Mumbai Society Gives A Grand Welcome To Stray Dog: ఇంతవరకు జంతువులకు సంబంధించిన పలు కథనాలను విన్నాం. పెంపుడు జంతువులు తన యజమాని పట్ల కనబరిచే విశ్వాసం, ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. . వీధి కుక్కలను ఆదరించే వాళ్లు కూడా ఉన్నారు. ఒకరో ఇద్దరో వాటికి ఆహారం పెట్టడం వంటివి చేస్తుంటారు. అవి కూడా వాళ్ల పట్ల మాత్రమే ప్రేమగా ఉంటాయి. కానీ ఈ వీధి కుక్క అందుకు భిన్నం అందరీ ప్రేమాభిమానలను గెలుచుకుంది ఎలాగో తెలుసా!
అసలు విషయంలోకెళ్తే...ముంబైలో ప్రభాదేవిలోని ఒక సొసైటీ విస్కీ అనే వీధి కుక్క ఉంది. ఆ కుక్కని ఆ సోసైటీ వాళ్లంతా ప్రేమగా చూసుకునేవారు. ఒకరోజు ఉన్నట్టుండి హఠాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆ సోసైటి వాసుల నిద్రహారాలు మాని మరీ ఆ కుక్క కోసం వెతకడం ప్రారంభించారు.
ఏడు రోజులు అనంతరం ఆ కుక్క విల్సన్ కాలేజీకి సమీపంలోని మైదానంలో కనిపించింది. దీంతో ఆ కాలనీ వాసులు ఆ కుక్కను సోసైటీకి కారులో తీసుకకువచ్చి హారతీ ఇచ్చి మరి ఘన స్వాగతం పలికారు. పైగా ఆ సోసైటీ వాసులు అది మాకు కుక్క కాదు అని చెప్పడం విశేషం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం ఇది అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
(చదవండి: అమ్మ నాన్న ఐ లవ్ యూ !..వైరల్ అవుతున్న ఉక్రెయిన్ సైనికుడి చివరి వీడియో!)
Comments
Please login to add a commentAdd a comment