
గుంటూరు, సాక్షి: టీడీపీ అధికారిక వెబ్‌సైట్లో చేసేవన్నీ ఫేక్ పోస్టులేనని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మీడియాతో ప్రస్తావించారు. తల్లిని చంపడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని టీడీపీ అధికారిక వెబ్ సైట్‌లో ఓ పోస్ట్ చేశారు. దానికి కారు టైర్ పేలిన పాత కథనం ఒకటి జత చేశారు. స్వయంగా విజయమ్మే ఇది ఫేక్ న్యూస్ అని లేఖ ఇచ్చారు. కానీ,
ఆ లేఖ కూడా ఫేక్ అని ప్రచారం చేశారు. చివరకు.. అదంతా అబద్ధమని విజయమ్మ టీవీ ముందుకు వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌లోనే జరిగింది. మరి నారా లోకేష్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు?. ఇంతకుమించి దిగజారిపోయి.. దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు.
నా భార్య(వైఎస్ భారతి) కడప పోలీస్ అధికారితో ఫోన్‌లో మాట్లాడిందని ఆంధ్రజ్యోతిలో ఓ కథనం ఇచ్చింది. అది ఫేక్ కథనం. అలాంటప్పుడు రాధాకృష్ణను జైల్లో పెడతారా?. ఎల్లో మీడియా అలానే ఉంది.. సోషల్ మీడియా అలానే ఉంది అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.

Comments
Please login to add a commentAdd a comment