న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శుక్రవారం(మార్చ్ 22) ఉదయం భూటాన్ వెళ్లారు. ప్రధానికి భూటాన్‌లోని పారో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆ దేశ ప్రధాని షెరిగ్ టోబ్గే ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్‌తో ద్వైపాక్షిక సంబంధాల విషయమై ప్రధాని చర్చలు జరుపుతారు.
భూటాన్ రాజుతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. గత వారమే భూటాన్ ప్రధాని భారత్‌లో ఐదు రోజుల పాటు పర్యటించి వెళ్లారు. నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింంది. భూటాన్‌తో భారత్ సంబంధాలు విశిష్టమైనవని తెలిపింది. కాగా, భూటాన్‌లో షెరిగ్ టోబ్గే ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరింది.
Comments
Please login to add a commentAdd a comment