకుపైగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భారీ ఊరేగింపుతో ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అభినందనలు తెలియజేస్తూ కేక్ కట్‌చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు శాలువాలతో, పూలదండలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట సీనియర్ నేతలు చిక్కాల రామరావు, వీసం రామకృష్ణ, అనకాపల్లి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి సుంకర శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యుడు సంజీవరావు ప్రభావతి, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి తుల్లి చంద్రశేఖర్, విశాఖ, అరకు పార్లమెంట్ విద్యార్థి విభాగం నాయకులు కాంతారావు, సురేష్, మాడుగుల, పాయకరావుపేట, చోడవరం నియోజకవర్గ పార్టీ నాయకులు సంజీవరావు ప్రభావతి, అట్టాడ శివకుమార్, డి.బాబురావు, పోలగట్ల పాపారావు, యర్రా అప్పారావు, టి.రాజారామ్, కిలపర్తి భాస్కర్‌రావు, కర్రిసత్యం, రెడ్డి జగన్మోహన్, కె.డేవిడ్, పెదబాబు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విప్‌గా.. కాపు రామచంద్రారెడ్డి
సాక్షి, రాయదుర్గం: రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని విప్‌గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన సొంత నియోజకవర్గం రాయదుర్గంలో అభిమానులు, పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఇక జిల్లాలోని వీరశైవులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జగన్మోహన్రెడ్డి విశ్వసనీయకు పట్టం కట్టారని కొనియాడారు. నిరుపేదకుటుంబం నుంచీ... కాపు రామచంద్రారెడ్డి స్వగ్రామం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డి పల్లి. నిరుపేద కుటుంబంలో జన్మించిన కాపు..కష్టపడి చదువుకున్నారు. రాయదుర్గం మండలం ఆర్బీ వంక గ్రామానికి చెందిన భారతిని వివాహమాడారు. కాపు రామచంద్రారెడ్డి తొలుత హాస్టల్ వార్డెన్, టీచర్, లైబ్రేరియన్‌గా పలు ఉద్యోగాలు చేశారు. అనంతరం బళ్లారిలోని ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా, బ్రాహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజర్‌గా కూడా పనిచేశారు. రాజకీయ అరంగేట్రం వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో ఇష్టపడే కాపు రామచంద్రారెడ్డి...ఆ మహానేత స్ఫూర్తితోనే 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి టీడీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిపై 14,091 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయిచే వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో ఏర్పడిన రాజకీయ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈక్రమంలోనే 2012 జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దీపక్‌రెడ్డిపై 32,476 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రాయదుర్గం నియోజకవర్గలోనే చరిత్ర సృష్టించారు. 2014లో స్వల్పఓట్ల తేడాతో పరాజయం చవిచూసినా...నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటాలు చేశారు. ప్రస్తుత 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులుపై 14,049 ఓట్ల మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. మూడు సార్లు రాయదుర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన కాపు రామచంద్రారెడ్డి తాజాగా బుధవారం అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. సేవాతత్పరుడు కాపు రామచంద్రారెడ్డి సామాజిక బాధ్యతగా తన సొంత నిధులతో సుమారు 8 వేల జంటలకుపైగా ఉచిత వివాహాలు, 2 వేల మందికి పైగా ఉచిత కంటి ఆపరేషన్లు చేయించారు. వందలాది మంది వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. దేవాలయాలకు విరాళాలు, డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, కంప్యూటర్ల వితరణ, కణేకల్లు జూనియర్ కళాశాలకు కార్పస్‌ఫండ్ ఇచ్చి తనవంతు తోడ్పాటు అందించారు. బయోడేటా పేరు : కాపు రామచంద్రారెడ్డి తండ్రి పేరు : కాపు చిన్న తిమ్మప్ప తల్లిపేరు : కాపు గంగమ్మ పుట్టిన తేదీ : 06.10.1963 అడ్రస్ : డోర్ నెం: 10–1–33, లక్ష్మీబజార్ , రాయదుర్గం , అనంతపురం జిల్లా విద్యార్హత : ఎంకాం (కర్ణాటక యూనివర్సిటీ) బీఎల్ఐఎస్సీ (గుల్బర్గా యూనివర్సిటీ), ఎల్ఐఎస్సీ (గుల్బర్గా యూనివర్సిటీ), ఎల్ఎల్బీ (స్పెషల్) ( గుల్బర్గా యూనివర్సిటీ), భాషా విశారద ఇన్ తెలుగు లిటరేచర్ వృత్తి : న్యాయవాది కుటుంబం : కాపు భారతి (భార్య), ప్రవీణ్‌కుమార్ రెడ్డి (కుమారుడు) అలేఖ్య రెడ్డి ( కోడలు), స్రవంతి రెడ్డి (కూతురు), మంజునాథరెడ్డి (అల్లుడు) -
ప్రభుత్వ విప్ కూన రవికుమార్ బూతు పురాణం
-
విప్.. గప్ చుప్!
- ప్రభుత్వంపై విపక్షాల దాడిని తిప్పికొట్టని ప్రభుత్వ విప్‌లు - పద్ధతి మార్చుకోవాలని సీనియర్లకు సీఎం క్లాస్! సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలు, ప్రజా, సామాజిక సంఘాలు కొన్నాళ్లుగా ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పాలన తీరునూ ఎండగడుతున్నాయి. అయితే తమ ప్రభుత్వంపై, పార్టీపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నా ప్రభుత్వ విప్‌లు మౌన వ్రతం పాటిస్తున్నారన్న చర్చ అధికార టీఆర్ఎస్లో సాగుతోంది. ఎవరికివారు తమ సొంత నియోజకవర్గాలకు పరిమితమవుతు న్నారని, ప్రభుత్వ విధానాలను సమర్థించడంలో, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో చురుగ్గా వ్యవహరిం చలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శాసనసభలో ఒక చీఫ్‌విప్ సహా నలుగురు విప్‌లు, శాసన మండలిలో ఒక చీఫ్‌విప్ సహా ముగ్గురు విప్‌లు మొత్తం ఏడుగురు ప్రభుత్వ విప్లున్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నవారిలో మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందు వరసలో ఉండగా, అడపాదడపా బోడకుంటి వెంకటేశ్వర్లు కూడా ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నారు. శాసనసభ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్‌లు గంప గోవర్దన్, నల్లాల ఓదెలు, గొంగిడి సునీత పూర్తి మౌనంగా ఉంటున్నారు. విపక్షాల విమర్శల దాడి... గత కొద్ది నెలలుగా ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు పెరిగా యి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జేఏసీ చైర్మన్ కోదండరాం, సీపీఎం, సీపీఐ కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి తదితరులు నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు. రైతులకు పంట రుణాలు, మిషన్ భగీరథ వంటి వాటితో పాటు జీఎస్టీకి ముందే అంగీకారం తెలపడం, మియాపూర్ భూకుంభ కోణం, నయీమ్ కేసు వంటి అనేక అంశాలపై ప్రభుత్వంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా టీఆర్ఎస్ విప్ల నుంచి స్పందన కన్పించట్లేదని, వీరికితోడు మంత్రులు సైతం స్పందించడం లేదన్న అభిప్రాయం కూడా ఉంది. అధినేత అసంతృప్తి... ఈ క్రమంలో విప్‌లు, కొందరు మంత్రులపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. వీరు పద్ధతి మార్చుకోవాలని కొందరు సీనియర్లకు క్లాస్ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. విమర్శలకు సమాధానం ఇచ్చేందుకు ఒకరిద్దరు మండలి విప్‌లు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎంపీ బాల్క సుమన్, ఇద్దరు ముగ్గురు మంత్రులు మాత్రమే ముందుకొస్తున్నారంటున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నాయిని, తలసాని మాత్రమే విపక్షాల దాడులను తప్పికొడుతున్నారని, మిగిలిన మంత్రులు వారి జిల్లాలకే పరిమితమవుతున్నారని చెబుతున్నారు. -
లెక్కతప్పితే ఎవరినీ వదిలిపెట్టను
బుక్కరాయసముద్రం : సీఎం బహిరంగ సభకు జనసమీకరణపై అధికారులపై ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినీబాల ఫైర్ అయ్యారు. బుధవారం మం డల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శింగనమల నియోజకవర్గం అధికారులతో సమావేశం నిర్వహిం చారు. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో జనాలను తరలించి తన పరు వు కాపాడాలని అధికారులకు సూచించారు. ఎలాగైనా సరే ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్ర జలను తరలించేలా ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. ఒక్కొక్క మండలం నుంచి ఎంత మందిని తీసుకొస్తారని అధికారులను ప్రశ్నించారు. ఆ తర్వాత మీరు చెప్పిన లెక్కలు తప్పితే ఎవరినీ వదిలి పెట్టను.. సభ అయిపోయిన తర్వాత మీ కథ చూస్తా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
భట్టీ.. నోరు అదుపులో పెట్టుకో
ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు సాక్షి, హైదరాబాద్: వరుస ఓటములతో మతి స్థిమితం కోల్పోయిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు అన్నారు. పాలేరు ఉప ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్‌ను పాతరేసినా వారికి బద్ధి రాలేదని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అవినీతి గురించి మాట్లాడడం నవ్వు తెప్పిస్తోందని, వట్టి మాటలు కట్టిపెట్టి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. అవినీతిలో పేటెంట్ హక్కులన్నీ కాంగ్రెస్‌వేనని, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ గృహనిర్మాణ మంత్రిగా ఉన్నప్పు డు ఇందిరమ్మ ఇళ్లను అవినీతి కూపంగా మార్చారన్నారు. ఎన్నికల హామీల అమలుపై బహిరంగ చర్చకు రావాలన్నారు. -
అభివృద్ధి పనులు ప్రారంభించిన విప్
అదిలాబాద్ జిల్లా మందమర్రిలో ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రూ. 40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం, మురికి కాల్వల మరమ్మత్తుతో పాటు మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. -
గిరిజన దర్బార్‌కు హాజరైన విప్, ఎమ్మెల్యేలు
ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్ గ్రామపంచాయతీ శివారులోని గాంధారి ఖిల్లా ఆదివారం గిరిజన భక్తులతో కిటికిటలాడింది. మూడు రోజులుగా జరుగుతున్న మైసమ్మ జాతరలో భాగంగా చివరిరోజైన ఆదివారం వేలాదిగా గిరిజనులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలు తెలుసుకునేందుకు దర్బార్ నిర్వహించారు. దీనికి ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యేలు కోవాలక్ష్మి, దివాకర్‌రావు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ హాజరయ్యారు. -
వీఐపీలే లక్ష్యంగా..
♦ ప్రభుత్వ విప్‌కు ఫోన్ చేసి ♦ డబ్బులడిగిన అగంతకుడి అరెస్ట్ యాదగిరిగుట్ట: వీఐపీలనే లక్ష్యంగా చేసుకుని.. ఫోన్లు చేసి, బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బహదూర్‌పురలోని సుల్తాన్ షాహి, లాల్ దర్వాజకు చెందిన మొండ్రాయి కృష్ణమాదిగ మందకృష్ణ మాదిగ పేరు చెప్పుకొని సంఘ కార్యక్రమాలకు ఫండ్ కోసం అని వీఐపీలకు ఫోన్ చేసి సులువుగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. ఇలా 2010లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావుకు ఫోన్‌చేసి పార్టీ ఫండ్ కింద 2 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. ఎమ్మెల్యే శంకర్రావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టయి నాలుగు నెలలు చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవించాడు. మళ్లీ జైలు నుంచి బయటకు వచ్చి పలువురు వీఐపీలకు ఫోన్లు చేసి బెదిరించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇతడిపై రౌడీషీట్‌కూడా తెరిచారు. ఇదే క్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతకు కూడా ఫోన్ డబ్బులు కావాలని బెదిరించాడు. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో వలపన్ని శనివారం అతడిని అరెస్టు చేశారు. -
అమ్మా.. మందకృష్ణను మాట్లాడుతున్నా..
* ప్రభుత్వ విప్‌కు అగంతకుడి ఫోన్ * రెండు రోజుల్లో 17 కాల్స్ * అనుమానంతో మందకృష్ణకు ఫోన్ చేసిన సునిత * తాను కాదంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడి వివరణ * ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్‌కు ఫిర్యాదు చేసిన విప్ యాదగిరిగుట్ట : ‘‘అమ్మా.. నేను మందకృష్ణ మాదిగను మాట్లాడుతున్నా.. పేదింటి యువతికి వివాహం చేస్తున్నాం.. రూ. 6వేల ఆర్థికసాయం చేయాలి’’ అంటూ ఓ అగంతకుడు ప్రభుత్వ విప్ గొంగిడి సునితారెడ్డికి పలుమా ర్లు ఫోన్ చేశాడు. రెండు రోజుల్లోనే 17 సార్లు ఫోన్ చేశారు. దీంతో ఆమె విసిగి ఎస్పీకి చేశారు. విప్ సునీతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గత బుధవారం రాత్రి విప్ సునీతారెడ్డికి గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. మందకృష్ణ మాదిగను మట్లాడుతున్న ఆర్థికసాయం కావాలని కోరగా సరే చూద్దాం లే అని ఆమె ఫోన్ కట్ చేసింది. మరుసటి రోజు ఉదయం 8.30 గంటల సమయంలో ఫోన్ చేయగా బిజీగా ఉన్నానన్డి ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత 11.15 వరకు వరుసగా 7 సార్లు ఫోన్ చేశాడు. అవసరమైతే ఎదైనా కల్యాణ మండపం ఇప్పిస్తానని విప్ సునీతారెడ్డి బదులు ఇచ్చారు. దీనికి ఫోన్ చేసిన వ్యక్తి లేదు లేదు రూ.ఆరు వేల సహాయమే కావాలని అడిగాడు. ఇలా బుధవారం, గురువారం రెండు రోజుల్లో ఓ నంబర్ నుం చి 14 సార్లు, మరో నంబర్ నుంచి 3 సార్లు ఫోన్ చేశాడు. రూ.ఆరు వేల కోసం మందకృష్ణ మాదిగ తనకు ఇన్ని సార్లు ఫోన్ చేయడం ఏమిటని అనుమానంతో విప్ మందకృష్ణ మాదిగకు ఫోన్ చేశారు. రూ. ఆరు వేలు ఎక్కడికి పంపించమంటారని అడగడంతో ఆయన అవాక్కయ్యారు. నేను మీకు ఫోన్ చేయలేదు అంటూ వివరణ ఇచ్చారు. దీంతో ఆమె వెంటనేఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్‌కు ఫిర్యాదు చేశారు. 25 రోజుల క్రితం కూడా ఓ అగంతకుడు ఫోన్ చేసి డబ్బులు అడిగాడని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. కాగా ఫోన్ నంబర్ల ఆధారంగా ఓ అనుమానితుడిని పోలీ సులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. -
విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి
ఆమదాలవలస: ప్రభుత్వ విప్ కూన రవికుమార్ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా అది విద్యుత్ తీగలకు తగిలి షాక్‌తో ఒకరు చనిపోగా, మరొకరు గాయపడి శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఆమదాలవలస కొత్తరోడ్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా సరదాపురం గ్రామానికి చెందిన బేసి భాస్కరరావు (40) కొత్తరోడ్ సమీపంలో వెల్డింగ్ దుకాణం నడుపుతూ.. గత రెండేళ్లుగా శ్రీకాకుళం పట్టణంలోని ఆదివారంపేటలో నివాసముంటున్నాడు. గురువారం ప్రభుత్వ విప్ రవికుమార్ విదేశీ పర్యటన ముగించుకొని వస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపేందుకు, ఆహ్వానం పలికేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ఫ్రేమ్‌లు తయారు చేసి వాటిని వేలాడ దీసేందుకు భాస్కరరావు కాంట్రాక్టును ఒప్పుకున్నాడు. వీటిని ఆమదాలవలస, శ్రీకాకుళం ప్రాంతాల్లో కట్టాడు. ఈ నేపథ్యంలోనే కొత్తరోడ్ సమీపంలో తన వెల్డింగ్ దుకాణం ఆవరణలోని శ్లాబ్‌పై పెద్ద ఫ్లెక్సీ కట్టేందుకు భాస్కరరావు ప్రయత్నించాడు. అయితే శ్లాబ్ పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు ఫ్లెక్సీ తగలడంతో దాన్ని పట్టుకొని ఉన్న భాస్కరరావు షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య జయలక్ష్మి, కుమార్తె జాన్సీ, కుమారుడు మురళీమోహన్‌లు ఉన్నారు. కుటుంబ యజమాని మృతి చెందాడని తెలుసుకున్న భార్య పిల్లలు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరై విలపించారు. సహాయం చేసేందుకని వెళ్లి గాయాలపాలు కొత్తరోడ్ సమీపంలో ఉన్న రైస్ మిల్లో పనిచేస్తున్న వంజంగి గ్రామానికి చెందిన చింతాడ నారాయణరావు ఫ్లెక్సీ కట్టడానికి సాయం చేసేందుకు వెళ్లి అతను కూడా విద్యుత్ షాక్‌కు గురై శ్లాబ్ పైనుంచి కిందకు పడిపోవడంతో గాయపడ్డాడని స్థానిక పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ రామచంద్రరావు తెలిపారు. అతన్ని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి కుటుంబానికి విప్ ఆర్థిక సాయం శ్రీకాకుళం :కొత్తరోడ్డు జంక్షన్ వద్ద ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన భాస్కరరావు కుటుంబానికి విప్ కూన రవికుమార్ లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించారు. శుక్రవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి వ్యక్తిగతంగా సహాయాన్ని అందించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పరంగా సహాయం అందేలా చూస్తానని మృతుని కుటుంబానికి రవికుమార్ ఇప్పటికే హామీ ఇచ్చారు.