ఎల్లుట్ల గ్రామం ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యామినీ బాల
పుట్లూరు(యల్లనూరు): శింగనమల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినిబాలకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ‘దళిత తేజం’ కార్యక్రమంలో పాల్గొనేందుకు మండలంలోని ఎల్లుట్ల గ్రామానికి వచ్చిన ఆమె, స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. రచ్చకట్ట వద్ద ఉన్న మహిళలను ఉద్దేశించి.. ‘‘అందరూ... బాగున్నారా... ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు అందుతున్నాయా’’ అని ప్రజలను అడిగారు. అక్కడే ఉన్న ఓ మహిళ మాట్లాడుతూ ‘‘గతంలో ఆరోగ్యం బాగా లేకపోతే ప్రభుత్వ సహాయం కోసం మీ దగ్గరకు వచ్చా...మీరు మా టీడీపీ కార్యకర్తలు కాదని వెనక్కిపంపారు.
ఇప్పుడొచ్చి బాగున్నారా అని అడుగుతున్నారు’’ అని ఎమ్మెల్యేపై అసహనం వ్యక్తం చేసింది. అక్కడే ఉన్న మరో మహిళ ‘‘మేము గత ఐదేళ్లుగా ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటున్నా...ఇంత వరకు ఇల్లు మంజూరు కాలేదు’’ అంటూ ఎమ్మెల్యే ముఖంపైనే చెప్పేసింది. ఇక ఉద్యానవన శాఖకు సంబంధించిన పథకాలన్నీ టీడీపీ నాయకులకే మంజూరు చేస్తూ రైతులందరిని నాశనం చేస్తున్నారని రైతులు ఎమ్మెల్యేపై మండిపడ్డారు. దీంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బంది పడిన యామినీ బాల అక్కడి నుండి చల్లగా జారుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment