సాక్షి, హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించి ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన పీవీ సింధు బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు పీవీ సింధుకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ.. '' ఒలింపిక్స్‌లో పతకం రావడం ఆనందంగా ఉంది. దేశానికి పతకం తీసుకురావడం ఆనందంగా ఉంది. ఒలింపిక్స్‌లో నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చింది. కాగా నిన్న(మంగళవారం) టోక్యో నుంచి స్వదేశానికి చేరుకున్న పీవీ సింధుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించిన సంగతి తెలిసిందే. అనంతరం కేంద్ర మంత్రులు సింధుతో పాటు ఆమె కోచ్ పార్క్‌ను ఘనంగా సత్కరించారు.2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment