
డాలస్: అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న టీటీడీ శ్రీవెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవానికి హాజరయ్యేందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు అమెరికాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైవీ దంపతులకు ఘన స్వాగతం లభించింది. నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కడప రత్నాకర్ తదితరులు వీరిని సాదరంగా ఆహ్వానించారు.
జూన్ 18న శాన్‌ఫ్రాన్సిస్కో, 19,సియాటెల్, డాలస్‌లో 25న , 26న సెంట్ లూయస్, 30న చికాగో, జూలై 2వ తేదీన న్యూఓర్లీన్స్, 3, వాషింగ్టన్ డీసీ, అట్లాంటాలో జూలై 9న, 10న అలబామాలో అత్యంత వైభవంగా శ్రీనివాస కల్యాణాన్ని నిర్వహిస్తారు.
డాలస్‌లోని క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్‌లో తెలుగువారి ఆధ్వర్యంలో టీపాడ్ నేతృత్వంలో జూన్ 25న విశేష పూజాకార్యక్రమం, శ్రీనివాస కల్యాణం ఇతర సేవలు ఘనంగా నిర్వహించనున్నారు. సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకం, కల్యాణ సేవలను అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment