వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతున్న ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున
సాక్షి, విజయవాడ : ‘దళిత తేజం-తెలుగుదేశం’ పేరు కాదు దళిత ద్రోహం-తెలుగుదేశం అని పేరు మార్చుకోవాలని టీడీపీ ప్రభుత్వానికి సూచిస్తూ వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కడప జిల్లా దళిత తేజం సమావేశంలో దళితులు కింద కూర్చుంటే టీడీపీ నేతలు కుర్చీల్లో కూర్చుంటారా, ఇంకెన్నాళ్లీ అస్పృశ్యత, అంటరానితనమని టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీలో దళిత నేతలు సిగ్గుతో తలదించుకోవాలని, దళితులకు ఘోర అవమానం జరిగిందని విమర్శించారు.
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ ఆలోచనా విధానం ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. సమస్యలపై ప్రతిపక్షం అడిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందిస్తుందని అన్నారు. బాబు పాలనలో దళిత సంక్షేమం అటకెక్కిందని, దళితులపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా చంద్రబాబు స్పందించరని ధ్వజమెత్తారు. చంద్రబాబు మీకు దళితులంటే ఎందుకు చిన్న చూపు అని సూటిగా ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా టీడీపీలో ఉన్న దళిత మంత్రులు, నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని అడిగారు. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ దళితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
వైఎస్సార్‌జిల్లా చాపాడు మండలంలోని చియ్యపాడు గ్రామంలో ఆదివారం టీడీపీ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో జరిగిన దళిత తేజం–తెలుగుదేశం కార్యక్రమంలో కుర్చీలలో కూర్చున్న అగ్రవర్ణ టీడీపీ నాయకులు, వేదిక ముందు కింద కూర్చున్న చియ్యపాడు దళిత మహిళలు.
Comments
Please login to add a commentAdd a comment