సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే అత్యధిక సబ్సిడీతో, అధిక విస్తీర్ణంలో పాలీహౌస్‌ల సేద్యా న్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందుచూపుతో ప్రోత్సహించడం వల్ల మన పాలీహౌస్ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారని వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
పాలీహౌస్ సేద్యంలో ఆదర్శ గ్రామంగా పేరు గాంచిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువల్లిలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కాలె యాద య్య అధ్యక్షతన జరిగిన రైతు సదస్సులో పోచారం మాట్లాడారు. రాష్ట్రంలో పాలీహౌస్‌ల సబ్సిడీ బకాయిలన్నీ చెల్లించామన్నారు. చనువల్లి నుంచి జెర్బర పూలు ఢిల్లీ, చెన్నై, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు ఎగుమతి కావటం గర్వకారణమన్నారు.
ఎకరానికి రూ.10–12 లక్షల ఆదాయం
ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామ్‌రెడ్డి ప్రసంగిస్తూ చనుపల్లిలో రైతులు జెర్పర పూలను సాగు చేస్తూ ఎకరానికి ఏటా 10–12 లక్షల వరకు నికరాదాయం ఆర్జిస్తుండడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారధి ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment