
కృష్ణా: పులిచింతల స్టాప్‌లాగ్ గేట్ పనులను ప్రభుత్వ విప్ ఉదయ భాను పరిశీలించారు. స్టాప్ లాగ్ గేట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. నేటి రాత్రి (శనివారం)కి స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు పూర్తవుతుందన్నారు. 16వ గేటు కొట్టుకువపోవడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని ఉదయ భాను పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు భవిష్యత్తులో హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటును పరిశీలిస్తామని అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాల వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన విమర్షించారు. లోకేష్ విషయం తెలియకుండా ట్వీట్లు చేస్తున్నారని దుయ్య బట్టారు. మచిలీపట్నం కోర్టు తీర్పుపై హైకోర్టుకి అపీల్‌కి వెళ్లకుండా.. చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేసింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాన్ని అప్పనంగా దోచిపెట్టే ప్రయత్నం చేయలేదా? అని అడిగారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే గత ప్రభుత్వం అన్ని రకాల సహాయం చేసిందని విమర్షించారు. 10 రోజుల్లో ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నింపుతామని, కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ ఉదయభాను తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment