న్యూ సంబరాలు | New Year's new-Trend | Sakshi
Sakshi News home page

న్యూ సంబరాలు

Published Fri, Jan 2 2015 2:26 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

న్యూ సంబరాలు - Sakshi

న్యూ సంబరాలు

బెంగళూరు: ఉల్లాసాలు, ఉత్సాహాలు, అవకాశాలు, ఆనందాలు, కొత్త అనుభవాలు, సరికొత్త అనుభూతులను మోసుకుంటూ 2015 అడుగుపెట్టేసింది. 2014కి గుడ్ బై చెబుతూ న్యూఇయర్‌కి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు మెట్రో వాసులు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని విద్యుద్దీపాల కాంతులతో నగరంలోని ప్ర ధాన కూడళ్లన్నీ సుందరంగా ముస్తాబ య్యాయి. నగరంలోని ఎంజీరోడ్డు, బ్రిగేడియర్ రోడ్డు బుధవారం ఎనిమిది గంటల నుంచే యువతతో కిక్కిరిసిపోయాయి. ఈ రోడ్లపైకి చేరిన యువత ఫోమ్‌ను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ న్యూ ఇయర్ విషెష్ చెప్పుకున్నారు.

మరోవైపు నగరంలోని పబ్‌లు, హోటళ్లు న్యూఇయర్ పార్టీలు, హోరెత్తించే డీజేల రీమిక్స్ సాంగ్స్‌తో నగరవాసులకు హుషారెత్తించే కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని దృష్టిలో ఉంచుకొని బీఎంటీసీ, నమ్మ మెట్రోలు అర్ధరాత్రి  వరకు సర్వీసులను నడిపాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement