నీరాజనం
భువనగిరి : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నీరా‘జనం’ పలికారు. బీబీనగర్ నుంచి జిల్లా సరిహద్దు పెంబర్తివద్దగల కాకతీయ తోరణం వరకు యువనేతకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. జగన్‌రాక సందర్భంగా మహిళలు, యువకులు పెద్దఎత్తున తరలివచ్చారు. మహిళలు మంగళహారతులు పట్టారు. యువకులు బాణసంచాకాల్చి స్వాగతం పలికారు. తనను కలిసిన వారందరితో జగన్ చేతులుకలిపి ఆత్మీయంగా పలకరించారు. జగన్‌పై అభిమానులు పూల వ ర్షం కురిపించారు. జగన్ చూడడానికి యువకులు, మహిళలు, వృద్ధులు తాపత్రయపడ్డారు. బీబీనగర్, టోల్‌గేట్, గూడురు, ఆలేరులో ఆయన దిగి జనానికి అభివాదం చేశారు. హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాకు వెళ్తున్నా వైఎస్ జగన్, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఉదయం 11.15 గంటలకు బీబీనగర్ చేరుకున్నారు.
అక్కడ వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ రాష్ట్ర సహా య కార్యదర్శి గూడూరు జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, బొకేలు ఇచ్చి ఆయనకు సత్కరించారు. అనంతరం టోల్‌గేట్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహం వద్ద కొద్దిసేపు ఆగారు. అక్కడ భువనగిరి పట్టణ కన్వీనర్ చల్లగురుగులు రఘుబాబు జగన్‌కు పూలదండ వేశారు. అనంతరం బీబీనగర్ మండలంలో గూడూరు వద్ద జైపాల్‌రెడ్డి నాయకత్వంలో భారీగా తరలివచ్చిన మహిళలు జగన్‌కు స్వాగతం పలికారు. మంగళహారతులు పట్టారు. యువకులు ఆయనతో కరచాలనం చేయడానికి పోటీపడ్డారు. తనను పలకరించిన గూడూరు గ్రామ మహిళలు, వృద్ధులను ఆత్మీయంగా ‘బాగున్నారా’ అని కుశల ప్రశ్నలు వేశారు. కారులోంచి దిగి సుమారు 5 నిమిషాలపాటు ముచ్చటించారు. యువకులు అయనపై గులా బీ పూల వర్షం కురిపించారు. అక్కడినుంచి అందరికి అభివాదం చేస్తూ భువనగిరి బైపాస్ మీదుగా ఆలేరుకు వెళ్లారు.
ఆలేరులో పార్టీ రాష్ట్రకార్యదర్శి వడ్లోజు వెంకటేష్ నాయకత్వంలో పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆగిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అక్కడికి వచ్చిన మహిళలను పలకరించారు. అక్కడి జిల్లా సరిహద్దులోని పెంబర్తివద్దగల కాకతీయ తోరణం వ రకు వెళ్లారు. అక్కడ వరంగల్ జిల్లా వైఎస్‌ఆర్‌సీసీ నాయకులు స్వాగతం పలికారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ వ్యస్థాపక సభ్యుడు శివకుమార్, రాష్ట్ర నాయకులు నల్లా సూర్యప్రకాశ్, గున్నం నాగిరెడ్డి, నంద్యాల కరుణాకర్‌రెడ్డి, ఇరుగు సునిల్‌కుమార్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, నంద్యాల కరుణాకర్‌రెడ్డి, వెల్లాల రామ్మోహన్‌రెడ్డి, ప్రఫుల్‌రెడ్డి, శ్రీరంగం, కొండా రాఘవరెడ్డి, సిద్దార్థరెడ్డి, మొలుగురాములు, మోడెపు జీవన్‌గౌడ్, జి.యాదగిరి, బండ్రు అంజనేయులు, చెన్న రాజేష్, బండారు ఆనంద్‌గౌడ్, డొంకెన నవీ న,భాస్కర్, పడాల శ్రీకాంత్ ఉన్నారు.