yaminibala
-
జాడలేని అత్తార్, యామినీ
సాక్షి, అనంతపురం: సార్వత్రిక సంగ్రామంలో ఒక ఘట్టం ముగిసింది. వైఎస్సార్సీపీ, టీడీపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే ఇప్పటి వరకూ ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. బుధవారం నాటికి అభ్యర్థులందరికీ భీ–ఫారంలు అందాయి. దీంతో ముహూర్తాలు చూసుకుని ఎవరికి వారు ఆర్భాటంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆపై ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. టిక్కెట్లు దక్కిన వారు ఎన్నికల హడావుడిలో ఉంటే టిక్కెట్లు దక్కని వారు మాత్రం భవిష్యత్తు పరిణమాలపై ఆలోచిస్తున్నారు. మొత్తంగా ఎన్నికల సంగ్రామం ఇక మరింత వేడెక్కనుంది. అభ్యర్థులంతా ఖరారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచే పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను ఒకేజాబితాలో ఆపార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మరోవైపు రెండు విడతల్లో 9 మంది అసెంబ్లీ అభ్యర్థులను, మూడో విడతలో 5 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. 13 రోజుల్లోనే టీడీపీకి గుప్తా బైబై గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఏడాదిగా టీడీపీతో నడుస్తున్నారు. పార్టీలో చేరకపోయినా...టీడీపీ ముఖ్య కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటున్నారు. ఎట్టకేలకు ఇటీవలే అమరావతిలో చంద్రబాబు చేత పచ్చకండువా వేయించుకున్నారు. ఎంపీ జేసీ సిఫార్సుతో గుంతకల్లు టిక్కెట్ తనకే వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఈ మేరకే జేసీ దివాకర్‌రెడ్డి కూడా పావులు కదిపారు. శింగనమల, కళ్యాణదుర్గం, గుంతకల్లు సిట్టింగ్‌లను మారిస్తేనే పోటీచేస్తానని చంద్రబాబును బ్లాక్మెయిల్ చేశారు. దీంతో చంద్రబాబు ‘అనంత’ పార్లమెంట్‌లోని కీలక నేతలతో మాట్లాడారు. జేసీతో తమకు రాజకీయ అవసరం లేదని, అవసరమైతే ఎంపీ టిక్కెట్ మార్చినా ఎలాంటి ఇబ్బంది లేదని వారు చెప్పారు. పైగా గుంతకల్లు సీటు మారిస్తే రాయదుర్గం మినహా అంతా అగ్రవర్ణాలే అవుతారని చెప్పారు. దీంతో జేసీ బ్లాక్ మెయిల్‌కు చంద్రబాబు గట్టిగానే స్పందించారు. గుంతకల్లులో సిట్టింగ్‌ను మార్చే ప్రసక్తే లేదని, ఇప్పటికే మీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోవడంతో పార్టీకి నష్టం వాటిల్లిందని, ఆపై మీ ఇష్టం అని జేసీకి తేల్చి చెప్పారు. అంతేకాకుండా వెంటనే గౌడ్‌కు టిక్కెట్ కేటాయించారు. జేసీని నమ్ముకుని రాజకీయంగా ‘రాంగ్‌స్టెప్’ వేశానని గ్రహించిన గుప్తా.. హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లి జనసేన పార్టీలో చేరారు. 13 రోజుల్లోనే టీడీపీని వీడిన గుప్తా జనసేన తరఫున పోటీ చేయనున్నారు. రెండో రోజూ సురేంద్ర అనుచరులు ఆందోళన కళ్యాణదుర్గం టిక్కెట్ ఆశించి భంగపడిన అమిలినేని సురేంద్రబాబు అనుచరులు రెండోరోజు ఆందోళన చేశారు. కళ్యాణదుర్గంలో డమ్మీ అభ్యర్థి ఉమాను పక్కనపెట్టి సురేంద్రకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 22న ఉరవకొండ ఇండిపెండెంట్‌గా సురేంద్రతో నామినేషన్ వేయిస్తామని హెచ్చరించారు. ఇకపోతే అనంతపురంలో టీడీపీ కార్పొరేటర్లు లాలెప్ప, దుర్గేష్‌లతో పాటు వెంకట ప్రసాద్(ఇండిపెండెంట్) కూడా నేడు వైఎస్సార్సీపీలో చేరనున్నారు. ప్రచార పర్వంలో అభ్యర్థులు టిక్కెట్ దక్కించుకున్న నేతలు ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పటికే వైఎస్సార్సీపీతో పాటు టీడీపీ నేతలు ప్రచారాన్ని సాగిస్తున్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని టీడీపీ నేతలు అభ్యర్థిస్తుంటే, చంద్రబాబు రాష్ట్రానికి, జిల్లాకు చేసిన అన్యాయంపై తీర్పు ఇవ్వాలని... రాజన్న రాజ్యం రావాలంటే ‘ఫ్యాన్’ గుర్తుకు ఓటేయాలని వైఎస్సార్ సీపీ నేతలు అభ్యర్థిస్తున్నారు. ప్రచారానికి సమయం తక్కువగా ఉండటంతో నేతల సతీమణులు, పిల్లలు సకుటుంబసపరివారసమేతంగా ప్రచారం సాగిస్తున్నారు. మరో ఐదురోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. జాడలేని అత్తార్, యామినీ టీడీపీ తరఫున టిక్కెట్లు దక్కని అత్తార్‌చాంద్‌బాషా, యామినీబాల అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మంత్రి పదవి ఆశచూపడంతో వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరానని, ఇప్పుడు టిక్కెట్ లేకుండా చంద్రబాబు మోసం చేశారని అత్తార్ తన అనుచరుల వద్ద బోరుమంటున్నారు. మోసం చేసిన టీడీపీని వీడాలని తన అనుచరులతో చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు యామినీబాలదీ ఇదే పరిస్థితి. దివాకర్‌రెడ్డి తమను మోసం చేశారని ఆమె విలపిస్తున్నారు. తమపై చంద్రబాబుకు తప్పుడు సమాచారం ఇచ్చారని వాపోతున్నారు. శింగనమలలో శ్రావణికి తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని, ఎన్నికల్లో ఆమె ఓటమి ఖాయమని తనకు ఫోన్ చేసిన వారితో చెబుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రఘువీరారెడ్డికి సాయం చేయడం కోసం డమ్మీ అభ్యర్థిగా ఉమాను బరిలోకి దింపి తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంపై ‘ఉన్నం’ కూడా తీవ్రంగానే స్పందించారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన ‘ఉన్నం’ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. చంద్రబాబు తనను మోసం చేశారని, తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. -
అన్నీ తాత్కాలికమే !
అనంతపురం, శింగనమల: మండలంలోని నాయనవారిపల్లి గ్రామ రోడ్డు కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకం ఇది. ఈనెల 2న ఎమ్మెల్యే యామినీబాల ఇక్కడ భూమి పూజ చేశారు. అయితే రెండు కడ్డీలు కట్టించి అందులో శిలాఫలకాన్ని ఉంచారు. రూ.1.26 కోట్లు మంజూరైనట్లు అందులో పొందుపర్చారు. రోడ్డు వేస్తామని గతంలో ఎమ్మెల్యే హామీ ఇవ్వడం.. ప్రస్తుతం ఎన్నికలు దగ్గరపడటంతోనే తాత్కాలిక శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారన్న చర్చ జరుగుతోంది. -
యామనీ బాల.. అవినీతి గోల
చదువుకున్న వ్యక్తి కావడంతో తమ నియోజకవర్గం అభివృద్ధి పథంలోదూసుకెళుతుందని అందరూ భావించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తారనుకున్నారు. అయితే అందరి అంచనాలుతారుమారయ్యాయి. ఎన్నికల సమయంలో ఒక విధంగాను, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రీతిగాను సదరు వ్యక్తి వ్యవహర్తిస్తుండడంతో నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా పడకేసింది. ప్రతి పనికీ పర్సంటేజీ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతుండడంతో ఆదర్శానికి కాలం చెల్లింది. చదువుకున్న మేధావి తనం కాస్త కమీషన్లకక్కుర్తిలో మట్టి కొట్టుకుపోయింది.ఇదీ శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే యామినీ బాల... నాలుగేళ్ల పాలనలో సాధించిన ప్రగతి. శింగనమల :ఉపాధ్యాయురాలిగా... విద్యాధికారిగా పనిచేస్తూ ఊహించని విధంగా ఎమ్మెల్యేగా అయ్యారు యామినీ బాల. 2014 ఎన్నికల సమయంలో గెలుపొందేందుకు ఎన్నో వాగ్ధానాలు చేశారు. కులం కార్డుతో ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో ప్రతి పనికీ పర్సంటేజీలు దండుకుంటూ పనుల నాణ్యతకు తిలోదకాలచ్చేశారు. ఇసుక, మట్టి అక్రమ రవాణాకు తెరదీసి రూ. కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. అభివృద్ధికి ఆమడ దూరంగాఎస్సీ కాలనీలు ఎస్సీలకు కేటాయించిన శింగనమల నియోజకవర్గంలో ఈ నాలుగేళ్లలో ఎస్సీ కాలనీల్లో ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోలేకపోయాయి. సమస్యలపై స్థానికులు ఎప్పటికప్పుడు మొరబెడుతున్నా.. ఆమె పట్టించుకోలేదు. ఫలితంగా ఎస్సీ కాలనీలు అభివృద్ధికి ఆమడ దూరంగా మురికి కూపాలను తలపిస్తున్నాయి. చక్రం తిప్పుతున్న అశోక్ యామినీబాల సోదరుడు అశోక్ అంతా తానై నియోజకవర్గ వ్యాప్తంగా అవినీతి, అక్రమాలకు తెరదీశారు. ప్రతి పనిలోనూ పర్సంటేజీలు తీసుకోవడం, పనుల కేటాయింపులు, అధికారుల బదిలీలు ఇతరత్రా అన్ని విషయాలు ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈయనకు తెలియకుండా నియోజకవర్గంలో ఏ ఒక్క పని జరగదనే ప్రచారం ఉంది. నీరు చెట్టు పనులు, ఇసుక దందా, సబ్సిడీ రుణాల మంజూరు ఇలా ప్రతి పనిలో అవినీతి తారాస్థాయికి చేరుకుంది. నీరు–చెట్టు పనుల్లో యథేచ్ఛ దోపిడీ నీరు–చెట్టు పథకం కింద శింగనమల మండలంలో టీడీపీ నాయకులు చేపట్టిన రూ. 8 కోట్ల పనుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. రూ. లక్ష విలువైన పనికి రూ. 10వేలు చొప్పున ఇరిగేషన్ అధికారుల నుంచి వసూలు చేశారు. శింగనమల చెరువు, సలకంచెరువు, నాగులగుడ్డం వద్ద ఉన్న చెన్నవరం చెరువు, చిన్నజలాలపురం చెరువు, కాలువల్లో చేపట్టిన పూడిక తీత పనుల్లోనూ భారీ అక్రమాలు చేటుచేసుకున్నాయి. పనులు నామమాత్రంగా చేసి నిధులు దోచేశారు. శింగనమల మండలంలోని ఉల్లికల్లు ఇసుక రీచ్‌లలో ఎమ్మెల్యే పీఏ రంగప్రవేశం చేసి అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకున్నారు. టిప్పరుకు రూ. 2 వేలు చొప్పున వసూలు చేశారు. నియోజకవర్గంలోని శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో దాదాపు రూ.70 కోట్లు వరకు నీరు–చెట్టు పనులు జరిగాయి. ఇందులో రూ.1 లక్ష పనికి రూ.5 వేలు చొప్పున కమీషన్‌ను ఎమ్మెల్యేకు ఇచ్చినట్లు టీడీపీ నాయకులే ఆరోపణులు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ♦ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా శాఖల వారీగా టార్గెట్లు కేటాయించి అధికారులతో డబ్బు వసూలు చేశారు. ♦ బీకేఎస్ మండలంలో నిరుపేదలను బెదిరించి వారు సాగుచేస్తున్న భూమిని లాక్కొన్నారు. ఎమ్మెల్యే యామినీబాల అ«ధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆమె తమ్ముడు అశోక్ బీకేయస్ మండలంలోని గోవిందపల్లి గ్రామంలో దూదేకుల వన్నూర్కు చెందిన 5 ఎకరాల పొలంను ఎమ్మెల్యే బినామీల పేరుతో పట్టా చేయించారు. అధికారులపై పెత్తనం శింగనమల నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అన్ని శాఖల అధికారులపై ఎమ్మెల్యే యామినీబాలతో పాటు ఆమె అనుచరుల పెత్తనం తీవ్ర స్థాయిలో ఉంది. ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు, ఈబీసీ కింద అర్హులకు రుణాలు మంజూరు చేయడానికి ఈ నియోజకవర్గంలో నామమాత్రపు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద కూర్చొని జాబితాను పరిశీలించి తుది అభ్యర్థులను ఖరారు చేశారు. ఇదే తరహాలో పింఛన్ల లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగింది. ఈ విషయంగా ఎంపీడీవోల లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను ఆమె గుప్పిట్లో ఉంచుకుని మొత్తం వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చేసుకున్నారు. టీడీపీ నాయకుల పెత్తనాన్ని భరించలేక పుట్లూరు ఎంపీడీఓ నెహమ్యా డిప్యూటేషన్‌పై తాడిపత్రికి వెళ్లారు. డిప్యూటేషన్లు రద్దు అయిన తర్వాత ఆయన పుట్లూరుకు రాలేని పరిస్థితి నెలకొంది. శింగనమల ఎంపీడీఓగా పనిచేసిన లలితకుమారి వీరి ఒత్తడి తట్టుకోలేక ఇంకా రెండేళ్ల సర్వీస్‌ను వదులుకుని స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. ఇచ్చిన హామీల అమలు తీరు ♦ శింగనమల చెరువును లోకలైజేషన్ చేయిస్తామంటూ 2014 ఎన్నికల సమయంలో శింగనమలలో జరిగిన బహిరంగసభలో యామినీబాల, శమంతకమణి వాగ్ధానం చేశారు. నేటికీ ఇది అమలు కాలేదు. ♦ శింగనమలలో మోడల్ çస్కూల్ ఏర్పాటు హామీ నేటికీ అమలు కాలేదు. ♦ ఎన్నికల్లో గెలిస్తే అర్హులైన వారందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేస్తామన్నారు. గెలిచిన తర్వాత ఏ ఒక్కరికీ పట్టా ఇవ్వలేదు. ♦ నార్పల వద్ద కూతలేరులో మురికినీరు కలుషితం కాకుండా ప్రత్యేక కాలువ ఏర్పాటు హామీ నెరవేరలేదు. ♦ పుట్లూరు మండలంలోని పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి చెరువులను నింపడంలో విఫలమయ్యారు. ♦ పుట్లూరు మండలంలో తాగునీటి సమస్య పరిష్కారం కాలేదు. ♦ బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని అమ్మవారిపేట గ్రామం వద్ద నార్పల రహదారి పక్కన మోడల్ స్కూల్ నిర్మాణం ఊసే లేకుండా పోయింది. ♦ యల్లనూరు మండల వ్యాప్తంగా ఉన్న చిత్రావతి నదికి ఏటా నీటిని విడుదల చేయలేకపోయారు. ♦ ప్రతి గ్రామానికీ తారురోడ్డు నిర్మాణం గాలిలో కలిసిపోయింది. ఇప్పటికీ మట్టి రోడ్లపైనే ప్రజలు ప్రయాణిస్తున్నారు. ♦ పశువైద్యశాలకు శాశ్వత భవన నిర్మాణం చేయించలేకపోయారు. = పాఠశాలల్లో గదుల కొరత తీరలేదు. అదనపు తరగతి గదుల నిర్మాణం పట్టించుకోలేదు. ఆమెకు సొంత ప్రయోజనాలే ముఖ్యం ఎమ్మెల్యే యామినీ బాలకు సొంత ప్రయోజనాలే ముఖ్యం. ఈ నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తీ వెనుకబడింది. పింఛన్ల పంపిణీలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ గృహాల లబ్ధి నిజమైన పేదలకు దక్కలేదు. పక్కా గృహ నిర్మాణాలన్నీ టీడీపీ కార్యకర్తలకే మంజూరు చేయించారు. నీరు చెట్టు పనుల్లో పెద్ద ఎత్తన నిధులు దోపిడీకి పాల్పడ్డారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు ఇవ్వడంలో వైఫల్యం చెందారు. చెరువులన్నీ నింపుతామంటూ ప్రకటించి, ఏ ఒక్క చెరువునూ నింపలేకపోయారు. పంట పెట్టే సమయంలో హెచ్చెల్సీకి లైనింగ్ పనులు చేపట్టి అన్నదాతల పొట్ట కొట్టారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారు. స్వతహాగా ఉపాధ్యాయురాలైనప్పటికీ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి చేసిన కృషి అంటూ ఏదీ లేదు. బెల్టు షాపులను పరోక్షంగా ప్రోత్సహించారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.– జొన్నలగడ్డ పద్మావతి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రైతులను మోసం చేశారు అధికారంలోకి రాగానే శింగనమల చెరువును లోకలైజేషన్ చేస్తామంటూ 2014 ఎన్నికల సమయంలో యామినీబాల మాట ఇచ్చారు. గెలిచిన తర్వాత ఇంత వరకూ చెరువు అభివృద్ధి గురించి ఏ మాత్రం ఆమె పట్టించుకోలేదు. లోకలైజేషన్ చేసి నీటి కేటాయింపులు రాబట్టలేకపోయారు. కేవలం రైతులను, కూలీలను ఆనాడు మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. అందరినీ మోసం చేశారు. – తిరుపతయ్య, రైతు, శివపురం, శింగనమల మం‘‘ -
అమ్మ.. కూతురు.. కొడుకు.. ఓ పీఏ!
ఈనెల 5వ తేదీన తహసీల్దార్ల బదిలీలు చేపట్టారు. శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు తహసీల్దార్ పుల్లన్నను కలెక్టరేట్లో రిపోర్టు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. అదే నియోజకవర్గంలోని నార్పల తహసీల్దార్ శ్రీధర్‌బాబును పుట్లూరుకు బదిలీ చేశారు. సుమారు 25 రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ వీరిద్దరూ బదిలీ స్థానాల్లో కాకుండా ఇదివరకున్న మండలాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. రాజకీయ అండదండలతోనే వీళ్లు యథావిధిగా కొనసాగుతున్నట్లు సమాచారం. శింగనమల నియోజకవర్గంలో రాజకీయ జోక్యానికి ఇదో ఉదాహరణ మాత్రమే.. శింగనమల: ఎమ్మెల్సీ శమంతకమణి.. ఈమె కుమార్తె ఎమ్మెల్యే యామినీబాల.. ఈమెకు తమ్ముడైన అశోక్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త.. ఎమ్మెల్యే పీఏ కిరణ్.. నియోజకవర్గంలో ఈ నలుగురి మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. కుటుం బంలో సఖ్యత లేని కారణంగా పార్టీ శ్రేణులు వర్గాలుగా విడిపోయారు. ఈ పరిస్థితి సామాన్య కార్యకర్తలతో పాటు నాయకులను గందరగోళంలో పడేస్తోంది. ఇదే సమయంలో పనుల విషయంలో ఎవరి వద్దకు వెళితే ఏమవుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికల్లో చివరి దశలో యామినీబాల నామినేషన్ వేసి అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి వరకు నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలంలో ఇన్చార్జి ఎంఈఓగా పని చేశారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబమే అయినా.. ఎన్నికయ్యాక మూడు సంవత్సరాల వరకు రాజకీయాల్లో పట్టు సాధించలేకపోయారు. ఆ తర్వాత తమ్మునితో విభేదాలు రావడంతో క్యాంప్ ఆఫీస్ నుంచే వ్యవహారాలు నడుపుతున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్‌కు తమ్ముడు పోటీలో ఉండడంతో, తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. తమ్ముడితో విభేదించే నియోజకవర్గ నాయకులను కలుపుకొని పార్టీలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. అశోక్ విషయానికొస్తే.. ఎమ్మెల్సీ శమంతకమణి కుమారుడు, ఎమ్మెల్యే యామినిబాలకు తమ్ముడు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక మూడు సంవత్సరాల పాటు అన్నీ తానై వ్యవహరించారు. అధికారుల బదిలీలు మొదలుకొని, పథకాలు.. ఇతరత్రా వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టాడు. అధికారులతో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అక్కా తమ్ముళ్ల మధ్యభేదాభిప్రాయాలు రావడంతో క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మేల్యే, సొంత ఇంటి నుంచి అశోక్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు ఎవరి వద్దకు వెళ్లాలో తెలియక గందరగోళంలో ఉన్నారు. పీఏ కిరణ్ చిచ్చు ఎమ్మెల్యే యామినిబాల పీఏ కిరణ్ జోక్యం కూడా నియోజకవర్గంలో అధికంగానే ఉంటోంది. అన్ని వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్లు టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఉల్లికల్లు ఇసుక రీచ్‌లో ప్రజాప్రతినిధులకు తెలియకుండా సొంతంగా టిప్పర్లు పెట్టి అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పీఏ తన సామాజిక వర్గానికే ప్రాధన్యత ఇస్తుండడంతో పార్టీలోని ఒక వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నీరు–చెట్టు పనుల్లోనూ కమీషన్లు నియోజకవర్గంలోని శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో 2014–18 మధ్య కాలంలో నీరు–చెట్టు పథకం కింద 589 పనులు చేపట్టారు. ఇందుకోసం దాదాపు రూ.60 కోట్లు వెచ్చించారు. ప్రతి పనిలో రూ.లక్షకు 10 శాతం కమీషన్‌ను తీసుకుంటున్నారు. ఇందులో 5 శాతం వరకు ప్రజాప్రతినిధులకు ముట్టజెప్పినట్లు తెలిసింది. ఇలా రూ.3 కోట్ల వరకు కమీషన్ల రూపంలో చేతులు మారినట్లు చర్చ జరుగుతోంది. రైతు రథం పథకంలోనూ వసూళ్లు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని రైతు రథం పథకంలో భాగంగా 2017–18 సంవత్సరానికి సంబంధించి పెద్ద ట్రాక్టర్ల మంజూరులో భారీగా అవినీతి చోటు చేసుకుంది. ప్రతి ట్రాక్టర్‌కు సిఫారసు లేఖ ఇచ్చేందుకు ఓ ముఖ్యనేత రూ.30వేలు వసూలు చేసినట్లు సమాచారం. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు 93 ట్రాక్టర్లు మంజూరు కాగా.. రూ.25లక్షలు ఆ ముఖ్యనేత వెనకేసుకున్నట్లు తెలిసింది. అభివృద్ధి పనుల్లోనూ పర్సెంటేజీలు నియోజకవర్గంలో ఏ పని మొదలు పెట్టినా పర్సెంటేజీలు తప్పనిసరి అయ్యాయి. శింగనమల టీడీపీ మాజీ మండల కన్వీనర్ ఒకరు 2016లో ఐసీడీఎస్ కార్యాలయం పనులను టెండర్ ద్వారా దక్కించుకున్నారు. అయితే పనులు మొదలుపెట్టిన తర్వాత.. ఓ ముఖ్య నేత అప్పట్లో పని చేసిన ఎంపీడీఓను పంపించి నిలిపివేయించారు. ముఖ్య నేతతో మాట్లాడిన తర్వాతే పనులు మొదలు పెట్టాలని చెప్పడంతో రూ.లక్ష ముట్టజెప్పి పనులు ప్రారంభించారు. రోడ్లు, భవనాల నిర్మాణాలతో పాటు ప్రతి పనిలోనూ పర్సెంటేజీ ఇవ్వనిదే పనులు కావట్లేదనే అభిప్రాయం పార్టీ వర్గీయుల్లోనే వ్యక్తమవుతోంది. అధికారుల బదిలీల్లోనూ.. నియోజకవర్గంలో ఒక అధికారి పోస్ట్‌కు రేట్ పెట్టి వసూలు చేశారు. ఓ అధికారి ఇక్కడకు రావాలంటే నిర్ణయించిన మొత్తం చెల్లించుకోవాల్సిందే. లేదంటే వెనక్కు పంపడం ఇక్కడ పరిపాటి. అప్పటికీ కొనసాగితే.. మానసిక వేధింపులతో వెళ్లిపోయేలా చేస్తున్నట్లు అధికారుల్లోనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలోని రెండు మండలాల తహసీల్దార్లు ఇటీవల బదిలీ అయ్యారు. అయితే వీరి బదిలీ చేసిన ప్రాంతాలకు వెళ్లలేదు. ముఖ్య నేతలతో మాట్లాడుకోవడం వల్లే ఆ ఇద్దరూ ధైర్యంగా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నట్లు సమాచారం. ఇసుక దందా ఉల్లికల్లు ఇసుక రీచ్‌లో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. డిసెంబర్ 18, 2014 న వెలుగు ఆధ్వర్యంలో రీచ్ ప్రారంభించారు. ప్రభుత్వం 32వేల క్యూబిక్ మీటర్లుకు అనుమతివ్వగా.. 47వేల క్యూబిక్ మీటర్లు తరలించారు. రికార్డులలో 27వేలు మాత్రమే చూపించారు. భారీ స్థాయిలో అక్రమాలు వెలుగులోకి రావడంతో 20 మందికి నోటీసులు ఇచ్చి, 16 మంది వెలుగు సిబ్బందిని తొలగించారు. ఇక రెండవసారి 2015 డిసెంబర్ నెల అఖరులో 12వేల క్యూబిక్ మీటర్ల ఇసుకకు అనుమతి లభిస్తే , ఉచితం పేరుతో అక్రమంగా ఇసుక తరలించారు. నిర్వహణ బాధ్యతలు వెలుగు సిబ్బందికి అప్పగించినా.. ఎమ్మెల్సీ తనయుడు ఆశోక్ , ఎమ్మెల్యే పీఏ కిరణ్ కనుసన్నల్లోనే వ్యవహారం సాగింది. ఒక మండల తెలుగు యువత అధ్యక్షుడు, మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు ఒక్కో టిప్పుర్‌కు అదనంగా రూ.2 వేలు వసూలు చేశారు. ప్రతి రోజు 30 టిప్పుర్ల చొప్పున రోజుకు రూ.60వేలు దండుకోవడం గమనార్హం. ఈ లెక్కన నెల రోజుల పాటు ఇసుక అక్రమ రవాణాతో సుమారు రూ.15లక్షలు దోచుకున్నారు. అదేవిధంగా ఇసుక తరలింపులోనూ వీరిద్దరూ రూ.20లక్షల వరకు వేనకేసుకున్నట్లు సమాచారం. -
ఏమీ చేయవ్.. ఎలా ఉన్నారని అడుతావా?
పుట్లూరు(యల్లనూరు): శింగనమల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినిబాలకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ‘దళిత తేజం’ కార్యక్రమంలో పాల్గొనేందుకు మండలంలోని ఎల్లుట్ల గ్రామానికి వచ్చిన ఆమె, స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. రచ్చకట్ట వద్ద ఉన్న మహిళలను ఉద్దేశించి.. ‘‘అందరూ... బాగున్నారా... ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు అందుతున్నాయా’’ అని ప్రజలను అడిగారు. అక్కడే ఉన్న ఓ మహిళ మాట్లాడుతూ ‘‘గతంలో ఆరోగ్యం బాగా లేకపోతే ప్రభుత్వ సహాయం కోసం మీ దగ్గరకు వచ్చా...మీరు మా టీడీపీ కార్యకర్తలు కాదని వెనక్కిపంపారు. ఇప్పుడొచ్చి బాగున్నారా అని అడుగుతున్నారు’’ అని ఎమ్మెల్యేపై అసహనం వ్యక్తం చేసింది. అక్కడే ఉన్న మరో మహిళ ‘‘మేము గత ఐదేళ్లుగా ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటున్నా...ఇంత వరకు ఇల్లు మంజూరు కాలేదు’’ అంటూ ఎమ్మెల్యే ముఖంపైనే చెప్పేసింది. ఇక ఉద్యానవన శాఖకు సంబంధించిన పథకాలన్నీ టీడీపీ నాయకులకే మంజూరు చేస్తూ రైతులందరిని నాశనం చేస్తున్నారని రైతులు ఎమ్మెల్యేపై మండిపడ్డారు. దీంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బంది పడిన యామినీ బాల అక్కడి నుండి చల్లగా జారుకున్నారు. -
లెక్కతప్పితే ఎవరినీ వదిలిపెట్టను
బుక్కరాయసముద్రం : సీఎం బహిరంగ సభకు జనసమీకరణపై అధికారులపై ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినీబాల ఫైర్ అయ్యారు. బుధవారం మం డల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శింగనమల నియోజకవర్గం అధికారులతో సమావేశం నిర్వహిం చారు. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో జనాలను తరలించి తన పరు వు కాపాడాలని అధికారులకు సూచించారు. ఎలాగైనా సరే ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్ర జలను తరలించేలా ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. ఒక్కొక్క మండలం నుంచి ఎంత మందిని తీసుకొస్తారని అధికారులను ప్రశ్నించారు. ఆ తర్వాత మీరు చెప్పిన లెక్కలు తప్పితే ఎవరినీ వదిలి పెట్టను.. సభ అయిపోయిన తర్వాత మీ కథ చూస్తా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.