సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరులో జరగనున్న ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొనేందుకు గన్నవరం వచ్చిన వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
గన్నవరం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరులో జరగనున్న ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొనేందుకు గన్నవరం వచ్చిన వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి జెట్ ఎయిర్‌వేస్ విమానంలో పార్టీ రాష్ట్ర నాయకులు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డితో కలిసి ఆమె ఉదయం 10.40 గంటలకు ఇక్కడికి విచ్చేశారు. విమానాశ్రయంలో ఆమెకు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
విజయమ్మకు, వైవీ సుబ్బారెడ్డికి విజయవాడ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ శాలువాలు కప్పారు. పార్టీకి చెందిన పలువురు నాయకులు విజయమ్మను పూలదండలతో ముంచెత్తారు. గన్నవరం విమానాశ్రయం బయట పెద్దఎత్తున వచ్చిన సమైక్యవాదులు విజయమ్మకు సంఘీభావం తెలిపారు.
విజయమ్మకు స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ కేంద్ర పాలకవర్గ మండలి సభ్యురాలు సభ్యులు కె.నాగేశ్వరరావు, ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, వంగవీటి రాధ, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, జ్యేష్ఠ రమేష్‌బాబు, అడుసుమిల్లి జయప్రకాష్, ముసునురు రత్నబోస్, ఇందుకూరి రామకృష్ణంరాజు, మద్దాల రాజేష్, ప్రసాదరాజు, నియోజకవర్గాల సమన్వకర్తలు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పి.గౌతమ్‌రెడ్డి, వాకా వాసుదేవరరావు, పడమట సురేష్ బాబు, తాతినేని పద్మావతి, విజయవాడ నగర అధికార ప్రతినిధి తాడి శకుంతల, మహిళా కన్వీనర్ సునీత, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.