జగన్కు పూలతో ఘనస్వాగతం | Grand Welcome to YS Jagan with Flowers | Sakshi
Sakshi News home page

జగన్కు పూలతో ఘనస్వాగతం

Published Tue, Sep 24 2013 4:40 PM | Last Updated on Sat, Jul 28 2018 6:26 PM

జగన్కు పూలతో ఘనస్వాగతం - Sakshi

జగన్కు పూలతో ఘనస్వాగతం

చంచల్గూడ జైలు నుంచి విడుదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి అభిమానులు పూలతో ఘనస్వాగతం పలికారు.

హైదరాబాద్: చంచల్గూడ జైలు నుంచి విడుదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి అభిమానులు పూలతో ఘనస్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన జగన్ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు తోచుకువచ్చారు. కిక్కిరిసిన జనంలో నుంచి వాహనం కదలడం  కూడా కష్టమైపోయింది. ఎటు చూసినా జనమే జనం. రాష్ట్రం నలుమూల నుంచి పార్టీ  నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో కదిలి వచ్చారు. జై జగన్ అన్న నినాదాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు.

485 రోజులు జైలులో ఉండి, బయటకు వచ్చిన యువనేతను చూసేందుకు యువత ఉత్సాహంగా తోసుకొనితోసుకొని ముందుకు వస్తున్నారు. చిరునవ్వుతో అందరికీ  రెండు చేతులు జోడించి అభివాదం చేస్తున్నారు. జైలు నుంచి  ఆయన వాహనం వెళ్లే రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. కాన్వాయ్ వెంటే జనం నడుస్తున్నారు.  జైలు వద్ద నుంచి ఆయన నివాసం లోటస్పాడ్ వరకు రోడ్డుకు ఇరువైపుల జనం బారులు తీరి ఉన్నారు. ఆ జనవాహినిని తప్పించుకొని ఆయన ఇంటికి చేరుకోవడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement