గ్రాండ్ వెల్‌కమ్ | New Year's new-Trend | Sakshi
Sakshi News home page

గ్రాండ్ వెల్‌కమ్

Published Fri, Jan 2 2015 2:06 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

గ్రాండ్  వెల్‌కమ్ - Sakshi

గ్రాండ్ వెల్‌కమ్

నూతన సంవత్సరం 2015కు బుధవారం రాత్రి నగరవాసులు ఘనంగా స్వాగతం పలికారు. స్వాగత సంరంభంలో భాగంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ఉత్సాహం ఉరకలేసింది. నగరంలోని రహదారులపై కుర్రకారు కేరింతలు కొట్టారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమాలు అలరించాయి.
 
కొత్త సంవత్సరానికి నగర ప్రజలు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. అర్ధరాత్రి 12 గంటలు కాగానే కేక్‌లు కట్‌చేసి, బాణసంచాపేల్చి సందడి చేశారు. బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. యువకులు రోడ్లపై సందడిచేశారు. నగరంలోని పలు హోటళ్లలో 2014కు వీడ్కోలు, 2015కు స్వాగతం పలుకుతూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యుత్ దీపాల వెలుగుల మధ్య వెండితెర, బుల్లితెర తారలు నృత్యాలతో అలరించారు.
 
ఫార్చ్యూన్‌లో అంబరాన్నంటిన సంబరాలు
 
మిరుమిట్లుగొలిపే విద్యుత్ దీపాల వెలుగులు... హై ఓల్టేజీ మ్యూజిక్.. దుమ్మురేపే డిస్కో.. హోరెత్తించిన డీజేల నడుమ నూతన సంవత్సర ఆగమన సంబరాలు జరిగాయి. మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ ఫార్చ్యూన్ మురళీపార్క్‌లో కౌంట్‌డౌన్ 2015 పేరిట నిర్వహించిన ఈ సంబరాలు అంబరాన్నంటాయి. వయోభేదం లేకుండా చిన్న, పెద్దా అంతా కలిసి చిందులతో సందడిచేశారు. బోల్ బేబీ బోల్ ఫేమ్ మానస ఆచార్య, పాప్‌సింగర్ సిద్దూ లేటెస్ట్ సాంగ్స్‌తో హుషారె త్తించగా, సురేష్ మిమిక్రీ కడుపుబ్బా నవ్వించింది. వేడుకల మధ్యలో ఫన్నీ గేమ్స్‌లో దంపతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈవెంట్స్ మధ్యలో లక్కీడిప్‌లు నిర్వహించి చిరు బహుమతులు అందిస్తూ యాంకర్లు ఉత్సాహపరి చారు. తాజ్ గేట్‌వే హోటల్‌లోనూ నూతన సంవత్సరం వేడుకలు జోరుగా సాగాయి. నగరంలో ఎక్కడ చూసినా న్యూ ఇయర్ జోష్ కనిపించింది. నగరంలో కేక్‌లు, స్వీట్లు, ఫ్లవర్ బొకేల విక్రయాలు జోరుగా సాగాయి.   
 - లబ్బీపేట
 
ఫన్‌టైమ్ క్లబ్‌లో సందడే సందడి

 సినిమా, సీరియల్ ఆర్టిస్టుల నృత్యాలు, మోడరన్ ఈవెంట్లు యువతలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఈ వేడుకలకు భారతి యాంకరింగ్ చేయగా నిరుపమ్, మంజుల, రవికృష్ణ, చందన బ్లాస్టింగ్, థ్రిల్లింగ్ డ్యాన్స్‌లతో అలరించారు. అనంతరం జరిగిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. సభ్యులకు తంబోలా, లక్కీడిప్, లక్కీ మేల్, లక్కీ ఫీమేల్, లక్కీ కిడ్, లక్కీ కపుల్ విభాగాల్లో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. క్లబ్ సొసైటీ కార్యదర్శి అజిత్‌బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గాంధీ, ప్రతినిధి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.        
 - పటమట
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement