శ్రీకాంత్‌కు ఘనస్వాగతం
సాక్షి, హైదరాబాద్: స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆదివారం టోర్నమెంట్ గెలిచిన శ్రీకాంత్, విజయానంతరం మంగళవారం నగరానికి చేరుకున్నాడు. విమానాశ్రయంలో అతనికి తల్లిదండ్రులు, సోదరుడు నందగోపాల్ స్వాగతం పలికారు.
పుల్లెల గోపీచంద్ అకాడమీ తరఫున గోపీచంద్ తల్లి సుబ్బారావమ్మతో పాటు అకాడమీలో శిక్షణ పొందుతున్న పలువురు చిన్నారి షట్లర్లు కూడా శ్రీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన స్విస్ ఓపెన్‌ను గెలుచుకున్న శ్రీకాంత్ ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. శ్రీకాంత్ 24 నుంచి జరిగే ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో తలపడతాడు.
రాష్ట్రపతి ప్రణబ్ అభినందన
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శ్రీకాంత్‌కు అభినందనలు తెలిపారు. ‘స్విస్ ఓపెన్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించిన శ్రీకాంత్ యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలి చాడు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిం చాలని ఆకాంక్షిస్తున్నాను’ అని రాష్ట్రపతి ఒక ప్రకటనలో తెలిపారు.