సీఎం రాకకు ఏర్పాట్లు | today cm kcr tour in distic grand welcome to pocharam srinivas reddy | Sakshi
Sakshi News home page

సీఎం రాకకు ఏర్పాట్లు

Published Tue, Mar 29 2016 3:23 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

సీఎం రాకకు ఏర్పాట్లు - Sakshi

సీఎం రాకకు ఏర్పాట్లు

బాన్సువాడ : జిల్లాకు రానున్న సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి భారీ ఏర్పాట్లు చేయిస్తున్నారు. పలు గ్రామాల్లో  ఫ్లెకీలు, స్వాగత తోరణాలు, ప్లకార్డులు తయారు చేయిస్తున్నారు.సోమవారం మంత్రి బాన్సువాడలోని తన స్వగృహం వద్ద నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మంజూరుపై నాయకులతో సమీక్షించారు.

కలెక్టర్ సమీక్ష
నిజామాబాద్‌అర్బన్: ఏప్రిల్  ఒకటి, రెండు తేదీలలో సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ యోగితారాణా తెలి పా రు. సోమవారం అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ఒకటో తేదీ న నర్సింగ్‌పల్లి, మాక్లూర్‌లో పర్యటన అనంతరం జిల్లా కేంద్రంలో మిషన్ భగీ రథ, మిషన్ కాకతీయ, రెండు పడక గదు లు, దళితులకు భూపంపిణీ, గ్రామజ్యోతి, ఆర్మూర్, నిజామాబాద్ పట్టణ అభివృద్ధి, కరువు నివారణ పనులు, కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్‌లను  సమీక్షిస్తారని తెలి పా రు.  డిచ్‌పల్లి బెటాలియన్, తిమ్మాపూర్ వద్ద  హెలిపాడ్‌లను సిద్ధంగా చేయనున్న ట్లు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement