అజింక్య రహానేకు గ్రాండ్‌ వెల్కమ్ : వీడియో వైరల్‌ | Ajinkya Rahane Gets Grand Welcome As He Returns Home  | Sakshi
Sakshi News home page

అజింక్య రహానేకు గ్రాండ్‌ వెల్కమ్ : వీడియో వైరల్‌

Published Thu, Jan 21 2021 1:20 PM | Last Updated on Thu, Jan 21 2021 5:19 PM

Ajinkya Rahane Gets Grand Welcome As He Returns Home  - Sakshi

సాక్షి, ముంబై: ఆస్ట్రేలియా గడ్డపై సరికొత్త చరిత్రను లిఖించిన టీమిండియా కెప్టెన్ అంజిక్య రహానేకు ముంబైలో ఘన స్వాగతం లభించింది. అపూర్వ విజయయంతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫిని దక్కించుకున్న రహానే టీంపై దేశవ్యాప్తంగా ప్రశంసలజల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని ఆయన అభిమానులు, స్థానికులు కూడా రహానే ఘన స్వాగతం పలికారు. గురువారం ముంబైలోని ఆయన నివాసానికి తిరిగివచ్చిన తరుణంలో బాండ్‌ బాజాలతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు.  

టీమిండియా విజయంతో దేశం గర్వపడేలా చేసిన  కూల్‌ కెప్టెన్‌ రహానేకు అపూర్వ స్వాగతం పలికారు అభిమానులు. కుమార్తె ఆర్యను ఎత్తుకుని వస్తున్న రహానేపై పూల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను రహానె భార్య రాధిక ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది  ఆస్ట్రేలియాలో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతో టీమ్ ఇండియాకు నాయకత్వం వహించిన అజింక్య రహానే నేతృత్వంలోని యంగ్‌ ఇండియా టీం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.  కాగా రహానే తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా దొపావ్కర్‌ను సెప్టెంబర్ 26, 2014లో లవ్ కమ్ ఆరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతుల ముద్దుల కూతురే ఆర్య . 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement