సీఎం బహిరంగ సభకు జనసమీకరణపై అధికారులపై ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినీబాల ఫైర్ అయ్యారు.
బుక్కరాయసముద్రం : సీఎం బహిరంగ సభకు జనసమీకరణపై అధికారులపై ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినీబాల ఫైర్ అయ్యారు. బుధవారం మం డల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శింగనమల నియోజకవర్గం అధికారులతో సమావేశం నిర్వహిం చారు. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో జనాలను తరలించి తన పరు వు కాపాడాలని అధికారులకు సూచించారు.
ఎలాగైనా సరే ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్ర జలను తరలించేలా ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. ఒక్కొక్క మండలం నుంచి ఎంత మందిని తీసుకొస్తారని అధికారులను ప్రశ్నించారు. ఆ తర్వాత మీరు చెప్పిన లెక్కలు తప్పితే ఎవరినీ వదిలి పెట్టను.. సభ అయిపోయిన తర్వాత మీ కథ చూస్తా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.