
న్యూఢిల్లీ: ఇటీవల భారత్ సారథ్యంలో జీ20 శిఖరాగ్ర భేటీని విజయవంతంగా నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఘన స్వాగతం లభించింది.
బుధవారం సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశానికి హాజరైన సందర్భంగా ప్రధానికి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితరులు స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ప్రధానిపై పూల వర్షం కురిపిస్తూ కార్యాలయంలోకి ఆహా్వనించారు. జీ20 విజయవంతంగా ముగియడం, ప్రపంచ నేతలు మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించడం తెలిసిందే. ఈ భేటీ తర్వాత బీజేపీ ప్రధాన కార్యాలయంలోకి ప్రధాని రావడం ఇదే మొదటిసారి.
Comments
Please login to add a commentAdd a comment