
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను మరోసారి రెపరెపలాడించిన తెలుగుతేజం పీవీ సింధుకు మంగళవారం స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.
ఈ సందర్భంగా కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను పీవీ సింధు కలవనుంది. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత ఒలింపిక్ బృందం ఆగస్టు 15 వేడుకలకు హాజరుకానుంది. వేడుకల్లో పాల్గొననున్న బృంద సభ్యులను ప్రధాని మోదీ తన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment