సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం | cm kcr receives grand welcome at Begumpet airport | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 24 2016 4:42 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

మహారాష్ట్ర పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు మంత్రులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రాజెక్టులపై ఒప్పందం చేసుకుని కేసీఆర్ ఇవాళ నగరానికి చేరుకున్నారు. మహా ఒప్పందంపై ఆయన ఈ సందర్భంగా స్పష్టత ఇవ్వనున్నారు. మరోవైపు విమానాశ్రయం నుంచి బేగంపేట బ్రిడ్జ్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. ఇక మహారాష్ట్ర ఒప్పందం వల్ల లబ్ధి పొందనున్న ఉత్తర తెలంగాణకు చెందిన రైతులు పెద్ద ఎత్తున నగరానికి వస్తుండటంతో.. బేగంపేట పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement