నీతాకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఘనస్వాగతం
సింపుల్, హుందాగా అందంగా ఆకట్టుకున్న నీతా అంబానీ
రిలయన్స్ ఫౌండేషన్, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, ఛైర్మన్ నీతా అంబానీ 2024 పారిస్ ఒలింపిక్స్ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పారిస్‌లో జరుగుతున్న 142వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్‌కు నీతా అంబానీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నుంచి ఘనస్వాగతం లభించింది. ముఖ్యంగా నీతా అంబానీ సాదరంగా ఆహ్వానించిన మాక్రాన్ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ కూడా నీతాకు శుభాకాంక్షలు తెలిపారు.
ఫ్రాన్స్ రాజధాని నగరంలో జరిగిన లూయిస్ విట్టన్ ఫౌండేషన్‌లో జరిగిన 142వ ఐఓసీ షన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నీతా అంబానీ ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దిన ఎరుపు రంగు సూట్‌ను ధరించారు. గోల్డెన్ థ్రెడ్‌వర్క్ డ్రెస్‌లో చాలా నిరాడంబరమైన ఆభరణాలతో నీతా అందంగా, హుందాగా కనిపించారు..
కాగా 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు శుక్రవారం, జూలై 26న జరగనున్నాయి. అధికారిక ప్రారంభోత్సవానికి ముందు జూలై 24న కొన్ని క్రీడలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఒలింపిక్స్‌లో 206 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 10,500 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 ఆగస్టు 11న ముగుస్తుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, నీతా అంబానీ వ్యాపారవేత్తగా, పరోపకారిగా చాలా పాపులర్. ఇటీవల తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment