సూర్యాపేట : ఖమ్మంలో బుధవారం నిర్వహించనున్న టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మంగళవారం సూర్యాపేటలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సుమారు గంట సేపు జాతీయ రహదారిపై వందలాది మంది నాయకులు, కార్యకర్తలు వేచి ఉన్నారు. ముఖ్యమంత్రి కొత్త బస్టాండ్ వద్దకు చేరుకొని తన కాన్వాయ్ నుంచే పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. స్వాగతం పలికిన వారిలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి,
పార్టీ అధ్యక్షులు బండా నరేందర్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, తహ సీల్దార్ మహమూద్‌అలీ, సూర్యాపేట, కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్‌లు గండూరి ప్రవళిక, వంటిపులి అనిత, నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, సోమా భరత్‌కుమార్, నంద్యాల దయాకర్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, కట్కూరి గన్నారెడ్డి, గండూరి ప్రకాశ్, వైవీ, గోదల రంగారెడ్డి, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, గుడిపూడి వెంకటేశ్వరరావు, ఉప్పల ఆనంద్, కెక్కిరేణి నాగయ్యగౌడ్ తదితరులు ఉన్నారు. సూర్యాపేట డీఎస్పీ ఎంఏ రషీద్ పర్యవేక్షణలో పట్టణ సీఐ వై.మొగలయ్య ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
‘పేట’లో సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం
Published Wed, Apr 27 2016 1:41 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement