మంచిర్యాల : జాతీయ అండర్ -15 బాలికల హ్యాండ్ బాల్ పోటీలను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ నల్లాల ఓదేలు ప్రారంభించారు. ఈ పోటీలు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం గుడిపేట గ్రామంలోని 13వ బెటాలియన్‌లో జరుగుతున్నాయి.
ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు 17 రాష్ట్రాలకు చెందిన బాలికలు పాల్గొంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మొదటి సారి జాతీయ బాలికల హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్‌తో పాటు తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
జాతీయ హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం
Published Sun, Jan 18 2015 2:26 PM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM
Advertisement
Advertisement